Homeబిజినెస్Redmi K90 Ultra price: గేమింగ్ లవర్స్ కోసం సూపర్ ఫోన్.. ధర ఎంతంటే..

Redmi K90 Ultra price: గేమింగ్ లవర్స్ కోసం సూపర్ ఫోన్.. ధర ఎంతంటే..

Redmi K90 Ultra price: Xiaomi సబ్ బ్రాండ్ అయిన ‘రెడ్‌మి’ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ రాబోతుంది. దీనికి రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మొబైల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గేమర్స్‌ను టార్గెట్ చేస్తూ ఇన్ బిల్ట్ కూలింగ్ ఫ్యాన్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. చైనాలో ఇప్పటికే దీని ప్రీ-బుకింగ్స్ ప్రారంభం కాగా, దీని లాంచ్ డేట్, ధర మరియు స్పెసిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ జూన్ చివరి వారంలోనే చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి కంపెనీ ఇప్పటికే అధికారిక టీజర్‌ను కూడా విడుదల చేసింది. చైనా లాంచ్ ముగిసిన తర్వాత కొన్ని నెలల్లోనే ఈ ఫోన్ భారత మార్కెట్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.

ఈ ఫోన్ ధరను కంపెనీ చాలా ఆకర్షణీయంగా ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇది K90 సిరీస్‌లోని ప్రీమియం మోడల్ అయిన K90 మ్యాక్స్ కంటే తక్కువ ధరకే లభించనుంది. చైనాలో దీని ప్రారంభ ధర దాదాపు సీఎన్ వై 3,000 (మన దేశీ కరెన్సీలో సుమారు రూ.41,000) వరకు ఉండవచ్చని అంచనా. ఇక భారత మార్కెట్లోకి వచ్చేసరికి పన్నుల వల్ల దీని ధర సుమారు రూ.45,000 నుండి రూ.50,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.

రెడ్‌మి K90 అల్ట్రా ప్రీమియం మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో రానుంది. ఇందులో 6.89 అంగుళాల OLED డిస్‌ప్లేను ఉంచారు. ఇది 1.5K రిజల్యూషన్ తో పనిచేస్తుంది. ఈ డిస్ ప్లేతో గేమింగ్ ఆడేటప్పుడు విజువల్స్ అత్యంత స్మూత్‌గా ఉండటం కోసం ఏకంగా 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇస్తున్నారు.

ఈ ఫోన్ లో అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం, మొబైల్ హిస్టరీలోనే అరుదుగా కనిపించేలా దీని లోపల ఒక యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ సిస్టమ్‌ను అమర్చారు. ఇది ఫోన్ హీట్ అవ్వకుండా అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ పై పనిచేయనుంది.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండవచ్చు. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 20 మెగాపిక్సెల్ లేదా 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వనున్నారు.

బ్యాటరీ విషయానికి వస్తే.. రెడ్‌మి ఈసారి ఊహించని రేంజ్‌లో ఏకంగా 8,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీని ఇందులో అమర్చబోతున్నారు. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడం కోసం 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే గేమింగ్ ఫోన్ కావాలనుకునే వారికి రెడ్‌మి K90 అల్ట్రా ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular