Test Match England Win: రెండు టెస్టులు సహృద్భావ వాతావరణంలో పూర్తి చేసుకున్న ఇరు జట్లు ఈ టెస్టులో ఆవేశకావేశాలకు వెళ్లి ఆట చెడకొట్టుకున్నారు.
ఆ ఓవర్ ఏం చేసింది
ఈ మ్యాచ్ లో మూడో రోజు బూమ్రా చివరి ఓవర్ లో జరిగిన డ్రామా ఇరుజట్ల సభ్యుల ఆటతీరుపై ప్రభావం చూపించిందనీ
అనడంలో సందేహం లేదు. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు బ్యాటర్ ను తన స్వింగ్ బౌలింగ్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఆ పరిస్థితిలో మరో ఓవర్ ఆడకుండా ఉండేందుకు బ్యాటర్ వేలుకు గాయమైనట్లు నటించడం, దానికి స్పందిస్తూ కెప్టెన్ గిల్ తో పాటు ఇండియా జట్టు సభ్యులు గెలిచేయడం, అతను వీటిని హెచ్చరించడం. వాగ్వాదంతో కొద్దిసేపు డ్రామా జరిగింది. ఆలాంటి సమయంలో అనవసరమైన వాటికి స్పందించడం గలాబాకు దారితీస్తుంది. ఆ క్షణంలో చేసిన అల్లరి, కేవలం ఇంగ్లాండ్ జట్టు సభ్యుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందనుకోవడం తప్పు. ఆ ప్రభావం ఇండియన్ జట్టుపై కూడా పడింది. గిల్ బ్యాటింగ్ కు వచ్చిన తరుణంలో ఇంగ్లండ్ స్లిప్ ఫీల్డర్ లు అదేవిధంగా వ్యవహరించేందుకు అవకాశం తీసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కేవలం ఒకవైపు మాత్రమే ఫీల్డర్ లను పెట్టీ బౌలింగ్ చేస్తున్నారని, ఇది బాడీలైన్ కిందకు వస్తుందని, అంపైర్ లు గమనించాలని ప్రముఖ క్రికెటర్ గవాస్కర్ మీడియా ముందు ప్రస్తావించడం కూడా చూశాం. ఇలాంటి వాటికి ప్రత్యర్తి జట్టు కు అవకాశం కల్పించడం హోం గ్రౌండ్, అంపైర్ ల మద్దతు ఉన్న ఇంగ్లండ్ జట్టు మరింత ప్రభావితం చేసింది.
Also Read: Australia Test Victory: ఎలాంటి వెస్టిండీస్ ఎలా అయిపోయింది.. మరీ దారుణంగా 27 పరుగులకా..
క్రికెట్ లో ఏదైనా సాధ్యమే..
క్రికెట్ లో ఏమైనా జరగొచ్చు అని ముఖ్యంగా ఎన్నో సంచలనాలకు వేదిక అయిన లార్డ్స్ క్రికెట్ మైదానం మళ్ళీ తన ప్రత్యేకత చాటుకుంది. గెలుస్తుందని అనుకునే జట్టు ఓడిపోవడం.. ఓటమి తప్పదని భావించే జట్టుకు చివరగా విజయం చేకూర్చడం ఈ మైదానం ప్రత్యేకత.
చివరి వరకు ఉత్కంఠ
భారత్ ఓటమికి కారణాలు ఏమైనా ఈ మ్యాచ్ మొదటి నుంచి ఎన్నో చమత్కారాలను క్రికెటర్లకు పరిచయం చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 135 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి టాయిలెండర్స్ మూలంగా 387 పరుగుల వరకు చేసింది. తిరిగి ఇండియా అదే స్కోర్ చేసి అలౌట్ అయ్యింది. అయితే చివరి 10 పరుగుల వ్యత్యాసం లోనే ఇండియా టాయిలెండర్స్ వికెట్లు వరుసగా కోల్పోయింది. ఆ సమయంలో ఇంగ్లాండ్ టాయిలెండర్స్ మాదిరిగా బ్యాటింగ్ చక్కగా చేసే నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కొంత ఓపిగ్గా ఆడి ఉంటే వంద పరుగులు ఎక్కువ చేసి ఉండాల్సింది. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కష్టపడకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా గెలుపు అవకాశాలు ఇండియాకు ఎక్కువ ఉండేవి. కానీ అలా జరగలేదు. రెండో ఇన్నింగ్స్ లో కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తక్కువ స్కోర్ కు అవుట్ కావడంతో తక్కువ స్కోర్ ను ఈజీగా సాధిస్తారని అభిమానులు అనుకున్నారు. కానీ అప్పటికే పిచ్ తన స్వభావాన్ని చూపిస్తుందని, బాల్ అనూహ్యంగా టర్న్ అవుతున్న విషయాన్ని గమనించాలి. ఇంగ్లాండ్ అంత తక్కువ స్కోరుకు అవుట్ అయ్యారంటే, Test Match England Win: ఇండియా బౌన్స్ బ్యాక్ అవుతుందా..?ఇండియాకు సెకండ్ ఇన్నింగ్స్ లో అదే సమస్య ఉంటుందని ఊహించలేకపోయారు.
Also Read: Eng Vs Ind 3rd Test: లార్డ్స్ లో టీమిండియా చేసిన తప్పులు ఇవే.. వాటి వల్లే ఈ ఓటమి
చెలరేగిన ఇంగ్లాండ్ బౌలర్లు
మొదట ఇంగ్లాండ్ బౌలర్లు ఆర్చర్, స్టోక్స్ చెలరేగి బౌలింగ్ చేయడం. టాప్ ఆర్డర్ లో జైస్వాల్, కరుణ్ నాయర్, కెప్టెన్ గిల్ వికెట్లు త్వరగా తీయడంతో జాగ్రత్త పడాల్సి వచ్చింది. అయితే 5 వ రోజు రాహుల్, పంత్ మధ్య పెద్ద భాగస్వామ్యం ఉంటుందని ఊహించారు. కానీ అలా జరగలేదు. రిషబ్ పంత్ వికెట్ కోల్పోవడం భారత్ ను ఇబ్బందుల్లో నెట్టింది. ఆ తరువాత రాహుల్ కూడా పెవిలియన్ దారి పట్టడంతో జడేజా పూర్తిగా జట్టు బాధ్యతను తన భుజాలపై మోస్తూ టాయిలెండర్స్ ను ప్రోత్సహిస్తూ ఒక్కో రన్ తస్కరిస్తూ 35 ఓవర్స్ ఆడి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి గెలుపుకు 22 పరుగుల దూరంలో చివరి వికెట్ కోల్పోయి పోరాడి ఓడారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ క్రికెటర్లకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. వచ్చే రెండు మ్యాచుల్లో నైనా ఇండియా గెలుపు చేజిక్కించుకోవాలని ఆశిద్దాం..