Home Blog Page 95

వారణాసి మూవీ షూటింగ్ లో రాజమౌళి ఆ నటుడి మీద సీరియస్ అయ్యాడా..?

Rajamouli Varanasi movie shooting
Rajamouli Varanasi movie shooting

Rajamouli Varanasi movie shooting: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇప్పటివరకు 12 సినిమాలతో వరుసగా నాలుగు హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు వారణాసి సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రాజమౌళి సినిమా అంటే చాలు అది చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతుంది. దానికోసం ఆయన తీవ్రమైన కసరత్తులు చేసి మరి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక వారణాసి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

రీసెంట్ గా జరుగుతున్న ఈ షెడ్యూల్లో రాజమౌళి ఒక మలయాళం నటుడి మీద కొంతవరకు సీరియస్ అయ్యాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఏనా? లేదంటే ఇంకా వేరే ఎవరైనా నటుడు ఉన్నాడా? లేదా అనే విషయాన్ని బయటకు చెప్పడం లేదు. కానీ సెట్లో ఆయన కొంతవరకు అతని మీద అరిచారట…

మొత్తానికైతే జక్కన్న మూవీకి ఎలాంటి సీన్స్ అవసరం ఉన్నాయో వాటిని ముందుగానే రాసుకొని ఆర్టిస్టులు చేత పర్ఫెక్ట్ గా దానిని స్క్రీన్ మీద ఎలివేట్ అయ్యే విధంగా నటింప చేసుకుంటూ ఉంటాడు. అందుకే అతను సినిమాలు తీయడంలో చాలా వరకు లేట్ అవుతూ ఉంటాయి. ప్రతి సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. అందువల్లే అతనికి భారీ విజయాలైతే వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది.

కాబట్టి ఆ సినిమాలను చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక గతంలో ఎప్పుడు ఆయన ఆర్టిస్టుల మీద కోపానికి వచ్చిన సందర్భాలు లేవు. మరి పర్సనల్ విషయాలు వల్ల అతనికి ఏమైనా కోపం వచ్చిందా? లేదంటే సినిమాలోని కంటెంట్ తను చెడగొట్టే విధంగా ఏదైనా ప్రయత్నం చేశాడా అనేది తెలియాల్సి ఉంది..ఇంతకీ మలయాళం నటుడు ఎవరు అనేది బయటికి చెప్పడం లేదు…

రామ్ చరణ్ - మహేష్ బాబు పార్టీ చేసుకున్నారా..? కారణమేంటంటే..?

Ram Charan Mahesh Babu party
Ram Charan Mahesh Babu party

Ram Charan Mahesh Babu party: మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. అయితే ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఆయన తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లను సాధించలేదు. మొత్తానికైతే ఆయన మార్క్ నటనను చూపించిన కూడా సినిమాలు మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. గత సంవత్సరం పెద్ది సినిమాతో మరోసారి భారీ రికార్డును కొల్లగొడతారు అనుకున్నప్పటికి ఇదొక మోస్తరు సక్సెస్ గానే మారింది. మహేష్ బాబు తో రామ్ చరణ్ కి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధమైతే ఉంది. వీళ్లిద్దరు ఒకరి సినిమాల గురించి ఒకరు చాలాసేపు చర్చించుకుంటారు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు చెప్పడం విశేషం…

ఇక రీసెంట్ గా మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక పార్టీ అయితే చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇంట్లోనే మహేష్ బాబును పిలిపించి మరీ తనకి ఒక పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ – మహేష్ బాబు ఇద్దరు కలిసే ఈ పార్టీ చేసుకున్నారా? లేదంటే ఇంకెవరైనా హీరోలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనే విషయాలు తెలియదు.

కానీ మొత్తానికైతే వీరిద్దరు చర్చించుకొని నెక్స్ట్ రాబోయే సినిమాల విషయంలో ఎవరెవరు ఎలాంటి ప్లానింగ్స్ తో వెళ్లబోతున్నారు అనేది కూడా చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ స్టార్ హీరోలిద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వాళ్ళందరిని సర్టిస్ఫై చేయడానికి వీళ్ళు అహర్నిశలు కసరత్తులైతే చేస్తున్నారు.

ఎవరైతే భారీ సక్సెస్ లను సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వీరిద్దరు కూడా నెంబర్ వన్ రేసులో ముందు వరుసలో దూసుకెళ్తుండటం విశేషం…ఇక మహేష్ బాబు వారణాసి సినిమాతో తన రేంజ్ మొత్తాన్ని మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి అయితే ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది…

జూన్‌ 21.. ఈ రోజే అత్యంత ఎక్కువ పగలు!

Longest Daylight Day
Longest Daylight Day

Longest Daylight Day: ఈ ఏడాది జూన్‌ 21 (ఆదివారం) సూర్యుడి కాంతి ఎక్కువ సేపు ఉండే రోజు. దీనిని సమ్మర్‌ సొల్‌స్టిస్‌ అని పిలుస్తారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఈ రోజును ‘విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియా’గా ప్రకటించి, విటమిన్‌–డి ప్రాముఖ్యత, సూర్యకాంతి ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సమ్మర్‌ సొల్‌స్టిస్‌ అంటే ఏమిటి?
భూమి తన కక్ష్యలో తిరుగుతున్నప్పుడు, ఉత్తర గోళం సూర్యుడి వైపు వంగి ఉండటం వల్ల జూన్‌ 21న పగలు అత్యంత ఎక్కువ సమయం ఉంటుంది. ఈ రోజు సుమారు 13 గంటల 10 నిమిషాలు పగలు ఉంటుంది. ఇది సహజమైన ఖగోళ సంఘటన. దక్షిణ గోళంలో మాత్రం ఇదే సమయంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియా
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఈ రోజును ప్రత్యేకంగా ‘విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియాగా ప్రకటించింది. విటమిన్‌–డి పాధాన్యతను, సూర్యకాంతి నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎండ తక్కువగా తీసుకుంటున్నారు. ఈ ప్రకటన ద్వారా ఆ అలవాటును మార్చే ప్రయత్నం జరుగుతోంది.

విటమిన్‌–డి ఎందుకు ముఖ్యం?
విటమిన్‌–డి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది ఎముకల బలం, రోగనిరోధక శక్తి, Ðమొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరం సూర్యకాంతి నుంచి సహజంగా ఈ విటమిన్‌ను ఉత్పత్తి చేసుకోగలదు. కాబట్టి సూర్యుడిని సరైన విధంగా ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి మంచిది.

సూర్యకాంతిలో పుష్కలంగా విటమిన్‌ – డి..
సూర్యకాంతి విటమిన్‌–డి ఉత్పత్తికి సహజమైన, ఉత్తమమైన మార్గం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక సమయం ఎండలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. సురక్షితమైన సమయంలో(ఉదయం లేదా సాయంత్రం) కొంత సేపు ఎండ తీసుకోవడం మంచిది.

అవగాహన అవసరం..
ఐఎంఏ ప్రకటన చేయడం వెనుక ఒక ముఖ్యమైన సందేశం ఉంది. నేటి జీవనశైలిలో చాలా మంది ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో సూర్యకాంతి తక్కువగా అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్‌–డి లోపం సాధారణం అవుతోంది. జూన్‌ 21ని విటమిన్‌–డి డే గా ప్రకటించడం ద్వారా ప్రజలు ఒక్కసారి ఆలోచించి, సూర్యకాంతిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఒక మంచి చర్య. రైతులు, పిల్లలు, వృద్ధులు అందరూ ఈ సందేశాన్ని అర్థం చేసుకొని ప్రయోజనం పొందాలి.

జూన్‌ 21 అనేది కేవలం అత్యంత పొడవైన రోజు మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యం గురించి ఆలోచించే రోజు కూడా. సూర్యుడి నుంచి వచ్చే సహజమైన బహుమతిని సరైన విధంగా స్వీకరించి, విటమిన్‌–డి స్థాయిలను మెరుగుపరచుకోవాలి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలి.

పవన్ అభిమాని నిరంజన్ ని కలిసి ఆర్ధిక సాయం అందించిన నిర్మాత బండ్ల గణేష్.. వీడియో వైరల్..

Bandla Ganesh helps Pawan Kalyan fan
Bandla Ganesh helps Pawan Kalyan fan

Bandla Ganesh helps Pawan Kalyan fan: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ అభిమాని నిరంజన్ యే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో గత వారం రోజుల నుండి ఇతని మీద పడుతున్న రీల్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రాణాంతక జెన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ , చావు అంచుల్లో ఉన్నాడు. అతని వ్యాధి కి వైద్యం ఇంకా కనిపెట్టలేడని , ఎన్ని రోజులు అతను ఈ భూమి మీద ఉంటాడో గ్యారంటీ లేదని స్వయంగా నిరంజన్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో నిరంజన్ చివరి కోరిక , తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి కలవాలని. రెండు మూడు నెలల నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నిరంజన్ తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు.

ఎట్టకేలకు రీసెంట్ గా ఇతని గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ , వరంగల్ కి వెళ్లి, భద్రకాళి అమ్మవారి దగ్గర , ఆ కుర్రాడి పేరిట అర్చన , పూజలు చేయించి , దైవ ప్రసాదాలను కుటుంబానికి అందించాడు. అంతే కాకుండా, ఆ కుర్రాడికి అవసరమయ్యే వైద్య ఖర్చులు ఒక లక్ష రూపాయలతో పాటు నిరంజన్ కోరిక మేరకు ఒక ఐ ప్యాడ్, పుడిల్ బ్రీడ్ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. కుటుంబానికి జీవనోపాధి కోసం ఒక క్యాంటీన్ ని కూడా పెట్టించాడు. పవన్ కళ్యాణ్ కారణంగా నిరంజన్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహాయసహకారాలు అందించేందుకు పెద్దలు ముందుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత, పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ నేడు నిరంజన్ కుటుంబాన్ని కలిసాడు. పవన్ కళ్యాణ్ వరంగల్ కి వెళ్లిన రోజే , నిరంజన్ కి తన వంతుగా 5 లక్షల రూపాయిలు అందిస్తానని ప్రకటించాడు.

నేడు నిరంజన్ కుటుంబాన్ని కలిసి, మీడియా ముందు బండ్ల గణేష్ 5 లక్షల రూపాయిల చెక్ ని నిరంజన్ తండ్రికి అందించాడు. నిరంజన్ తో మాట్లాడుతున్నప్పుడు , తనకు కారు కనుక్కొని అందులో తిరగాలని ఉందని కోరారట. ఈ 5 లక్షలతో కారుని కొన్నుకొని తిరుగు నాయనా అని చెప్పానంటూ బండ్ల గణేష్ ఈ సందర్భంగా మీడియా కి తెలిపాడు. ఆ కుర్రాడు సంపూర్ణ ఆరోగ్యం తో బయటపడాలని , ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

గేమింగ్ లవర్స్ కోసం సూపర్ ఫోన్.. ధర ఎంతంటే..

Redmi K90 Ultra price
Redmi K90 Ultra price

Redmi K90 Ultra price: Xiaomi సబ్ బ్రాండ్ అయిన ‘రెడ్‌మి’ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. దీనికి రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మొబైల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. చైనాలో ఇప్పటికే దీని ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, దీని లాంచ్ డేట్, ధర మరియు స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ చివరి వారంలోనే చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి కంపెనీ ఇప్పటికే అధికారిక టీజర్‌ను కూడా విడుదల చేసింది. చైనా లాంచ్ ముగిసిన తర్వాత కొన్ని నెలల్లోనే ఈ ఫోన్ భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ధరను కంపెనీ చాలా ఆకర్షణీయంగా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇది K90 సిరీస్‌లోని ప్రీమియం మోడల్ అయిన K90 మ్యాక్స్ కంటే తక్కువ ధరకే లభించనుంది. చైనాలో దీని ప్రారంభ ధర దాదాపు సీఎన్ వై 3,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ.41,000) వరకు ఉండవచ్చని అంచనా. ఇక భారత మార్కెట్లోకి వచ్చేసరికి పన్నుల వల్ల దీని ధర సుమారు రూ.45,000 నుండి రూ.50,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి K90 అల్ట్రా ప్రీమియం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.89 అంగుళాల OLED డిస్‌ప్లేను ఉంచారు. ఇది 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఈ డిస్ ప్లేతో గేమింగ్ ఆడేటప్పుడు విజువల్స్ అత్యంత స్మూత్‌గా ఉండటం కోసం ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇస్తున్నారు.

ఈ ఫోన్ లో అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం, మొబైల్ హిస్టరీలోనే అరుదుగా కనిపించేలా దీని లోపల ఒక యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ఫోన్ హీట్ అవ్వకుండా అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ పై పనిచేయనుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండవచ్చు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 20 మెగాపిక్సెల్ లేదా 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వనున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. రెడ్‌మి ఈసారి ఊహించని రేంజ్‌లో ఏకంగా 8,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇందులో అమర్చబోతున్నారు. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్ కావాలనుకునే వారికి రెడ్‌మి K90 అల్ట్రా ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

అతడికి నాలుగు.. రోహిత్ చేతికి మూడు.. ఆప్ఘన్ మ్యాచ్ లో ఇది మామూలు మ్యాజిక్ కాదు పో..

Rohit Sharma Afghanistan match
Rohit Sharma Afghanistan match

Rohit Sharma Afghanistan match: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా మరోసారి దుమ్ము రేపుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి.. సిరీస్ సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. మరో మ్యాచ్ లో కూడా అదే సత్తా చూపిస్తోంది.

చెన్నై వేదికగా చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆఫ్గనిస్తాన్ జట్టుకు టీమిండియా బౌలర్ ప్రసిద్ కృష్ణ చుక్కలు చూపించాడు. ఓపెనర్లు గురుబాజ్ (5), ఇబ్రహీం జర్దాన్ (11), రహమత్ షా (5), రసూలి (1) వికెట్లను పడగొట్టాడు. వీరిలో గురుబాజ్, జర్దాన్, రహమత్ షా ఒకే తీరుగా అవుట్ అయ్యారు. వీరి ముగ్గురు క్యాచ్లను స్లిప్ లో ఉన్న రోహిత్ శర్మ పట్టుకోవడం విశేషం.

ఒకే తీరైన బంతులు వేసి ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ టాప్ బ్యాటర్లను ప్రసిద్ కృష్ణ ఔట్ చేయడం విశేషం. ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 36 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టును సాహితి (68*), ఓమర్ జాయ్ (50) ఆదుకున్నారు. ఐదో వికెట్ కు వీరు ఏకంగా 114 బంతుల్లో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. నాలుగు వికెట్లను త్వరగా తీసిన టీమ్ ఇండియా బౌలర్లు.. ఆ తర్వాత లయ కోల్పోయారు. దీంతో ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు.

ఈ మ్యాచ్లో ప్రసిద్ కృష్ణ మొత్తంగా ఆరు ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఇందులో రెండు మెయిడ్ ఇన్ ఓవర్లు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు.. అందులో రెండు పరుగులు వైడ్, నో బాల్ రూపంలో రావడం విశేషం.. అతడి బౌలింగ్ లో ఆడేందుకు ఆఫ్గనిస్తాన్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్లిప్ లో క్యాచ్ లు పట్టిన రోహిత్ శర్మ.. ఒకప్పటిలాగా కనిపించాడు. ఇటీవల కాలంలో అతడు గాయాల బారిన పడ్డాడు. జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరికి పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించి అదరగొట్టాడు. స్లిప్ లో గతంలో మాదిరిగా ఫీల్డింగ్ చేస్తూ సత్తా చూపిస్తున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ లో జట్టులో చోటు ఉంటుందో, ఉండదోననే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అతడు మైదానంలో పాదరసం లాగా కదలాడు. ముఖ్యంగా మూడు క్యాచ్లు పట్టి అదరగొట్టాడు.

హార్దిక్ కు నో ఛాన్స్.. దరిద్రం నీ చుట్టే తిరుగుతోందా భయ్యా..

Hardik Pandya no chance
Hardik Pandya no chance

Hardik Pandya no chance: హార్దిక్ పాండ్యాను దరిద్రం వెంటాడుతోంది. మామూలుగా కాదు.. అతడి చుట్టూ వైఫై లాగా తిరుగుతోంది. ఏ ముహూర్తంలో అయితే 2024లో ముంబై జట్టులో చేరిపోయాడో.. అప్పటినుంచి అతడి దిశ మొత్తం తీరో గమనం వైపే సాగుతోంది. భార్య నటాషాతో విడాకులు తీసుకున్నాడు. కొత్తగా మిహికాతో మొదలు పెట్టాడు.

2024లో ముంబై జట్టు అంతగా ఆడలేదు. అతడి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. 2025లో ముంబై జట్టు ఆట తీరు కాస్త మారినప్పటికీ.. హార్దిక్ పాండ్యా మీద విమర్శలు ఏమాత్రం తగ్గలేదు. పైగా అతడిని ముంబై జట్టుకు నాయకుడిగా ఎందుకు ఎంపిక చేశారని ఆ జట్టు మాజీ ప్లేయర్లు.. విశ్లేషకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనికి తోడు 2025 సీజన్ లో కూడా హార్దిక్ పాండ్యా కెరియర్ గొప్పగా చెప్పుకునే స్థాయిలో సాగలేదు. ఐపీఎల్ లో ముంబై జట్టు గొప్ప ప్రదర్శన చేయకపోవడం పట్ల హార్దిక్ పాండ్యా మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. 2026లో ఐపీఎల్లో అతని నాయకత్వంలో ముంబై జట్టు మరోసారి విఫలమైంది.

ఇటీవల అతడు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ లో కూడా అతడు ఆడేది అనుమానమే. ఎందుకంటే బెంగళూరులో బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతడి తొడ కండరాలకు గాయమైంది. అయితే ఆ గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్.. ఇంగ్లాండ్ జట్లతో జరిగే సిరీస్ లకు అతడికి మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు సెప్టెంబర్ లో ఆసియా క్రీడల జట్టులో కూడా అతడికి అవకాశం లభించలేదు. దీంతో హార్దిక్ పాండ్యా అభిమానులు ఆవేదనలో కూరుకు పోయారు.

హార్దిక్ పాండ్యా బలమైన ఆటగాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. ఒక అసలు సిసలైన ఆల్రౌండర్. 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని అతనికి మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. బౌలింగ్ వేసేటప్పుడు హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడని.. ఇంగ్లాండ్ సిరీస్లో యంగ్ ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చి.. హార్దిక్ మీద వర్క్ లోడ్ తగ్గించి.. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది..

మరోవైపు విరాట్ కోహ్లీ విషయంలో కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఎందుకంటే అతడు ఇంగ్లాండ్ టూర్ కు అందుబాటులో ఉంటాడు అనే విషయం మీద స్పష్టత లేదు. ఈనెల 22న జరిగే సామర్థ్య పరీక్షలు విరాట్ కోహ్లీ గనుక పాస్ అయితేనే ఇంగ్లాండ్ టూర్ లో అవకాశం ఉంటుంది. కండరాల నొప్పితో విరాట్ కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. అతడు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు. అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. జూన్ 22న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ వైద్య బృందం విరాట్ కోహ్లీని పరీక్షిస్తుంది. అందులో అతడు పాస్ అయితేనే ఇంగ్లాండ్ సిరీస్ కోసం ఎంపిక అవుతాడు.

ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage
Two Men Marriage

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ విచిత్ర సంప్రదాయాన్ని గ్రామస్థులు ఆశ్రయించారు. ఇంతకీ వీరు ఏం చేశారంటే?

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో వర్షాలు పడాలని కోరుకుంటూ ఇద్దరు పురుషులకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారాన్ని స్థానికంగా ‘అందిర బిబాహ’ (మగ పెళ్లి) అని పిలుస్తారు. వర్షాలు పడకుండా తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరుణ దేవుడి అనుగ్రహం కోసం ఈ తరహా మగ పెళ్లిళ్లు చేయడం అక్కడ శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం. ఈ వివాహం ద్వారా ప్రకృతికి, దైవానికి మధ్య ఉన్న బంధం బలపడి, త్వరలోనే మేఘాలు కురుస్తాయని స్థానికులు బలంగా నమ్ముతారు.

ఈ వినూత్న వివాహ వేడుకలో గ్రామానికి చెందిన 29 ఏళ్ల జతిన్ వరుడిగా మారగా, 27 ఏళ్ల కలాండి వధువు రూపం ధరించారు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా, ఈ పెళ్లిని ఒక సాధారణ సాంప్రదాయ వివాహం లాగే అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అలంకరణలు, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలం, పెళ్లి విందు.. ఇలా అన్ని కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎంతో వైభవంగా ఒక్కటైన ఈ మగ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు. కేవలం వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా జరిగే ఈ పెళ్లి ముగిసిన మరుసటి రోజే ఈ జంట అధికారికంగా విడిపోతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు యథావిధిగా గడుపుతారు. ఆధునిక కాలంలో ఇలాంటి నమ్మకాలు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, కరవు కోరల్లో చిక్కుకున్న తమ భూములను, జీవనోపాధిని కాపాడుకోవడానికి గ్రామస్థులు తమ పూర్వీకుల నాటి నమ్మకాన్నే నమ్ముకుని ఈ వివాహాన్ని నిర్వహించారు.

బాలయ్య విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏంటి అలా ఉంది..

Balakrishna:
Balakrishna:

Jr NTR stance on Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఎఫెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్న ఆయన దర్శకులను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరితో సినిమా చేస్తే తన ఇమేజ్ రెట్టింపు అవుతుంది అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో దర్శకులందరు కూడా అతన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…ఇక బాలయ్య బాబుకు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవనే విషయం మనందరికి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు బాలయ్య బాబుతో మాట్లాడాలనే ప్రయత్నం చేసిన కూడా బాలయ్య మాత్రం అతనికి పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుతో కలువడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండే వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ బాలయ్యతో కలిసి పోదామనే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరుపున ప్రచారానికి రమ్మంటే రాలేదు.

కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య అతనికి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ళ అభిమానులు మాత్రం వీళ్ళిద్దరు కలిసిపోయి ఒకే స్టేజి మీద కనిపిస్తే చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ అది ఈ మధ్యకాలంలో మాత్రం జరగడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు ఫ్యూచర్లో కలిసి సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ సినిమా చేయకపోయిన కూడా వీళ్ళు కలిసి ఒక ఈవెంట్లో కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు అలాగే టిడిపి కార్యకర్తలు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కలిసి ఒకే స్టేజ్ మీద కనిపిస్తారా..? లేదంటే ఇద్దరు కలిసి సినిమా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది…

యోగాతో ఆ పని రేసుగుర్రంలా చేయొచ్చు.. ఇక మగాళ్లు ఆగుతారా..

Yoga Benefits for Men
Yoga Benefits for Men

Yoga Benefits for Men: ఒత్తిడి.. కాలుష్యం.. తీసుకునే ఆహారం.. తల్లిదండ్రుల నేపథ్యం.. కారణాలు ఏవైనా గాని నేటి కాలంలో యువకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని సందర్భాలలో వారు తమ మగతనాన్ని చూపించుకోవడంలో బాధపడుతున్నారు. ఈ సమస్యను ఒకరికి చెప్పుకోలేరు. తమలో తామే మదన పడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో రకరకాల మందులు వాడుతుంటారు. అవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోగా.. శరీరం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంటాయి.

ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు.. ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు. ఖరీదైన మందులు కొనాల్సిన అవసరం లేదు. కేవలం శారీరక వ్యాయామం చేస్తే సరిపోతుంది. అలాగని గంటలు గంటలు చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. ఒళ్ళును హూనం చేసుకోవలసిన అవసరం కూడా లేదు. జస్ట్ యోగా చేస్తే చాలు. అవును మన ఎయిమ్స్ పరిశోధకులు పరిశీలనలో ఇది తేలింది.

ప్రతిరోజు యోగా చేయడం ద్వారా వంధ్యత్వ సమస్యలు తగ్గిపోతాయి. వీర్య కణాల నాణ్యత పెరుగుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది. డిఎన్ఏ నష్టం కూడా తగ్గిపోతుంది. పురుషుల్లో పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పరిశోధన ను కొంతకాలంగా ఎయిమ్స్ వైద్యులు చేస్తున్నారు. వారి పరిశీలనలో యోగాతో పురుషుల్లో అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని తేలింది.

ఈ పరిశోధన పత్రాలను యోగా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ యోగాలో ప్రచురించారు.. వారి అధ్యయన ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా పదిహేను శాతం జంటల్లో ఉన్న పురుషులు వంధ్యత్వ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ ప్రభాకర్ తివారి.. రీమా దాదా.. అంజలి యాదవ్.. రాజి కుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం అధ్యయనం చేసింది. 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న దాదాపు 78 మంది పురుషులను పరిశీలించింది. వీరంతా కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.

వీరిలో 42 మంది ప్రతిరోజు గంట చొప్పున.. వారానికి ఐదు రోజులు యోగాసనాలు.. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు.. ధ్యానం.. విశ్రాంతి వంటి వాటిని నిర్వహించారు. ఇలా 12 వలలో పాటు క్రమం తప్పకుండా చేశారు. అంతకుముందు వారి వీర్యంలో నాణ్యత.. యోగా చేసిన తర్వాత వీర్యం నాణ్యతను పరిశీలించారు. సంతానోత్పత్తిలో అత్యంత కీలకమైన వీర్యకణాల పారామితి లో పెరుగుదల కనిపించిందని పరిశోధకులు గుర్తించారు.

ఇంగ్లాండ్ లో పాకిస్తాన్ జిహాది గ్రూమింగ్ గ్యాంగ్ అరాచకం.. ఏకంగా 1,25,000 మంది అమ్మాయిలు.. ఏం దారుణం రా ఇది..

England grooming gangs case
England grooming gangs case

England grooming gangs case: ఈ వార్త రాస్తున్నప్పుడు చాలా బాధగా ఉంది. కన్నీరు అదే పనిగా ఒలుకుతుంది. ఏం దారుణం ఇది.. ఏం దుర్మార్గం ఇది.. అసలు ప్రపంచంలో ఇలాంటి దుర్మార్గులను ఎందుకు బతకనివ్వాలి. అసలు వాళ్లకు బతికే అవకాశం ఎక్కడిది.. ఇంతటి ఉన్మాదానికి పాల్పడిన ఆ ముష్కరులను మనుషులను ఎందుకు పిలవాలి.. మనుషులుగా ఎందుకు చూడాలి.. కనిపిస్తే కాల్చి పారేయడం కాదు.. జైల్లో ఉంచి మూడు పూటలా మేపి.. దున్నపోతుల లాగా బలిసేలా చేయడం కాదు.. బతికి ఉండగానే నరకం చూపించాలి. ఎందుకు ఈ నేరం చేసాం రా అని అనుకునేలా చేయాలి.

ఇంగ్లాండ్ లో కొంతమంది అమ్మాయిలపై పాకిస్తాన్ జిహాదీ గ్యాంగ్ దారుణానికి పాల్పడుతోందని.. ఘోరాలకు ఒడిగడుతోందని చాలా కాలం క్రితమే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాన్ని అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేసింది అక్కడి ప్రభుత్వం. గడిచిన 40 సంవత్సరాలుగా తాగిస్తాను ముస్లిం గ్రూమింగ్ బృందాలు లక్షలాదిమంది బాలికలను ప్రలోభ పెట్టారు. వారికి మాయమాటలు చెప్పారు. ఎత్తుకెళ్లారు.. ఘోరానికి పాల్పడ్డారు. క్రూరంగా హింసించారు. చివరికి వారిని అమ్మేశారు. కొందరైతే పలమార్లు దారుణానికి పాల్పడి.. వారి మతాన్ని మార్పించారు. అయితే మొదట్లో బ్రిటిష్ అధికారులు దీనిని బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇది వెలుగులోకి వస్తే ఇంగ్లాండ్ పరువు పోతుందని భావించారు. కానీ ఇప్పుడు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఇంగ్లాండులో పాకిస్తాన్ జిహాది గ్యాంగ్ ఎంత క్రూరమైందో.. దానివల్ల ఇంగ్లాండ్ ఏ స్థాయిలో ఇబ్బంది పడుతుందో బయటికి వచ్చింది. అయితే ఈ దారుణాలకు పాల్పడిన వారిలో దాదాపు 87 నుంచి 90% వరకు పాకిస్థానీ ముస్లిం పురుషులు ఉన్నారు. వీరు దాదాపు రెండు లక్షల 50 వేల మందికి పైగా శ్వేత జాతీయయులైన బాలికలపై దారుణాలకు పాల్పడ్డారు.

ఈ దారుణానికి సంబంధించి 20019 పేజీల విచారణ నివేదికను ఎంపీ రిఫర్డ్ లో అధ్యక్షతన.. ఇంకా కొంతమంది నాయకత్వంలో బయట పెట్టారు. వీరంతా కూడా కొంతకాలంగా స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు. బాధితుల వాంగ్మూలాలు.. అంతర్గత సమాచారం ఆధారంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా దారుణానికి గురైన పిల్లల్లో చాలామంది గర్బంధాల్చారని.. ప్రసవించారని.. కొంతమంది బలవంతపు గర్భ స్రావాలకు గురయ్యారని.. చిత్రహింసలను ఎదుర్కొన్నారని.. బలవంతంగా మతమార్పిడి బారిన పడ్డారని.. జీవిత కాలంలో ఎంతకాలం తగ్గని మానసిక గాయాలకు గురయ్యారని తేలింది.. 2019లోనే దాదాపు 19 వేల మంది పిల్లలు ఈ దారుణాలకి గురయ్యారు.

తల్లిదండ్రులు లేని పిల్లలు.. ఒంటరి మహిళల వద్ద పెరుగుతున్న పిల్లలను.. ఎటువంటి ఆలనా పాలన లేని పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఈ పాకిస్తానీ జీహా ది గ్యాంగ్ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. యూకే లోని దాదాపు 50 శాతం ప్రాంతాలను ఈ పాకిస్తానీ జిహాది గ్యాంగ్ కవర్ చేసింది. అంతేకాదు పిల్లల్ని అక్రమంగా రవాణా చేయడం.. వారికి మత్తు పదార్థాలను అందించడం.. వారితో దారుణానికి పాల్పడుతున్నప్పుడు రికార్డు చేయడం.. ఆ వీడియోలను చూపించే బెదిరించడం.. వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేరాలు దాదాపు 40 సంవత్సరాల కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. దీనిపై యూకే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

టికెట్‌ లేని ప్రయాణం ఇక మరింత ఖరీదు.. ఫైన్‌ రెట్టింపు చేసిన ఇండియన్‌ రైల్వే!

Indian Railways new penalty rules
Indian Railways new penalty rules

Indian Railways new penalty rules: భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ నష్టాన్ని తగ్గించుకోవడానికి కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. జనవిశ్వాస్‌ చట్టం కింద జరిమానాలను రెట్టింపు చేసింది. టికెట్‌ లేకుండా ప్రయాణం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్పులు రైల్వే వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చడానికి దోహదపడతాయి.

కొత్త ఫైన్, శిక్షల వివరాలు..
టికెట్‌ లేకుండా రైలు ఎక్కిన వారికి ఇప్పటి వరకు విధించే కనీస జరిమానా రూ.250గా ఉండేది. ఇప్పుడు అది రూ.500కు పెరిగింది. జూన్‌ 20 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఫైన్‌ చెల్లించని వారికి ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉండవచ్చని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధనలు జనవిశ్వాస్‌ చట్టం ద్వారా మరింత బలోపేతం అయ్యాయి. ప్రయాణికులు చట్టబద్ధంగా, బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలన్నదే దీని ఉద్దేశం.

ప్రయాణికుల బాధ్యతలు..
ప్రతీ ప్రయాణికుడు తప్పనిసరిగా వ్యాలిడ్‌ టికెట్‌ తన దగ్గర ఉంచుకోవాలి. ఆన్‌లైన్‌ బుకింగ్, యూటీఎస్‌ యాప్‌ లేదా కౌంటర్‌ ద్వారా టికెట్‌ తీసుకోవడం సులభం. టికెట్‌ లేకుండా ఎక్కడం వల్ల రైల్వేలకు నేరుగా ఆర్థిక నష్టం కలుగుతుంది. దీంతోపాటు, సరైన టికెటింగ్‌ వ్యవస్థ లేకపోతే రద్దీ, అసౌకర్యం పెరుగుతాయి. ప్రయాణికులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మర్చిపోయినా లేదా టికెట్‌ కొనలేకపోయినా, రైలు ఎక్కే ముందు టికెట్‌ తీసుకోవడం ఉత్తమం. ఇది శిక్షల నుంచి రక్షణ మాత్రమే కాదు, సురక్షితమైన ప్రయాణానికి కూడా దోహదపడుతుంది.

ఫైన్స్‌ వసూలు గణాంకాలు..
సెంట్రల్‌ జోన్‌లో మే నెలలోనే రూ.40.85 కోట్ల ఫైన్స్‌ వసూలు చేయడం ఈ నిబంధనలు ఎంత కఠినంగా అమలవుతున్నాయో చూపిస్తుంది. ఇలాంటి భారీ మొత్తాలు రైల్వేలు ఆదాయం పెంచడానికి, నిబంధనలను అమలు చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో స్పష్టం చేస్తాయి. ఈ గణాంకాలు ఒక వైపు రైల్వేల ఆర్థిక ఆరోగ్యానికి మంచివి. మరోవైపు, ప్రయాణికులలో అవగాహన లోపం ఇంకా ఉందని కూడా సూచిస్తాయి. రైల్వే శాఖ ఇప్పుడు ఈ వసూలు మొత్తాలను మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మార్పుల ప్రభావం..
ఈ కొత్త రూల్స్‌ రైల్వే వ్యవస్థకు బలం చేకూర్చే అవకాశం ఉంది. టికెట్‌ కొనుగోలు పెరిగితే రైల్వేలకు అదనపు ఆదాయం వస్తుంది. ఆ డబ్బు రైల్వేల మెరుగుదల, కొత్త సౌకర్యాలు, భద్రతకు ఉపయోగపడుతుంది. ప్రయాణికులలో క్రమశిక్షణ పెరగడం వల్ల రద్దీ తగ్గి, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. అయితే, కొంతమంది ప్రయాణికులకు, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ఈ ఫైన్‌ పెంపు భారం కావచ్చు. రైల్వే శాఖ అవగాహన కార్యక్రమాలు, సులభమైన టికెటింగ్‌ వ్యవస్థ, డిజిటల్‌ బుకింగ్‌ ప్రోత్సాహం ద్వారా ఈ సవాళ్లను అధిగమించాలి. నిబంధనలు కఠినంగా ఉండాలి, కానీ అమలు న్యాయబద్ధంగా, పారదర్శకంగా ఉండాలి.

రైల్వేలు తీసుకున్న ఈ నిర్ణయం సరైన దిశలో ఒక అడుగు. టికెట్‌ లేకుండా ప్రయాణం చేయడం ఇకపై ఖరీదైనది, ప్రమాదకరమైనది అవుతుంది. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, వ్యాలిడ్‌ టికెట్‌తో సురక్షితంగా ప్రయాణం చేయాలి. రైల్వే శాఖ కూడా ఈ నిబంధనలను న్యాయంగా అమలు చేస్తూ, ప్రజల సౌకర్యాన్ని మెరుగుపరచాలి. ఇది రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్పు.

'బిగ్ బాస్ 10' కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Bigg Boss 10 Nagarjuna remuneration
Bigg Boss 10 Nagarjuna remuneration

Bigg Boss 10 Nagarjuna remuneration: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు మేకర్స్. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా ఈ నెల 12 నుండి స్వీకరిస్తున్నారు మేకర్స్. మరో 10 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎవరైనా బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకుంటే , వెంటనే దరఖాస్తు చేసుకోండి , జియో హాట్ స్టార్ లో ఈ వెసులుబాటు ఉంటుంది. ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈసారి మేకర్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని మామూలు రేంజ్ ఉన్నవాళ్ళని తీసుకొని రావడం లేదు.

జనాల్లో మంచి పాపులారిటీ , ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కొద్దిరోజుల్లోనే స్పష్టమైన క్లారిటీ రానుంది. 10 మంది సెలబ్రిటీలు , 10 మంది కామనర్స్ తో ఈ సీజన్ ని మొదలు పెట్టబోతున్నారని టాక్. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయట. ఇకపోతే ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో , అక్కినేని నాగార్జున ఈ సీజన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నారు అట. నాగార్జున సినిమాలకు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నాలుగు సినిమాల రెమ్యూనరేషన్స్ కలిపినా ఇంత రెమ్యూనరేషన్ రాదట. అంతే కాదు , బిగ్ బాస్ అన్ని భాషలకు సంబంధించిన సీజన్స్ హోస్టులు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్స్ ని అందుకోవడం లేదట.

నాగార్జున కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం , ఆయన హోస్టింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చడం వల్లే. కంటెస్టెంట్స్ మీద నోరు పారేసుకోకుండా, ఒక పెద్ద మనిషి తరహా లో వాళ్ళు చేస్తున్న తప్పులని వేలెత్తి చూపిస్తూ , తన హోస్టింగ్ ని గత 7 సీజన్స్ ని కొనసాగిస్తూ వస్తున్నాడు నాగార్జున. ఆయనకు అత్యంత ఆదరణ లభిస్తుండడం వల్లే, ఇప్పటికీ హోస్ట్ గా కొనసాగుతున్నాడు , అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ సీజన్ కూడా హిట్ అయితే ఇక రాబోయే రోజుల్లో ఏ రేంజ్ డిమాండ్ చేస్తాడో చూడాలి. సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ మొదలు కానుంది. అదే విధంగా ‘అగ్నిపరీక్ష 2’ ప్రోగ్రాం జులై 25 నుండి మొదలు అవ్వబోతుందట.

పీఎం కిసాన్‌ సాయం.. ఇది చేయకుండా నిధులు జమ కావు!

PM Kisan eKYC mandatory
PM Kisan eKYC mandatory

PM Kisan eKYC mandatory: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం రూ.2 వేలు శనివారం(జూన్‌ 20న) ఖాతాల్లో జమ కాబోతోంది. ఇది వ్యవసాయ కుటుంబాలకు కాలానుగుణంగా అందించే మద్దతు. అయితే ఈ నిధులు అందరికీ రావు. కొన్ని అవసరమైన ధృవీకరణలు పూర్తి చేసిన వారికి మాత్రమే జమ అవుతాయి. ఈ ప్రక్రియ రైతులకు సమయానికి సాయం అందించడానికి రూపొందించబడింది.

ఈకేవైసీ తప్పనిసరి..
నిధులు సరైన వ్యక్తుల చేతుల్లో పడేలా చూడటానికి ఈ ధృవీకరణ అవసరం. ఇది డబ్బులు తప్పు ఖాతాల్లోకి వెళ్లకుండా, ఒకే వ్యక్తి ఎక్కువసార్లు సాయం పొందకుండా నిరోధిస్తుంది. ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల వివరాలను ధృవీకరించడం వల్ల పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు జరుగుతుంది. ఇది ప్రభుత్వ నిధులు వృథా కాకుండా, నిజమైన రైతులకు చేరేలా చేస్తుంది.

ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా?
ఇంటర్నెట్‌ ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగా ప్రక్రియను ముగించవచ్చు. ఆధార్‌ వివరాలు నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ సమర్పించడం ద్వారా ధృవీకరణ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌ సౌకర్యం లేని వారు సమీపంలోని మీసేవా కేంద్రాలు లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో బయోమెట్రిక్‌ పద్ధతిలో కూడా చేయించుకోవచ్చు. ఈ రెండు మార్గాలు రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

డిజిటల్‌ ధృవీకరణ ప్రాముఖ్యత..
ఈ విధానం వ్యవసాయ రంగంలో డిజిటల్‌ పరివర్తనను ప్రోత్సహిస్తుంది. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వడం వల్ల మధ్యవర్తులు తగ్గుతారు, రైతులకు సమయానికి సాయం చేరుతుంది. ఈకేవైసీ పూర్తి చేయని వారు ఈ సాయం నుంచి పొందేందుకు వెంటనే ధృవీకరణ ప్రక్రియను ముగించాలి.

ఇది ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ఆధునిక చర్యల్లో ఒకటి. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం ద్వారా తమకు అందవలసిన సాయాన్ని సకాలంలో పొందవచ్చు.

'వారణాసి' గ్లింప్స్ లో ఉన్నది మహేష్ బాబు కాదా..? ఆడియన్స్ ని భలే మోసం చేశారుగా..

Varanasi glimpse
Varanasi glimpse

Varanasi glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమాలోని కొన్ని కీలకమైన షాట్స్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ని ఒక గ్లింప్స్ వీడియో ద్వారా రామోజీ ఫిలిం సిటీ లో ‘#Globetrotter’ అనే ఈవెంట్ ని నిర్వహించి , గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో మహేష్ బాబు లుక్స్ ని , ఆయన ఎక్స్ ప్రెషన్స్ ని చూసి అభిమానులకు అప్పుడే అనుమానం వచ్చింది.

ఇవి నేచురల్ మహేష్ బాబు లుక్స్ , ఎక్స్ ప్రెషన్స్ లాగా లేవే, AI ద్వారా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు నెటిజెన్స్. వాళ్ళ అనుమానాలు నిజం అయ్యాయి, గ్లింప్స్ వీడియో లో మనం చూసిన మహేష్ బాబు నిజమైన మహేష్ బాబు కాదు , AI ద్వారా క్రియేట్ చేశారు. గ్లింప్స్ చివర్లో ఆయన ఎద్దు మీద స్వారీ చేస్తూ , చేతిలో సూలం పట్టుకున్న షాట్ ఉంది కదా, ఆ షాట్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే మొదలు పెట్టారు. సన్నివేశం నెంబర్ 76 , టేక్ 1 , బుల్ షాట్ – 410 A అని ఉన్నటువంటి క్లాప్ బోర్డు నిన్నటి నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మనం గ్లింప్స్ లో చూసిన షాట్ ఇప్పటి వరకు షూట్ చెయ్యలేదా ?, అసలు ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నాము అంటూ రాజమౌళి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసాడు. మరి ఆ సమయానికి సినిమా రెడీ గా ఉంటుందా? , ఇప్పటి వరకు రాజమౌళి చరిత్ర లో , చెప్పిన తేదికి సినిమాని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాకు కూడా అదే జరుగుతుందనే భయం అభిమానుల్లో ఉంది. కానీ రాజమౌళి మాత్రం సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఆ టార్గెట్ ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి.

ప్రభాస్ ఒకే కథ తో రెండు సినిమాలు చేశాడా..?వాటి రిజల్ట్ ఏంటంటే..?

Prabhas same story two movies
Prabhas same story two movies

Prabhas same story two movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన రాని గుర్తింపు కొంత మంది స్టార్ హీరోలకు మాత్రం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా భారీ ఎత్తున సినిమాలనైతే చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాతో తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి ప్రత్యేకమైన గుర్తింపునైతే తీసుకొచ్చాయి.

కానీ ఒక రెండు సినిమాలు మాత్రం అతనికి ఏ మాత్రం ఇమేజ్ ను తీసుకురాక పోగా ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఇక రెండు సినిమాల కథలు కూడా దాదాపు ఒకే లాగా ఉండడం ప్రేక్షకుడిని అలాగే ప్రభాస్ అభిమానులను సైతం జీర్ణించుకోలేకుండా చేసింది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి యోగి మూవీ కాగా, మరొకటి ఏక్ నిరంజన్ కావడం విశేషం…

ఈ రెండు సినిమాల్లో కూడా హీరో తన ఫ్యామిలీ కోసం తన పేరెంట్స్ కోసం విపరీతంగా సఫర్ అవుతుంటాడు. ఈ సినిమా చివర్లో తన అమ్మని కూడా చూసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ మూవీలో సైతం తన ఫ్యామిలీ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీతో కలుస్తారని అందరు అనుకున్నప్పటికి ఫ్యామిలీతో కలువకుండా తను కూడా సింగిల్ గానే ఉండిపోతాడు. ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లు ప్రేక్షకుడిని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయాయి.

ఓవరాల్ గా సినిమాలు బాగున్నప్పటికి క్లైమాక్స్ విషయంలో తేడా కొట్టడం అలాగే రెండు సినిమాల కథలు కూడా పేరెంట్స్ మీదనే ఉండడం వల్ల ఈ సినిమాలను చూసిన ప్రేక్షకులకు కొంతవరకు నిరాశ ఎదురైంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్ గా తన నటనని చూపించినప్పటికి అనుకున్న మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు…

'దివానా' మూవీకి 'అర్జున్ రెడ్డి' సినిమా మధ్య ఉన్న తేడా ఇదేనా..?

Deewana vs Arjun Reddy
Deewana vs Arjun Reddy

Deewana vs Arjun Reddy: హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘దివానా’ సినిమా ట్రైలర్ తోనే జూనియర్ అర్జున్ రెడ్డి అనే పేరును సంపాదించుకుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి అర్జున్ రెడ్డి సినిమాకి దీనికి మధ్య మిస్సైన పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… అర్జున్ రెడ్డి సినిమాలో ఒక రా ఎమోషన్ అయితే ఉంటుంది. లవ్ స్టోరీ లో ఇంటెన్సిటి ఉంటుంది. అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ బాధపడితే మనకు కూడా బాధనిపిస్తుంది. అంతటి పెన్ ఫుల్ సిచువేషన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత సందీప్ రెడ్డివంగా కే దక్కుతుంది. దానివల్లే సినిమా నెక్స్ట్ లెవల్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చుకున్నప్పటికి ‘దివానా’ మూవీకి అంత పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయలేదు.

దానివల్లే సినిమా ఓకే అనిపించింది తప్ప అర్జున్ రెడ్డి రేంజ్ లో భారీ సక్సెస్ మూట గట్టుకోలేకపోయింది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా కథ బాగున్నప్పటికి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా ఎఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే మాత్రం సినిమా చాలావరకు డీలాపడిపోయే ప్రమాదం ఉంది…

ఇప్పుడు వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది దర్శకులు మొదటి సినిమాతోనే పెను సంచనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

వాళ్ళు అనుకున్నట్టుగానే కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… దివానా సినిమా ఒక గుడ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు… అలా కాకుండా యూత్ ఈ మూవీకి కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్స్ బాగానే వస్తాయి… రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఈ మూవీ టాక్ ఏంటనేది అంతా పెర్ఫెక్ట్ గా తెలియదు…