Homeక్రీడలుక్రికెట్‌Lucknow vs Delhi: అక్షర్ కసి.. కేఎల్ రాహుల్ ఐడియాలజీ.. ఇది సరికొత్త ఢిల్లీ క్యాపిటల్స్

Lucknow vs Delhi: అక్షర్ కసి.. కేఎల్ రాహుల్ ఐడియాలజీ.. ఇది సరికొత్త ఢిల్లీ క్యాపిటల్స్

Lucknow vs Delhi: ఐపీఎల్ లో సొంత మైదానం పై ఆడే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్ ప్రేక్షకుల సపోర్టు లభిస్తుంది. పిచ్ మీద కమాండింగ్ ఉంటుంది కాబట్టి.. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అద్భుతం జరిగితే తప్ప ప్రత్యర్థి జట్టుకు విజయం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో ఆ సూత్రాన్ని ఢిల్లీ జట్టు పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ జట్టు ఈసారి సరికొత్తగా కనిపిస్తోంది. […]

Lucknow vs Delhi: ఐపీఎల్ లో సొంత మైదానం పై ఆడే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్ ప్రేక్షకుల సపోర్టు లభిస్తుంది. పిచ్ మీద కమాండింగ్ ఉంటుంది కాబట్టి.. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. ఫలితంగా ప్రత్యర్థి జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అద్భుతం జరిగితే తప్ప ప్రత్యర్థి జట్టుకు విజయం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో ఆ సూత్రాన్ని ఢిల్లీ జట్టు పూర్తిగా మార్చేసినట్టు కనిపిస్తోంది.

ఢిల్లీ జట్టు ఈసారి సరికొత్తగా కనిపిస్తోంది. అక్షర్ పటేల్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు ప్లేయర్లు తమ సత్తా ఏమిటో ప్రారంభ మ్యాచ్ లోనే చూపించారు. లక్నో జట్టును.. లక్నో మైదానంలోనే ఉతికి ఆరేశారు. పదునైన బంతులు వేసి.. పరుగులు తీయడం కాదు కదా.. వికెట్ కాపాడుకుంటే చాలు దేవుడా అనుకునే పరిస్థితి కల్పించారు. ఫలితంగా 18.4 ఓవర్ల లోనే లక్నో జట్టు 141 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మార్ష్(35), అబ్దుల్ సమద్ (36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ జట్టులో ఎంగిడి 3.. నటరాజన్ 3.. కులదీప్ యాదవ్ 2.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఢిల్లీ జట్టు బౌలింగ్ ఇలా ఉండడానికి ప్రధాన కారణం అక్షర్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కేఎల్ రాహుల్ కూడా ఈ క్రతువులో భాగస్వామి. ఎందుకంటే లక్నో జట్టు మీద రాహుల్ కు విపరీతమైన కోపం ఉంది. సరైన సమయం కోసం రివెంజ్ తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్నాడు. అక్షర్ ఆధ్వర్యంలో గత ఏడాది ఢిల్లీ జట్టు మెరుగైన ప్రదర్శన చేసింది. ఈసారి ఏకంగా ట్రోఫీ అందిస్తానని మేనేజ్మెంట్ కు అతడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తను మాత్రమే కాకుండా.. జట్టు ఆటగాళ్లలో కూడా విపరీతమైన స్ఫూర్తిని నింపుతున్నాడు.

లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో మార్క్రం వికెట్ పడగొట్టిన తీరు అక్షర్ పటేల్ బౌలింగ్ కు మెచ్చు తునక. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశారు. విప్రజనిగం మినహా మీద వారంతా 7.8 లోపు మాత్రమే ఏకానమీ నమోదు చేశారు. ముఖ్యంగా ముఖేష్ కుమార్ కేవలం 5.7 ఎకనామి నమోదు చేశాడంటే అతడు ఏ స్థాయిలో బౌలింగ్ వేసాడో అర్థం చేసుకోవచ్చు.

లక్నో పిచ్ అంతగా సహకరించకపోయినప్పటికీ.. గత అనుభవాల నేపథ్యంలో రెడ్ సాయిల్ తో రూపొందించినప్పటికీ.. ఢిల్లీ బౌలర్లు ఏమాత్రం అధైర్య పడలేదు. కొన్నిసార్లు వేగం.. ఇంకొన్నిసార్లు టెక్నిక్ తో బౌలింగ్ వేశారు. ఫలితంగా లక్నో జట్టు ఏమాత్రం కూడా ప్రతిఘటించలేకపోయింది. కనీసం పూర్తిస్థాయి ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper