Ram Charan and Gautham Tinnanuri : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు రామ్ చరణ్(Ram Charan)… ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు (Buchhi Babu) డైరెక్షన్ లో పెద్ది (Peddi) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు ఈ సినిమా ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ (Ram Charan) గౌతమ్ తిన్నానూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు. దాంతో గౌతమ్ విజయ్ దేవరకొండని హీరో గా పెట్టి కింగ్ డమ్ (Kingdom) అనే సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను రామ్ చరణ్ తో చేయాల్సింది.
Also Read : రామ్ చరణ్ చేసిన సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చిన సినిమాలు ఇవేనా..?
కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి రామ్ చరణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేకపోయాడు. ఇక మొత్తానికైతే విజయ్ దేవరకొండ తో రెండు పార్టులు గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మే 30వ తేదీన రిలీజ్ రెడీ అవుతున్న ఈ సినిమాతో గౌతమ్ తిన్ననూరి ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాతో తను ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. ‘కింగ్ డమ్’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కొత్త జానర్ లో తెరకెక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా కూడా గ్లింప్స్ చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది.
మరి ఇలాంటి ఒక గ్లింప్స్ ని మనం ఇప్పటివరకు చూడలేదని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఇక ఇలాంటి క్రమంలో విజయ్ దేవరకొండ కెరియర్ లో ఇది ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుంది అంటూ ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
Also Read : మరగుజ్జుగా కనిపించబోతున్న రామ్ చరణ్..అభిమానులు తట్టుకోగలరా!