Homeజాతీయ వార్తలుHyderabad: పాతబస్తీలో శృతిమించుతున్న ఆగడాలు.. కరెంట్ కట్ చేసినందుకు సబ్‌ ఇంజినీర్‌ చాతీపై తన్నాడు..!

Hyderabad: పాతబస్తీలో శృతిమించుతున్న ఆగడాలు.. కరెంట్ కట్ చేసినందుకు సబ్‌ ఇంజినీర్‌ చాతీపై తన్నాడు..!

Hyderabad: ఓల్డ్‌ సిటీ.. హైదరాబాద్‌లో ఈ పేరు వింటేనే అధికారుల నుంచి పోలీసుల వరకు హడల్‌.. ప్రజాప్రతినిధులైతే ఆ పేరు ఎత్తడానికి కూడా సాహసం చేయరు. ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లక తప్పనిసరి పరిస్థితి. అసాంఘిక కార్యకలాపాలకు.. ఓ వర్గానికి చెందిన వలస వాదులకు అది అడ్డాగా మారిందని బీజేపీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు ఉగ్రవాద సంస్థలకు అనుబంధంగా పనిచేసే వారు పట్టుబడడం బీజేపీ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అయినా రాష్ట్రం ప్రభుత్వం ఇక్కడి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేసే ప్రయత్నం చేయదు. అధికారులకు, పోలీసులకు విషయం తెలిసినా.. పెద్దగా పట్టించుకోరు! కరెంటు బిల్లు వసూలు చేయడానికి కూడా అధికారులు జంకుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ సంఘం నిర్వహించిన సర్వేలో అత్యధిక విద్యుత్‌ బిల్లులు పెండింగ్‌ ఉన్న ప్రాంతంగా ఓల్‌ సిటీని గుర్తించింది. తర్వాతి స్థానంలో సిద్దిపేట ఉంది. ఓల్డ్‌ సిటీ ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించరు. అయినా పాలకులు పెద్దగా పట్టించుకోరు. కాదు కాదు.. వసూలు చేసే సాహసం చేయరు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయం. ఇతర ప్రాంతాల్లో ఒక నెల బిల్లు చెల్లించకపోయినా కరెంటు కనెక్షన్ కట్‌ చేస్తారు. ఓల్డ్‌ సిటీలో మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉంటాయి. అక్కడి వారు ఇచ్చినప్పుడే బిల్లు తీసుకుంటారు.

Hyderabad
Hyderabad

-పేరు నిలబెట్టాడు..
ఓల్డ్‌.. అంటే పాత.. నాగరికత తెలియని.. అనాగరికులు అని అర్థం. రాష్ట్ర రాజధానిలో భాగమైన ఈ ఓల్డ్‌ సిటీ పేరును అక్కడి ఓ యువకుడు నిలబెట్టాడు. తాము అనాగరికులమే.. అనాగరికంగానే వ్యవహరిస్తామని నిరూపించాడు. కార్వాన్‌ నియోజకవర్గానికి చెందిన ఆ యువకుడు కరెంటు బిల్లు కట్టమని అడిగిన విద్యుత్‌ శాఖ అధికారిపై వీరంగం సృష్టించాడు. తన కార్యాలయానికే విద్యుత్‌ సరఫరా కట్‌ చేస్తావా అంటూ.. దాడికి పాల్పడ్డాడు. నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా చుట్టూ అధికారులు వద్దని వారిస్తున్నా.. వినకుండా బల్లపై ఎక్కి మరీ దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనతో పాతబస్తీ మరోసారి వార్తలలో నిలిచింది.

-అంతా మా ఇష్టం..
ప్రధానంగా పాత బస్తీలో స్థానిక నాయకులు, కొంత మంది యువకులు అధికారులతో ఇష్టాను సారంగా ప్రవర్తిస్తారు. ఈ ఆరోపణలకు బలం చూకూర్చే విధంగా అనేక సంఘటనలు ఇప్పటికే వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు పెండింగ్‌ బిల్లులు చెల్లించలేదని విద్యుత్‌ అధికారి అతని కార్యాలయానికి.. విద్యుత్‌ సరఫరాను నిలిపివేశాడు. 22 ఏళ్ల సదరు స్థానిక యువకుడు, మరో ముగ్గురితో కలిసి రెచ్చిపోయారు. తన కార్యాలయానికే విద్యుత్‌ సరఫరా నిలిపిస్తావా అంటూ ఆఫీస్‌కు వచ్చాడు. కార్యాలయంలో జూనియర్‌ ఇంజనీర్‌ విజయ్‌కుమార్‌ ఛాంబర్‌కు వెళ్లాడు. అక్కడ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా.. బెంచీ మీద నిలబడి అధికారిపై పిడిగుద్దులు కురిపించారు. కాలితో తన్నాడు. పాత బస్తీలో మంత్రి కేటీఆర్‌ పర్యటించిన రోజే ఈ సంఘటన జరగడం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది.

-మతం పేరిట పంచాయతీలు పెట్టం..
పాత బస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తామని, అభివృద్ధిని విశ్వసిస్తామని, కులం, మతం పేరిట రాజకీయాలు చేయమని పంచాయతీలు చేయమని అన్నారు. మతం పేరిట రాజకీయాలు.. విధ్వేషాలు చేసేవారిని అణచివేస్తామని హెచ్చరించారు. మంత్రి పాతబస్తీలో ఉన్న సమయంలోనే కార్వాన్‌ పరిధిలో విద్యుత్‌ అధికారిపైనా దాడి జరిగింది. మీడియాలో, సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అయ్యాయి. అయినా మంత్రి కనీసం స్పందించలేదు. 24 గంటలు గడిచిన తర్వాత కూడా చర్యలకు ఆదేశించలేదు. మంత్రి పక్కనే హోంమంత్రి కూడా ఉన్నారు. అయినా చర్య తీసుకుంటామని ప్రకటన కూడా చేయలేదు.

Also Read: Mahesh Babu Emotional Post: ఎప్పటికీ ప్రేమిస్తాను.. కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ !

ఈ క్రమంలో బీజేపీ నాయకులు బుధవారం స్పందించారు. మత రాజకీయాలను సహించమంటున్న కేటీఆర్‌ పాత బస్తీలో జరిగిన దాడిని కనీసం ఖండించకపోవడం, చర్యలకు ఆదేవించకపోవడం ఎలాంటి రాజకీయమని బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగినా స్పందించే టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత పాత బస్తీలో దురాఘతాలపై ఎందుకు స్పందించరని, భైంసా అల్లర్లపై ఎందుకు నోరెత్తరని నిలదీశారు. ప్రభుత్వ అధికారిపైనే పాత బస్తీలో దాడులు జరుగుతుంటే.. అధికార పార్టీ నాయకలు ఒక వర్గానికి కొమ్ముకాస్తూ.. ఆ ప్రాంతానికి చెందిన విధ్వంసకర శక్తులను వెనుకేసుకురావడం ఏం రాజకీయమని నిలదీశారు. సామాజిక మాధ్యమాల్లో విద్యుత్‌ అధికారిపై దాడి దృశ్యాలు వైరల్‌ అయినా.. ఆ శాఖ ఉద్యోగులు, అధికారులు కూడా కనీసం స్పందించకపోవడం గమనార్హం.

ఉద్యోగుల్లో ఐక్యత ఏమైందన్న ప్రశ్న తలెత్తుతోంది. పాత బస్తీ ఘటనపై ఆశాఖ ఉద్యోగులు స్పందించకపోతే.. ప్రభుత్వం ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులు పెంచిన నేపథ్యంలో అధిక బిల్లు వచ్చిందని, తాము బిల్లు చెల్లించమని, పాత బస్తీలో వసూలు చేసిన తర్వాత తమ వద్దకు రావాలని ఇతర ప్రాంతాల్లోనూ దాడులు జరిగే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: Mahesh Babu Emotional Post: ఎప్పటికీ ప్రేమిస్తాను.. కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ !


Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular