Liquor Deaths In West Godavari: ఆంధ్రాలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. కూలీనాలీ చేసుకునే పేదలు కల్తీ సారాకు బలైపోయారు. వినడానికే బాధగా ఉన్న ఈ ఘటన విషయంలో సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం.. ఇది సహజ మరణాలుగా చిత్రీకరించడానికి వాళ్లు చేయని ప్రయత్నం లేదు.

జరిగిందేదో ఏదో జరిగింది. వాళ్లకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం సహజ మరణాలుగా చిత్రీకరించడాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Chinajiyar Swamy : కేసీఆర్ తో చెడింది.. చినజీయర్ స్వామిపై వివాదాల బండ పడింది.. వీడియోతో బుక్!
కల్తీసారా లాంటి ఘటనలు తరచుగా ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. బీహార్ సహా చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే మధ్యపాన నిషేధం అమలు చేస్తామన్న జగన్ సర్కార్ ధరలు పెంచడంతో కల్తీ మద్యం తయారై చీప్ గా దొరికిందని తాగి ప్రజలు ఉసురు తీసుకుంటున్నారు.
ఏపీలో మద్యపాన నిషేధం కాదు.. ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. ధరలు భారీగా పెంచి ఏవేవో నకిలీ బ్రాండ్లు తేవడంతో సామాన్యులు ఈ మద్యం కొనలేకపోతున్నారు. తాగడం కోసం వారు నకిలీ మద్యం తాగి ప్రాణాలు తీసుకుంటున్నారు.
Also Read: Nara Lokesh’s Letter To Jagan: జగన్ కు నారా లోకేష్ లేఖ.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలట
తప్పుడు మద్యపాన విధానమే ఏపీలో మరణాలకు కారణం. మద్యపాన నిషేధం ఎక్కడా సక్సెస్ కాలేదు. భారత్ లో ఇది అసలు సాధ్యం కాదు. వైసీపీ తప్పుడు మద్యం విధానంతో పేదలు బలి అవుతున్నారని దీనిపై సవివరణ విశ్లేషణను ‘రామ్ ’ గారి కింది వీడియోలో చూడొచ్చు..
[…] Liquor Policy AP: తాము అధికారంలోకి వస్తే మద్యనిషేధం చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఏపీలోని అక్కచెల్లెళ్లకు హామీ ఇచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా నేటికీ మద్యం నిషేధం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. దీనికితోడు మద్యం షాపులను తగ్గిస్తున్నామనే సాకుతో మద్యం రేట్లను భారీగా పెంచి ప్రభుత్వం ఖజనా నింపుకునే ప్రయత్నం చేస్తోందని అన్నివర్గాల నుంచి విమర్శలకు తావిస్తోంది. […]
[…] Nara Lokesh’s Letter To Jagan: రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో అన్ని దేశాలపై ప్రభావం పడింది. అక్కడ వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వారిని చదివించేందుకు ముందుకొచ్చింది. వారి విద్య కోసం అయ్యే ఖర్చు తామే భరిస్తామని చెబుతోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. విద్యార్థుల భవితవ్యంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు. […]