Homeక్రీడలుక్రికెట్‌Gautam Gambhir : అంటేనేమో చిన్న బుచ్చుకుంటాడు గానీ.. గౌతమ్ గంభీర్ వల్ల ఎంతమంది ప్లేయర్లు...

Gautam Gambhir : అంటేనేమో చిన్న బుచ్చుకుంటాడు గానీ.. గౌతమ్ గంభీర్ వల్ల ఎంతమంది ప్లేయర్లు వెళ్లిపోయారో తెలుసా?

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా రాకమందు టీమిండియా అన్ని ఫార్మాట్ లలో నెంబర్ వన్ గా ఉండేది. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ ప్రధాన శిక్షకుడిగా వచ్చాడో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు ఎంపిక కాలేదు. వన్డే లలో కొన్ని వైఫల్యాలు ఎదుర్కొంది. టి20 లలో ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలో ఓటమి ఎదుర్కొంది. టీమిండియా ఒకప్పటి స్థాయి చూస్తున్న […]

Gautam Gambhir : గౌతమ్ గంభీర్ శిక్షకుడిగా రాకమందు టీమిండియా అన్ని ఫార్మాట్ లలో నెంబర్ వన్ గా ఉండేది. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ ప్రధాన శిక్షకుడిగా వచ్చాడో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. టెస్ట్ ఫార్మాట్లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు ఎంపిక కాలేదు. వన్డే లలో కొన్ని వైఫల్యాలు ఎదుర్కొంది. టి20 లలో ప్రస్తుత వరల్డ్ కప్ లో సూపర్ 8 దశలో ఓటమి ఎదుర్కొంది.

టీమిండియా ఒకప్పటి స్థాయి చూస్తున్న చాలా మంది.. ఇప్పుడు ఇలా మారిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం గౌతమ్ గంభీర్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టి20 ఫార్మేట్ లో ఉపసారథిగా ఉన్న అక్షర్ పటేల్ ను తొలగించాడు. యశస్వి జై స్వాల్ ను పక్కన పెట్టాడు. వ్యక్తిగత సమస్యలను సాకుగా చూపించి శ్రేయస్ అయ్యర్ ను జట్టు నుంచి దూరం పెట్టాడు. మహమ్మద్ షమీకి అవకాశాలు రాకుండా చేశాడు. సారధి గారు రోహిత్ శర్మను టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పించాడు. విరాట్ కోహ్లీకి కూడా అదే దారి. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపిస్తున్న సర్ఫ రాజ్ ఖాన్ ను తొలగించాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రుతు రాజ్ గైక్వాడ్ కు అవకాశాలు కల్పించలేదు.

అంతగా ఆకట్టుకోలేకపోతున్న రింకు సింగ్, తిలక్ వర్మకు, అభిషేక్ శర్మకు అవకాశాలు ఇవ్వడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. జైస్వాల్ టీ 20 వరల్డ్ కప్ లో ఆడి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. గౌతమ్ గంభీర్ తన నిర్వాకం వల్ల జట్టును మొత్తం సర్వనాశనం చేసాడని విశ్లేషకులు చెబుతున్నారు. గౌతమ్ గంభీర్ ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోవాలని.. లేకపోతే జట్టు ఇంకా ఓటములు ఎదుర్కొంటుందని క్రికెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

సరైన ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని.. అలాకాకుండా అంతగా ఆకట్టుకోలేని ప్లేయర్లకు అవకాశాలు ఇవ్వడం ద్వారా.. ఇదిగో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని.. దీనివల్ల గొప్పగా ఉండే జట్టు.. ఇబ్బందులు పడుతుందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. జట్టులో ప్రయోగాలు చేయడం మంచిదేనని.. ఆ ప్రయోగాలు జట్టుకు మంచిని తెచ్చే విధంగా ఉండాలని.. అలా కాకుండా ఇలా ముంచే విధంగా ఉంటేనే సమస్య ఎదురవుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper