Homeబిజినెస్Motorola Razr Fold Price 2026: Motorola నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ మొబైల్.. ధర ఎంత...

Motorola Razr Fold Price 2026: Motorola నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ మొబైల్.. ధర ఎంత అంటే?

Motorola Razr Fold Price 2026: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola నుంచి మార్కెట్లోకి ఆకర్షణీయమైన ఫోన్లు వస్తుంటాయి. అయితే 2026 సంవత్సరంలో చాలా కంపెనీలు కొత్త మోడల్స్ మార్కెట్ లోకి తీసుకువచ్చాయి. ఇందులో భాగంగా Motorola Razr Fold మొబైల్ ను ప్రవేశపెట్టింది. ఇది కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ఫోల్డబుల్ మొబైల్. ఇందులో ఉండే ఫీచర్స్ మిగతా ఫోల్డబుల్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. మరి మోటరోలా తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

Motorola Razr మొబైల్ డిస్ప్లే 8.1 అంగుళాల LPTO తో కలిగి ఉంది. ఇది 2కె రిజర్వేషన్ తో పనిచేస్తుంది. ఈ డిస్ప్లే 165 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. ఇందులో 6200 nits బ్రైట్నెస్ ఉండడంతో ఎలాంటి వాతావరణంలో నైనా అద్భుతమైన కాంతితో ఫోటోలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఈ మొబైల్ లో రెండు స్క్రీన్ లలో 3000 nits బ్రైట్నెస్ ను కూడా అందిస్తుంది. ఈ మొబైల్ డిజైన్ స్లిమ్ గా ఉండడంతో చేతిలో పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు వచ్చిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ వలె తక్కువ మందంతో కలిగి ఉంటుంది.

ఈ మొబైల్ లో మొత్తం ఐదు కెమెరాలను చూడవచ్చు. ప్రాథమికంగా 50 MP కెమెరా పనిచేస్తుంది. ఇది ఖచ్చితమైన రంగులను అందించి మల్టీస్పెక్ట్రల్ త్రీ ఇన్ వన్ లైట్ సెన్సార్ తో ఫోటోలను అందిస్తుంది. మరో కెమెరా ఆల్ట్రా వైడ్ సెన్సార్ తో 50 MP నీ కలిగి ఉంది. ఇంకో కెమెరా 50 MP పెరిస్కోప్ తెలుగు ఫోటో లెన్స్ తో పనిచేస్తుంది. సెల్ఫీ కోసం 32 MP కెమెరా అలాగే 20 MP కెమెరా వీడియో రికార్డింగ్ కోసం పనిచేస్తుంది. ఇలాంటి కెమెరాలు ఉండడం వల్ల ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునేవారు ప్రత్యేకంగా కెమెరాను కొనాల్సిన అవసరం ఉండదు. ఈ కెమెరాలతో ఏఐ ఆధారిత ఫోటోలను కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

మోటరోలా Razr మొబైల్ లో 6,000 mAh బ్యాటరీని ఉంచారు. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కావడంతో 80 W వైర్డ్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 W వైర్లెస్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. దీంతో రోజువారి వినియోగదారులతోపాటు ఉద్యోగులు, గేమింగ్ కోరుకునే వారికి ఈ బ్యాటరీ బాగా సూట్ అవుతుంది. దీని ధర సుమారు 2,318 డాలర్లుగా నిర్ణయించారు. త్వరలో ఇది ఉత్తర అమెరికాలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ కంపెనీ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ మొబైల్ కావడంతో చాలామంది దీనిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన కెమెరా ఉండటంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version