spot_img
HomeతెలంగాణTS SSC Results : తెలంగాణ టెన్త్‌ ఫలితాలు : నిర్మల్ కు తొలిస్థానం..వికారాబాద్ లాస్ట్

TS SSC Results : తెలంగాణ టెన్త్‌ ఫలితాలు : నిర్మల్ కు తొలిస్థానం..వికారాబాద్ లాస్ట్

TS SSC Results :  తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 86.60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాలను రాష్ట్ర విద్యా పరిశోధన మండలి (ఎన్.సీఈఆర్టీ) ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

ఈ ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్‌ విద్యార్థులు 4,86,194 మంది దరఖాస్తు చేసుకోగా 4,84,384 మంది హాజరయ్యారు. వీరంతా రిజల్ట్స్‌ కోసం దురు చూస్తున్నారు. ఏప్రిల్‌ 11వ తేదీన తెలంగాణ పదో తరగతి పరీక్షలు ముగియగా 14వ తేదీన వాల్యుయేషన్‌ ప్రక్రియ ను ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 18 కేంద్రాల్లో వాల్యుయేషన్‌ నిర్వహించారు. ఏప్రిల్‌ 21వ తేదీ వరకు పూర్తిచేశారు.

తుది ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు. ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్‌ చేస్తున్నారు. టెక్నికల్‌ ట్రయల్స్‌ను పలుమార్లు నిర్వహించారు. అంతా సవ్యంగా జరుగడంతో బుధవారం ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు.

ఫలితాల్లో బాలికలు 88.53 శాతం… బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ వ్యాప్తంగా 2793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో సున్నా శాతం ఫలితాలు వచ్చాయి. 25 పాఠశాల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి సబిత తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తీర్ణతలో 99 శాతంతో ప్రథమ స్థానంలో నిర్మల్‌ జిల్లా నిలిచింది. 59.46 శాతంతో చివరి స్థానంలో వికారాబాద్‌ సరిపెట్టుకుంది.

జూన్ 14 నుంచి 22 వరకూ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని.. ఈనెల 26 లోపు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ravi Teja

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...
AI Farming Technology

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Jeetendra Property

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...
Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper