Homeఎంటర్టైన్మెంట్Jr NTR stance on Balakrishna: బాలయ్య విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏంటి అలా ఉంది..

Jr NTR stance on Balakrishna: బాలయ్య విషయంలో ఎన్టీఆర్ వైఖరి ఏంటి అలా ఉంది..

Jr NTR stance on Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఎఫెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్న ఆయన దర్శకులను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరితో సినిమా చేస్తే తన ఇమేజ్ రెట్టింపు అవుతుంది అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో దర్శకులందరు కూడా అతన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…ఇక బాలయ్య […]

Jr NTR stance on Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఎఫెక్టివ్ గా ముందుకు సాగుతున్నాడు. కథల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్న ఆయన దర్శకులను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరితో సినిమా చేస్తే తన ఇమేజ్ రెట్టింపు అవుతుంది అనే ధోరణిలో కూడా ఆలోచిస్తున్నాడు. అతను అనుకున్నట్టుగానే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో దర్శకులందరు కూడా అతన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…ఇక బాలయ్య బాబుకు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవనే విషయం మనందరికి తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు బాలయ్య బాబుతో మాట్లాడాలనే ప్రయత్నం చేసిన కూడా బాలయ్య మాత్రం అతనికి పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుతో కలువడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఒకే ఫ్యామిలీలో ఉండే వాళ్లిద్దరి మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ బాలయ్యతో కలిసి పోదామనే ప్రయత్నం చేస్తున్నాడట. కానీ గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఎలాంటి స్పందన తెలియజేయలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరుపున ప్రచారానికి రమ్మంటే రాలేదు.

కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని బాలయ్య అతనికి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది… ఇక వీళ్ళ అభిమానులు మాత్రం వీళ్ళిద్దరు కలిసిపోయి ఒకే స్టేజి మీద కనిపిస్తే చూడాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. కానీ అది ఈ మధ్యకాలంలో మాత్రం జరగడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు ఫ్యూచర్లో కలిసి సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ సినిమా చేయకపోయిన కూడా వీళ్ళు కలిసి ఒక ఈవెంట్లో కనిపిస్తే చూడాలని నందమూరి అభిమానులు అలాగే టిడిపి కార్యకర్తలు సైతం ఆసక్తి చూపిస్తుండటం విశేషం…ఇక ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి కలిసి ఒకే స్టేజ్ మీద కనిపిస్తారా..? లేదంటే ఇద్దరు కలిసి సినిమా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper