Homeక్రీడలుక్రికెట్‌Tilak Varma New Look Viral: గ్రీకువీరుడిగా తిలక్ వర్మ.. అమ్మాయిలంతా క్యూ కట్టడం ఖాయం

Tilak Varma New Look Viral: గ్రీకువీరుడిగా తిలక్ వర్మ.. అమ్మాయిలంతా క్యూ కట్టడం ఖాయం

Tilak Varma New Look Viral: టీమిండియా యంగ్ క్రికెటర్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఆరడుగుల ఎత్తు, ఆరు ఫలకలదేహంతో అదరగొడుతున్నాడు. అతడు ఫొటోలకు ఇచ్చిన ఫోజులు అమ్మాయిల మతులు పొగడుతున్నాయి. తిలక్ వర్మ ఫొటోలను ముంబై ఇండియన్స్ జట్టు తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాలలో సంచలనం కలిగిస్తున్నాయి.

దేహాకృతికి విపరీతమైన ప్రాధాన్యం

తిలక్ వర్మ మొదటి నుంచి కూడా జిమ్ లో ఎక్కువ సేపు గడుపుతాడు. శరీర సామర్థ్యానికి విపరీతమైన ప్రాధాన్యం ఇస్తాడు. మైదానంలో కూడా విపరీతమైన సాధన చేస్తాడు. ఎటిపరిస్థితుల్లో కూడా జంక్ ఫుడ్ జోలికి వెళ్లడు. అందువల్లే అతడు ఆజానుభాహుడి మాదిరిగా కనిపిస్తాడు. తిలక్ వర్మ ఫిట్ నెస్ కు విపరీతమైన ప్రయారిటీ ఇస్తాడు. అందువల్లే మైదానంలో విపరీతమైన చురుకుగా ఉంటాడు.

ఆసియా కప్ లో అద్భుతమైన ప్రతిభ

గత ఏడాది జరిగిన ఆసియా కప్ లో అద్బుతమైన ప్రతిభ చూపించాడు తిలక్ వర్మ. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మిగతా ప్లేయర్లు విఫలమైనప్పటికీ.. తిలక్ వర్మ ఒక్కడే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టీ 20 సిరీస్ లో తడాఖా చూపించాడు.

Also Read: ఐపీఎల్ 16 రోజులేనా.. బీసీసీఐ ఇచ్చిన ట్విస్ట్ వెనుక అసలు కారణం ఇది

టి20 వరల్డ్ కప్ లో సూపర్ ఇన్నింగ్స్

ఇక ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ మీద మెరుపు వేగంతో పరుగులు తీశాడు. అత్యంత ప్రమాదకరమైన అలెన్ క్యాచ్ పట్టాడు. చివరి వికెట్ ను కూడా తన క్యాచ్ ద్వారా తీశాడు. ఇటీవల కాలంలో స్థిరమైన ఆటతీరు కొనసాగిస్తున్న తిలక్ వర్మ ఒక్కసారిగా నేషనల్ క్రష్ గా మారిపోయాడు. అతడి క్రేజ్ ను పరిగణలోకి తీసుకున్న ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఫొటో షూట్ నిర్వహించింది.

అచ్చం గ్రీకు వీరుడి మాదిరిగా..

తిలక్ వర్మ చొక్కా విప్పి టీ 20 ట్రోఫీ పట్టుకుని ఫొటోలకు ఫోజులుఇచ్చాడు. ఆరు అడుగులదేహం, ఆరు ఫలకల దేహంతో అతడు గ్రీకు వీరుడిగా కనిపించాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తిలక్ వర్మ ఇలా కనిపిస్తూ ఉంటే అమ్మాయిలు మొత్తం అతడి ఇంటి చుట్టూ క్యూలో ఉంటారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular