TANA Mahasabhalu 2025 : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతి రెండు సంవత్సరాలకోసారి నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈసారి తానా 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3 నుండి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నాయి. అమెరికాలోని నలుమూలల నుండి తెలుగువారు, అలాగే అమెరికా, ఇండియా నుండి రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల ప్రముఖులు, సినీతారలు మరియు ఇతర ప్రముఖులు ఈ మహాసభలకు హాజరై సందడి చేయనున్నారు.
ఈసారి మహాసభలకు సినీరంగం నుండి పలువురు హీరోలు, హీరోయిన్‌లు, సంగీత దర్శకులు, నేపథ్య గాయనీ గాయకులు వస్తున్నారు. వీరితోపాటు యాంకర్లు, ఇతర చిన్న, పెద్ద తారలంతా తరలి వస్తున్నారు.
టాలీవుడ్ నుండి సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్, హీరో నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, ప్రముఖ సంగీత దర్శకులు థమన్, గాయనీ గాయకులు చిత్ర, సునీత, ఎస్.పి.బి. చరణ్, శ్రీకృష్ణ, సింహ, అలాగే గాయని శోభారాజు, జబర్దస్త్ హీరోయిన్ సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. వీరితోపాటు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యే ఈ మహాసభలకు అందరూ రావాలని కాన్ఫరెన్స్ నిర్వాహకులు కోరారు.
ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఆఫర్: ఒకటి కొంటే ఒకటి ఉచితం!
తానా మహాసభల కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు ఒక అద్భుతమైన రిజిస్ట్రేషన్ ఆఫర్‌ను ప్రకటించారు. జూన్ 8వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక టిక్కెట్‌కు ఇంకో టిక్కెట్ ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ఆఫర్ పొందాలనుకున్నవారు పోస్టర్‌లో చూపిన విధంగా కోడ్‌ను ఉపయోగించుకోవచ్చు.
జూలై 4, 5వ తేదీల వరకు సాధారణ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. అయితే, ఈ “ఒకటి కొంటే ఒకటి ఉచితం” (BOGO) ఆఫర్ జూన్ 8వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటనే మీరు మహాసభలకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి. ఇతర వివరాల కోసం కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
కాన్ఫరెన్స్ వెబ్‌సైట్: tanaconference.org
రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://tanaconference.org/event-registration.html