Heroes in Tollywood: ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల సినిమాలకు టాక్ బాగుంటే ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి చూసేవారు. కానీ కరోనా తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా పొయ్యాయి. ఇప్పుడు మీడియం రేంజ్ హీరో సినిమాకు ఆడియన్స్ కేవలం మూడు రోజులకు మించి వెళ్లలేకపోయారు. అది కూడా టాక్ పాజిటివ్ గా వస్తేనే. విడుదలకు ముందు వావ్ ఫ్యాక్టర్ తో ఆడియన్స్ కి కచ్చితంగా థియేటర్స్ చూడాలి అనే ఫీలింగ్ కలిగించలేకపోయినా మొదటి రోజు మొదటి ఆట లోనే అవుట్. అలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న నితిన్(Nithin), రామ్ పోతినేని(Ram Pothineni) లాంటి హీరోల పరిస్థితే ఇలా ఉంటే, ఇక కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించి, సినిమాల్లో హీరోలు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది.
Also Read: రెడ్ ఫ్రాక్ లో శ్రీముఖి కిరాక్ లుక్… స్టార్ యాంకర్ వెకేషన్ ఫోటోలు వైరల్
పాపం వాళ్లకు సమయం , డబ్బు వృధా తప్ప మరొకటి కనిపించడం లేదు. రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ గౌతమ్ కృష్ణ హీరో గా సోలో బాయ్ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఆడియన్స్ కి తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. పాపం బిగ్ బాస్ 4 లో టాప్ 3 వరకు వచ్చిన సోహైల్, బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ సన్నీ వంటి వాళ్ళు సినిమాల్లో హీరోలు గా ఎంట్రీ ఇచ్చి, రెండు మూడు సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. పరిస్థితి చూస్తుంటే, రాబోయే రోజుల్లో మీడియం రేంజ్ సినిమాల మనుగడ సాగడం చాలా కష్టమే అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఆడియన్స్ మైండ్ సెట్ అలా మారిపోవడానికి కారణం ఓటీటీ.
Also Read: ఓవర్సీస్ లో మొదలైన ‘కింగ్డమ్’ అడ్వాన్స్ బుకింగ్స్..విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్స్ ఇవే!
ఇప్పుడు ఒక మీడియం రేంజ్ హీరో సినిమా సూపర్ హిట్ అయితే మూవీ లవర్స్ కొంతమంది థియేటర్స్ కి వెళ్లి చూస్తున్నారు,కానీ అత్యధిక శాతం మంది ఆమ్మో థియేటర్స్ కి వెళ్తే అదనపు సమయం వృధా అవుతుంది. మూడు వారాలు పోతే ఓటీటీ లోకి వచేస్తుందిగా, అప్పుడు చూసుకోవచ్చులే అనే తరహా మైండ్ సెట్ కి అలవాటు పడిపోయారు. అందుకే మేకర్స్ ఇక పై నుండి సరికొత్త ఆలోచనలతో స్క్రిప్ట్స్ ని రెడీ చేస్తేనే ఈ ఇండస్ట్రీ లో మనుగడ సాగించగలరు. లేకపోతే కష్టమే, అనవసరంగా సమయం, డబ్బు వృధా చేసుకోవద్దు అంటూ పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ బాగాలేకపోతే చిరంజీవి, రజనీకాంత్, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాలనే పట్టించుకోని రోజులివి. అలాంటిది మీడియం రేంజ్ హీరోలు ఎంత అలెర్ట్ ఉండాలో మీరే ఊహించుకోండి.