Eng Vs Ind 3rd Test: లార్డ్స్ లో టీమిండియా బౌలింగ్ బాగా చేసింది. తొలి ఇన్నింగ్స్ లో లీడ్ సంపాదిస్తుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా చేతులెత్తేసింది. తద్వారా ఇంగ్లాండ్ 387 రన్స్ స్కోర్ సమం చేసింది. వాస్తవానికి భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు ఇబ్బంది కలిగించినప్పటికీ.. రాహుల్ (100), పంత్(74), జడేజా (72) నిలబడటంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఈ పరుగులను మరింత భారీగా చేసే అవకాశాన్ని భారత్ చేతులారా కోల్పోయింది. ద్వారా లీడ్ సంపాదించకుండా స్కోరు సమం చేయడంతోనే సరిపెట్టుకుంది.
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారిన సమీకరణం.. లార్డ్స్ టెస్ట్ లో విజేత ఎవరంటే…
తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ 74 పరుగులు చేసి జోరు మీద ఉన్నాడు. అయితే ఊహించని విధంగా రన్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తిరిగి లైన్లోకి వచ్చింది.. ఫలితంగా ఇంగ్లాండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ 387 పరుగుల వద్ద ఆగిపోయింది.
ఇక రెండవ ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్, యశస్వి జైస్వాల్ (13, 0), నైట్ వాచ్ మన్ ఆకాష్ దీప్ విఫలమయ్యారు. ఒకవేళ నైట్ వాచ్ మన్ గా జడేజా ను పంపి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.. ఇక రిషబ్ రెండవ ఇన్నింగ్స్ లో ఆర్చర్ వేసిన బంతిని అంచనా వేయలేకపోవడం జట్టును దెబ్బతీసింది.
193 పరుగులు చేదించే సమయంలో బ్యాటర్లను ఎంచుకున్న విధానం ఏ మాత్రం బాగోలేదు. కెప్టెన్ గిల్ నుంచి మొదలు పెడితే సుందర్ వరకు విఫలం కావడం జట్టు ఓటమికి ప్రధాన కారణమైంది. నిదానంగా ఆడాల్సిన సమయంలో.. బంతి గమనాన్ని అంచనా వేసి బ్యాటింగ్ చేయాల్సిన సందర్భంలో భారత బ్యాటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఓటమికి దారితీసింది.
ఇక భారత బౌలర్లు వికెట్లు పడగొట్టినప్పటికీ ఎక్స్ ట్రా లు ఇచ్చిన విధానం మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఏకంగా 31 ఎక్స్ ట్రా లు ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ లో 32 ఎక్స్ ట్రా లు సమర్పించుకున్నారు. ఇవి కూడా జట్టు ఓటమికి ఓ కారణంగా నిలిచాయి.. వాస్తవానికి భారత బౌలర్లు ఇలా ఎక్స్ ట్రా లు ఇవ్వకుండా ఉండి ఉంటే ఇంగ్లాండ్ స్కోర్ మరింత తక్కువగా నమోదు అయ్యేది. రెండవ ఇన్నింగ్స్ లో ఇచ్చిన 32 ఎక్స్ ట్రా లు ఇంగ్లాండ్ స్కోర్ ను 192 పరుగులకు చేర్చాయి. లేకుంటే ఇంగ్లాండ్ స్కోరు 160 పరుగుల వద్దే ముగిసేది. పిచ్ ను అంచనా వేయలేక మొదట్లో భారత బౌలర్లు తడపడ్డారు.. అందువల్లే ఎక్స్ ట్రా లు ఇచ్చారు. ఫలితంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు సరిగ్గా ఆడకున్నా పరుగులు వచ్చాయి.. తద్వారా ఇంగ్లాండ్ జట్టు ఈ పిచ్ పై కష్ట సాధ్యమైన టార్గెట్ విధించింది. పిచ్ సహకరిస్తున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ బౌలర్లు అదరగొట్టారు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్ లో విజయం సాధించారు.