spot_img
Homeజాతీయ వార్తలుNarendra Modi: తన గెలుపు సీక్రెట్ ఏంటో చెప్పిన మోడీ!

Narendra Modi: తన గెలుపు సీక్రెట్ ఏంటో చెప్పిన మోడీ!

Narendra Modi: దేశానికి నాయకుడు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాలి. క్లారిటీతో ముందుకెళ్లాలి. అప్పుడే ఆ పార్టీపై నమ్మకం , ఆదరణ కలుగుతుంది. ఇప్పుడు బీజేపీలో చేస్తోంది అదే. కులాలు, మతాల కుంపట్లతో రగిలే ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి భవ బంధాలు, బంధుత్వాలు లేని ఒక యోగిని సీఎం చేసేశారు. ఆయనకు అలిగేషన్స్ లేకపోవడంతో అక్కడ బీజేపీ హిట్ అయ్యింది. రెండోసారి గెలిచింది.

Narendra Modi
Narendra Modi

ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణం కాంగ్రెస్ లా వారసత్వ రాజకీయాలను చేయకపోవమేనని మోడీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల యూపీ ఎన్నికల్లో తాను ఎందుకు ఎంపీల వారసులకు టికెట్లు ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడే నేతలు, కార్యకర్తలకు టికెట్లు ఎందుకు ఇచ్చానో మోడీ క్లారిటీ ఇచ్చారు. కేవలం పార్టీ గెలుపు కోసమేనని.. బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అని తెలియజేయడానికేనని మోడీ అన్నారు.

ఢిల్లీలో ఈరోజు ఐదు రాష్ట్రాల్లో గెలిచిన సందర్భంగా మోడీకి, జేపీ నడ్డాకు బీజేపీ సీనియర్లు , ఎంపీలు సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరించడానికి ప్రధాన కారణం అదొక కుటుంబ పార్టీ అని.. వారసత్వ రాజకీయాలు చేస్తారని.. అందుకే మనం అలాంటి దారిలో నడవకూడదనే పార్టీలో కష్టపడ్డ వారికే టికెట్లు ఇచ్చామని మోడీ అన్నారు.

Also Read: Telangana Assembly Session 2022: బడ్జెట్ చివరి రోజు కేసీఆర్ ఇచ్చిన వరాలు.. బీజేపీపై సంధించిన ఈ ప్రశ్నలు

జాతీయ రాజకీయాలే కాదు.. ప్రాంతీయ పార్టీల్లోనూ అదే వారసత్వ కంపు కొడుతోంది. తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి పలు పదువులు దక్కాయి. కేటీఆర్ సీఎం రేసులో ఉన్నారు. ఇక ఏపీలో తమిళనాడులో స్టాలిన్ ఫ్యామిలీ.. యూపీలో సమాజ్ వాదీ అఖిలేష్ పార్టీ.. శివసేనలో తండ్రీ కొడుకులు సీఎం మంత్రులుగా కొనసాగుతున్నారు. ఎన్సీపీలోనూ అదే కథ.. శరద్ పవార్, ఆయన కూతురు రాజ్యమేలుతున్నారు. వీరే కాదు.. చాలా పార్టీల్లో వారసత్వ రాజకీయాలున్నాయి.

యూపీ నుంచి తమ వారసులకు టికెట్లు కావాలని ఎంతో మంది ఎంపీలు, మంత్రులు, నేతలు ఒత్తిడి తీసుకొచ్చినా.. కేవలం వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించవద్దనే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇదే బీజేపీ సక్సెస్ ఫార్ములా..

కాంగ్రెస్ లో సోనియా, రాహుల్, ప్రియాంక తప్పితే మరొకరు లేరు. అదే బీజేపీలో మోడీకి వారసులు లేరు. ఇక వాళ్లు ప్రోత్సహించరు. తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. ఏపీలోనూ సోము వీర్రాజు లాంటి ఫైర్ బ్రాండ్లకు బాధ్యతలు ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లోనూ వారసత్వ రాజకీయాలకు తావు లేకుండా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి అందలం దక్కింది. ప్రజల్లో ఆ భరోసా కల్పించారు కాబట్టి విజయం తధ్యమైంది. బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ లాజిక్ మిస్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ చతికిలపడుతోంది. అందుకే వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చరమగీతం పాడేసి మోడీ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని చెప్పొచ్చు.

Also Read: Janasena-TDP Alliance: ప‌వ‌న్ స్పీచ్‌తో టీడీపీలో కొత్త ఆశ‌లు.. వైసీపీలో అల‌జ‌డి

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper