Homeజాతీయ వార్తలుWork From Home Fuel Shortage India: ఆఫీస్‌కు రాకండి... ఇంటి నుంచే పనిచేయండి..

Work From Home Fuel Shortage India: ఆఫీస్‌కు రాకండి… ఇంటి నుంచే పనిచేయండి..

Work From Home Fuel Shortage India: పశ్చిమాసియా యుద్ధాలు ఇంధన సరఫరాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా భారత్‌ను కూడా తాకింది. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడ్డాయి. ఆలయాల ప్రసాదం, అన్న క్యాంటీన్లు కూడా మూతపడుతున్నాయి. Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్! ఐటీ కంపెనీల చర్యలు.. ఇంధనం కొరతను ఎదుర్కొనేందుకు, పొదుపు చేసేందుకు ఐటీ […]

Work From Home Fuel Shortage India: పశ్చిమాసియా యుద్ధాలు ఇంధన సరఫరాను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా భారత్‌ను కూడా తాకింది. దీంతో హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడ్డాయి. ఆలయాల ప్రసాదం, అన్న క్యాంటీన్లు కూడా మూతపడుతున్నాయి.

Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఐటీ కంపెనీల చర్యలు..
ఇంధనం కొరతను ఎదుర్కొనేందుకు, పొదుపు చేసేందుకు ఐటీ కంపెనీలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ప్రకటించాయి. కంపెనీలకు వస్తే.. క్యాంటీన్ల నిర్వహణకు గ్యాస్‌ కొరత, ఉద్యోగులు రావడానికి, పోవడానికి ఇంధనం ఖర్చవుతుంది. క్యాబ్‌లకు కూడా ఇంధనం కావాలి. వీటిని తగ్గించేందుకు వర్క్‌ఫ్రం హోం చేయాలని సూచించాయి. హెచ్‌సీలో చెన్నై కార్యాలయాల్లో 12–13 మార్చి డబ్ల్యూఎఫ్‌హెచ్‌ అనుమతి జారీ చేశారు. వెండర్లు గ్యాస్‌ లేకపోవడంతో భోజన సేవలు పూర్తిగా ఆపేశారు. ఇది వేలాది ఉద్యోగులను ప్రభావితం చేసింది.

ఇన్‌ఫోసిస్‌ సూచనలు
బెంగళూరు, చెన్నై, పూణే క్యాంపస్‌లలో లైవ్‌ కౌంటర్లు (దోస, ఇతర వంటకాలు) నిలిపాయి. మెనూ పరిమితం చేసి, ఇంటి భోజనం తీసుకురావాలని సలహా ఇచ్చాయి. 3.37 లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడింది.

Wells Fargo పిలుపు
ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌ కట్టకం లింక్డిన్‌లో పోస్ట్‌ చేసి, ఇంధన ఆదాకు గిఊఏని ప్రోత్సహించారు. రోజువారీ కమ్యూటింగ్‌ తగ్గిస్తే, ఆరోగ్యం, అత్యవసర సేవలు, ప్రజా రవాణాకు ఇంధనం మళ్లించవచ్చని సూచించారు.

గ్లోబల్‌ ఆర్థిక పరిణామాలు
పశ్చిమాసియాలో వ్యాపారాలు విస్తరించాలనుకునే కంపెనీలు సీనియర్‌ హైరింగ్‌లు ఆలస్యం చేస్తున్నాయి. ఇంధనం, నిర్మాణం, లాజిస్టిక్స్‌ రంగాల్లో ఒత్తిడి పెరిగి, బోనస్‌లు తగ్గే అవకాశం ఉంది. ఇన్‌ఫోసిస్‌ ఉద్యోగులు ఈ మార్పులకు అనుగుణంగా సర్దుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper