Coconut: గుడికి వెళ్లిన సమయంలో పూజ సామగ్రితో పాటు కొబ్బరికాయ తప్పనిసరిగా ఉంటుంది. కొబ్బరికాయ ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన నీటితో కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని దేవుడికి సమర్పిస్తే సంతోషిస్తారని భక్తుల నమ్మకం. కొందరు ఒక కొబ్బరికాయ కొడితే.. మరికొందరు మొక్కుకున్న ప్రకారం.. 108 కొబ్బరికాయలు కూడా కొడుతారు. కొబ్బరికాయ కొట్టడం వల్ల మనుషుల్లోని మూడు చెడు గుణాలు తొలగిపోతాయని కొందరు అంటే.. కొబ్బరికాయలో ఉండే మూడు గుణాలు.. బ్రహ్మ, విష్ణు, శివుడు అయిన త్రిమూర్తులకు ప్రతీక అని అంటారు. ఏదీ ఏమైనా కొబ్బరికాయను కొట్టడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అయితే కొబ్బరికాయను కొట్టిన తరువాత పువ్వు వస్తే మోహం సంతోషంగా మారుతుంది. కానీ ఈ కొబ్బరికాయ కుళ్లిపోతే మాత్రం మోహం మాడిపోతుంది. ఎందుకంటే కొబ్బరికాయ కుళ్లిపోతే ఏదో అశుభం జరుగుతుందని భావిస్తారు. అయితే ఇది కూడా ఒక శుభ సంకేతమే అని అంటున్నారు.ఎలాగంటే?
Also Read: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కి జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!
మనిషిలోని అహం, దురాశ, మాయను తొలగించేందకు కొబ్బరికాయను కొడుతారని అంటారు. అయితే కొబ్బరికాయను కొట్టడం ద్వారా దేవుడికి స్వచ్ఛమైన నైవేద్యాన్ని సమర్పించిన వారవుతారు. అందువల్ల ప్రతీ పూజలో కొబ్బరికాయ తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇలా మనస్పూర్తిగా కొట్టే కొబ్బరికాయలో ఏదైనా అశుభం ఎదురైతే కొందరు విలవిలలాడిపోతారు. అంటే కొబ్బరికాయ కొట్టిన తరువాత అది కుళ్లిపోయినా.. లేదా పాడైపోయినది అని తెలిస్తే బాధపడుతారు. తమకు ఏదో అశుభం జరుగుతుందని అనుకుంటారు.
వాస్తవానికి మనం కొబ్బరికాయ కొట్టేదే.. మనలోని ఉన్న చెడు గుణాలను పగలకొడుతున్నామని అర్థం. అంటే కొబ్బరికాయ కొట్టిన తరువాత అది కుళ్లిపోయింది.. అని తెలిస్తే ఏమాత్రం ఆందోళన చెందవద్దని అంటున్నారు. ఎందుకంటే కొబ్బరి కాయ కుళ్లిపోయింది.. అంటే అప్పటి వరకు ఉన్న చెడు గుణాలు తొలగిపోయాయి.. అని తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ కొబ్బరి కాయ ఇలా కుళ్లి పోయిందంటే దుష్ట శక్తుల నుంచి కొన్ని పరిస్థితులు మీకు శుభం కలిగిస్తున్నాయని సంకేతంగా తెలుపుతుంది. ఇక అప్పి వరకు ఆ ఇంట్లో అనారోగ్యం, లేదా ఇతర సమస్యలతో బాధపడేవారికి ఇక నుంచి విముక్తి కలుగుతుందని తెలుసుకోవాలి.
అయితే అప్పటికీ మనసు ఇంకా విచారంగానే ఉంటే.. వెంటనే ఆరోజు లేదా.. మరుసటి రోజు 5గురికి అన్నదానం చేయాలి. ఆ తరువాత మరోసారి కొబ్బరికాయ కొట్టి చూడండి. ఇప్పుడు ఎలాంటి బాధలు ఉండవు. అయితే కొబ్బరికాయలో పువ్వు వస్తే సంకేతం ఏంటనే కొందరి సందేహం ఉండొచ్చు. కొబ్బరికాయలో పువ్వు వస్తే శుభం కలుగుతుందని కొన్ని గ్రంథాలు చెప్పాయి. అయితే కుళ్లిన కొబ్బరికాయ వస్తే ఆందోళన చెందకుండా.. వాటికి పరిహారం చేసుకోవాలి.
కొబ్బరికాయను కొట్టడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుంది. ఎందుకంటే ఎలాంటి కల్తీలేని నీరు అంటే కొబ్బరి నీళ్లు మాత్రమే. అలాగే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అందువల్ల కొబ్బరికాయ కొట్టిన తరువాత అందులోని వచ్చిన నీటినీ తప్పకుండా సేవించాలి. అంతేకాకుండా కొబ్బరికాయను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువల్ల ఆలయానికి వెళ్లినప్పుడు కొబ్బరికాయను నిర్లక్ష్యం చేయకుండా వాటిని తినాలని చెబుతూ ఉంటారు.