Homeక్రీడలుక్రికెట్‌Yuzvendra Chahal X post goes viral: వాళ్లను ఇరాన్ పంపించండి.. చాహల్ నీ ధైర్యానికి...

Yuzvendra Chahal X post goes viral: వాళ్లను ఇరాన్ పంపించండి.. చాహల్ నీ ధైర్యానికి హ్యాట్సాఫ్..

Yuzvendra Chahal X post goes viral: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అమెరికా చేతిలో కన్నుమూశాడు. అతడు అందమైన తర్వాత ఇరాన్లో నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. కానీ అదేం దరిద్రమో తెలియడం లేదు. భారత్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ ఖమేని చావు పట్ల కన్నీరు పెడుతోంది. ఈ విషయంలో భారత్ కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తుంది. పహల్గం దాడి జరిగినప్పుడు ఒక్కడూ స్పందించలేదు. ప్యాంటు జిప్పు తీసి చూపించండి […]

Yuzvendra Chahal X post goes viral: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. అమెరికా చేతిలో కన్నుమూశాడు. అతడు అందమైన తర్వాత ఇరాన్లో నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. కానీ అదేం దరిద్రమో తెలియడం లేదు. భారత్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఘనత వహించిన కాంగ్రెస్ పార్టీ ఖమేని చావు పట్ల కన్నీరు పెడుతోంది. ఈ విషయంలో భారత్ కలగజేసుకోవాలని డిమాండ్ చేస్తుంది.

పహల్గం దాడి జరిగినప్పుడు ఒక్కడూ స్పందించలేదు. ప్యాంటు జిప్పు తీసి చూపించండి అంటూ.. తుపాకితో కాల్చి చంపారు. పదులకొద్ది ఇండియన్ టూరిస్టులను కాల్చపడేశారు. శీతలమైన జమ్ము కాశ్మీర్ మొత్తాన్ని రక్తసిక్తం చేశారు. అయితే నాడు జరిగిన ఈ ఘటనపై ఎవరూ పెద్దగా నోరు మెదపలేదు. కానీ, ఇప్పుడు ఖమేనీ హతమైన తర్వాత ఒక్కసారిగా తమ స్వరాలను పెకిలిస్తున్నారు. ఖమేనీ మృతి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏడుపులు ప్రదర్శిస్తున్నారు. లక్నో, హైదరాబాద్, కాశ్మీర్ ప్రాంతాలలో నిరసనలు చేపడుతున్నారు.

ఈ నిరసనల పట్ల ఇప్పటికే బుల్లితెర యాంకర్ రష్మీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి నిరసనలు చేపట్టే వారికి ఏం అధికారం ఉందని ప్రశ్నించింది. చనిపోయిన వ్యక్తి ఈ దేశానికి చెందిన వాడు కాదని.. అలాంటప్పుడు ఈ దేశంలో నిరసన ఎలా చేపడుతారు అంటూ ప్రశ్నించింది. ఇప్పుడు రష్మీకి టీమ్ ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ కూడా తోడయ్యాడు.

“ఖమేని మృతి చెందిన నేపథ్యంలో చేపడుతున్న నిరసనలు వారి సొంత దేశంలో చేసుకోవాలి. మనదేశంలో నిరసనలు చేపట్టేవారు ఇరాన్ వెళ్ళిపోవాలి. నువ్వు ఉంటున్న దేశానికి సపోర్ట్ చెయ్. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నువ్వు సపోర్ట్ చేస్తున్న దేశానికి వెళ్ళిపో” అంటూ చాహల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది కాస్త సంచలనగా మారింది. ఇప్పటివరకు ఈ వ్యవహారంపై ఏ సెలబ్రిటీ కూడా స్పందించలేదు. తొలిసారిగా రష్మీ స్పందించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇప్పుడు ఆమెకు చాహల్ కూడా తోడు కావడంతో చర్చ మరింత పెరిగింది. దీంతో నెటిజన్లు సెలబ్రిటీలను ప్రశ్నిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper