Deewana vs Arjun Reddy: హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘దివానా’ సినిమా ట్రైలర్ తోనే జూనియర్ అర్జున్ రెడ్డి అనే పేరును సంపాదించుకుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి అర్జున్ రెడ్డి సినిమాకి దీనికి మధ్య మిస్సైన పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… అర్జున్ రెడ్డి సినిమాలో ఒక రా ఎమోషన్ అయితే ఉంటుంది. లవ్ స్టోరీ లో ఇంటెన్సిటి ఉంటుంది. అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ బాధపడితే మనకు కూడా బాధనిపిస్తుంది. అంతటి పెన్ ఫుల్ సిచువేషన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత సందీప్ రెడ్డివంగా కే దక్కుతుంది. దానివల్లే సినిమా నెక్స్ట్ లెవల్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చుకున్నప్పటికి ‘దివానా’ మూవీకి అంత పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయలేదు.
దానివల్లే సినిమా ఓకే అనిపించింది తప్ప అర్జున్ రెడ్డి రేంజ్ లో భారీ సక్సెస్ మూట గట్టుకోలేకపోయింది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా కథ బాగున్నప్పటికి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా ఎఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే మాత్రం సినిమా చాలావరకు డీలాపడిపోయే ప్రమాదం ఉంది…
ఇప్పుడు వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది దర్శకులు మొదటి సినిమాతోనే పెను సంచనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.
వాళ్ళు అనుకున్నట్టుగానే కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… దివానా సినిమా ఒక గుడ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు… అలా కాకుండా యూత్ ఈ మూవీకి కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్స్ బాగానే వస్తాయి… రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఈ మూవీ టాక్ ఏంటనేది అంతా పెర్ఫెక్ట్ గా తెలియదు…
