spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena Avirbhava Sabha: ప్రతిపక్షాల సమాఖ్య కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్?

Janasena Avirbhava Sabha: ప్రతిపక్షాల సమాఖ్య కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్?

Janasena Avirbhava Sabha: ఏపీలోని ఇప్పటంలో నిర్వహించిన జనసేన 9వ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ ప్రజలకు ఒక్కటే హామీ ఇచ్చారు. అది దారుణాలకు కారణమవుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించుతానని శపథం చేశారు. ఇందుకోసం అవసరమైతే వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చకుండా పొత్తులకు సిద్ధం అని ప్రకటించారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వగానే ఏపీపై దండయాత్ర మొదలు పెట్టి 2024లో జనసేన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై చాలా స్పష్టమైన ఆలోచనలతో ముందుకెళుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. కార్యాచరణ జనసేనాని పవన్ అమలు చేస్తారని.. వ్యూహాలు, ప్రణాళికలు పొత్తు పెట్టుకున్న బీజేపీ అందిస్తుందని పవన్ చెప్పకనే చెప్పారు.కేంద్రంలోని బీజేపీ ఏపీలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ ఇవ్వగానే దండయాత్ర మొదలుపెడుతానని.. బీజేపీ ప్లాన్ ప్రకారం ఏపీలో ముందుకెళ్లి రాజ్యాధికారం సాధిస్తామని తెలిపారు.

ఇక వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే పొత్తులకు సిద్ధం అని ప్రకటించారు. దీన్ని బట్టి టీడీపీ కోరితే ఆ పార్టీతో పొత్తుకు తాను సిద్ధమని పవన్ కళ్యాణ్ పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ నేతలు, చంద్రబాబు, లోకేష్ లు పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికారు. భీమ్లానాయక్ ను తొక్కేసిన వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా.. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపారు. భీమ్లానాయక్ చూడాలంటూ టీడీపీ నేతలకు బహిరంగంగానే చెప్పారు. పవన్ ను జగన్ తొక్కేస్తున్నారని చంద్రబాబు, లోకేష్ లు ఆరోపించారు.

దీన్ని బట్టి టీడీపీ కూడా జనసేనానితో పొత్తుకు ఇప్పటికే ఆసక్తి చూపింది. తాజాగా పవన్ సైతం వైసీపీని ఓడించడానికి.. ఆ పార్టీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని సంచలన ప్రకటన చేశారు.అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానన్నారు.

దీంతో ఇప్పుడు ఏపీలో రాజకీయాలు పవన్ చుట్టూ తిరుగుతున్నాయి. బలమైన వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ బలం చాలదు. జనసేన-బీజేపీ కూటమికి అంత శక్తి కూడదీసుకోదు. దీంతో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రతిపక్షాల సమాఖ్య కూటమికి పురుడు పోయడం ఖాయంగా కనిపిస్తోంది. అనంతరం ఈ కూటమి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోబోతున్నారని సమాచారం.

ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు చాలా సార్లు సీఎంగా చేశారు. ఇప్పుడాయనకు 70 ఏళ్లు దాటాయి. వృద్ధాప్యం బాబుకు భారం అవుతోంది. ఇక చంద్రబాబు వారసుడు లోకేష్ కు నాయకత్వం లక్షణాలు లేవు. ఇక బీజేపీ సోము వీర్రాజు ఇప్పటికే పవన్ కళ్యాణ్ యే మా ఉమ్మడి సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. దీంతో ఈ ప్రతిపక్షాల కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే.. ఈ కూటమి పురుడు పోసుకుంటే.. వైసీపీ ఓటు చీలకుండా ఆ పార్టీకి ఓటమి ఖాయం. 2024లో పవన్ కళ్యాణ్ సీఎం కావడం ఖాయం. మరి ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
Oktelugu Epaper