Bigg Boss Agnipariksha 2: ‘బిగ్ బాస్’ లోనే కాదు ‘అగ్ని పరీక్ష’ లో కూడా ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమందిని చూసిన వెంటనే, వీళ్ళు చాలా వీక్ గా ఉన్నారు, బిగ్ బాస్ హౌస్ లో మనుగడ సాగించడం చాలా కష్టం అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కంటెస్టెంట్స్ ఊహించని రేంజ్ లో పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ రోహిత్. ఆడిషన్స్ లో చాలా సాఫ్ట్ గా కనిపించిన ఇతను, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టడం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అదే విధంగా ఎంతో మంది అండర్ రేటెడ్ కంటెస్టెంట్స్ ఈమధ్య కాలం లో బాగా షైన్ అయ్యారు. నవరసాల మామ రామ కృష్ణ, దీపక్ వంటి కంటెస్టెంట్స్ గ్రాఫ్స్ భారీగా పెరిగాయి.
అయితే ఓటింగ్ కి ఇదే చివరి వారం. ఈ చివరి వారం ఓటింగ్ లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అందరి కంటే అత్యధిక ఓటింగ్ తో తిరుగులేని స్థానం లో దూసుకెళ్తున్న కంటెస్టెంట్ రోహిత్. అతనికి కేవలం 3 నుండి 4 శాతం ఓటింగ్ తేడాతో రెండవ స్థానంలో కొనసాగుతున్న కంటెస్టెంట్ అమన్. వీళ్లిద్దరికీ దరిదాపుల్లో ఇప్పుడు ఒక్క కంటెస్టెంట్ కూడా లేరట. టాప్ 3 నుండి టాప్ 10 వరకు దాదాపుగా అందరికీ ఒకే రేంజ్ ఓట్లు పడుతున్నాయట. మూడవ స్థానం లో ప్రస్తుతానికి చరణ్ కొనసాగుతున్నాడు. ఆడిషన్స్ సమయంలో ఇతనికి మూడు గ్రీన్ ఫ్లాగ్స్ వచ్చాయి, అప్పుడు ఏర్పడిన ఓటింగ్ ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. కానీ మొదటి రెండు స్థానాలకు, ఈయనకు మధ్య దూరం భారీ రేంజ్ లో ఉంది.
ఇక ఆ తర్వాత నాల్గవ స్థానం లో నవరసాల మామ రామకృష్ణ కొనసాగుతున్నదని టాక్. ఎక్కడో మూలాన ఉండేవాడు, షాలిని తో గొడవ జరిగినప్పటి నుండి ఇతనిపై జనాల్లో సానుభూతి పెరిగి ఓట్లు భారీగా పడుతున్నాయి. ఒక్క సరైన ఎపిసోడ్ పడితే టాప్ 3 కి వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ఆ తర్వాతి స్థానం లో రాజకుమారి దయానా, 6 వ స్థానం లో షాలిని, 7 వ స్థానం లో మితిలేష్, 8 వ స్థానం లో దీపక్, 9 వ స్థానం లో శ్రేష్టి, పడవ స్థానం లో అపూర్వ, ప్రియా వంటి వారు కొనసాగుతున్నారట. మూడు నుండి 10 స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఒకే రేంజ్ ఓటింగ్ పడుతుండడం వల్ల , ఎవరినైనా బిగ్ బాస్ హౌస్ లోకి పంపొచ్చు అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.