Homeఆధ్యాత్మికంJune 7 Horoscope in Telugu : ఈ రాశుల వారికి చాలా కలిసివస్తుంది..

June 7 Horoscope in Telugu : ఈ రాశుల వారికి చాలా కలిసివస్తుంది..

June 7 Horoscope in Telugu : నేటి రాశి ఫలాలు..మీకు మీ రాశిఫలాలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అని ఉందా? జ్యోతిష్యం గురించి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అందుకే మన ఫలితాలు ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి అని తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి. మీరు కూడా అలాంటి వారిలో ఒకరు అయితే ఒకసారి మీ రాశి ఈ రోజు ఎలా ఉందో చెక్ చేసుకోండి.

మేషం
ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు.

వృషభం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్యబాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.

మిథునం
విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు.

కర్కాటకం
ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. క్రీడాకారులు, రాజకీయరంగాల్లోని అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు.

సింహం
బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు.

కన్య
ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆకస్మిక భయం దూరమవుతుంది.

తుల
అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికం
గౌరవ మర్యాదలకు లోపముండదు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. గృహంలో మార్పులు కోరుకుంటారు.

ధనుస్సు
మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఉంటాయి. రుణలాభం పొందుతారు. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మకరం
ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.

కుంభం
విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభార్తలు వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మీనం
పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular