Homeక్రీడలుక్రికెట్‌1983 India World Cup Cash Rewards: ఇప్పటి 131 కోట్లు కాదు.. ఆ రోజుల్లోనే...

1983 India World Cup Cash Rewards: ఇప్పటి 131 కోట్లు కాదు.. ఆ రోజుల్లోనే 25,000.. బీసీసీఐ చేసిన పనికి యావత్ ప్రపంచం నోరు వెళ్ళబెట్టింది!

1983 India World Cup Cash Rewards: ప్రపంచ క్రికెట్ మీద భారత్ పెత్తనం సాగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ వెలుగొందుతోంది. భారత్ సాధించిన అభివృద్ధి పట్ల పాకిస్తాన్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. బంగ్లాదేశ్ గుండెలు బాదుకుంటుంది. ఆస్ట్రేలియా అసూయతో చూస్తూ ఉంటుంది. కానీ, బీసీసీఐ ఒక్క రోజులోనే ఈ ఘనత సాధించలేదు. రాత్రికి రాత్రే ఈ స్థాయికి చేరుకోలేదు.

Also Read: గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ఏమోయ్ ట్రంప్.. ఇందులో నీ హస్తం ఉందా?!

బిసిసిఐ ఇప్పుడంటే ఆటగాళ్ల మీద కనక వర్షం కురిపిస్తుంది. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లకు అదనపు ఆదాయ మార్గాన్ని చూపిస్తోంది. ఇవేవీ లేని రోజుల్లో.. బిసిసిఐ డేరింగ్ స్టెప్పేసింది. మిగతా క్రికెట్ బోర్డులు మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో.. ఆదాయాల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో బీసీసీఐ ఏకంగా నాడు కపిల్ దేవ్ ఆధ్వర్యంలో 1983లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించినప్పుడు.. ఒక్కో ఆటగాడికి 25 వేల చొప్పున ఇచ్చింది. వాస్తవానికి వెస్టిండీస్ జట్టు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. ఆ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆర్థిక సహాయం చేసినట్టు ఇప్పటివరకైతే ఆధారాలు లేవు.

ఇదే విషయాన్ని వెస్టిండీస్ ప్లేయర్లు అనేక సందర్భాల్లో చెప్పుకున్నారు. “మీకేంటి మీరు ఇండియాలో పుట్టారు. మీకు బలమైన బీసీసీఐ మద్దతు ఉంది. మీరు విజయాలు సాధిస్తే భుజం తడుతుంది. మీకు అద్వితీయమైన ప్రోత్సాహం అందిస్తుంది. కానీ మా పరిస్థితి అలా కాదు.. రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఆర్థికంగా అంత ప్రయోజనం లభించలేదని” వెస్టిండీస్ ప్లేయర్లు అప్పట్లో పలు సందర్భాల్లో చెప్పారు. ఇక రెండుసార్లు వెస్టిండీస్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. ఆ దేశ క్రికెట్ బోర్డు చెప్పుకునే స్థాయిలో ఆటగాళ్లకు ఆర్థికంగా ప్రయోజనం కలిగించలేదు.

1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించినప్పుడు భారత క్రికెట్ మేనేజ్మెంట్ ఒక్కో ఆటగాడికి 25 వేల చొప్పున నగదు బహుమతి అందించింది. 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 12 కోట్లు, 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పుడు 39 కోట్లు, 2024లో t20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 125 కోట్లు, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగినప్పుడు 51 కోట్లు, ఇక 2026లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 131 కోట్లను బీసీసీఐ ఆటగాళ్లకు అందించింది. ఆటగాళ్లకు ఈ స్థాయిలో ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తుంది కాబట్టి మన దేశంలో క్రికెట్ ఆడేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు. డొమెస్టిక్ క్రికెట్ లో కూడా ఆటగాళ్లకు ఇచ్చే ఫీజును పెంచిన నేపథ్యంలో.. యువకులు తమ కెరియర్ గా క్రికెట్ ను ఎంచుకుంటున్నారు. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు ఉన్నప్పటికీ.. ఐపీఎల్ కు ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆటగాళ్లకు బీసీసీఐ భారీగా ఆర్థిక ప్రయోజనం కలిగించడమే. చివరికి అంతటి ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా తమ దేశీయ టోర్నీలను పక్కనపెట్టి.. ఐపీఎల్ లో ఆడేందుకు ముందుకు వస్తున్నారు అంటే దీనికి ప్రధాన కారణం బీసీసీఐ అందిస్తున్న ఆర్థిక భరోసానే.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular