Homeఎంటర్టైన్మెంట్Vijay father praises daughter in law: తన కోడలి పై ప్రశంసల వర్షం కురిపించిన...

Vijay father praises daughter in law: తన కోడలి పై ప్రశంసల వర్షం కురిపించిన తమిళ హీరో విజయ్ తండ్రి..ఇదేమి ట్విస్ట్ సామీ!

Vijay father praises daughter in law: తమిళ స్టార్ హీరో , TVK పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం పై గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఎలాంటి కథనాలు ప్రచారం అవుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. తమిళ నాడు లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ . సొంత అభిమానులు కూడా విజయ్ పై మండిపడుతున్నారు. విడాకులు తీసుకోవడం ఏ సెలబ్రిటీ కి అయినా ఈ మధ్య […]

Vijay father praises daughter in law: తమిళ స్టార్ హీరో , TVK పార్టీ అధినేత విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం పై గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఎలాంటి కథనాలు ప్రచారం అవుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాము. తమిళ నాడు లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ . సొంత అభిమానులు కూడా విజయ్ పై మండిపడుతున్నారు. విడాకులు తీసుకోవడం ఏ సెలబ్రిటీ కి అయినా ఈ మధ్య కాలంలో సర్వసాధారణమే. కానీ ఈ విడాకుల పిటీషన్ లో ఆమె చేసిన ఆరోపణలే సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు ఏ టాప్ స్టార్ కూడా విడాకుల వ్యవహారం లో ఇలాంటి ఆరోపణలను ఎదురుకోలేదు. ఇదంతా పక్కన పెడితే, గతం లో విజయ్ తన భార్య గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

సాధారణంగా విజయ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి దూరంగా ఉంటాడు. కానీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కోరిక మేరకు , ‘బీస్ట్’ మూవీ విడుదలకు ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఒక సందర్భంలో ఆయన తన భార్య సంగీత ని తలుచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘నా భార్య నన్ను ప్రతీ విషయంలో గమనిస్తూనే ఉంటుంది. నా విషయంలో ఆమె అసలైన విమర్శకురాలు . నేను తీసుకునే నిర్ణయాలు, చేసే సినిమాలు నచ్చకపోతే ముఖం మీదనే చెప్పేస్తుంది ‘ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా గతం లో సంగీత గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాప్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నా కొడుకు విజయ్ ఎవరి మాట విన్నా , వినకపోయినా, తన భార్య సంగీత మాటని మాత్రం కచ్చితంగా వింటాడు. ఆమె మాటలకు గొప్ప విలువ ఇచ్చేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: గ్రాండ్ గా జరిగిన అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్..మెగాస్టార్ చిరంజీవి గైర్హాజరు..కారణం ఏంటంటే!

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘విజయ్ కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ సంగీత ప్రత్యేకమైన నిఘా ని పెడుతుంది. ప్రతీ విషయంలోనూ ఆమె అత్యంత ఖచ్చితత్వం తో, ఎంతో పరిణీతితో వ్యవహరిస్తుంది. ఏ విషయం లో కూడా రాజే పాడనీ తత్త్వం ఆమె సొంతం ‘ అంటూ గతం లో ఒక ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు. సంగీత విజయ్ పై అలా మొదటి నుండి నిఘా వెయ్యడం వల్లే, త్రిష తో ఆయన పెట్టుకున్న వివాహేతర సంబంధం గురించి తెలిసిందని, అందుకే విడాకులు కోరిందని కొంతమంది సోషల్ మీడియా లో విశ్లేషిస్తున్నారు. మరి ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తీసుకోబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper