Messi vs Ronaldo: చిరుత వేగాన్ని ఎవరు అందుకోగలరు? పులి పంజా దెబ్బను ఎవరు అంచనా వేయగలరు? రెండు కూడా పరాక్రమానికి నిలువెత్తు ప్రతీకలు.. అలాంటి గుణగణాలు ఇద్దరి మనుషులకు వస్తే వారి పేర్లు మెస్సి, రొనాల్డో అని పెట్టాల్సి వస్తుంది.. ఒకరిది అర్జెంటీనా, మరొకరిది పోర్చుగల్.. ఇద్దరు కూడా వారి దేశాల ఫుట్ బాల్ జట్లకు వెన్నెముకలు.. సమకాలీన ఫుట్ బాల్ చరిత్రలో మేరునగధీరులు. ఇద్దరు కూడా జాతీయ జట్టులోకి ప్రవేశించే ముందు క్లబ్ లకు ఆడారు.. తమను తాము నిరూపించుకున్న తర్వాతే జాతీయ జట్టులోకి ప్రవేశించారు. వారి ప్రతిభను మరింత మెరుగుపరుచుకున్నారు. ఫుట్ బాల్ చరిత్రలో కొత్త కొత్త రికార్డులు లిఖించారు.

-పోర్చుగల్ పులి
రొనాల్డో ను పోర్చుగల్ పులి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 2003 నుంచి అతడు తన జాతీయ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.. ఫార్వర్డ్ స్థానంలో ఆడతాడు. ఇప్పటివరకు ఐదు బ్యాలన్ డీ వోర్ పురస్కారాలు దక్కించుకున్నాడు. యూరోపియన్ గోల్డెన్ షూ పురస్కారాలు నాలుగు తగ్గించుకున్నాడు.. ఈ రెండు రికార్డులు సాధించిన ఏకైక ఐరోపా ఆటగాడు. తన కెరియర్లో 30 ప్రధాన ట్రోఫీలు గెలుచుకున్నాడు. వాటిలో ఏడు లీగ్ టైటిల్స్, ఐదు యూఈ ఎఫ్ ఏ ఛాంపియన్ లీగ్స్, ఒకటి యూఈ ఎఫ్ ఏ యూరోపియన్ ఛాంపియన్ షిప్, ఒకటి యూఈ ఎఫ్ ఏ నేషన్స్ లీగ్ టైటిల్స్ ఉన్నాయి.. రొనాల్డో ఇప్పటివరకు 134 గోల్స్ సాధించాడు.. అత్యధిక అసిస్ట్(41) రికార్డులు సొంతం చేసుకున్నాడు. క్లబ్ కోసం, దేశం కోసం 750 కి పైగా సీనియర్ కెరియర్ గోల్స్ సాధించాడు. అంతర్జాతీయంగా 100 గోల్స్ సాధించిన రెండవ ఆటగాడు.. ఐరోపా దేశాలలో మొదటివాడు.
-వారెవా మెస్సీ
ఈ అర్జెంటీనా ఆటగాడు మైదానంలో చిరుతపులిలా కదులుతాడు. బంతిపై పూర్తి నియంత్రణ సాధిస్తాడు.. ఈ 36 ఏళ్ల ఆటగాడు అనేక రికార్డులను తన సొంతం చేసుకున్నాడు.. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఆరు బాలన్ డీ వోర్ పురస్కారాలు సాధించాడు.. ఛాంపియన్ లీగ్ లో 8 గోల్స్ సాధించి రికార్డు సృష్టించాడు.. క్లబ్బులు, దేశం కోసం 750 కి పైగా సీనియర్ కెరియర్ గోల్స్ చేశాడు.. ఒకే క్లబ్ కోసం అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.. అంతేకాదు ఒకే క్యాంపెయిన్ లో ఐదు యూత్ జట్లకు సారథ్యం వహించి రికార్డు సృష్టించాడు. స్పానిష్ ఫుట్ బాల్ మ్యాచ్లో మొదటిసారి ట్రిబుల్ గోల్స్ సాధించాడు. 22 సంవత్సరాల వయసులో మొదటి బాలన్ డీ వో ర్ గెలుచుకున్నాడు.. అంతేకాదు వరుసగా నాలుగు సార్లు ఈ అవార్డులను గెలుచుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.. 2018లో బార్సిలోనా క్లబ్ బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు 2015, 2019 లో బాలన్ డీ వో ర్ పురస్కారాలు సాధించాడు.. ఇలా వరుసగా ఏడుసార్లు అవార్డులు అందుకొని చరిత్ర సృష్టించాడు.

-ఇద్దరు యోధులే
సమకాలీన ఫుట్ బాల్ చరిత్రలో ఇద్దరు కూడా యోధులే. మెస్సీ, రొనాల్డో తమ జట్లకు ఎన్నో అనితర సాధ్యమైన విజయాలు అందించారు. అయితే 2014లో అర్జెంటీనా జట్టుని ఫైనల్ దాకా తీసుకెళ్లిన మెస్సి కప్ మాత్రం అందివ్వలేకపోయాడు. రొనాల్డో కూడా తన జట్టుకు ఈసారి ఎలాగైనా కప్ అందించాలని తాపత్రయంతో ఆడాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు తన కెరియర్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న మెస్సీ జట్టుకు ఎలాగైనా కప్ అందించాలని ఉవ్విళ్లరుతున్నాడు.ఈ దిగ్గజం ఆశ నెరవేరుతుందో లేదో ఈ ఆదివారం తేలబోతోంది.