Homeఎంటర్టైన్మెంట్Bro Movie Teaser- Pawan Kalyan: 'బ్రో ' టీజర్ చూసి పగలబడి నవ్వుకున్న పవన్...

Bro Movie Teaser- Pawan Kalyan: ‘బ్రో ‘ టీజర్ చూసి పగలబడి నవ్వుకున్న పవన్ కళ్యాణ్ .. వైరల్ అవుతున్న వీడియో

అందులో భాగంగా ఆయన భీమవరం కి చేరుకున్నాడు. హైదరాబాద్ కి వచ్చి సినిమాకి సంబంధించిన డబ్బింగ్ చెప్పే అవకాశం లేకపోవడం తో, ఆ చిత్ర డైరెక్టర్ సముద్ర ఖని నేరుగా భీమవరం కి వచ్చేసాడు. అక్కడే పవన్ కళ్యాణ్ తో టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ చెప్పించుకున్నాడు. ఇప్పుడు టీజర్ మొత్తం సిద్ధం అయిపోయిందని, అప్డేట్ త్వరలోనే ఇస్తామని డైరెక్టర్ సముద్ర ఖని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.

Bro Movie Teaser- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం వచ్చే నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే, విడుదలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు కేవలం మోషన్ పోస్టర్ తప్ప మరో ప్రమోషనల్ కంటెంట్ ఏది కూడా రాలేదు.

దీనితో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో రచ్చ చేసారో మన రోజూ చూస్తూనే ఉన్నాం. మేకర్స్ ని ట్యాగ్ చేసి బండ బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇన్ని రోజుల నిరీక్షణ కి మొత్తానికి తెరపడనుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని రేపు లేదా ఎల్లుండి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వారాహి విజయ యాత్ర’ పొలిటికల్ టూర్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అందులో భాగంగా ఆయన భీమవరం కి చేరుకున్నాడు. హైదరాబాద్ కి వచ్చి సినిమాకి సంబంధించిన డబ్బింగ్ చెప్పే అవకాశం లేకపోవడం తో, ఆ చిత్ర డైరెక్టర్ సముద్ర ఖని నేరుగా భీమవరం కి వచ్చేసాడు. అక్కడే పవన్ కళ్యాణ్ తో టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ చెప్పించుకున్నాడు. ఇప్పుడు టీజర్ మొత్తం సిద్ధం అయిపోయిందని, అప్డేట్ త్వరలోనే ఇస్తామని డైరెక్టర్ సముద్ర ఖని ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.

ఇదంతా పక్కన పెడితే టీజర్ చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ షాట్ ని చూసి పగలబడి నవ్వడం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. టీజర్ లో నిజంగా అంత నవ్వొచ్చే షాట్స్ పెట్టారా, ఇదేదో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని తిరగరాసే సినిమాలాగా ఉందే అని అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. మరి వారి నమ్మకాలు ఎంతవరకు నిజం అవుతాయో మరికొద్ది గంటల్లోనే తెలియనుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper