Homeఆధ్యాత్మికంShiva Kapala Story: మహాశివుడి కపాల దండ వెనుక స్టోరీ ఇదే..

Shiva Kapala Story: మహాశివుడి కపాల దండ వెనుక స్టోరీ ఇదే..

Shiva Kapala Story: హిందూ పురాణాల ప్రకారం.. పరమశివుడు అనేక విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. అందులో అత్యంత భయానకమైన, రహస్యమయమైన రూపాల్లో ఒకటి “కపాల మాలధారి” రూపం. శివుడి మెడలో కనిపించే కపాల దండ లేదా పుర్రెల హారం వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం భయానక అలంకారం మాత్రమే కాదు.. జీవితం, మరణం, అహంకారం గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రతీకగా భావిస్తారు. అ సందేశం ఏంటంటే? పురాణాల ప్రకారం […]

Shiva Kapala Story: హిందూ పురాణాల ప్రకారం.. పరమశివుడు అనేక విభిన్న రూపాల్లో దర్శనమిస్తాడు. అందులో అత్యంత భయానకమైన, రహస్యమయమైన రూపాల్లో ఒకటి “కపాల మాలధారి” రూపం. శివుడి మెడలో కనిపించే కపాల దండ లేదా పుర్రెల హారం వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం భయానక అలంకారం మాత్రమే కాదు.. జీవితం, మరణం, అహంకారం గురించి గొప్ప సందేశాన్ని ఇచ్చే ప్రతీకగా భావిస్తారు. అ సందేశం ఏంటంటే?

పురాణాల ప్రకారం ..ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు తనకు ఐదు తలలు ఉండటంతో అహంకారానికి లోనయ్యాడని చెబుతారు. ఆ గర్వాన్ని తగ్గించేందుకు శివుడు కాలభైరవ రూపం ధరించి బ్రహ్మ ఐదో తలను ఖండించాడని కథ ఉంది. అయితే బ్రహ్మహత్య పాపం కారణంగా ఆ కపాలం శివుడి చేతికి అంటుకుపోయింది. అప్పటి నుంచి శివుడు భిక్షాటన చేస్తూ తిరిగాడని, చివరికి కాశీలో ఆ పాప విమోచనం పొందాడని పురాణాలు వివరిస్తాయి. ఈ సంఘటన తర్వాత శివుడి కపాల రూపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందని చెబుతారు.

శివుడి కపాల దండకు మరో ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. ఈ పుర్రెలు మనుషుల జనన–మరణ చక్రాన్ని సూచిస్తాయని తత్వవేత్తలు చెబుతారు. ఎంత శక్తివంతుడైనా, ధనవంతుడైనా చివరికి శరీరం మట్టిలో కలిసిపోతుందనే సత్యాన్ని శివుడు తన అలంకారంతో గుర్తుచేస్తాడని భావిస్తారు. అంటే అహంకారం, లోభం, మోహం అన్నీ తాత్కాలికమే అని ఈ రూపం బోధిస్తుంది.

కొన్ని శైవ సంప్రదాయాల ప్రకారం శివుడి మెడలోని కపాలాలు గత యుగాల్లో జన్మించిన జీవుల ప్రతీకలు. కాలానికి అధిపతి అయిన మహాకాలేశ్వరుడు సృష్టి, స్థితి, లయలను నియంత్రిస్తాడనే భావనను ఈ రూపం తెలియజేస్తుంది. అందుకే శివుడిని స్మశానవాసి , భూతనాథుడు , కాలభైరవుడు వంటి పేర్లతో కూడా పిలుస్తారు.

దేవతలకే భయం కలిగించే శివుడి ఈ ఉగ్రరూపం వెనుక భక్తులకు రక్షణ భావన దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి. చెడును నాశనం చేసి ధర్మాన్ని కాపాడేందుకు శివుడు భయంకర రూపం ధరించాడని విశ్వాసం. అందుకే ఆయన ఉగ్రంగా కనిపించినా భక్తుల పట్ల మాత్రం కరుణామూర్తిగా ఉంటాడని శైవాగమాలు పేర్కొంటాయి.

శివుడి కపాల దండ మనిషికి ఒక గొప్ప జీవన సత్యాన్ని నేర్పుతుంది. శరీరం నశించేదే అయినా ఆత్మ శాశ్వతమనే భావనను గుర్తుచేస్తుంది. జీవితం తాత్కాలికమని తెలుసుకుని ధర్మబద్ధంగా జీవించాలని, అహంకారాన్ని విడిచిపెట్టాలని శివతత్వం సందేశం ఇస్తుంది. అందుకే శివుడి ఈ భయానక రూపాన్ని భక్తులు భయంతో కాకుండా భక్తి, ఆధ్యాత్మికతతో ఆరాధిస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper