Homeజాతీయ వార్తలుTwo Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ విచిత్ర సంప్రదాయాన్ని గ్రామస్థులు ఆశ్రయించారు. ఇంతకీ వీరు ఏం చేశారంటే? ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో వర్షాలు పడాలని […]

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ విచిత్ర సంప్రదాయాన్ని గ్రామస్థులు ఆశ్రయించారు. ఇంతకీ వీరు ఏం చేశారంటే?

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో వర్షాలు పడాలని కోరుకుంటూ ఇద్దరు పురుషులకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారాన్ని స్థానికంగా ‘అందిర బిబాహ’ (మగ పెళ్లి) అని పిలుస్తారు. వర్షాలు పడకుండా తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరుణ దేవుడి అనుగ్రహం కోసం ఈ తరహా మగ పెళ్లిళ్లు చేయడం అక్కడ శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం. ఈ వివాహం ద్వారా ప్రకృతికి, దైవానికి మధ్య ఉన్న బంధం బలపడి, త్వరలోనే మేఘాలు కురుస్తాయని స్థానికులు బలంగా నమ్ముతారు.

ఈ వినూత్న వివాహ వేడుకలో గ్రామానికి చెందిన 29 ఏళ్ల జతిన్ వరుడిగా మారగా, 27 ఏళ్ల కలాండి వధువు రూపం ధరించారు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా, ఈ పెళ్లిని ఒక సాధారణ సాంప్రదాయ వివాహం లాగే అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అలంకరణలు, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలం, పెళ్లి విందు.. ఇలా అన్ని కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎంతో వైభవంగా ఒక్కటైన ఈ మగ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు. కేవలం వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా జరిగే ఈ పెళ్లి ముగిసిన మరుసటి రోజే ఈ జంట అధికారికంగా విడిపోతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు యథావిధిగా గడుపుతారు. ఆధునిక కాలంలో ఇలాంటి నమ్మకాలు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, కరవు కోరల్లో చిక్కుకున్న తమ భూములను, జీవనోపాధిని కాపాడుకోవడానికి గ్రామస్థులు తమ పూర్వీకుల నాటి నమ్మకాన్నే నమ్ముకుని ఈ వివాహాన్ని నిర్వహించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Oktelugu Epaper