Homeఅంతర్జాతీయంIran War Impact On Pakistan: ఇరాన్‌ యుద్ధం.. పాకిస్తాన్‌ చావుకు వచ్చింది!

Iran War Impact On Pakistan: ఇరాన్‌ యుద్ధం.. పాకిస్తాన్‌ చావుకు వచ్చింది!

Iran War Impact On Pakistan: ఇరాన్‌కు, అమెరికా–ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌దేశాలకు యద్ధుం మొదలై వారం దాటింది. ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. ఈ యుద్ధం 14 దేశాలకు విస్తరించింది. యుద్ధం నాలుగువారాలకుపైగా కొనసాగే అవకాశం ఉందని అమెరికా అంచనా వేస్తోంది. యుద్ధంలో సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, సైప్రస్, అజర్‌బైజాన్‌ కూడా యుద్ధంలో చేరింది. ఇక్కడి పాలకులు సున్నీలు, షియాలు 60 శాతానికిపైనా ఉంది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌పోర్టుపై ఇరాన్‌ దాడి చేసింది. బహ్రెయిన్‌లోనూ 50 శాతానికిపైగా షియాలు ఉంటారు. ఇక్కడ కూడా పాలకులు సున్నీలు. ఇక్కడి ప్రధాన ఆయిల్‌ కంపెనీపై ఇరాన్‌ దాడి చేసింది.

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

ఇరకాటంలో పాకిస్తాన్‌..
ప్రస్తుత ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు గల్ఫ్‌ ప్రాంతాన్ని అగ్నిపర్వతంగా మార్చాయి. ఈ సంఘర్షణ పాకిస్తాన్‌కు ఇబ్బందిగా మారుతోంది. సౌదీ, యూఏఈతో రక్షణ ఒప్పందాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్‌ ఆ దేశాల తరఫున యుద్ధం చేయలేని పరిస్థితి. అణ్వాయుధం కలిగిన ఏకైక ఇస్లామిక్‌ దేశం పాకిస్తాన్‌కు ఇరాన్‌తో 900 కి.మీ. సరిహద్దు ఉంది. ఇటు ఇరాన్‌కు వ్యతిరేకంగా, అటు అమెరికాకు అనుకూలంగా యుద్ధం చేయలేక డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. తమ ఎయిర్‌బేస్‌లు అమెరికాకు అందించి ఇరాన్‌పై దాడిని ప్రోత్సహిస్తోంది.

గాజాకు సైన్యం పంపలేక ఆఫ్గాన్‌తో యుద్ధం..
ఇదిలా ఉంటే.. గాజా సైనికులు పంపలేక ఆఫ్గానిస్తాన్‌లో యుద్ధం మొదలు పెట్టిన పాకిస్తాన్‌ ఇప్పుడు ఆఫ్గాన్‌ కొట్టే దెబ్బలకు విలవిలలాడుతోంది. తాజాగా 41 మంది పాకిస్తాన్‌ సైనికులు ఆఫ్గాన్‌ దాడిలో మరణించారు. ఇరాన్‌తో విరోధం పెరిగితే పాకిస్తాన్‌కు సరిహద్దున ఉన్న మూడు దేశాలతో వైరం పెరుగుతుంది. షియా–సున్నీ విభేదాలు దేశంలో అల్లర్లకు దారితీయవచ్చు.

ఆర్థిక కష్టాలు..
మరోవైపు పాకిస్తాన్‌ను ఆర్థిక కష్టాలు చుట్టముడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆర్మూజ్‌ సంధి వద్ద పడవలు ఆగిపోవడం, చెల్లింపుల ఆలస్యం పాకిస్తాన్‌ సైనిక చర్యలను అడ్డుకుంటున్నాయి. ఆఫ్గానిస్తాన్‌తో పోరాడే స్థితి లేదు. సౌదీ అరేబియాను చమరు కావాలని కోరే పరిస్థితి లేదు. మొత్తం మీద పాకిస్తాన్‌కు అన్నివైపుల నుంచి సమస్యలు వస్తున్నాయి. ఇస్లామ్‌ ఆధారంగా నాటో ఏర్పాటు చేయాలనుకున్న పాకిస్తాన్‌కు ఇస్లాం దేశాలు కొట్టుకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉంది. యుద్ధంలోకి వెళితే షియా, సున్నీల మధ్య వైరం పెరిగే అవకాశం ఉంది.

అమెరికా అంచనాల ప్రకారం యుద్ధం నాలుగు వారాలకు మించి కొనసాగవచ్చు. పాకిస్తాన్‌ ఇస్లామిక్‌ నాటో ప్రయత్నం విఫలం కావొచ్చు. గల్ఫ్‌ దేశాలతో ఒప్పందాలు ఉన్నా ఇరాన్‌ వ్యతిరేకత పాకిస్తాన్‌కు తలనొప్పిగా మారింది. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తటస్థంగా ఉండిపోవడమే మేలనుకుంటోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version