Homeఆంధ్రప్రదేశ్‌Divvela Madhuri Vs Karate Kalyani: అదేం చీర కట్టుడు.. దివ్వెల మాధురి వర్సెస్ కరాటే...

Divvela Madhuri Vs Karate Kalyani: అదేం చీర కట్టుడు.. దివ్వెల మాధురి వర్సెస్ కరాటే కళ్యాణి

Divvela Madhuri Vs Karate Kalyani: తిరుమల తిరుపతి దేవస్థానంలో( Tirumala Tirupati Devasthanam) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లో తోటి కంటెస్టెంట్ తనూజ పుట్టిన రోజు సందర్భంగా ఆమెను తీసుకుని వచ్చి కేక్ కట్ చేశారు దివ్వెల మాధురి. తిరుమలలో ఓ గెస్ట్ హౌస్ లో ఈ కార్యక్రమం కొనసాగగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టారు మాధురి. అయితే అది టీటీడీ నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీస్ కేసు నమోదయింది. ఈ పరిస్థితుల్లో బిగ్ బాస్ మరో ఫేమ్ కరాటే కళ్యాణి స్పందించారు. మాధురి చీర పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ గట్టిగానే హెచ్చరికలు పంపారు. మరోసారి అలా చీర కడితే గట్టిగానే ఉంటుందని హెచ్చరించారు. రామాయణాన్ని, రాముని, సీతని అవమానించారంటూ మండిపడ్డారు. బుద్ధి రావాలి, క్షమించమని అడగాలి అంటూ పోస్ట్ పెట్టారు కరాటే కళ్యాణి.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

* కొత్త డిజైన్ తో చీర
దివ్వెల మాధురి( divvela Madhuri ) ఇటీవల తిరుమల వచ్చారు. ఆ సమయంలో దేవుళ్ళ డిజైన్లతో ఉన్న చీరను కట్టారు. చీర పై రామాయణాన్ని డిజైన్ గా వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరాటే కళ్యాణి స్పందించారు. ఇది ఎవరు ఉపేక్షించిన రామ భక్తులు ఊరుకోరు అనే హెచ్చరించారు. కాళ్లతో కావ్యాన్ని తొక్కితే.. ఎలా పడితే అలా బొమ్మలు వేసి అపహాస్యం చేస్తే ఊరుకోం.. చీర నేసిన వారిని కూడా వదలం. గతంలో నారా బ్రాహ్మణి కూడా తప్పు చేశారు. ఆమెను చూసి ఈరోజు దివ్వెల మాధురి కూడా తప్పు చేశారు. హిందుత్వాన్ని పాటించకున్నా పర్లేదు. కానీ అపహస్యం చేయొద్దు. రామాయణం రాముడు గురించి.. సీతమ్మ గురించి ఇలా హేళన చేసినట్టు చేస్తే మామూలుగా ఉండదు. అది ఎవరైనా తగ్గేది లేదు. మళ్లీ మేము వాళ్ళ ఫ్యాన్స్ అని వచ్చారో.. మీకు ఉంటాది.. ఇలాంటివి నిజమైన హిందువులు ప్రోత్సహించే అవకాశం లేదు.. మీ అభిమానం ఇంకెక్కడైనా చూసుకోండి అంటూ హెచ్చరించారు. వాళ్లకి బుద్ధి రావాలి లేదా క్షమించమని అడగాలి.. జైశ్రీరామ్ అంటూ ముగించారు కరాటే కళ్యాణి.

* అప్పట్లో బ్రాహ్మణి..
మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి( Nara Brahmani) కట్టు బొట్టులో చాలా పద్ధతిగా ఉంటారు. అయితే గత ఏడాది కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బ్రాహ్మణి. ఆ సమయంలో ఆమె ధరించిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చీర పై రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంది. వాల్మీకి చరిత్రను చీరపై డిజైన్ రూపంలో ప్రింట్ చేశారు. తేట తెలుగులో, చేతితో రామాయణం మహాకావ్యం లోని పంక్తులు రాశారు. ఈ చీరను శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోరిక మేరకు.. కంచి పట్టు చీర పై స్థానిక కలంకారి ఆర్ట్స్ తో తీర్చిదిద్దారు. చీర పై డిజైన్ లో తామర పువ్వు, బాణం, సీతా సమేత రామలక్ష్మణులు, రామాయణంలోని ముఖ్య ఘట్టాలను చిన్నచిన్న థీమ్స్ రూపంలో పొందుపరిచారు. ఈ చీర తయారు చేయడానికి ఏకంగా 35 రోజుల సమయం పట్టింది. అయితే ఇటీవల దివ్వెల మాదిరి సైతం అదే డిజైన్ తో కూడిన చీరను ధరించారు. అందుకే కరాటే కళ్యాణి స్పందించారు. దీనిపై దివ్వెల మాధురి ఎలా స్పందిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version