Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Nagarjuna remuneration: 'బిగ్ బాస్ 10' కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్...

Bigg Boss 10 Nagarjuna remuneration: ‘బిగ్ బాస్ 10’ కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Bigg Boss 10 Nagarjuna remuneration: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు మేకర్స్. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా ఈ నెల 12 నుండి స్వీకరిస్తున్నారు మేకర్స్. మరో […]

Bigg Boss 10 Nagarjuna remuneration: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు మేకర్స్. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా ఈ నెల 12 నుండి స్వీకరిస్తున్నారు మేకర్స్. మరో 10 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎవరైనా బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకుంటే , వెంటనే దరఖాస్తు చేసుకోండి , జియో హాట్ స్టార్ లో ఈ వెసులుబాటు ఉంటుంది. ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈసారి మేకర్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని మామూలు రేంజ్ ఉన్నవాళ్ళని తీసుకొని రావడం లేదు.

జనాల్లో మంచి పాపులారిటీ , ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కొద్దిరోజుల్లోనే స్పష్టమైన క్లారిటీ రానుంది. 10 మంది సెలబ్రిటీలు , 10 మంది కామనర్స్ తో ఈ సీజన్ ని మొదలు పెట్టబోతున్నారని టాక్. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయట. ఇకపోతే ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో , అక్కినేని నాగార్జున ఈ సీజన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నారు అట. నాగార్జున సినిమాలకు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నాలుగు సినిమాల రెమ్యూనరేషన్స్ కలిపినా ఇంత రెమ్యూనరేషన్ రాదట. అంతే కాదు , బిగ్ బాస్ అన్ని భాషలకు సంబంధించిన సీజన్స్ హోస్టులు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్స్ ని అందుకోవడం లేదట.

నాగార్జున కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం , ఆయన హోస్టింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చడం వల్లే. కంటెస్టెంట్స్ మీద నోరు పారేసుకోకుండా, ఒక పెద్ద మనిషి తరహా లో వాళ్ళు చేస్తున్న తప్పులని వేలెత్తి చూపిస్తూ , తన హోస్టింగ్ ని గత 7 సీజన్స్ ని కొనసాగిస్తూ వస్తున్నాడు నాగార్జున. ఆయనకు అత్యంత ఆదరణ లభిస్తుండడం వల్లే, ఇప్పటికీ హోస్ట్ గా కొనసాగుతున్నాడు , అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ సీజన్ కూడా హిట్ అయితే ఇక రాబోయే రోజుల్లో ఏ రేంజ్ డిమాండ్ చేస్తాడో చూడాలి. సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ మొదలు కానుంది. అదే విధంగా ‘అగ్నిపరీక్ష 2’ ప్రోగ్రాం జులై 25 నుండి మొదలు అవ్వబోతుందట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper