Homeఎంటర్టైన్మెంట్SPY Teaser : మొన్న కార్తికేయ_2.. నేడు స్పై.. ప్యాన్ ఇండియా నుంచి తగ్గేదేలే అంటున్న...

SPY Teaser : మొన్న కార్తికేయ_2.. నేడు స్పై.. ప్యాన్ ఇండియా నుంచి తగ్గేదేలే అంటున్న నిఖిల్

SPY Teaser : హ్యాపీ డేస్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు నిఖిల్ సిద్ధార్థ ఆలియాస్ నిఖిల్. ఈ యువ నటుడు తన కెరియర్లో చాలా ప్రయోగాలు చేశాడని చెప్పాలి. హ్యాపీ డేస్ తర్వాత యువత, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, శంకరాభరణం, కిరాక్ పార్టీ, కార్తికేయ 2, 18 పేజెస్ వంటి వైవిధ్యభరితమైన సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ముఖ్యంగా కార్తికేయ సినిమాలో అతని నటన మరో స్థాయిలో ఉంటుంది. ఇక సూర్య వర్సెస్ సూర్యలో అయితే జీవించాడు అనే పదం కూడా తక్కువవుతుంది. అలాంటి నిఖిల్ ఇప్పుడు దేశభక్తి జోనర్ లో స్పై అనే పేరుతో రూపొందుతున్న సినిమాలో జై అనే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ యూట్యూబ్లో విడుదలైంది. ఆ టీజర్ చూస్తే నిఖిల్ పడిన కష్టం కళ్ళ ముందు కనిపిస్తోంది. అంతేకాదు ఆ టీజర్ మరింత ప్రామిసింగ్ గా ఉంది.

ప్రయోగాలకు కొత్తపీట

సినిమా అనేది కమర్షియల్ హంగులతో ఉంటుంది. నిర్మాత కోట్లకు కోట్లు డబ్బులు పెట్టుబడి పెడతారు కాబట్టి వాటికంటే ఎక్కువ రావాలని కోరుకుంటాడు. ఇందులో భాగంగానే దర్శకుడితో కమర్షియల్ హంగులు ఉండేలా మార్పులు చేర్పులు చేయిస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలు కమర్షియల్ హంగులకు దూరంగా ఉంటూనే నిర్మాతలకు కోట్లు తెచ్చి పెడుతూ ఉంటాయి. అలాంటి సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకునే నటుల్లో నిఖిల్ ఒకడు. ఈయన ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి ద్వంద్వార్థంతో, బూతులతో, వెకిలి సీన్లు ఉన్న సినిమా లేదంటే అతిశయోక్తి కాక మానదు. అందువల్లే ప్రస్తుతం ఉన్న యువ నటుల్లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటున్నాడు.

ఇప్పుడు రూట్ మార్చాడు

ఇక తాజాగా నిఖిల్ కార్తికేయ_2 విజయం తర్వాత తన రూటు పూర్తిగా మార్చేశాడు. ఈసారి ఏకంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న స్పై అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ఎడిటర్ గ్యారి బీహెచ్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమిళ చిత్రసీమకు చెందిన ఐశ్వర్య మీనన్ ఈ సినిమా ద్వారా కథానాయకగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. జూన్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం ఢిల్లీలోని కర్తవ్య పథ్ వద్ద టీజర్ విడుదల చేసింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతోంది. కార్తికేయ _2 పాన్ ఇండియా రేంజ్ లో విజయవంతం కావడంతో తన మార్కెట్ ను మరింత పెంచుకునేందుకు నిఖిల్ ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాడు.. హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఒక మామూలు నటుడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నిఖిల్..ఇవాళ పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ పెంచుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper