Homeఆధ్యాత్మికం'Today horoscope in telugu ' : ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ఊహించని...

‘Today horoscope in telugu ‘ : ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు ఊహించని ఆదాయం..

‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశరాసులపై పూర్వా పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఈరోజు బుధాదిత్యం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాసిన వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వ్యాపాలకు ఈరోజు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. చట్టపరమైన చిక్కులు ఉంటే ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకున్న ఫలితాలు ఉంటాయి. దీంతో అధికారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యాయంగా ఉంటారు. ఓ విషయం గురించి ఆందోళన చెందుతారు. అయితే స్నేహితుల సలహాతో దానిని పరిష్కరించుకుంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్ర. వ్యాపారాలు అనుకోకుండా విజయాలను సాధిస్తారు. ఇప్పుడు పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయాల్లో ఉండే నాయకులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇతరులతో సత్సబంధాలు మెరుగుపరుచుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉండడంతో ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా మెదులుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులు అధిక ప్రయోజనాలు పొందుతారు. కోటి వారి మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఎదురవుతాయి. అయితే వీటికోసం మాటలను అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వాగ్వాద ఉంటుంది. రోజువారి పనులను పూర్తి చేయడానికి కష్టపడతారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య వాదనలో ఉంటాయి. దీంతో సంబంధాలు చీలికలు ఏర్పడే అవకాశం ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా తీర్థయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కన్య రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి రానుంది. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అధిక లాభాలు వస్తాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యులతో వాదన ఉంటే మౌనంగా ఉండటమే మంచిది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబంలో ఏర్పడిన ఘర్షణ వాతావరణాన్ని తెలివితో పరిష్కరించుకుంటారు. అయితే వ్యాపారులు ఏదైనా సమస్య ఉంటే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలి. మాటల మాధుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్నేహితుల మధ్య విభేదాలు వస్తే వెంటనే పరిష్కరించుకుంటారు. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం దూర ప్రయాణాలు చేస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే పెద్దల సలహా పాటించడం మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వ్యాపారులు ఈరోజు నష్టాలను చనిచూడాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. సంబంధాలు మెరుగుపరచుకోవాలి. స్నేహితుల మధ్య సహకారం పెంపొందుతుంది. వారితో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల నుంచి తన సహాయం అందుతుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అయితే కొన్ని కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :. ఈ రాశి కలిగిన కొన్ని రంగాలవారు సవాళ్లను ఎదుర్కొంటారు. ఇష్టమైన పనులను మాత్రమే చేయాలి. లేకుంటే తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. వీటిని వెంటనే పరిష్కరించుకోవాలి. సామాజిక రంగాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన పరిచయాలు పెరుగుతాయి. చర్చలు పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి ఉద్యోగులకు తోటి వారి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీంతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular