Jacob Bethell performance: 253 పరుగులు.. పొట్టి ఫార్మాట్ లో అది కూడా నాకౌట్ మ్యాచ్ లో ఆ స్థాయిలో రన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంత స్కోర్ చేసినప్పటికీ.. దానిని కాపాడుకోవడంలో టీమిండియా చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. టీమ్ ఇండియా కెప్టెన్ ఏకంగా ఆరుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించాల్సి వచ్చింది. వీరిలో బుమ్రా మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. మిగతా వారంతా పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు.
ఇంగ్లాండ్ జట్టు నాలుగు వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఈ దశలో టీమ్ ఇండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, ఇంగ్లాండ్ జట్టులో బెతల్ (105), విల్ జాక్స్(35) భారత బౌలర్ల మీద ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 39 బంతుల్లోనే 77 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. విల్ జాక్స్ అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో అవుట్ అయినప్పటికీ.. సామ్ కరణ్ తో బెతల్ పోరాటం ప్రారంభించాడు. ఆరో వికెట్ కు కూడా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేవలం 27 బంతుల్లోనే బెతల్, కరణ్ హాఫ్ సెంచరీ పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.
కరణ్ ఔట్ అయిన తర్వాత బెతల్ మీద భారం పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా బెతల్ ను అద్భుతంగా రన్ అవుట్ చేయడంతో అతడి ప్రస్థానం ముగిసింది. ఒకవేళ బెతల్ గనుక ఉండి ఉంటే టీమిండియా పరిస్థితి మరో విధంగా ఉండేది. ఎందుకంటే బెతల్ 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. దీనిని బట్టి అతడి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయకపోవడం ద్వారా బెతల్ చెలరేగిపోయాడు. నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఇంగ్లాండ్ జట్టు గెలుపుకు దగ్గరగా వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం బెతల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఒకవేళ బెతల్ గనక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది. ఇంగ్లాండ్ జట్టు టీమ్ ఇండియాకు షాక్ ఫలితాన్ని అందించేది. అతడు రన్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. టీమిండియా బౌలింగ్ కట్టుదిట్టంగా లేకపోవడం వల్లే ఇంగ్లాండ్ బ్యాటర్ బెతల్ ఆ స్థాయిలో బ్యాటింగ్ చేశాడని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆ లోపాలను సవరించుకొని న్యూజిలాండ్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ వేయాలని టీమిండియా ఆటగాళ్లకు విశ్లేషకులు సూచిస్తున్నారు.