spot_img
Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan - I-Pac : జగన్ పాలిట ఐ ప్యాక్ హీరోనా.. విలనా?

CM Jagan – I-Pac : జగన్ పాలిట ఐ ప్యాక్ హీరోనా.. విలనా?

CM Jagan – I-Pac :   అందుకే అంటారు అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలనేది. సొంత పార్టీల నేతల కంటే ఎక్కువగా జగన్ ఐ ప్యాక్(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సర్వేలనే నమ్ముతున్నారు. రిషిరాజ్ సింగ్ నేతృత్వంలో ఈ టీం పనిచేస్తుంది. ఆపరేషన్ 2024 దీని ముఖ్య విధి. ఆ టీం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా పార్టీ శ్రేణులను జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐ ప్యాక్ సర్వేలు ఏమయ్యాయి. అంచనాలు ఎక్కడ తప్పాయి. దీనిపై జగన్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

మొదటి నుంచి జగన్ వ్యూహకర్తల మీదే ఆధారపడ్డారు. వారే తనను గట్టెక్కిస్తారని భావిస్తున్నట్లున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశాంత్ కిషోర్‌ను అపాయింట్ చేసుకున్నారు. కోట్లకు కోట్లు తగలేసి అధికారంలోకి వచ్చారు. పీకే టీం చేసిన సర్వేలు ఆయన గెలుపునకు ఎంతో దోహదపడ్డాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఐ ప్యాక్ టీం ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ టీం చురుగ్గా పనిచేస్తుంది.

నియోజకవర్గాల వారీగా పార్టీ మంచి చెడులను అంచనా వేసి జగన్‌కు రిపోర్టు ఇస్తూ తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించడం ఐ ప్యాక్ పని. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తిగా దృష్టి పెట్టి అధికారంలోకి తీసుకురావాల్సిన టీం సభ్యులు పప్పులో కాలేశారు. ఇది ఎంతలా అంటే వైసీపీకి కోలుకోలేని విధంగా దెబ్బ పడిపోయింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐ ప్యాక్ టీం చేసిన నిర్లక్యంగా కారణంగా రాబోవు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుండనడంలో సందేహం లేదు.

ముందు నుంచి ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. తమ సత్తా చాటి వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిస్తున్న ఉద్యోగ సంఘాలపై ఐ ప్యాక్ టీం దృష్టి పెట్టింది. ఆ మేరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుచుకునేందుకు వ్యూహాలు రచించారు. ఉద్యోగ సంఘాల్లో ఐనైక్యత ఆధారంగా పార్టీని గెలిపించుకోగలిగారు. అయితే, పట్టభద్రల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతిపక్షాల నోళ్లకు పని కల్పించింది.

ఐ ప్యాక్ చేసిన చిన్న తప్పిదాన్ని జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం తమ టీం విజయాన్ని తెలియజేసేందుకు వెళ్లగా, అక్కడ సీన్ మరో రకంగా ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అడిగినన్ని డబ్బులు ఇస్తున్నాము.. ఒక్కొక్కరికి వేలకు వేలు జీతాలు ఇస్తున్నాము.. చిన్న ఎన్నికను కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఎలా అని నిలదీసినట్లు తెలుస్తుంది. ఇలా అయితే ఇంకొకరిని చూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారట.

దీంతో ఐ ప్యాక్ టీం సభ్యులు జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలోనన్న ఆలోచనలో పడిపోయారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాబోవు ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుచుకునేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. చూద్దాం ఏం అవుతుందో…

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper