Home Blog Page 94

జ్ఞానేశ్వరీ మిస్సింగ్ కేసులో.. కీలక పరిణామం.. చిన్నారి జాడ దొరికినట్టేనా..

Jnaneshwari Missing Case
Jnaneshwari Missing Case

Jnaneshwari Missing Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ అగ్రహారం ప్రాంతంలో తప్పిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు విషయంలో ఇప్పటివరకు పురోగతి లభించలేదు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి.. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు.. అనేక రకాలుగా సెర్చ్ ఆపరేషన్ లు చేశారు. ఆయనప్పటికీ పాప ఆచూకీ లభించలేదు.

జూన్ 6న జ్ఞానేశ్వరి ఇంటి బయట ఆడుకుంటున్నది.. అదే సమయంలో తమ తల్లిదండ్రులు పెంచుకుంటున్న కుక్కతో పాటు ఆమె వెళ్లిపోయింది.. అప్పటినుంచి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు .. అధికారులు వెతుకుతూనే ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లభించకపోవడంతో పోలీసులు అపహరణ (కిడ్నాప్) కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి తో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క అదే రోజు గ్రామంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద తిరుతూ కనిపించినట్టు తెలుస్తోంది. ఆ కుక్క మధ్యాహ్నం సమయంలో ఆందోళనగా తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కుక్క తర్వాత ఎటువైపు వెళ్ళిందో క్లారిటీ లేకుండా పోయింది.

అలా వెళ్లిపోయిన కుక్క మూడు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చింది. అప్పటినుంచి ఆ కుక్క కనిపించిన వారి మీద దాడి చేసింది. వింతగా ప్రవర్తించింది. ఆ కుక్కకు వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసినప్పటికీ.. జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. చివరికి ఆ కుక్క చనిపోయింది. ఇప్పటివరకు పోలీసులు జ్ఞానేశ్వరి కేసులో 6 వేలకు పైగా ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను కూడా ప్రశ్నించే వదిలిపెట్టారు. కొండమీద ఉండే వ్యక్తుల గురించి కూడా విచారించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే దివి పోలవరం, కోటవురట్ల, పిఠాపురం ప్రాంతాలలో గాలింపు చేస్తున్నాయి.. చనిపోయిన ఆ కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. ఆ రిపోర్టు రాకపోవడం పట్ల స్థానికులలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్నారు.

జ్ఞానేశ్వరి కేసులో మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యూస్ కోసం.. లైక్స్ కోసం.. అడ్డగోలు ప్రచారం చేయవద్దని.. తాము పాప కోసం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో చూడాలని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులు సమయమనంతో ఉండాలని.. తమ బాధను అర్థం చేసుకోవాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కాగా, చిన్నారి మిస్సింగ్ కేసులో పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజ్ క్లూ గా దొరికిందని తెలుస్తోంది.. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఉన్న వివరాలను బయట పెట్టకుండా, మీడియాకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ

Vemuri Radhakrishna Apology
Vemuri Radhakrishna Apology

Vemuri Radhakrishna Apology: ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జన్మదినం. ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ లలో రాధాకృష్ణ ఫోటోలు పెట్టుకుని.. యజమాని పట్ల తమ ప్రేమ భావాన్ని చాటుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైకులు.. కామెంట్లు సొంతం చేసుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకోవాల్సిన రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా క్షమాపణ చెప్పారు.. సహృదయంగా గమనించాలని.. తన పత్రికలో గమనిక కూడా వేశారు.

ఆంధ్రజ్యోతి పత్రికలో శుక్రవారం సంచికలో “ఆఎంపీని టార్చర్ చేస్తారని”తాటికాయ పరిమాణంలో అక్షరాలతో బ్యానర్ వార్త ప్రచురితమైంది. ఇదంతా కూడా సునీల్ నాయక్ అనే అధికారికి ముందే తెలుసు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అయితే ఈ కథనం రాసే క్రమంలో రిపోర్టర్ సక్రమంగానే వ్యవహరించాడు. కానీ సెంట్రల్ డెస్క్ లోనే సీనియర్ సబ్ ఎడిటర్లు దారి తప్పారు.. కనీసం ఫైనల్ కాపీ కూడా చూసుకోకుండా.. హడావిడిగా సునీల్ నాయక్ ఫోటో వేశారు. ఇంతకీ ఆ ఫోటో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ఫోటో కాదు. ఆస్థానంలో మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఫోటో వేశారు. కథనం మాత్రం సునీల్ కుమార్ నాయక్ దే. ఫోటో మాత్రం పీవీ సునీల్ కుమార్ ది.

ఉదయాన్నే తన ఫోటో చూసుకొని కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టున్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక దివాలా కోరుతనాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు. అందువల్లే ఆంధ్రజ్యోతి పత్రిక శనివారనాటి ఏపీ ఎడిషన్ లో గమనిక పేరుతో చిన్నపాటి డిస్క్లైమేర్ ప్రచురించింది. అది కూడా మూడో పేజీలో.. బ్యానర్ వార్తను తాటికాయ పరిమాణంలో అక్షరాలతో ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేశారు. గమనికను మాత్రం మూడో పేజీలో ఏదో వేసి వేయనట్టుగా.. జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేనట్టుగా ప్రచురించింది.

వాస్తవానికి ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ను గాలికి వదిలేసారా.. అందులో ఉపసంపాదకులు పనిచేయడం లేదా.. సీనియర్ ఉద్యోగులకు బాధ్యత లేదా.. రాసిన వాళ్లకు అవగాహన లేదా.. అసలు ఏం చేస్తున్నారు.. బ్యానర్ వార్తలో ఫోటో మారిపోతే దానికి బాధ్యులు ఎవరు.. ఇంతటి వార్తలో పీవీ సునీల్ కుమార్ ఫోటో వేశారంటే ఆ బాధ్యతారాహిత్యాన్ని ఏమనుకోవాలి.. ఇదిగో ఇలానే ఏపీ పాఠకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రాధాకృష్ణ ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు ఎదురు వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫస్ట్ పేజీలో వేసే రాధాకృష్ణ.. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇలా చూసి చూడనట్టు.. కనిపించి కనిపించినట్టు.. వార్తలు ప్రచురించడం నిజంగా గొప్ప విషయం.

ఈ స్కూటర్ ను ఎగబడి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో ఏముంది..

TVS Jupiter scooter features
TVS Jupiter scooter features

TVS Jupiter scooter features: భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కుటుంబ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న స్కూటర్లలో TVS Jupiter ఒకటి. సౌకర్యవంతమైన రైడింగ్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ మోడల్ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా గత నెలలో ఈ స్కూటర్ అమ్మకాల్లో 27.83 శాతం వృద్ధి సాధించింది. వీటిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

2026 మే నెలలో టీవీఎస్ జూపిటర్ మొత్తం 1,24,767 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,606 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అదనంగా 27,161 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఏడాది వ్యవధిలో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసి కంపెనీకి మరోసారి బలమైన ఫలితాలను అందించింది. స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో చాలా మంది ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన ప్రయాణం, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశాల్లో టీవీఎస్ జూపిటర్ మంచి పనితీరు కనబరుస్తుండటంతో వినియోగదారుల తొలి ఎంపికగా నిలుస్తోంది. నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

జూపిటర్ విజయానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధునిక డిజైన్, మెరుగైన ఇంజిన్ పనితీరు, విశాలమైన సీటింగ్ సౌకర్యం, అధిక స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో 113.3cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7.91 bhp పవర్, 9.8 Nm టార్క్ ను అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్‌లు, వాయిస్ అసిస్టెన్స్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించిన డీలర్ నెట్‌వర్క్, సమర్థవంతమైన సర్వీస్ సదుపాయాలు కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

స్కూటర్ విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ టీవీఎస్ జూపిటర్ తన స్థిరమైన పనితీరుతో మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. కొత్త మోడళ్ల ప్రవేశం, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న ప్రభావం మధ్య కూడా ఈ స్కూటర్ అమ్మకాలు పెరగడం విశేషంగా భావిస్తున్నారు. ఇది బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 91,738 నుంచి ప్రారంభం అవుతుంది. మే నెలలో నమోదైన ఈ విక్రయాలు TVS Motor Company కు పెద్ద ఊరటనిచ్చాయి. జూపిటర్ అమ్మకాల వృద్ధి కంపెనీ మొత్తం స్కూటర్ విభాగ పనితీరును బలోపేతం చేయడంతో పాటు మార్కెట్ వాటాను మరింత పెంచే అవకాశాలను కల్పిస్తోంది.

హార్ముజ్‌ సంక్షోభం.. 115 కోట్ల బ్యారెళ్ల ఆయిల్‌ నష్టం!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait crisis oil impact: అమెరికా–ఇరాన్‌ మధ్య డీల్‌ కుదిరింది. యుద్ధం కారణంగా మూతపడిన హార్ముజ్‌ జలసంధి తెరుచుకుంది. దీంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇప్పటికే జరిగిన నష్టం తిరిగి రాదని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మూడున్నర నెలల యుద్ధం కారణంగా ప్రపంచం భారీ మొత్తంలో ముడి చమురును కోల్పోయింది. దీని ప్రభావం వ్యూహాత్మక నిల్వలపై తీవ్రంగా పడింది.

భారీగా ఆయిల్‌ నష్టం..
మూడున్నర నెలల పాటు కొనసాగిన యుద్ధం కారణంగా ప్రపంచం 115 కోట్ల బ్యారెళ్ల (1.15 బిలియన్‌ బ్యారెళ్ల) ముడి చమురును కోల్పోయింది. హార్ముజ్‌ జలసంధి సంక్షోభం కారణంగా సరఫరా ఆగిపోయి ఈ నష్టం జరిగింది. జలసంధి తెరిచినా, ఇప్పటికే జరిగిన నష్టం తిరిగి రాకపోవడం గమనార్హం.

వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు కనిష్ఠ స్థాయికి..
ఈ నష్టం వల్ల ప్రపంచ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 1990 తర్వాత ఇంత తక్కువ స్థాయికి దిగజారాయి. దేశాలు తమ నిల్వలను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఫలితంగా భవిష్యత్తు సరఫరా భద్రతకు సంబంధించిన ఆందోళనలు పెరిగాయి.

అమెరికా నిల్వలు 43 ఏళ్ల కనిష్టానికి..
అమెరికాలో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు 43 ఏళ్లలో ఇంత తక్కువ స్థాయికి చేరాయి. యుద్ధం కారణంగా అమెరికా కూడా తన నిల్వలను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. ఇది అమెరికా శక్తి భద్రతకు సంబంధించిన గంభీరమైన సంకేతం.

రికవరీకి నెలల సమయం..
యుద్ధానికి ముందు ఉన్న స్థితికి తిరిగి రావడానికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు అభిప్రాయపడుతున్నాయి. నిల్వలు మళ్లీ నింపడం, సరఫరా గొలుసులు పూర్తిగా పునరుద్ధరణ చెందడం వంటివి సమయం తీసుకుంటాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కొంతకాలం ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఈ నష్టం ఫలితం ఏంటి?
హార్ముజ్‌ జలసంధి సంక్షోభం ప్రపంచ ఇంధన భద్రత ఎంత దుర్బలంగా ఉందో చూపించింది. 115 కోట్ల బ్యారెళ్ల నష్టం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన ధరలు, దేశాల శక్తి భద్రతపై తీవ్ర ప్రభావం చూపింది. నిల్వలు 1990 తర్వాత కనిష్ట స్థాయికి రావడం అంటే భవిష్యత్తులో ఏదైనా కొత్త సంక్షోభం వచ్చినప్పుడు దేశాలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అమెరికా నిల్వలు 43 ఏళ్ల కనిష్ట స్థాయికి రావడం దీనికి ఉదాహరణ. యుద్ధం ముగిసినా, రికవరీకి కొన్ని నెలల సమయం పట్టడం వల్ల ఇంధన మార్కెట్‌లో అస్థిరత కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి దేశాలు తమ ఇంధన వనరులను వైవిధ్యపరచడం, నిల్వలను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.

'క్లిన్ కారా' ముఖాన్ని రివీల్ చేసిన రామ్ చరణ్.. అచ్చు గుద్దినట్టు ఉపాసన పోలికలే..

Ram Charan Klin Kaara face reveal
Ram Charan Klin Kaara face reveal

Ram Charan Klin Kaara face reveal: పెళ్ళైన 12 ఏళ్లకు రామ్ చరణ్ , ఉపాసన జంటకు క్లిన్ కారా అనే పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పుట్టిన పాప కావడం తో మెగా ఫ్యామిలీ కి క్లిన్ కారా ఎంతో ప్రత్యేకం. తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఈ చిన్నారి ని ఒక గాజు బొమ్మ లాగా చూసుకున్నారు, ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. అయితే రామ్ చరణ్ , ఉపాసన క్లిన్ కారా ముఖాన్ని అభిమానులకు చూపించకుండా ఇంత కాలం దాచుకుంటూ వచ్చారు. ఆ చిన్నారి కి మూడేళ్ళ వయస్సు నిండిన తర్వాత అభిమానులకు చూపిస్తామని చెప్పుకొచ్చారు. రీసెంట్ గానే క్లిన్ కారా తన మూడవ పుట్టిన రోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ , ఉపాసన దంపతులు క్లిన్ కారా ముఖాన్ని అభిమానులకు రివీల్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ ఫోటో ని చూసిన వెంటనే అచ్చు గుద్దినట్టు అమ్మ పోలికలతో పుట్టిందని కొందరు , లేదు నాన్న పోలికలతో పుట్టిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఆ చిన్నారిని బాగా పరిశీలించి చూస్తే, ఇద్దరి పోలికలతో సమానంగా పుట్టిందని అర్థం అవుతోంది , కానీ చూడగానే ఎవరికైనా ఉపాసన లాగానే ఉందని అనిపించక తప్పదు. ఎందుకంటే ఎక్కువ శాతం పోలికలు ఉపాసన వే కాబట్టి. మరి మీకేమి అనిపిస్తుంది?, ఈ చిన్నారి ఉపాసన లాగా ఉందా?, లేదా రామ్ చరణ్ లాగా ఉందా?, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియజేయండి. ముఖ్యంగా ఈ చిన్నారి చిరు నవ్వు చూస్తే ఎంత బాధలో ఉన్నవాడికైనా మనసు ప్రశాంతం గా అనిపిస్తుంది. చిన్న బిడ్డల నవ్వులో ఎదో మ్యాజిక్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే రీసెంట్ గానే రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు రెండవ సంతానం గా మగబిడ్డ పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ బిడ్డ పుట్టినప్పుడు రామ్ చరణ్ క్లిన్ కారా ని తీసుకొని హాస్పిటల్ కి వస్తాడు. ఆ సమయం లోనే క్లిన్ కారా ముఖం రివీల్ అయ్యింది. కానీ అధికారికంగా తల్లిదండ్రుల ద్వారా రివీల్ చేయబడింది నేడు మాత్రమే. ఇక కొడుకు ఫోటో ఎప్పుడెప్పుడు రివీల్ చేస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ‘పెద్ది’ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న మెగా అభిమానులకు , రామ్ చరణ్ వాళ్ళ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ క్లిన్ కారా ఫోటో ని విడుదల చేయడం మెగా అభిమానుల్లో ఒక పండుగ వాతావరణం నెలకొల్పేలా చేసింది.

ధనుష్ తో మృణాల్ ఠాకూర్ లవ్ బ్రేకప్.. కారణం ఆ హీరోయిన్ యేనా.. ఇది మామూలు ట్విస్ట్ కాదు..

Dhanush Mrunal Thakur breakup
Dhanush Mrunal Thakur breakup

Dhanush Mrunal Thakur breakup: గత కొంతకాలం గా కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు , హాట్ టాపిక్ గా మారిన జంట ధనుష్ – మృణాల్ ఠాకూర్. వీళ్లిద్దరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని , లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే అధికారికంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని , ఇలా రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి. అంతే కాదు , వీళ్లిద్దరు ప్రైవేట్ గా ఒక హోటల్ లో ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియా లో లీక్ చేశారు. అయితే వీటిపై మృణాల్ ఠాకూర్ పలు సందర్భాల్లో స్పందించింది కూడా. తాను ధనుష్ ని ఒక బ్రదర్ లాగా భావిస్తానని, మా ఇద్దరి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని , వ్యక్తిగత రిలేషన్ అసలు లేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ ఆ ఫోటోలను చూసి నెటిజెన్స్ అసలు నమ్మలేకపోయారు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏంటంటే , వీళ్లిద్దరి మధ్య లవ్ బ్రేక్ అయ్యిందని , ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. అసలు మా మధ్య ఏమి లేదు బాబోయ్ అంటూ మృణాల్ ఠాకూర్ మొదటి నుండి చెప్పుకుంటూ వస్తుంటే , బాలీవుడ్ మీడియా వాళ్ళ మధ్య లవ్ రిలేషన్ షిప్ నడుస్తుందని పుకారు పుట్టించడం, వాళ్ళు పుట్టించిన పుకారు న్యూస్ కి ఇప్పుడు బ్రేకప్ అనే మరో పుకారు పుట్టించడం వంటివి చూసి అభిమానులు మీకు మీరే కొత్త ప్రపంచాలను క్రియేట్ చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో బాలీవుడ్ పై మండిపడుతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్, ధనుష్ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు , కానీ వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది అనేది మాత్రం నిజం. దాని గురించే మీడియా లో ఇంత చర్చ నడిచింది.

ఇక వీళ్లిద్దరి కెరీర్స్ విషయానికి వస్తే, ధనుష్ రీసెంట్ గానే ‘కారా’ అనే చిత్రాన్ని విడుదల చేసి , కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘ఓం’ అనే చిత్రం చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి రీసెంట్ గానే ఆమె ‘డెకాయిట్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అదే విధంగా బాలీవుడ్ లో ఆమె వరుణ్ ధావన్ , పూజ హెగ్డే లతో కలిసి ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై ‘ అనే చిత్రం చేసింది. రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది.

పార్టీల విచ్ఛిన్న ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రమాదం

Indian democracy

Indian democracy : భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం. అతిపెద్ద నిజమైన ప్రజాస్వామ్య దేశం. రెండు పార్టీలు, బహుళ పార్టీలకు కొన్ని దేశాలకు అవకాశం ఉండదు. నీకు నచ్చిన సిద్ధాంతంతో కోపంతో కొత్త పార్టీలు పెట్టుకోవచ్చు. ఎన్ని చెప్పినా భావ స్వేచ్ఛకు ఓటు వేయాల్సిందే. స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోరుకోవాలి. మనం గొప్ప దేశంగా చెప్పుకోవడానికి పెద్ద క్వాలిటీ ఏంటంటే.. ఇదే..

ప్రజాస్వామ్యానికి అధికార పార్టీ ఎంత ముఖ్యమో.. ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం.. అధికార పార్టీకి చెక్ పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షానికి అవసరం. ఇలా లేకపోతే ఒకే పార్టీ కేంద్రకృత అధికారంలోకి వెళుతుంది. భారత్ లో గట్టి ప్రతిపక్షం లేదు. వాళ్ల స్వయంకృతాపరాధం.. బీజేపీకి ప్రత్యామ్మాయం కాంగ్రెస్ కనిపించడం లేదు. రాహుల్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ విఫలం అవుతూనే ఉంది.

పార్టీల విచ్ఛిన్న ప్రక్రియ ప్రజాస్వామ్యానికి ప్రమాదం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

'పెద్ది' ని చావుదెబ్బ కొట్టిన సమంత 'మా ఇంటి బంగారం'.. ఇలా జరుగుతుందని ఊహించలేదు..

Peddi vs Maa Inti Bangaram
Peddi vs Maa Inti Bangaram

Peddi vs Maa Inti Bangaram: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది ‘ బాక్స్ ఆఫీస్ జోరు గత రెండు వారాలుగా ఏ రేంజ్ లో ఉన్నిందో మన కళ్లారా చూసాము. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా, వీకెండ్ తర్వాత వసూళ్లు పడిపోయే రోజులివి. ఎందుకంటే సమీపం లోనే ఓటీటీ లోకి వచ్చేస్తుంది, ఈ మాత్రం దానికి థియేటర్ వరకు వెళ్లి సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం అనే మైండ్ సెట్ కి వచ్చేసారు జనాలు. ఇలాంటి రోజుల్లో కూడా వీకెండ్ తర్వాత , మామూలు వర్కింగ్ డేస్ లో భారీ వసూళ్లను రాబట్టడం అనేది చిన్న టాస్క్ కాదు. కానీ ‘పెద్ది’ చిత్రం ఆ అరుదైన ఫీట్ ని చేసి చూపించింది. మామూలు వర్కింగ్ డేస్ లో ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను చూసి ట్రేడ్ షాక్ కి గురైంది.

పైగా రెండు వారాల పాటు , చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు కూడా విడుదల లేకపోవడం తో, ఆడియన్స్ కి పెద్ది తప్ప మరో ఛాయస్ లేకుండా పోయింది. అయితే నిన్న విడుదలైన సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం మాత్రం ‘పెద్ది’ వసూళ్లకు పెద్ద గండి పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విమర్శకులు సైతం పర్వాలేదు , ఒకసారి కచ్చితంగా ఈ చిత్రాన్ని చూడొచ్చు అనే రేంజ్ టాక్ చెప్పడం తో, మూవీ లవర్స్ , ఫ్యామిలీ ఆడియన్స్ ఈ వారానికి ఆ చిత్రాన్ని మొదటి ఛాయస్ గా ఎంచుకున్నారు. ఆ కారణం చేత ‘పెద్ది’ వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. నిన్న తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి కేవలం 69 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఈరోజు వీకెండ్ కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ ‘పెద్ది’ మరోసారి జోరు చూపిస్తుందని అనుకున్నారు.

కానీ ఆశించిన స్థాయి జోరు మాత్రం కనిపించడం లేదు. ఇదే అభిమానులకు కాస్త నిరాశకు గురి చేస్తున్న విషయం. ‘పెద్ది’ విడుదలైన రెండు వారాలకు ‘మా ఇంటి బంగారం’ వచ్చింది, ఒకవేళ ‘పెద్ది’ విడుదలైన వారానికే ఈ చిత్రం పోటీ కి దిగుంటే , కలెక్షన్స్ పై ఇంకా తీవ్రమైన ప్రభావం చూపించి ఉండేదని అంటున్నారు. ఒకవేళ ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోటీ లో ఇప్పుడు లేకపోయుంటే , కచ్చితంగా శనివారం రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను, అదే విధంగా ఆదివారం రోజున మూడు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి కచ్చితంగా రాబట్టి ఉండేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

అయోధ్యలో విరాళాలు మాయం.. ఇదీ అసలు నిజం

Ayodhya donations missing case
Ayodhya donations missing case

Ayodhya donations missing case: కొద్దిరోజులుగా జాతీయ మీడియాలో.. ప్రాంతీయ మీడియాలో అయోధ్య రామాలయం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా అక్కడి ఆలయంలో భక్తులు ఇస్తున్న విరాళాలు దారి మళ్ళాయి అంటూ కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సెక్షన్లు అయోధ్య రామాలయం గురించి అడ్డగోలుగా మాట్లాడడం మొదలుపెడుతున్నాయి. వాస్తవానికి విరాళాలు మాయమైపోయాయా.. కొందరు వాటిని కావాలని దారి మళ్ళించారా.. ఆ డబ్బులను ఏం చేశారు.. వీటిపై యూపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఈ వ్యవహారం మీద తొలిసారిగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు..”రామాలయం నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 500 సంవత్సరాలు ఎదురు చూసాం. ఇప్పుడు ఒక ఆరోపణ వచ్చింది. ఈ విరాళాలు మాయమయ్యాయని విమర్శలు వినిపిస్తున్నాయి.. దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. నిరాధార ఆరోపణలు అసలు చేయకూడదు. ప్రత్యేక దర్యాప్తు బృందం మీద నాకు నమ్మకం ఉంది.. విరాళాలకు సంబంధించి అవకతవకలు గనక జరిగి ఉంటే కచ్చితంగా ఆ ఆధారాలను ప్రత్యేక దర్యాప్తు బృందానికి సమర్పించాలని” యోగి పేర్కొన్నారు. “అనవసరమైన అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యవహరించకూడదని.. రామాలయ ప్రతిష్టను దెబ్బతీసి.. ట్రస్ట్ కార్యకలాపాలను ఇబ్బంది పెట్టకూడదని” యోగి పేర్కొన్నారు.

మరవైపు ఈ ఆలయ నిర్వహణ పట్ల రామజన్మభూమి నిర్మాణ కమిటీ చైర్మన్.. మాజీ ఐఏఎస్ అధికారి మిశ్రా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు పక్క దారి పట్టడం ఏంటని మండిపడ్డారు. ఆలయ పరిపాలన విధానం సరిగా లేదని.. ఇది విధానాల బలహీనతను సూచిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల రకరకాల విమర్శలు వితమవుతున్నాయని.. ఇలాంటప్పుడు ఆలయ పరిపాలన మొత్తం ప్రక్షాళన కావాలని ఆయన సూచించారు. వాలంటీర్ల ద్వారా ఎక్కువ సేవల జరగడం వల్ల జవాబుదారితనం లోపిస్తోందని.. దానివల్ల ఆలయ ప్రతిష్ట మొత్తం మంటగలిసిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ నిర్మాణంలో ఎంతో వేగంగా పనిచేసిన ట్రస్ట్ బోర్డు.. ఆలయ నిర్వహణ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా కీలకమైన విభాగాలలో పనిచేయడానికి వాలంటీర్లను పెట్టుకుంది. వారికి వేతనం ఇవ్వకుండా.. కేవలం భోజనం మాత్రమే పెట్టవచ్చని నిర్వహణ బోర్డు కక్కుర్తి పడింది. దానివల్ల వాలంటీర్లు ఇలా చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా రామాలయం ప్రతిష్ట మొత్తం మంట కలిసి పోతుంది. కీలకమైన విభాగాలలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను నియమించి.. వారికి జీతభత్యాలను అందిస్తే ఇటువంటి పరిస్థితి రాదని రామ భక్తులు అంటున్నారు. మరి దీనిపై ట్రస్ట్ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

భారత్ అంటే చాలు చైనా పోసుకుంటున్నది.. ఎందుకిలా.. ఏమైంది..

China reaction to India growth
China reaction to India growth

China reaction to India growth: సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులకు పాల్పడుతుంది. ఈశాన్య రాష్ట్రాలను తన దేశంలో ఉన్న భూభాగంగా పేర్కొంటూ ఉంటుంది. అంతేకాదు అప్పుడప్పుడు సైనికులతో కొట్లాటకు కూడా దిగుతూ ఉంటుంది. గాల్వాన్ లోయ ఘటన ఇందుకు బలమైన నిదర్శనం. గాల్వాన్ లోయ ఘటన జరిగిన తర్వాత చైనా భారత్ జోలికి రావడం లేదు. అలాగని సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడకుండా ఉండడం లేదు. ఇటీవల కాలంలో భారత్ వ్యూహాత్మక వాణిజ్య విషయంలో ప్రపంచ దేశాలతో వేగంగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకమైన మైత్రిని పెంపొందించుకుంటున్నది. ఈ నేపథ్యంలో చిప్ ల తయారీ.. ముడి సరుకుల రవాణా వంటి వాటిల్లో భారత ప్రభుత్వం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నది. ఒక రకంగా చైనాకు ఇది పెద్ద దెబ్బ.

ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. ఆదిలోనే దెబ్బకొట్టేందుకు భారత్ రష్యాతో జట్టు కట్టింది. రష్యా ఒకప్పుడు ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించింది. అమెరికా ఆధిపత్యాన్ని సాగకుండా అడ్డుపడింది. రష్యా విచ్చిన్నం తర్వాత అమెరికా దూకుడుకు అడ్డు లేకుండా పోయింది. ఇప్పుడు చైనా అమెరికా స్థానాన్ని భర్తీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో రకరకాల ఆయుధాలు.. తయారీ సంస్థల బలోపేతం.. వంటి వాటిల్లో చైనా దూకుడుగా ఉంది. చైనా దూకుడు కళ్లెం వేయడానికి భారత్ రష్యా తో చేతులు కలిపింది.

భారత్ ఇటీవల బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేసింది. వాటిని ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మీద ప్రయోగించింది. దీంతో యావత్ ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసింది. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే నేలమట్టం చేయడానికి భారత్ వీటిని ఉపయోగించింది. అంతటి ఇజ్రాయిల్.. అమెరికా వద్ద ఉన్న మిస్సైల్స్ కూడా ఇలాంటి పనిచేయలేదు. అయితే ఇప్పుడు భారత్ బ్రహ్మోస్ విషయంలో సరికొత్తగా అడుగులు వేస్తోంది. ఈ మెసేజ్ విభాగంలో చిన్న.. హైపర్ సోనిక్ వెర్షన్లను భారత్ తయారు చేయబోతోంది. అత్యంత వేగంగా పనిచేసే మిస్సైల్స్ ను భారత్ రష్యా సహకారంతో తయారుచేయబోతోంది. ఈ ఆయుధాలను తయారు చేసిన తర్వాత వియత్నాం.. ఫిలిప్పీన్స్ కు సమకూర్చబోతోంది.

ప్రపంచంలో ఇప్పటికే బ్రహ్మోస్ అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ గా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో చైనా మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అక్కడి పాలకులు కూడా భారత్ చేస్తున్న ప్రయోగాల పట్ల భయపడుతున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది భారత్.. చైనా దేశానికి పక్కలో బల్లెం లాగా మారిన ఫిలిప్పీన్స్.. వియత్నాం దేశాలకు భారత్ ఆయుధాలు సరఫరా చేస్తుంది. ఇప్పటికే టిబెట్ విషయంలో చైనా ఎంతటి దుర్మార్గాలకు పాల్పడిందో ప్రపంచం మొత్తం చూసింది.. తైవాన్ తో ఎలాంటి తగువులు పెట్టుకుంటుందో అందరూ చూస్తున్నారు. అంతటి అమెరికా కూడా ఏం చేయలేకపోతోంది. అమెరికా చేయని పని ఇండియా చేసి చూపిస్తోంది. ఇండియా బ్రహ్మోస్ మిస్సైల్స్ కనుక చైనా పక్క దేశాలకు విక్రయించడం మొదలుపెడితే.. డ్రాగన్ కు కంటిమీద కునుకుండదు.

అనకొండ డైనాస్ట్ రాహుల్ గాంధీని జాకీలతో పైకి లేపాలని భగీరథ ప్రయత్నం

Rahul Gandhi leadership

Rahul Gandhi leadership : రాహుల్ గాంధీ ఇటీవల రామచంద్ర గుహ ఎలా విఫలమయ్యాడో ఖరాఖండిగా చెప్పాడు. పచ్చి బీజేపీ వ్యతిరేకి అయిన రామచంద్ర గుహనే ఇలా రాయడంతో హాట్ టాపిక్ గా మారింది. తనకే రాహుల్ పైన అసంతృప్తి వచ్చేసింది. రామచంద్ర గుహ లాంటి వారు కూడా రాహుల్ నాయకత్వ లోపాలను ఎత్తి చూపారు.

రాజ్ దీప్ సర్దేశాయ్ తాజాగా రాహుల్ విఫలనాయకుడు చెప్తూనే.. రాహుల్ అవసరం ఉందంటూ జాకీలు ఎత్తి లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రిక్వెస్ట్ చేస్తే చేశాడని అర్థమవుతోంది. ఇంకా చాలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

56 ఏళ్లు రాహుల్ .. తనను తాను జెన్ జీ నాయకుడిగా ఈ వయసులో ప్రొజెక్ట్ చేయాలని కోటాకు వెళ్లి అక్కడ విద్యార్థులతో సమావేశమై రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ విద్యార్థులను మోటివేట్ చేయకుండా డీమోటివ్ చేస్తున్నాడు.

అనకొండ డైనాస్ట్ రాహుల్ గాంధీని జాకీలతో పైకి లేపాలని భగీరథ ప్రయత్నం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

కార్యాలయాల్లో ఎక్కువగా కాఫీ తాగుతున్నారా.. ‘కెఫిన్ విత్‌డ్రాయల్’ సమస్యలో ఇరుక్కున్నట్లే.. అసలేంటిది..

Caffeine withdrawal symptoms
Caffeine withdrawal symptoms

Caffeine withdrawal symptoms: ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ ముందు పనిచేసేవారి సంఖ్య ఎక్కువే. ఇలా ఆఫీసుల్లో పనిచేసేవారికి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. డెడ్‌లైన్లు, టార్గెట్లు ఏర్పాటు చేయడం వల్ల వాటిని రీచ్ చేసేందుకు చాలా మంది రోజుకు పలుమార్లు కాఫీ తాగడం అలవాటు చేసుకుంటున్నారు. కాఫీ తాగితే అలసట తగ్గి, చురుకుదనం పెరుగుతుందని భావిస్తారు. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వాటిలో ‘కెఫిన్ విత్‌డ్రాయల్’ఒకటి. అసలేంటిది?

హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వారంలో ప్రతిరోజూ 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగేవాడు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కాఫీ అతని రోజువారీ జీవితంలో భాగమైపోయింది. అయితే వీకెండ్ రోజుల్లో ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో కాఫీ తాగకుండా ఉండేవాడు. ఇదే సమయంలో అతడికి తీవ్రమైన తలనొప్పి రావడం ప్రారంభమైంది. దీంతో అతడు వైద్యులను సంప్రదించగా, అతడికి వచ్చిన తలనొప్పి సాధారణ మైగ్రేన్ లేదా ఇతర అనారోగ్య సమస్య కాదని తేలింది. రోజూ అధికంగా కెఫిన్ తీసుకుంటూ అకస్మాత్తుగా ఆపేయడం వల్ల వచ్చే ‘కెఫిన్ విత్‌డ్రాయల్’ లక్షణమని వైద్యులు గుర్తించారు. శరీరం కెఫిన్‌కు అలవాటు పడిన తర్వాత ఒక్కసారిగా దాన్ని నిలిపివేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

కెఫిన్ విత్‌డ్రాయల్ అంటే ఏమిటి?
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాల్లో ఉండే కెఫిన్ మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది అప్రమత్తతను పెంచి అలసటను తగ్గిస్తుంది. కానీ శరీరం కెఫిన్‌కు అలవాటు పడిన తర్వాత ఒక్కసారిగా దాని సరఫరా ఆగిపోతే మెదడులో రక్తనాళాల పనితీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. దీనివల్ల తలనొప్పి, అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కెఫిన్ విత్‌డ్రాయల్ ఉన్నవారిలో తీవ్రమైన తలనొప్పితో పాటు నిద్రమత్తు, బలహీనత, మూడ్ స్వింగ్స్, చిరాకు, పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత కోల్పోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో వికారం, కండరాల నొప్పులు కూడా కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

రోజూ ఎక్కువ కాఫీ తాగే వారు దాన్ని ఒక్కసారిగా పూర్తిగా ఆపేయకుండా క్రమంగా తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు రోజుకు నాలుగు కప్పులు తాగే వారు ముందుగా మూడు, తర్వాత రెండు కప్పులకు తగ్గిస్తూ వెళ్లాలి. ఇలా చేయడం వల్ల శరీరం నెమ్మదిగా మార్పుకు అలవాటు పడుతుంది.

కాఫీపై ఆధారపడకుండా ఉండేందుకు తగినంత నీరు తాగడం, సరిపడా నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం, పండ్ల రసాలు లేదా హెర్బల్ టీలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి సహజ శక్తిని అందించడంలో సహాయపడతాయి.

 

'పెద్ది' తర్వాత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్.. ఇలా అయితే కష్టమే..

Ram Charan long break after Peddi
Ram Charan long break after Peddi

Ram Charan long break after Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గానే ‘పెద్ది’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని , ఓపెనింగ్స్ దగ్గర నుండి లాంగ్ రన్ వరకు , అభిమానులను, అండీస్ ని, ట్రేడ్ ని సర్ప్రైజ్ కి గురి చేసే నంబర్స్ ని రాబడుతూ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. ఓవర్సీస్ మరియు నార్త్ ఇండియా లో అనుకున్నంత ఫలితం రాలేదు. రెండు ప్రాంతాల్లోనూ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం. అయితే ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.

కానీ ఇప్పట్లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. సుకుమార్ ఇంకా స్టోరీ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నాడు. మరోపక్క రామ్ చరణ్ కూడా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే ‘పెద్ది’ చిత్రం కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు , కాళ్ళు విరిగాయి , చేతులు విరిగాయి, చివరికి కంటికి కూడా దెబ్బ తగిలింది. శరీరం మొత్తం దెబ్బలతో నిండిపోయి ఉండడం తో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈ ఏడాది లో రామ్ చరణ్ కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లడం దాదాపుగా అసాధ్యమే. వచ్చే ఏడాది సమ్మర్ లో కానీ , సెకండ్ హాఫ్ లో కానీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటి లాగానే , ఈసారి కూడా రామ్ చరణ్ కొత్త సినిమా కోసం అభిమానులు కనీసం రెండు నుండి మూడేళ్లు నిరీక్షించక తప్పదు. ఇదొక్కటే రామ్ చరణ్ విషయం లో అభిమానులకు నచ్చదు.

సినిమాలు బాగా ఆలస్యం గా చేస్తాడు , ఆయన ఇచ్చే గ్యాప్ కారణంగా, కావాల్సినంత ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అవ్వడం లేదు అనేది మెగా అభిమానుల వాదన. ‘పెద్ది’ తర్వాత ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా అందిస్తాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు రామ్ చరణ్ భవిష్యత్తులో రాజమౌళి తో మరో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. రాజమౌళి సినిమా అంటే ఇన్నేళ్ల సమయం పడుతుందో అందరికీ తెలిసిందే. ఇదంతా చూస్తుంటే , రామ్ చరణ్ తన కెరీర్ ముగించేసరికి కనీసం 30 సినిమాలు అయినా చేస్తాడా లేదా అని ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఆ అమ్మాయి చనిపోయింది.. ఊరంతా పచ్చగా మారింది..

Shyam Sunder Paliwal tree planting
Shyam Sunder Paliwal tree planting

Shyam Sunder Paliwal tree planting: సాధారణంగా ఎవరైనా చనిపోతే.. ఆ కుటుంబం శోకంలో మునిగిపోతుంది. బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతుంటారు. చుట్టుపక్కల వారు కూడా బాధపడుతుంటారు. కానీ ఈ కథనంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆడపిల్ల చనిపోతే.. ఊరు ఊరు మొత్తం పచ్చగా మారిపోయింది. ఇదేంటి ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే చదివేయండి ఈ కథనం..

రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ సమంద్ అనే జిల్లా ఉంది. ఇక్కడ పిప్లాంత్రి అనే గ్రామంలో శ్యాంసుందర్ అనే సర్పంచ్ ఉండేవాడు. ఈయన చిన్న కూతురు కిరణ్, అకాల మరణం చెందింది. కూతురు మరణించడంతో అతడు తీవ్రమైన దుఃఖానికి గురయ్యాడు. తన కూతురి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటాలని నిర్ణయించుకున్నాడు. అది కాస్త ఒక ఆచారం లాగా మారిపోయింది. ఆడపిల్ల పుడితే చాలు 111 మొక్కలు నాటే కార్యక్రమానికి అక్కడి తల్లిదండ్రులు శ్రీకారం చుట్టారు.

ఏ ఇంట్లో నైనా ఆడపిల్ల పుడితే ఆమె భవిష్యత్తు కోసం గ్రామస్తులు, తల్లిదండ్రులు 31,000 వరకు విరాళాలు సేకరిస్తారు. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. 18 సంవత్సరాల నిండిన తర్వాత ఆ డబ్బు ఆ అమ్మాయి చదువు లేదా పెళ్లికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆడపిల్ల పుట్టినప్పుడు నాటిన మొక్కలు పర్యావరణానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఆ గ్రామంలో దాదాపు 350 కి పైగా మొక్కలను నాటారు. దీనివల్ల ఎడారిగా ఉన్న ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా పచ్చగా మారిపోయింది.

లింగసమానత్వం మనదేశంలో అంతగా లేదు. కానీ ఇక్కడ మాత్రం దేశానికి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆడపిల్ల పుడితే ఒక గొప్ప పండుగలాగా జరుపుకుంటారు. ఆడపిల్లల సంరక్షణ.. పర్యావరణ పరిరక్షణ అనే రెండు గొప్ప అంశాలను కొనసాగిస్తున్న ఈ గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఈ గ్రామం గురించి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ప్రత్యేకమైన కథనాలను రూపొందించాయి. ఒక మామూలు గ్రామం ఒక ఆడపిల్ల చనిపోతే ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అది కాస్త ఎడారిని అడవిగా మార్చింది. అంతేకాదు అక్కడి ఆడపిల్లలకు సరికొత్త భవిష్యత్తుని ఇచ్చింది. నేటి కాలంలో విద్యావంతులు ఉన్న నగరాలు.. పట్టణాలు ఆడపిల్లలను నలుసులు గా చూస్తున్నాయి. కానీ ఈ గ్రామంలో ప్రజలు మాత్రం ఆడపిల్లను దేవతలాగా.. ఆమె పుడితే ఒక పండగలాగా జరుపుతున్నారు. ఈ గ్రామం నుంచి దేశమే పాఠం నేర్చుకోవాలి.

వారణాసి మూవీ షూటింగ్ లో రాజమౌళి ఆ నటుడి మీద సీరియస్ అయ్యాడా..?

Rajamouli Varanasi movie shooting
Rajamouli Varanasi movie shooting

Rajamouli Varanasi movie shooting: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించాడు. ఇప్పటివరకు 12 సినిమాలతో వరుసగా నాలుగు హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు వారణాసి సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రాజమౌళి సినిమా అంటే చాలు అది చాలా గ్రాండియర్ గా తెరకెక్కుతుంది. దానికోసం ఆయన తీవ్రమైన కసరత్తులు చేసి మరి సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక వారణాసి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

రీసెంట్ గా జరుగుతున్న ఈ షెడ్యూల్లో రాజమౌళి ఒక మలయాళం నటుడి మీద కొంతవరకు సీరియస్ అయ్యాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఆ నటుడు ఎవరు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఏనా? లేదంటే ఇంకా వేరే ఎవరైనా నటుడు ఉన్నాడా? లేదా అనే విషయాన్ని బయటకు చెప్పడం లేదు. కానీ సెట్లో ఆయన కొంతవరకు అతని మీద అరిచారట…

మొత్తానికైతే జక్కన్న మూవీకి ఎలాంటి సీన్స్ అవసరం ఉన్నాయో వాటిని ముందుగానే రాసుకొని ఆర్టిస్టులు చేత పర్ఫెక్ట్ గా దానిని స్క్రీన్ మీద ఎలివేట్ అయ్యే విధంగా నటింప చేసుకుంటూ ఉంటాడు. అందుకే అతను సినిమాలు తీయడంలో చాలా వరకు లేట్ అవుతూ ఉంటాయి. ప్రతి సినిమా విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకుంటూనే ముందుకు సాగుతున్నాడు. అందువల్లే అతనికి భారీ విజయాలైతే వస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి సినిమాలంటే ప్రతి ఒక్కరికి విపరీతమైన ఇంట్రెస్ట్ ఉంటుంది.

కాబట్టి ఆ సినిమాలను చూడడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తుండటం విశేషం… ఇక గతంలో ఎప్పుడు ఆయన ఆర్టిస్టుల మీద కోపానికి వచ్చిన సందర్భాలు లేవు. మరి పర్సనల్ విషయాలు వల్ల అతనికి ఏమైనా కోపం వచ్చిందా? లేదంటే సినిమాలోని కంటెంట్ తను చెడగొట్టే విధంగా ఏదైనా ప్రయత్నం చేశాడా అనేది తెలియాల్సి ఉంది..ఇంతకీ మలయాళం నటుడు ఎవరు అనేది బయటికి చెప్పడం లేదు…

రామ్ చరణ్ - మహేష్ బాబు పార్టీ చేసుకున్నారా..? కారణమేంటంటే..?

Ram Charan Mahesh Babu party
Ram Charan Mahesh Babu party

Ram Charan Mahesh Babu party: మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. అయితే ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఆయన తర్వాత చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ లను సాధించలేదు. మొత్తానికైతే ఆయన మార్క్ నటనను చూపించిన కూడా సినిమాలు మాత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించడం లేదు. గత సంవత్సరం పెద్ది సినిమాతో మరోసారి భారీ రికార్డును కొల్లగొడతారు అనుకున్నప్పటికి ఇదొక మోస్తరు సక్సెస్ గానే మారింది. మహేష్ బాబు తో రామ్ చరణ్ కి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధమైతే ఉంది. వీళ్లిద్దరు ఒకరి సినిమాల గురించి ఒకరు చాలాసేపు చర్చించుకుంటారు అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు చెప్పడం విశేషం…

ఇక రీసెంట్ గా మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒక పార్టీ అయితే చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇంట్లోనే మహేష్ బాబును పిలిపించి మరీ తనకి ఒక పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రామ్ చరణ్ – మహేష్ బాబు ఇద్దరు కలిసే ఈ పార్టీ చేసుకున్నారా? లేదంటే ఇంకెవరైనా హీరోలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అనే విషయాలు తెలియదు.

కానీ మొత్తానికైతే వీరిద్దరు చర్చించుకొని నెక్స్ట్ రాబోయే సినిమాల విషయంలో ఎవరెవరు ఎలాంటి ప్లానింగ్స్ తో వెళ్లబోతున్నారు అనేది కూడా చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ స్టార్ హీరోలిద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. వాళ్ళందరిని సర్టిస్ఫై చేయడానికి వీళ్ళు అహర్నిశలు కసరత్తులైతే చేస్తున్నారు.

ఎవరైతే భారీ సక్సెస్ లను సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం వీరిద్దరు కూడా నెంబర్ వన్ రేసులో ముందు వరుసలో దూసుకెళ్తుండటం విశేషం…ఇక మహేష్ బాబు వారణాసి సినిమాతో తన రేంజ్ మొత్తాన్ని మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో రాజమౌళి అయితే ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది…

జూన్‌ 21.. ఈ రోజే అత్యంత ఎక్కువ పగలు!

Longest Daylight Day
Longest Daylight Day

Longest Daylight Day: ఈ ఏడాది జూన్‌ 21 (ఆదివారం) సూర్యుడి కాంతి ఎక్కువ సేపు ఉండే రోజు. దీనిని సమ్మర్‌ సొల్‌స్టిస్‌ అని పిలుస్తారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ఈ రోజును ‘విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియా’గా ప్రకటించి, విటమిన్‌–డి ప్రాముఖ్యత, సూర్యకాంతి ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సమ్మర్‌ సొల్‌స్టిస్‌ అంటే ఏమిటి?
భూమి తన కక్ష్యలో తిరుగుతున్నప్పుడు, ఉత్తర గోళం సూర్యుడి వైపు వంగి ఉండటం వల్ల జూన్‌ 21న పగలు అత్యంత ఎక్కువ సమయం ఉంటుంది. ఈ రోజు సుమారు 13 గంటల 10 నిమిషాలు పగలు ఉంటుంది. ఇది సహజమైన ఖగోళ సంఘటన. దక్షిణ గోళంలో మాత్రం ఇదే సమయంలో రాత్రి ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియా
ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఈ రోజును ప్రత్యేకంగా ‘విటమిన్‌–డి డే ఆఫ్‌ ఇండియాగా ప్రకటించింది. విటమిన్‌–డి పాధాన్యతను, సూర్యకాంతి నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎండ తక్కువగా తీసుకుంటున్నారు. ఈ ప్రకటన ద్వారా ఆ అలవాటును మార్చే ప్రయత్నం జరుగుతోంది.

విటమిన్‌–డి ఎందుకు ముఖ్యం?
విటమిన్‌–డి శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది ఎముకల బలం, రోగనిరోధక శక్తి, Ðమొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరం సూర్యకాంతి నుంచి సహజంగా ఈ విటమిన్‌ను ఉత్పత్తి చేసుకోగలదు. కాబట్టి సూర్యుడిని సరైన విధంగా ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి మంచిది.

సూర్యకాంతిలో పుష్కలంగా విటమిన్‌ – డి..
సూర్యకాంతి విటమిన్‌–డి ఉత్పత్తికి సహజమైన, ఉత్తమమైన మార్గం. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అధిక సమయం ఎండలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. సురక్షితమైన సమయంలో(ఉదయం లేదా సాయంత్రం) కొంత సేపు ఎండ తీసుకోవడం మంచిది.

అవగాహన అవసరం..
ఐఎంఏ ప్రకటన చేయడం వెనుక ఒక ముఖ్యమైన సందేశం ఉంది. నేటి జీవనశైలిలో చాలా మంది ఇంట్లో లేదా కార్యాలయాల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. దీంతో సూర్యకాంతి తక్కువగా అందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్‌–డి లోపం సాధారణం అవుతోంది. జూన్‌ 21ని విటమిన్‌–డి డే గా ప్రకటించడం ద్వారా ప్రజలు ఒక్కసారి ఆలోచించి, సూర్యకాంతిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించే ఒక మంచి చర్య. రైతులు, పిల్లలు, వృద్ధులు అందరూ ఈ సందేశాన్ని అర్థం చేసుకొని ప్రయోజనం పొందాలి.

జూన్‌ 21 అనేది కేవలం అత్యంత పొడవైన రోజు మాత్రమే కాదు.. ఇది మన ఆరోగ్యం గురించి ఆలోచించే రోజు కూడా. సూర్యుడి నుంచి వచ్చే సహజమైన బహుమతిని సరైన విధంగా స్వీకరించి, విటమిన్‌–డి స్థాయిలను మెరుగుపరచుకోవాలి. ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలి.