Highest Bodyguard Salary In Bollywood: పెద్దగా పరిచయం లేని హీరోయిన్ షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తేనే.. ఆమెను చూసేందుకు జనం ఎగబడతారు. వేల సంఖ్యలో తరలి వస్తారు. మళ్లీ ఆ జనసంద్రంలో నుంచి ఆ హీరోయిన్ క్షేమంగా బయటపడాలంటే.. పెద్ద రక్షణ వలయమే కావాలి. మరి ఊరు పేరు లేని హీరోయిన్ కే ఇంత హడావుడి ఉంటే.. ఇక స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోలు పబ్లిక్ ప్లాట్ ఫామ్స్ పైకి వస్తే ఇంకెలా ఉంటుంది పరిస్థితి ?
స్టార్లు వస్తున్న ఏరియా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా జనాలు బారులు తీరుతారేమో. తమ అభిమాన నటీనటులతో కలిసి ఫోటోలు దిగడానికి పోటీ పడతారు. ముఖ్యంగా సినిమాల్లో తమ అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్లు వస్తే.. ఇక జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అందుకే.. హీరోయిన్లను ప్రతీక్షణం కాపాడేందుకు బాడీగార్డ్ లు ఉంటారు.
అభిమానులు సెల్ఫీల పేరుతో హీరోలకు కలగ జేసే ఇబ్బందుల నుంచి కాపాడేది కూడా ఈ బాడీగార్డ్ లే. మంచి బాడీగార్డ్ కి చాలా డిమాండ్ ఉంది. అటు రాజకీయ వ్యవస్థలోనూ బాడీగార్డ్ ల సంస్కృతి వచ్చింది. దాంతో.. కొంతమంది హీరోలకు హీరోయిన్లకు మంచి బాడీగార్డ్ లు దొరకని పరిస్థితి కూడా ఉంది.
అందుకే, హీరోయిన్లే కాదు హీరోలు సైతం తమ బాడీగార్డ్ ల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. బాడీగార్డ్‌ల కోసం భారీ శాలరీస్ పే చేస్తున్నారు. అయితే, తాజాగా బాలీవుడ్ లోని హీరోహీరోయిన్ల బాడిగార్డ్స్ జీతాలు ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
మరి హిందీ హీరోహీరోయిన్లలో బాడీగార్డ్స్ కోసం ఏడాదికి ఎవరు ఎక్కువ శాలరీస్ ఇస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరో చూద్దాం.
1. స్టార్ హీరో షారుక్ ఖాన్ తన బాడీగార్డ్ రవి సింగ్ కి ఏడాదికి 2.6 కోట్లు ఇస్తున్నాడు.

2. అమీర్ ఖాన్ తన బాడీగార్డ్ యువరాజ్ గోర్పడే కి 2 కోట్లు ఇస్తున్నాడు.

3. అమితాబ్ బచ్చన్ తన బాడీగార్డ్ జితేందర్ షిండే కి 1.5 కోట్లు ఇస్తున్నాడు.

4. సల్మాన్ ఖాన్ తన బాడీగార్డ్ షెరా 2 కోట్లు ఇస్తున్నాడు.

5. అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ శ్రేయసే తేలే కి 1.20 కోట్లు ఇస్తున్నాడు.

6. కంగనా రనౌత్ తన బాడీగార్డ్ కుమార్ కి 90 లక్షలు ఇస్తోంది.

7. దీపికా పదుకొణె తన బాడీగార్డ్ జలాల్ కి కోటి ఇస్తోంది.

8. కత్రీనా కైఫ్ తన బాడీగార్డ్ దీపక్ సింగ్ కి కోటి ఇస్తోంది.

9. అనుష్క శర్మ తన బాడీగార్డ్ ప్రకాష్ సింగ్ కి 1.2 కోట్లు ఇస్తోంది.

[…] Shahrukh Khan OTT Platform: కరోనా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు ఫుల్ గిరాకీ పెరిగింది. ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. గ్రామీణ యువత కూడా ఓటీటీలోనే ఎక్కువగా తమ కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ల మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడిన పరిస్థితి. మొత్తమ్మీద భవిష్యత్తు మొత్తం ఓటీటీలదే అని అర్థం అయిపోయింది. అందుకే, ఈ ఊపులో పలు కొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. […]
[…] RRR Movie: సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ ఆర్ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి వస్తున్న అనుమానాలు చాలా ఎక్కువే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఉండడంతో ఎవరిని ఎక్కువ, తక్కువ చేసి చూపించినా ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతాయి అంటూ మొదటి నుంచి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. […]
[…] […]