Chiranjeevi- Balakrishna: సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ మధ్య ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ మాములుగా ఉండేది కాదు..నువ్వా నేనా అనే రేంజ్ లో వీళ్లిద్దరి మధ్య పోటీ ఉండేది..వీళ్లిద్దరి సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదలైనవి ఉన్నాయి..ఒకే రోజు విడుదలైన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి..ఇప్పుడు మరోసారి వీళ్లిద్దరు వచ్చే సంక్రాంతికి పోటీ పడబోతున్నారు.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం జనవరి 12 వ తేదీన విడుదల అవుతుండగా..మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం జనవరి 13 వ తేదీన విడుదల కాబోతుంది..ఈ రెండు సినిమాలకు మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ఉంది..వాల్తేరు వీరయ్య చిత్రానికే ఎక్కువ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది..విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది..నిర్మాత కూడా రెండు సినిమాలకు ఒక్కడే..గతం లో కూడా చిరంజీవి మరియు బాలయ్య సినిమాలు ఇలాగే సంక్రాంతి పోరు లో పోటీపడినప్పుడు ఇద్దరి సినిమాల్లోనూ హీరోయిన్ ఒకరే.
అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన మృగరాజు మరియు నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘నరసింహ నాయుడు’ చిత్రాలు 2001 వ సంవత్సరం జనవరి 11 వ తారీఖున విడుదలయ్యాయి..చూడాలని ఉంది వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి – గుణశేఖర్ కాంబినేషన్ నుండి వస్తున్న సినిమా కావడం తో మృగరాజు అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైంది..నరసింహ నాయుడు చిత్రం సాధారణమైన అంచనాలతో రిలీజ్ అయ్యింది..రెండు సినిమాల్లో ‘సిమ్రాన్’ హీరోయిన్ గా నటించడం విశేషం.

మృగరాజు చిత్రం పెద్ద ఫ్లాప్ గా మిగలగా..నరసింహనాయుడు చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..ఇప్పుడు సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ ఇద్దరి హీరోల సినిమాల్లో ఒకే హీరోయిన్ అవ్వడం తో అదే ఫలితాలు రాబోతున్నాయా..? అని విశ్లేషకులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు..కానీ వాల్తేరు వీరయ్య చిత్రం అద్భుతంగా వచ్చిందని..మెగాస్టార్ కి పోటీగా ఎవ్వరు వచ్చినా వాళ్ళ పరిస్థితి ‘లారీ క్రింద నిమ్మకాయే’ అని మెగా ఫ్యాన్స్ నమ్మకం తో చెప్తున్నారు..మరి వాళ్ళ నమ్మకం నిజం అవుతుందో లేదో తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.