Sri Satya Love Failure Story : హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన శ్రీసత్య పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. అనంతరం నేను శైలజా, గోదావరి నవ్వింది వంటి చిత్రాల్లో పాత్రలు చేసింది. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ రాకపోవడంతో సీరియల్ నటిగా మారింది. నిన్నే పెళ్లాడతా, ముద్ద మందారం, త్రినయని తో పాటు ఒకటి రెండు ఇతర సీరియల్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న శ్రీసత్యకి మరింత ఫేమ్ దక్కింది. అయితే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఆమె మూటగట్టుకుంది. శ్రీసత్య మొదట్లో చాలా కామ్ గా ఎవరితో మాట్లాడేది కాదు. ఇలా అయితే కుదరదు అని నాగార్జున సూచన చేయడంతో తీరు మార్చుకుంది.
అర్జున్ కళ్యాణ్ ఆమె వెంటపడేవాడు. అర్జున్ కళ్యాణ్ వీక్ నెస్ ని బాగా వాడుకుంది శ్రీసత్య. అతనికి అంది అందనట్లు ఉంటూ తిప్పించుకునేది. అవసరమైన సందర్భాల్లో తనకు అనుకూలంగా వాడుకునేది. ఆమె కోసమే షోకి వచ్చినట్లు ప్రవర్తించిన అర్జున్ కళ్యాణ్ త్వరగానే హౌస్ ని వీడాడు. అర్జున్ కళ్యాణ్ విషయంలో ఓ లైన్ మైంటైన్ చేసిన శ్రీసత్య.. శ్రీహాన్ కి మాత్రం దగ్గరైంది. అతడు టైటిల్ విన్నర్ రేసులో ఉన్నాడని గ్రహించి తనతో సన్నిహితంగా ఉండటం స్టార్ట్ చేసింది.
ఇతరులను వాడుకుంటూ గేమ్ ఆడుతుందని శ్రీసత్య మీద నెగిటివిటీ నడిచింది. ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపించాయి. అయితే ఫ్యామిలీ వీక్ శ్రీసత్యకు ప్లస్ అయ్యింది. తల్లి వీల్ చైర్ లో రావడంతో సింపతీ దక్కింది. అయినప్పటికీ ఫైనల్ కి వెళ్లలేకపోయింది శ్రీసత్య. మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత ఆమెకు మా టీవీ షోలలో అవకాశాలు దక్కాయి. బీబీ జోడిలో కంటెస్ట్ చేసింది. ప్రస్తుతం కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2లో సందడి చేస్తుంది.
Also Read : వాటికి సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ… ఛీ, అప్పుడే బాగున్నాయి అంటూ జనాల సెటైర్స్!
తాజా ఎపిసోడ్ లో శ్రీసత్య తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ బయటపెట్టింది. ప్రియుడి కోసం కంటి చూపును కూడా ప్రమాదంలో పెట్టుకుందట. శ్రీసత్య ఇంటి ఎదుట ఒక అబ్బాయి ఉండేవాడట. అతన్ని చూసేందుకు రోజు ఎదురింటి వెళ్ళేది అట. ఒకరోజు స్పెక్ట్స్ పెట్టుకుని వెళ్లిందట. స్పెక్ట్స్ నీకు చాలా బాగున్నాయి అన్నాడట. దాంతో స్పెక్ట్స్ కొనివ్వమని వాళ్ళ అమ్మను అడిగిందట. వాళ్ళ అమ్మ కొనివ్వలేదట. అక్క స్పెక్ట్స్ రావాలంటే ఏం చేయాలని పక్కింటి అక్కను అడిగిందట. ఆమె సలహా మేరకు పక్కింటి అక్క స్పెక్ట్స్ రెండు నెలలు పెట్టుకుందట. దాంతో శ్రీసత్యకు సైట్ వచ్చిందట. అప్పుడు వాళ్ళ అమ్మ స్పెక్ట్స్ కొనిస్తాను అందట. ఇంత చేస్తే.. చివరికి శ్రీసత్య ప్రియుడు ఆ పక్కింటి అక్కను ప్రేమించాడు అట. ఆ విధంగా తన లవ్ ఫెయిల్ అయ్యిందని వెల్లడించింది.