Kingdom movie hype: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) పై ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విజయ్ దేవరకొండ గత చిత్రాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అయినప్పటికీ ఈ చిత్రం పై ఇంతటి క్రేజ్ రావడానికి ప్రధాన కారణం డైరెక్టర్. గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) గతం లో నాని తో ‘జెర్సీ’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాని నుండి నేషనల్ అవార్డు విన్నింగ్ రేంజ్ పెర్ఫార్మన్స్ ని రాబట్టకున్నాడు. అలాంటి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కాబట్టే ఈ సినిమా పై ఇంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం అయ్యింది. దానికి తోడు డైరెక్టర్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, విజయ్ దేవరకొండ గెటప్, ఈ చిత్రం పై మరిన్ని అంచనాలు పెంచడానికి కారణం అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే టీజర్ వచ్చిందో, అప్పటి నుండి ఈ సినిమా మీదున్న అంచనాలు పదింతలు ఎక్కువ పెరిగాయి.
Also Read: రెడ్ ఫ్రాక్ లో శ్రీముఖి కిరాక్ లుక్… స్టార్ యాంకర్ వెకేషన్ ఫోటోలు వైరల్
అలా భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ ఏడాది లో రెండు మంచి డేట్స్ ని వదులుకున్న ఈ చిత్రం, ఈసారి గురి తప్పే ఛాన్స్ లేకుండా బలంగా ఫిక్స్ అయ్యి వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ నేడు మొదలయ్యాయి. ముందుగా నార్త్ అమెరికా లోని కొన్ని ముఖ్యమైన లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ చిత్రానికి 200 కి పైగా టికెట్స్ అమ్ముడు పోయాయని, 80 షోస్ కి 3 వేల డాలర్ల గ్రాస్ వచ్చిందని అంటున్నారు. ఇది అదిరిపోయే రేంజ్ ఆరంభం అని, ఇదే రేంజ్ ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ఈ చిత్రం మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read: అయ్యో సుహాస్ కి ఏమైంది..? యంగ్ హీరోకి కష్టాలు!
ఈ సినిమా ఆల్ టైం రికార్డు ని మీడియం రేంజ్ క్యాటగిరీ లో అందుకోవాలంటే, నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ ప్రీమియర్స్ రికార్డుని ఎట్టిపరిస్థితిలోనూ దాటాల్సి ఉంటుంది. ఆ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి 8 లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది దాదాపుగా స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్. ‘కింగ్డమ్’ చిత్రం ఈ రికార్డు ని అందుకుంటే ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్టు లెక్క. మరి ఆ రేంజ్ కి వెళ్తుందో లేదో తెలియాలంటే థియేట్రికల్ ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటే కచ్చితంగా ఈ సినిమా ఓవర్సీస్ లో స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రేంజ్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.