Jasprit Bumrah success secret: అతడికి ఫార్మాట్ తో సంబంధం ఉండదు. బ్యాటర్ ఎవరనేది లెక్క ఉండదు. మైదానంలోకి దిగితే చాలు.. అతడి టార్గెట్ మొత్తం వికెట్ మీద ఉంటుంది. ఎలాంటి బంతులైనా వేస్తాడు. ఎలాంటి ప్రత్యర్థి బ్యాటర్ నైనా సరే ముప్పు తిప్పలు పెట్టి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తాడు. అతడే జస్ ప్రీత్ బుమ్రా.
బుమ్రా ప్రస్తుతం టీమిండియాలో ఏస్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో 100 చొప్పున వికెట్లు తీసిన బౌలర్ గా అతడు ఆవిర్భవించాడు. ఈ ఘనత అందుకున్న టీమిండియా బౌలర్ గా అతడు వినతి ఎక్కాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు.
కీలకమైన మ్యాచులలో వికెట్లు తీయడం మాత్రమే కాకుండా.. పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తున్నాడు. గురువారం ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు కు చుక్కలు చూపించాడు బుమ్రా. తీసింది ఒక వికెట్ మాత్రమే అయినప్పటికీ.. పరుగులు ఇవ్వకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశాడు.. ముఖ్యంగా 18 ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ వేసి.. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మ్యాచ్ మూమెంట్ మొత్తాన్ని మార్చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తీవ్రమైన ఒత్తిడికి గురైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు బుమ్రా గురించి పదేపదే చెప్పాడు. అతడి వల్ల టీమ్ ఇండియా గెలిచిందని పేర్కొన్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారానికి బుమ్రా అర్హుడని పేర్కొన్నాడు. దీనిని బట్టి బుమ్రా ఎలాంటి బౌలింగ్ వేశాడో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లాండ్ జట్టుతో మ్యాచ్ ముగిసిన తర్వాత.. బుమ్రా ముంబై మైదానంలో తన భార్య సంజనతో కలిసి సరదాగా కబుర్లు చెప్పాడు. వారిద్దరూ చాలా సేపు మైదానంలో ఉండి అనేక విషయాలు మాట్లాడుకున్నారు. సంజన స్పోర్ట్స్ ప్రజెంటర్. గతంలో బుమ్రా ను అనేకసార్లు ఆమె ఇంటర్వ్యూ చేసింది. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. చాలా రోజులపాటు ప్రేమించుకున్న తర్వాత వారిద్దరు వివాహం చేసుకున్నారు. బుమ్రా, సంజన దంపతులకు ఒక కుమారుడు.
సంజన బుమ్రా లోపాల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటుందట. వాటిని అతడు శ్రద్ధగా వింటాడట . ఆ తర్వాత ఆ లోపాలను అతడు సవరించుకుంటాడట. అందువల్లే అతడు అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతున్నాడట. ఇదే విషయాన్ని అతడు అనేక సందర్భాల్లో చెప్పాడు.