Home Blog Page 96

'బిగ్ బాస్ 10' కోసం నాగార్జున తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు..

Bigg Boss 10 Nagarjuna remuneration
Bigg Boss 10 Nagarjuna remuneration

Bigg Boss 10 Nagarjuna remuneration: కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ ప్రారంభానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు మేకర్స్. గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ షో ద్వారా సామాన్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన దరఖాస్తులు కూడా ఈ నెల 12 నుండి స్వీకరిస్తున్నారు మేకర్స్. మరో 10 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎవరైనా బిగ్ బాస్ లోకి వెళ్లాలని అనుకుంటే , వెంటనే దరఖాస్తు చేసుకోండి , జియో హాట్ స్టార్ లో ఈ వెసులుబాటు ఉంటుంది. ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. ఈసారి మేకర్స్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని మామూలు రేంజ్ ఉన్నవాళ్ళని తీసుకొని రావడం లేదు.

జనాల్లో మంచి పాపులారిటీ , ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు అనేది కొద్దిరోజుల్లోనే స్పష్టమైన క్లారిటీ రానుంది. 10 మంది సెలబ్రిటీలు , 10 మంది కామనర్స్ తో ఈ సీజన్ ని మొదలు పెట్టబోతున్నారని టాక్. వైల్డ్ కార్డు ఎంట్రీలు కూడా ఉంటాయట. ఇకపోతే ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున నే హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. గత సీజన్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం తో , అక్కినేని నాగార్జున ఈ సీజన్ కోసం దాదాపుగా 40 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకోబోతున్నారు అట. నాగార్జున సినిమాలకు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నాలుగు సినిమాల రెమ్యూనరేషన్స్ కలిపినా ఇంత రెమ్యూనరేషన్ రాదట. అంతే కాదు , బిగ్ బాస్ అన్ని భాషలకు సంబంధించిన సీజన్స్ హోస్టులు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్స్ ని అందుకోవడం లేదట.

నాగార్జున కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కారణం , ఆయన హోస్టింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చడం వల్లే. కంటెస్టెంట్స్ మీద నోరు పారేసుకోకుండా, ఒక పెద్ద మనిషి తరహా లో వాళ్ళు చేస్తున్న తప్పులని వేలెత్తి చూపిస్తూ , తన హోస్టింగ్ ని గత 7 సీజన్స్ ని కొనసాగిస్తూ వస్తున్నాడు నాగార్జున. ఆయనకు అత్యంత ఆదరణ లభిస్తుండడం వల్లే, ఇప్పటికీ హోస్ట్ గా కొనసాగుతున్నాడు , అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ సీజన్ కూడా హిట్ అయితే ఇక రాబోయే రోజుల్లో ఏ రేంజ్ డిమాండ్ చేస్తాడో చూడాలి. సెప్టెంబర్ 6 నుండి ఈ సీజన్ మొదలు కానుంది. అదే విధంగా ‘అగ్నిపరీక్ష 2’ ప్రోగ్రాం జులై 25 నుండి మొదలు అవ్వబోతుందట.

పీఎం కిసాన్‌ సాయం.. ఇది చేయకుండా నిధులు జమ కావు!

PM Kisan eKYC mandatory
PM Kisan eKYC mandatory

PM Kisan eKYC mandatory: పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు నేరుగా ఆర్థిక సహాయం రూ.2 వేలు శనివారం(జూన్‌ 20న) ఖాతాల్లో జమ కాబోతోంది. ఇది వ్యవసాయ కుటుంబాలకు కాలానుగుణంగా అందించే మద్దతు. అయితే ఈ నిధులు అందరికీ రావు. కొన్ని అవసరమైన ధృవీకరణలు పూర్తి చేసిన వారికి మాత్రమే జమ అవుతాయి. ఈ ప్రక్రియ రైతులకు సమయానికి సాయం అందించడానికి రూపొందించబడింది.

ఈకేవైసీ తప్పనిసరి..
నిధులు సరైన వ్యక్తుల చేతుల్లో పడేలా చూడటానికి ఈ ధృవీకరణ అవసరం. ఇది డబ్బులు తప్పు ఖాతాల్లోకి వెళ్లకుండా, ఒకే వ్యక్తి ఎక్కువసార్లు సాయం పొందకుండా నిరోధిస్తుంది. ఆధునిక సాంకేతికత ద్వారా రైతుల వివరాలను ధృవీకరించడం వల్ల పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు జరుగుతుంది. ఇది ప్రభుత్వ నిధులు వృథా కాకుండా, నిజమైన రైతులకు చేరేలా చేస్తుంది.

ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా?
ఇంటర్నెట్‌ ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగా ప్రక్రియను ముగించవచ్చు. ఆధార్‌ వివరాలు నమోదు చేసి, మొబైల్‌కు వచ్చే ఓటీపీ సమర్పించడం ద్వారా ధృవీకరణ పూర్తవుతుంది. ఆన్‌లైన్‌ సౌకర్యం లేని వారు సమీపంలోని మీసేవా కేంద్రాలు లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో బయోమెట్రిక్‌ పద్ధతిలో కూడా చేయించుకోవచ్చు. ఈ రెండు మార్గాలు రైతులకు సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయి.

డిజిటల్‌ ధృవీకరణ ప్రాముఖ్యత..
ఈ విధానం వ్యవసాయ రంగంలో డిజిటల్‌ పరివర్తనను ప్రోత్సహిస్తుంది. నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వడం వల్ల మధ్యవర్తులు తగ్గుతారు, రైతులకు సమయానికి సాయం చేరుతుంది. ఈకేవైసీ పూర్తి చేయని వారు ఈ సాయం నుంచి పొందేందుకు వెంటనే ధృవీకరణ ప్రక్రియను ముగించాలి.

ఇది ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న ఆధునిక చర్యల్లో ఒకటి. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవడం ద్వారా తమకు అందవలసిన సాయాన్ని సకాలంలో పొందవచ్చు.

'వారణాసి' గ్లింప్స్ లో ఉన్నది మహేష్ బాబు కాదా..? ఆడియన్స్ ని భలే మోసం చేశారుగా..

Varanasi glimpse
Varanasi glimpse

Varanasi glimpse: సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం పై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమాలోని కొన్ని కీలకమైన షాట్స్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబు కూడా పాల్గొన్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ ని ఒక గ్లింప్స్ వీడియో ద్వారా రామోజీ ఫిలిం సిటీ లో ‘#Globetrotter’ అనే ఈవెంట్ ని నిర్వహించి , గ్రాండ్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో మహేష్ బాబు లుక్స్ ని , ఆయన ఎక్స్ ప్రెషన్స్ ని చూసి అభిమానులకు అప్పుడే అనుమానం వచ్చింది.

ఇవి నేచురల్ మహేష్ బాబు లుక్స్ , ఎక్స్ ప్రెషన్స్ లాగా లేవే, AI ద్వారా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేశారు నెటిజెన్స్. వాళ్ళ అనుమానాలు నిజం అయ్యాయి, గ్లింప్స్ వీడియో లో మనం చూసిన మహేష్ బాబు నిజమైన మహేష్ బాబు కాదు , AI ద్వారా క్రియేట్ చేశారు. గ్లింప్స్ చివర్లో ఆయన ఎద్దు మీద స్వారీ చేస్తూ , చేతిలో సూలం పట్టుకున్న షాట్ ఉంది కదా, ఆ షాట్ కి సంబంధించిన షూటింగ్ ని నిన్ననే మొదలు పెట్టారు. సన్నివేశం నెంబర్ 76 , టేక్ 1 , బుల్ షాట్ – 410 A అని ఉన్నటువంటి క్లాప్ బోర్డు నిన్నటి నుండి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంది. ఇది చూసిన మహేష్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మనం గ్లింప్స్ లో చూసిన షాట్ ఇప్పటి వరకు షూట్ చెయ్యలేదా ?, అసలు ఈ సినిమా షూటింగ్ ప్రోగ్రెస్ ఎంత వరకు వచ్చింది అంటూ రాజమౌళి ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదల చేయబోతున్నాము అంటూ రాజమౌళి ఇప్పటికే అధికారిక ప్రకటన చేసాడు. మరి ఆ సమయానికి సినిమా రెడీ గా ఉంటుందా? , ఇప్పటి వరకు రాజమౌళి చరిత్ర లో , చెప్పిన తేదికి సినిమాని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఈ సినిమాకు కూడా అదే జరుగుతుందనే భయం అభిమానుల్లో ఉంది. కానీ రాజమౌళి మాత్రం సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నాడు. మరి ఆ టార్గెట్ ఎంత వరకు రీచ్ అవుతాడో చూడాలి.

ప్రభాస్ ఒకే కథ తో రెండు సినిమాలు చేశాడా..?వాటి రిజల్ట్ ఏంటంటే..?

Prabhas same story two movies
Prabhas same story two movies

Prabhas same story two movies: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించిన రాని గుర్తింపు కొంత మంది స్టార్ హీరోలకు మాత్రం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించగలిగే కెపాసిటి ఉన్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం ఆయన డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా భారీ ఎత్తున సినిమాలనైతే చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాతో తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాలు అతనికి ప్రత్యేకమైన గుర్తింపునైతే తీసుకొచ్చాయి.

కానీ ఒక రెండు సినిమాలు మాత్రం అతనికి ఏ మాత్రం ఇమేజ్ ను తీసుకురాక పోగా ఆ రెండు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఇక రెండు సినిమాల కథలు కూడా దాదాపు ఒకే లాగా ఉండడం ప్రేక్షకుడిని అలాగే ప్రభాస్ అభిమానులను సైతం జీర్ణించుకోలేకుండా చేసింది. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటి అంటే ఒకటి యోగి మూవీ కాగా, మరొకటి ఏక్ నిరంజన్ కావడం విశేషం…

ఈ రెండు సినిమాల్లో కూడా హీరో తన ఫ్యామిలీ కోసం తన పేరెంట్స్ కోసం విపరీతంగా సఫర్ అవుతుంటాడు. ఈ సినిమా చివర్లో తన అమ్మని కూడా చూసుకునే అవకాశం లేకుండా పోతుంది. ఈ మూవీలో సైతం తన ఫ్యామిలీ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీతో కలుస్తారని అందరు అనుకున్నప్పటికి ఫ్యామిలీతో కలువకుండా తను కూడా సింగిల్ గానే ఉండిపోతాడు. ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లు ప్రేక్షకుడిని పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయాయి.

ఓవరాల్ గా సినిమాలు బాగున్నప్పటికి క్లైమాక్స్ విషయంలో తేడా కొట్టడం అలాగే రెండు సినిమాల కథలు కూడా పేరెంట్స్ మీదనే ఉండడం వల్ల ఈ సినిమాలను చూసిన ప్రేక్షకులకు కొంతవరకు నిరాశ ఎదురైంది. ఇక ప్రభాస్ ఈ సినిమాలో చాలా ఎఫెక్టివ్ గా తన నటనని చూపించినప్పటికి అనుకున్న మేరకు సక్సెస్ లను సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలాపడ్డాడు…

'దివానా' మూవీకి 'అర్జున్ రెడ్డి' సినిమా మధ్య ఉన్న తేడా ఇదేనా..?

Deewana vs Arjun Reddy
Deewana vs Arjun Reddy

Deewana vs Arjun Reddy: హర్షిత్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన ‘దివానా’ సినిమా ట్రైలర్ తోనే జూనియర్ అర్జున్ రెడ్డి అనే పేరును సంపాదించుకుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నప్పటికి అర్జున్ రెడ్డి సినిమాకి దీనికి మధ్య మిస్సైన పాయింట్స్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… అర్జున్ రెడ్డి సినిమాలో ఒక రా ఎమోషన్ అయితే ఉంటుంది. లవ్ స్టోరీ లో ఇంటెన్సిటి ఉంటుంది. అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ బాధపడితే మనకు కూడా బాధనిపిస్తుంది. అంతటి పెన్ ఫుల్ సిచువేషన్ ను పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ఘనత సందీప్ రెడ్డివంగా కే దక్కుతుంది. దానివల్లే సినిమా నెక్స్ట్ లెవల్ సక్సెస్ గా నిలిచింది. ఇక ఇలాంటి క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో పోల్చుకున్నప్పటికి ‘దివానా’ మూవీకి అంత పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయలేదు.

దానివల్లే సినిమా ఓకే అనిపించింది తప్ప అర్జున్ రెడ్డి రేంజ్ లో భారీ సక్సెస్ మూట గట్టుకోలేకపోయింది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా కథ బాగున్నప్పటికి దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా ఎఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే మాత్రం సినిమా చాలావరకు డీలాపడిపోయే ప్రమాదం ఉంది…

ఇప్పుడు వస్తున్న యూత్ ఫుల్ లవ్ స్టోరీస్ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది దర్శకులు మొదటి సినిమాతోనే పెను సంచనాలను క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు.

వాళ్ళు అనుకున్నట్టుగానే కొంతమంది సక్సెస్ లను సాధిస్తే మరి కొంతమంది మాత్రం ప్లాప్ లను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… దివానా సినిమా ఒక గుడ్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఆ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు… అలా కాకుండా యూత్ ఈ మూవీకి కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్స్ బాగానే వస్తాయి… రెండు మూడు రోజులు గడిస్తే కానీ ఈ మూవీ టాక్ ఏంటనేది అంతా పెర్ఫెక్ట్ గా తెలియదు…

ముంబై మెట్రో సూపర్‌.. భారత్‌ రవాణా వ్యవస్థపై అమెరికా మహిళ ప్రశంస!

American woman praises Mumbai Metro
American woman praises Mumbai Metro

American woman praises Mumbai Metro: అమెరికా నుంచి వచ్చిన లిజ్‌ అనే మహిళ ముంబై మెట్రో ప్రయాణాన్ని అత్యంత సానుకూలంగా వర్ణించారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో ద్వారా ఈ అనుభవాన్ని పంచుకుంటూ, ఇక్కడి ప్రజా రవాణా వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్రశంసలు భారత పట్టణ మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నట్లు ప్రపంచం గుర్తిస్తున్నట్లు చెబుతున్నాయి.

తక్కువ ధరలు, మెరుగైన సౌకర్యం..
కేవలం రూ.20 వంటి చాలా తక్కువ ధరకు ఎయిర్‌ కండిషన్డ్, సురక్షితమైన ప్రయాణం లభించడం ఆమెను ఆకర్షించింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన నగరాల్లో ఇలాంటి సౌకర్యాలు ఖరీదైనవిగా ఉంటాయి. ముంబై మెట్రో ఈ విషయంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. ఇది ప్రజా రవాణా వ్యవస్థ యొక్క ప్రాథమిక లక్ష్యం. అందరికీ సులభంగా అందుబాటులో ఉండాలి అనే సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది.

శుభ్రత, భద్రత, మహిళల ప్రత్యేక ఏర్పాట్లు..
న్యూయార్క్‌ సబ్‌వే కంటే ముంబై మెట్రో చాలా శుభ్రంగా ఉందని లిజ్‌ పోల్చారు. అలాగే మహిళలకు ప్రత్యేక కోచ్‌లు ఉండటం ఆమెను ఆనందపరచింది. ఇది భద్రతా సమస్యలను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలను సూచిస్తుంది. రద్దీగా ఉండే నగరాల్లో మహిళలు సురక్షితంగా ప్రయాణించగలిగే వాతావరణం కల్పించడం చాలా ముఖ్యం. ఈ ఏర్పాట్లు భారత్‌లో సామాజిక సమానత్వంవైపు సాగుతున్న ప్రయత్నాల్లో ఒకటి.

అమెరికా నేర్చుకోవాల్సిన పాఠాలు..
లిజ్‌ అభిప్రాయం ప్రకారం అమెరికా భారతదేశ ప్రజా రవాణా వ్యవస్థ నుండి చాలా నేర్చుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా రవాణా వ్యవస్థలో శుభ్రత, సరసమైన ధరలు, సామాజిక సురక్ష వంటి అంశాల్లో లోపాలు ఉండవచ్చు. భారత్‌ వంటి దేశాలు జనాభా సాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో సమర్థవంతమైన మెట్రో వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఇది వనరుల సమర్థ వినియోగం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఉదాహరణ.

భారత్‌ ప్రజా రవాణా వ్యవస్థ ప్రగతి..
ముంబై మెట్రో వంటి ప్రాజెక్టులు భారత్‌లో పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల విస్తరణను చెబుతున్నాయి. తక్కువ ఖర్చు, మెరుగైన సౌకర్యాలు, భద్రతా చర్యలు ఇవన్నీ కలిసి ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజారవాణా వైపు మళ్లించడానికి సహాయపడతాయి. ఇది ట్రాఫిక్‌ రద్దీ తగ్గించడం, పర్యావరణ కాలుష్యం నియంత్రణ వంటి విస్తృత లక్ష్యాలకు కూడా దోహదపడుతుంది.

అమెరికన్‌ మహిళ ప్రశంసలు భారత్‌ పట్టణ రవాణా వ్యవస్థ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నట్లు చెబుతున్నాయి. దేశం మొత్తం అభివృద్ధి చెందుతున్న విధానానికి చిహ్నం. ప్రపంచం నుంచి వచ్చే ఇలాంటి అభిప్రాయాలు భారత్‌ తన మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచుకోవడానికి ప్రేరణగా పనిచేస్తాయి.

 

View this post on Instagram

 

A post shared by Liz & Shiv (@spicygori)

'మా ఇంటి బంగారం' మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం..

Maa Inti Bangaram Collections
Maa Inti Bangaram Collections

Maa Inti Bangaram first day collections: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ తీవ్రమైన సంక్షోభం లో ఉన్నటువంటి మన టాలీవుడ్ కి ‘పెద్ది’ ఇచ్చిన ధైర్యం మామూలుది కాదు. చాలా కాలం తర్వాత థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో కనిపించేలా చేసిన చిత్రమిది. కేవలం వీకెండ్ కి మాత్రమే ఈ సినిమా పరిమితం అయిపోలేదు , దాదాపుగా 2 వారాల పాటు వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో కొనసాగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లకంటే కూడా, ఈ చిత్రానికి ఓవర్సీస్ లో వచ్చిన గ్రాస్ వసూళ్లు ఎక్కువగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిని బట్టీ సమంత కి ఓవర్సీస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం ఒక్క ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 7 లక్షల డాలర్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో అక్షరాలా 6 కోట్ల 60 లక్షల రూపాయిలు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ 4 నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు రాగా, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 12 కోట్ల 60 లక్షల గ్రాస్ నుండి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు రాబట్టింది. షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రాంతాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన షేర్ వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతం నుండి 1 కోటి 10 లక్షజాలా రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

సీడెడ్ ప్రాంతం లో 20 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 24 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 6 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈమధ్య కాలం లో కొంతమంది యంగ్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓవర్సీస్ ఓపెనింగ్స్ గ్రాస్ ని కూడా ఈ చిత్రం దాటేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

'మా ఇంటి బంగారం' లో సమంత ని డామినేట్ చేసిన 'మంజూష' బ్యాక్ గ్రౌండ్ వివరాలు చూస్తే నోరెళ్లబెడుతారు..

Manjusha background
Manjusha background

Manjusha background: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. టాక్ కూడా చాలా పాజిటివ్ గా రావడంతో ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకుంటుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు బయ్యర్స్. ఈ సినిమాలో సమంత నటనకు ఎంతటి అద్భుతమైన మార్కులు వచ్చాయో, ఆమెతో పాటు కలిసి నటించిన మంజూష ముక్కవల్లి కి కూడా అదే స్థాయి మార్కులు వచ్చాయి. ఈ చిత్రం లో ఆమె నటనపై , కామెడీ టైమింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. ఇంతకు ముందు ఈ నటిని ఎక్కడా చూడలేదు, ఇంత బాగా నటించింది , అసలు ఎవరు ఈమె? , ఎక్కడి నుండి వచ్చింది? అంటూ ఈమె గురించి వివరాలను తెలుసుకోవడం కోసం సోషల్ మీడియా ని తెగ గాలిస్తున్నారు నెటిజెన్స్.

అందరూ అనుకుంటున్నట్టుగా ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీ నుండో , లేదా వేరే ఏ ఇతర ఇండస్ట్రీ నుండో వచ్చిన ఆర్టిస్ట్ కాదు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన ఒక సామాన్యురాలు మాత్రమే. లెజండరీ నటీమణులు సూర్యకాంతం, ఛాయాదేవి , నిర్మలమ్మ వంటి వారిని ఇమిటేట్ చేస్తూ , వాళ్ళ మ్యానరిజమ్స్ ని మక్కీకి మక్కీ దింపుతూ ఎన్నో వందల రీల్స్ చేసింది. వాటికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అలా బాగా పాపులర్ అయినా ఈమెని సమంత మరియు నందిని రెడ్డి టీం గుర్తించి, ఈ చిత్రం లో సమంత కి స్నేహితురాలి పాత్రకు ఎంచుకున్నారు. తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతీ ఫ్రేమ్ లో చక్కగా ఉపయోగించుకుంది మంజూష. సమంత తో పోటీపడి మరీ నటించి అందరి దృష్టిని ప్రత్యేకించి ఆకర్షించింది.

మంజూష ముక్కవల్లి కి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆమె రీల్స్ కాసేపు చూస్తే చాలు , వేరే ప్రపంచం లోకి వెళ్ళిపోతారు , మంచి ఎంటర్టైన్మెంట్ ని పొందుతారు. మొదటి సినిమాతోనే అద్భుతంగా ప్రేక్షకులను అలరించిన మంజూషాకు రాబోయే రోజుల్లో కచ్చితంగా సినిమా అవకాశాలు భారీగానే వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు , ఇలాంటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయిని ప్రోత్సహించి ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చినందుకు సోషల్ మీడియా లో సమంత మరియు నందిని రెడ్డి లకు కృతఙ్ఞతలు చెప్తున్నారు నెటిజెన్స్.

 

View this post on Instagram

 

A post shared by Manjusha Mukkavilli (@manju_kuttilu)

'దివానా ' ఫుల్ మూవీ రివ్యూ...హిట్టా?ఫట్టా..?

Deewana Movie Review
Deewana Movie Review

Deewana Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంటే కుర్ర హీరోలు మాత్రం ప్రేమకథ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ సంగిశెట్టి అనే దర్శకుడు ‘దివానా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

మున్నా (హర్షిత్ రెడ్డి) అనే ఒక అకతయిగా తిరిగే కుర్రాడు అమూల్య (స్నేహ మణి మేఘాలై) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను పొందడానికి చిత్ర విచిత్రాలు చేస్తూ ఎలాగైనా సరే తనని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అమూల్యను ఏడిపించిన కొంతమందిని కొట్టి జైలుకి కూడా వెళ్తాడు. తనకోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ తనకు తెలిసేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఫ్యూచర్ మీద ఎలాంటి ప్లానింగ్ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న హీరోని పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొడతారు. అలాగే ఆయనకి ఉన్న గోల్ ఏంటి? హీరోయిన్ ను పొందడానికి ఆమె అతనికి పెట్టిన కండిషన్ ఏంటి? ఆ కండిషన్ లో తను ఎంతవరకు విజయం సాధించాడు? ఫైనల్ గా మున్నా, అమూల్య ఇద్దరు ఒకటయ్యారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ సినిమాని మొదటి నుంచి ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది. కానీ దాని కోసం వేసుకున్న సబ్ ప్లాట్స్ ప్రేక్షకుడిని పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయాయి. ముఖ్యంగా తను స్ట్రైయిట్ గా సినిమాని ఒక ఫీల్ గుడ్ మూవీగా చెప్పిన బాగుండేది. కానీ ప్రేక్షకుడికి మధ్యలో ఎక్కడైనా బోర్ కొడుతుందేమో అనే ఉద్దేశంతో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కామెడీ చేయించాలి అనుకోని ఇష్టం వచ్చినట్టుగా సీన్లను రాసుకున్నాడు. అవి కామెడీని పండించకపోగా సినిమా చూసే ప్రేక్షకుడికి విసుగు తెప్పించాయి.

ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఇలాగే సాగుతుంది. ఇంటర్వెల్ లో ఇచ్చిన ఒక ట్విస్టు కి మాత్రం ప్రేక్షకుడికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అలాంటి మంచి ట్విస్ట్ రాసుకున్న ఆయన సినిమా మొత్తాన్ని అలానే ఎంగేజింగ్ గా తీసుకొని వెళ్తే బాగుండేది కదా అనే ఒక ఫీల్ అయితే ట్విస్ట్ రివిల్ అయిన తర్వాత మనకు కలుగుతుంది. ఇక సెకండాఫ్ లో హీరో తన గోల్ కోసం ఏం చేశాడు అనే సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నం చేసిన కూడా అవన్నీ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. అలాగే వాటిని సాధించడానికి తను ఈజీగా అన్ని చేసుకుంటూ వెళ్లిపోవడం వల్ల సినిమా చూసిన వాళ్ళకి ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలు ఓకే అనిపించినప్పటికి ఓవరాల్ గా సినిమా సూపర్ సక్సెస్ అయ్యే కంటెంట్ ఉన్నప్పటికి దానిని దర్శకుడు అనవసరమైన సబ్ ప్లాట్స్ పెట్టి మొత్తం స్పాయిల్ చేశారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా తీసిపారేసేంత దారుణంగా ఏమీ లేదు. ఫ్యామిలీ అందరు కలిసి సరదాగా ఒకసారి చూడొచ్చు… ఇక కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఆ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా హెల్ప్ అయింది…

ఇక ఎమోషనల్ సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు కామెడీ సన్నివేశాలను చిత్రకరించడంలో కొంతవరకు తడబడ్డాడు. కామెడీని పండించడంలో ద్రాజకుడు చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ఇక దర్శకుడు రాసుకున్న కథ కొత్తగా ఏమీ లేకపోయినా దాని చుట్టూ అల్లుకున్న ట్రీట్మెంట్ అయితే బాగుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ లవ్ స్టోరీ కి, ఎమోషనల్ సన్నివేశాలకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. వాటిని బేస్ చేసుకొని సినిమా మొత్తాన్ని ఒకే ప్లాట్ మీద తీసుకెళ్తే మాత్రం ఈ మధ్యకాలంలో వచ్చిన లవ్ స్టోరీ లో ‘దివానా’ ది బెస్ట్ లవ్ స్టోరీ గా నిలిచిపోయేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

హర్షిత్ రెడ్డి (మున్నా) క్యారెక్టర్ లో జీవించేసాడు. ఒక ఆకతాయి కుర్రాడు ఎలా ఉంటాడు. డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆకతాయిగా తిరుగుతున్న కుర్రాడి పాత్రను పర్ఫెక్ట్ గా పోట్రే చేశాడు… హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో కూడా తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని చూపించాడు.

ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే అందరినీ ఏడిపించేసాడనే చెప్పాలి…ఇక అమూల్య పాత్రలో నటించిన స్నేహ మణి మేఘాలై చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలం లో ఇలాంటి పాత్ర ఎవ్వరికి దొరకలేదు. కానీ ఆమె వచ్చిన అవకాశాన్ని చాలా బాగా వాడుకుంది. ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఈ సినిమాలోని సాంగ్స్ ఒకే అనిపించాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విజువల్స్ ఒకే అనిపించాయి. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చాలా రీచ్ గా తెరకెక్కించారు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో పర్లేదు అనిపించాయి…

ప్లస్ పాయింట్స్

ఎమోషనల్ సన్నివేశాలు
ఇంటర్వెల్ ట్విస్ట్
హీరో, హీరోయిన్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ చాలా స్లో అయింది…
కొన్ని అనవసరపు సన్నివేశాలు…
స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది…

రేటింగ్ : 2.25/5

ట్రంప్‌ కోసం కొత్త ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌.. ఖరీదు తెలిస్తే కళ్లు బైర్లు కమ్మామల్సిందే!

New Air Force One for Trump
New Air Force One for Trump

New Air Force One for Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోసం ఖతర్‌ దేశం ఒక ప్రత్యేకమైన బోయింగ్‌ 747–8 విమానాన్ని బహుమతిగా అందించింది. గత సంవత్సరం ట్రంప్‌ పర్యటన సమయంలో ఇచ్చిన ఈ విమానం ఇప్పుడు అధికారికంగా అధ్యక్షుడి ప్రయాణాలకు సిద్ధమైంది. ఇది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు, గౌరవం, సహకారాన్ని ప్రతిబింబించే చిహ్నంగా చూడవచ్చు.

ఆధునిక సాంకేతికతతో పూర్తి మార్పు..
అమెరికా అధికారులు ఈ విమానంలో అత్యాధునిక సాంకేతికత, భద్రతా వ్యవస్థలు, అధునాతన సౌకర్యాలను అమర్చారు. ఇది సాధారణ వాణిజ్య విమానం నుంచి అధ్యక్షుడి ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. కమ్యూనికేషన్‌ సిస్టమ్స్, రక్షణ సామర్థ్యాలు, అంతర్గత వసతులు అన్నీ కూడా అత్యున్నత స్థాయిలో ఉండేలా రూపొందించారు. ఈ మార్పులు అధ్యక్షుడి ప్రయాణాల సమయంలో గరిష్ట భద్రత, సౌకర్యాన్ని అందించడానికి ఉద్దేశించినవి.

ప్రస్తుతం 40 ఏళ్ల పాత విమానం..
ట్రంప్‌ ఇప్పటికీ 40 ఏళ్ల నాటి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానాన్ని వాడుతున్నారు. ఈ పాత విమానం చాలా సంవత్సరాలుగా అధ్యక్షుల ప్రయాణాలకు సేవలందించింది. కానీ సాంకేతికత, భద్రతా ప్రమాణాలు మారిన నేటి కాలంలో కొత్త విమానం అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పు అమెరికా అధ్యక్ష కార్యాలయ ఆధునికీకరణ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అడుగుగా చూడవచ్చు.

కొత్త విమానం ప్రత్యేకత ఏమిటి..
ఖతర్‌ నుంచి వచ్చిన బహుమతి, దానిని అధునాతనంగా మార్చడం రెండూ కలిసి అధ్యక్షుడి స్థానం యొక్క ప్రతిష్టను, భద్రతా అవసరాలను, అంతర్జాతీయ దౌత్య సంబంధాలను సూచిస్తాయి. ఇలాంటి బహుమతులు రెండు దేశాల మధ్య స్నేహం, సహకారాన్ని బలపరుస్తాయి. అదే సమయంలో, పాత విమానం నుంచి కొత్తదానికి మారడం అమెరికా అధ్యక్ష కార్యాలయం సాంకేతిక, భద్రతా ప్రమాణాలను నవీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను చెబుతుంది.

ఈ విమానం కేవలం ఒక రవాణా సాధనం కాదు. అది అధ్యక్షుడి ప్రతినిధిత్వం, దేశ భద్రత, ప్రపంచ వేదికపై అమెరికా స్థానాన్ని ప్రతిబింబించే చిహ్నం. ఖతర్‌ బహుమతి నుంచి అధునాతన సాంకేతికతతో సిద్ధం చేసిన ఈ విమానం వరకు జరిగిన మార్పు అధ్యక్షుడి ప్రయాణాలలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని సూచిస్తోంది.

తల్లి కాబోతున్న సమంత.. ఇందులో సంచలనమైన నిజాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Samantha pregnant
Samantha pregnant

Samantha pregnant: సోషల్ మీడియా లో ప్రస్తుతం సమంత ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మయోసిటిస్ వ్యాధి కారణంగా కొంతకాలం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వచ్చిన సమంత , ఇప్పుడు ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రం ద్వారా నిన్న మన ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ తో పాటు, బంపర్ ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మొదటి రోజే 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి వచ్చాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ప్రొమోషన్స్ మొదలైనప్పటి నుండి సమంత గురించి సోషల్ మీడియా లో ఓకే వార్త బాగా ప్రచారం అవుతోంది. అది ఏమిటంటే ఆమె తల్లి కాబోతుంది అని.

ఎందుకంటే సమంత ఈ సినిమా కోసం దాదాపుగా 50 కి పైగా ఇంటర్వ్యూస్ ఇచ్చింది. అదే విధంగా ఎన్నో ఈవెంట్స్ ని కూడా నిర్వహించింది. వీటి అన్నిట్లోనూ ఆమె చీర ధరించడమే ఇప్పుడు ఈ ప్రెగ్నన్సీ అనుమానాలు అభిమానుల్లో కలిగేలా చేశాయి. బేబీ బంప్ ని దాచడం కోసమే, ఆమె ఇలా చీర లోనే ఎక్కువగా కనిపించిందని , సాధారణంగా సమంత మోడరన్ దుస్తుల్లో కనిపించేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని , ఇలా రకరకాల కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. దీని పై సమంత లేదా , ఆమె భర్త రాజ్ నిడిమోరు స్వయంగా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది ఈమె రాజ్ నిడిమోరు ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సమయం నుండి వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

అప్పటి నుండి వీళ్లిద్దరు మంచి స్నేహితులు గానే కొనసాగుతూ వస్తున్నారు. ఇక కొన్ని కారణాల వల్ల, ఆమె నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత మయోసిటిస్ వ్యాధితో తీవ్రమైన ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది. ఈ సమయం లో ఆమెకు రాజ్ నిడిమోరు ఇచ్చిన ధైర్యం సాధారణమైనది కాదు. ఆ కఠినమైన సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ప్రేమగా మారేలా చేసింది. అప్పటి నుండి డేటింగ్ చేసుకుంటూ వచ్చిన వీళ్లిద్దరు గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన కుటంబత్తూరు లోని ఈషా యోగా కేంద్రం లో పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గా విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ ని కూడా అందించాడు.

Next Level Monster ట్యాగ్ లైన్ తో శాంసంగ్ కొత్త ఫోన్.. కలర్ అదుర్స్..

Samsung Galaxy M47 5G Launch
Samsung Galaxy M47 5G Launch

Samsung Galaxy M47 5G Launch: Samsung మొబైల్ కొనాలని అనుకునేవారికి ఇది శుభవార్తే.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న తన సక్సెస్‌ఫుల్ M సిరీస్ నుంచి సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి ఈ కంపెనీ రెడీ అయింది. శామ్‌సంగ్ గెలాక్సీ M47 5G (Samsung Galaxy M47 5G) పేరుతో రాబోతున్న ఈ సరికొత్త ఫోన్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ లో దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్‌లోకి వచ్చింది. దీంతో ఈఫోన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

శామ్‌సంగ్ కంపెనీ గత మోడల్స్‌కు భిన్నంగా ఈసారి ఈ ఫోన్‌కు Next Level Monster అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చింది. అమెజాన్ లోఉన్న టీజర్ ప్రకారం .. గెలాక్సీ M47 5G లుక్ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. ముఖ్యంగా డీప్ మెరూన్ కలర్ వేరియంట్ హైలైట్‌గా నిలవనుంది. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా డార్క్ మ్యాట్ ఫినిషింగ్‌తో ఉంటూ, కెమెరా మాడ్యూల్ చుట్టూ మెటాలిక్ రెడ్ యాక్సెంట్స్‌తో డిజైన్ చేశారు. ఈసారి ట్రెండీగా ఉండే బాక్సీ ఫ్రేమ్, ఫ్లాట్ బ్యాక్ డిజైన్‌ను తీసుకొచ్చింది. కుడివైపు పవర్ బటన్‌కు ఇంటిగ్రేట్ చేసిన సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇందులో ఉండనుంది.

ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ఉండనుంది. ఇది గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ Super AMOLED స్క్రీన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుండడం వల్ల స్క్రోలింగ్, వీడియోలు చూడడం చాలా స్మూత్‌గా ఉంటుంది.

Galaxy M47 ఫోన్ వెనుక భాగంలో సరికొత్త పిల్ షేప్డ్ కెమెరా ఐలాండ్ ఉండబోతోంది. ఇందులో 50MP ప్రాథమిక కెమెరా , 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మ్యాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ తో రన్ కానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఈ కొత్త ఫోన్ లో 6,000 mAh బ్యాటరీ వచ్చే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. బేస్ వేరియంట్ 8GB రామ్ + 128GB స్టోరేజ్‌తో ప్రారంభం కానుంది. అయితే జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో దీని అఫీషియల్ లాంచ్ డేట్ ప్రకటించి, మార్కెట్లోకి తీసుకురానున్నారు.ఇది మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీని ఇచ్చేలా కనిపిస్తోంది. భారతదేశంలో దీని ధర సుమారుగా రూ. 20,000 నుండి రూ. 25,000 లోపు ఉండే అవకాశం ఉంది. అమెజాన్ ఇండియాతో పాటు శామ్‌సంగ్ అఫీషియల్ వెబ్‌సైట్లలో ఇది సేల్‌కు రానుంది.

ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ హెచ్చరిక... బుర్ర వాడండి అని హితవు!

Trump
Trump

Trump Warns Israel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి తీసుకున్నారు. హెజ్‌బొల్లాపై దాడులు చేసి కాల్పుల విరమణను ఉల్లంఘించినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరగడం వల్ల శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారతాయని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ నాయకత్వం నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా, బుద్ధిపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. అమెరికా ప్రయోజనాలు, ప్రాంతీయ స్థిరత్వం కోసం సంయమనం అవసరమని స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.

సంయమనంతోనే శాంతి..
ట్రంప్‌ వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌కు కొంచెం బుర్ర ఉపయోగించి నిర్ణయాలు తీసుకోమని సందేశం ఇస్తున్నాయి. హెజ్‌బొల్లా వంటి సంఘర్షణలు పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉందని, అలాంటి పరిణామాలు మొత్తం మధ్యప్రాచ్యంలో అస్థిరతను పెంచుతాయని ఆయన అభిప్రాయం. ఇజ్రాయెల్‌ భద్రత కోసం చేసే చర్యలు అవసరమైనప్పటికీ, అవి అంతర్జాతీయ ఒప్పందాలు, కాల్పుల విరమణలను ఉల్లంఘించకుండా ఉండాలని సూచన. ఇది ట్రంప్‌ శైలిని ప్రతిబింబిస్తుంది. మిత్రులను కూడా విమర్శించడానికి వెనుకాడడు.

అమెరికా లేకపోతే ఇజ్రాయెల్‌ భద్రతకు ముప్పు..
ట్రంప్‌ మరో ముఖ్యమైన విషయం చెప్పారు. అమెరికా మద్దతు లేకపోతే ఇజ్రాయెల్‌ భద్రతకే ప్రమాదం ఏర్పడేదని. ఇది రెండు దేశాల మధ్య సంబంధాల లోతును చెబుతుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌కు సైనిక, రాజకీయ, ఆర్థిక మద్దతు అమెరికా నుంచి వస్తుంది. అయితే, ఈ మద్దతు షరతులు లేకుండా కాదని, ఇజ్రాయెల్‌ కూడా అమెరికా ప్రయోజనాలు, ప్రాంతీయ శాంతి ప్రయత్నాలను పరిగణనలోకి తీసుకోవాలని సంకేతం. ఇది మద్దతు ఇస్తాం, కానీ సంయమనం కూడా చూపించాలి అని ట్రంప్‌ సందేశం.

మధ్యప్రాచ్యంపై మారిన ట్రంప్‌ విధానం..
ట్రంప్‌ వ్యాఖ్యలు చూస్తుంటే మధ్యప్రాచ్యంపై మారిన విధానాన్ని, వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్‌కు బలమైన మద్దతు, మరోవైపు దాడులు, ఉద్రిక్తతలు పెంచకుండా నియంత్రణ. హెజ్బొల్లా సంఘర్షణలో ఇజ్రాయెల్‌ చర్యలు పెద్ద యుద్ధంగా మారకుండా నిరోధించడం లక్ష్యం. ఇది గతంలోని అమెరికా ఫస్ట్‌ విధానానికి అనుగుణంగా ఉంది. మిత్రులను కూడా జవాబుదారీగా ఉంచడం. ఇజ్రాయెల్‌ భద్రత కోసం అమెరికా మద్దతు అవసరం అని గుర్తుచేయడం ద్వారా, ట్రంప్‌ రెండు దేశాల సంబంధాలను మరింత బలపరచాలని, కానీ అది ఒకవైపు మాత్రమే కాకుండా సమతుల్యంగా ఉండాలని సూచిస్తున్నారు.

ప్రాంతీయ శాంతికి కీలకం..
ట్రంప్‌ హెచ్చరిక ఇజ్రాయెల్‌కు మాత్రమే కాదు మొత్తం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించడానికి సంకేతం. కాల్పుల విరమణలు ఉల్లంఘనలు పెద్ద సంఘర్షణలకు దారితీస్తాయని, అలాంటి పరిణామాలు అమెరికా ప్రయోజనాలకు కూడా హాని కలిగిస్తాయని ఆయన అభిప్రాయం. ఇజ్రాయెల్‌ భద్రత, ప్రాంతీయ స్థిరత్వం రెండూ ముఖ్యమని, ఒకటి మరొకటి లేకుండా సాధ్యం కాదని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. ట్రంప్‌ శైలి నేరుగా, బహిరంగం కాబట్టి, ఇది ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచి, శాంతి చర్చల వైపు మళ్లించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

మధ్యప్రాచ్యంలో సంక్లిష్ట పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడి ఈ హెచ్చరిక రెండు దేశాల సంబంధాలను మరింత బాధ్యతాయుతంగా, సంయమనంతో నడిపించాలనే సందేశాన్ని ఇస్తోంది. ఇది ప్రాంతీయ శాంతి ప్రయత్నాలకు కొత్త దిశను సూచిస్తోంది.

'శ్రీ మంతుడు' సినిమాలో నమ్రత చేసిన ఆ మార్పు వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయిందా..?

Srimanthudu Movie Success
Srimanthudu Movie Success

Srimanthudu Movie Success: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ మొదట్లో ఆయన చేసిన సినిమాలు అతని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. అందుకే ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు ఎక్కడ తడబడకుండా తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక వ్యక్తిగా మారబోతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమా మీదనే భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమాకి సంబంధించిన తీవ్రమైన కసరతులైతే చేస్తున్నారు. ఎలాగైనా సరే సినిమాని అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో రాజమౌళి ముందుకు సాగుతున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ మూవీ భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎంటైర్ కెరియర్ లో చేసిన సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో శ్రీమంతుడు సినిమా ఒకటి…

ఇది నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును కూడా బ్రేక్ చేసింది. అలాంటి శ్రీమంతుడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి మహేష్ బాబు భార్య అయిన నమ్రత కూడా ఒక కారణమనే విషయం మనలో చాలామందికి తెలియదు. అయితే ఈ సినిమా కథని మొదట కొరటాల శివ నమ్రత కు చెప్పినప్పుడు ఆమె అందులో కొన్ని మార్పులు చేర్పులు చెప్పిందట. కొరటాల దానిని మార్పులు చేర్పులు చేసి మరి మహేష్ బాబు దగ్గరికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది.

ఇక హీరో ఫాదర్ కి తన ఊరికి సంబంధించిన సన్నివేశాలు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నమ్రత డిసైడ్ చేసిందట. దానివల్ల ఈ సినిమా మీద వెయిటేజ్ అయితే ఎక్కువగా పెరిగిందని ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు చాలా వరకు ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అంటూ చాలామంది చెబుతున్నారు. మొత్తానికైతే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా సక్సెస్ ను సాధించడంలో కీలకపాత్ర వహించిందనేది వాస్తవం…

అల్లు అర్జున్ ను స్టార్ హీరోను చేసిన ఈ ముగ్గురు డైరెక్టర్లను పట్టించుకోవడం లేదా..?

Allu Arjun
Allu Arjun

Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ని మొదలుపెట్టిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ఫ్యాన్స్ లకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క సినిమాలో తన స్టెప్పులతో కుర్రాలను ఉర్రూతలూగించిన ఘనత కూడా తనకే దక్కుతుంది. ఇక అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ‘రాకా’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇంతకుముందు చేసిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా టాప్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా అల్లు అర్జున్ కి ఒక ముగ్గురు దర్శకులు చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ల వల్లే ఆయన టాప్ హీరోగా మారడనే విషయం చాలా మందికి తెలీదు. ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే ఒకరు సుకుమార్ కాగా, మరొకరు పూరి జగన్నాథ్ కావడం విశేషం…

ఇక వీళ్ళతో పాటుగా త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వారు కూడా అలీ అర్జున్ తో చాలా మంచి సినిమాలు చేసి తనను టాప్ హీరోగా మార్చారు. అతనికి భారీ సక్సెస్ లను కట్టబెట్టిన ఘనత కూడా వాళ్ళకే దక్కుతుంది… ఇక రీసెంట్ గా సుకుమార్ తో పుష్ప సినిమా చేశాడు. ఇక త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

కానీ పూరి జగన్నాధ్, సురేందర్ రెడ్డి లను మాత్రం అల్లు అర్జున్ అసలు పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఒకప్పుడు టాప్ హీరోలుగా కొనసాగారు. వాళ్ళతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ చాలా రోజులపాటు వెయిట్ చేశాడు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. అతను టాప్ హీరోగా మారిపోయాడు కాబట్టి ఈ దర్శకులకు సినిమాలు ఇవ్వడానికి చాలా వరకు భయపడిపోతున్నాడు.

కారణం ఏంటంటే వాళ్ళు ఫామ్ లో లేరు. కాబట్టి సక్సెస్ ఫుల్ సినిమాలను చేస్తారా? లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అందువల్లే ఆయన వాళ్లతో సినిమా చేసి రిస్క్ చేయాలనుకోవడం లేదు. దానికోసమే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళని పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది…

కాజల్ అందాలు.. ఆనందాలు

Kajal Aggarwal birthday
Kajal Aggarwal birthday

ఎన్టీఆర్ డ్రాగన్ తో హిట్ కొడితే రామ్ చరణ్ ను బీట్ చేస్తాడా..?

NTR Fans Anger
NTR Fans Anger

NTR Dragon Movie: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన చేస్తున్న సినిమాల్లో ప్రతి సినిమా కూడా తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసి పెట్టినవే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్కును చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభాస్, అల్లుఅర్జున్ లాంటి నటులు ఇప్పటికే భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతుంటే రాంచరణ్ ఎన్టీఆర్ లాంటి వారు మాత్రం పూర్తిగా డీలాపడిపోతున్నారు. ఇక ఎలాగైనా సరే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం తమ స్టామినా ను చూపించాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క ఇండస్ట్రీ హిట్ కూడా లేదు. కాబట్టి ఆయన ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసినట్టుగా తెలుస్తుంది… ఇక ప్రస్తుతం ఆయన మొదట రామ్ చరణ్ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు ఈ సినిమా భార్య కలెక్షన్స్ ను కొల్లగొడుతుందని అందరు అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయి 15 రోజులు దాటినా కూడా ఇప్పటివరకు భారీ కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది.

కారణమేదైనా కూడా ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఔట్ పుట్ రాలేదని అందువల్లే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించలేక పోయిందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం… సినిమాలను రిపీటెడ్ గా చూసే ఆడియన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ వస్తాయి.

లేకపోతే మాత్రం ఒకసారి మాత్రమే ఆ సినిమాను చూసి వదిలేస్తే సినిమాకి అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశాలు లేవని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… ఇక పెద్ది సినిమాకి భారీ కలెక్షన్స్ రాకపోవడం తో జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తే రామ్ చరణ్ ను బీట్ చేసే అవకాశమైతే దొరికింది.

ఇప్పటికే డ్రాగన్ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం ఈజీగా 1000 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశామైతే ఉందని ప్రతి ఒక్కరు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…