Today 22 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు ఊహించని డబ్బు వసూలు అవుతుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు ఉత్సాహకరమైన వాతావరణ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులను ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు కలిసి రావడంతో లాభాల పంట పండుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తాడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇన్నాళ్లు అయోమయంగా ఉన్న ఒక విషయంపై స్పష్టత వస్తుంది. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. భవిష్యత్తులో వచ్చే లాభాల కోసం ఇప్పుడు పెట్టుబడులు పెడతారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని వెంటనే అధిగమించుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వl ఉద్యోగులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరి మాట తీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. వ్యక్తిగతంగా ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులకు వస్తువులు కొనుగోలు చేస్తారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తొందరపాటు చర్యలు చేపడితే సహనంతో ఉండాలి. ఉన్నట్లుండి అధికంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉండే వారికి అన్నీ కలిసి వస్తాయి. ఆగిపోయిన బకాయిలు వసూలు అవుతాయి. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ప్రయాణాలు కలిసి వస్తాయి. పాత పెట్టుబడుల నుంచి అధిక లాభాలు పొందుతారు. సాయంత్రం మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీంతో ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం ఏర్పడుతుంది. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు క్రమశిక్షణతో ఉండడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో వ్యాపార అభివృద్ధి సాగుతుంది కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈరోజు సామాజికంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. నైపుణ్యతను ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మధ్యతో ఉండడంతో అధిక లాభాలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి. విద్యార్థులకు గురువుల అండదండలు ఉంటాయి. అనవసరపు వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండాలి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.