Homeఎంటర్టైన్మెంట్Bandla Ganesh helps Pawan Kalyan fan: పవన్ అభిమాని నిరంజన్ ని కలిసి ఆర్ధిక...

Bandla Ganesh helps Pawan Kalyan fan: పవన్ అభిమాని నిరంజన్ ని కలిసి ఆర్ధిక సాయం అందించిన నిర్మాత బండ్ల గణేష్.. వీడియో వైరల్..

Bandla Ganesh helps Pawan Kalyan fan: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ అభిమాని నిరంజన్ యే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో గత వారం రోజుల నుండి ఇతని మీద పడుతున్న రీల్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రాణాంతక జెన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ , చావు అంచుల్లో ఉన్నాడు. అతని వ్యాధి కి వైద్యం ఇంకా కనిపెట్టలేడని , ఎన్ని రోజులు అతను […]

Bandla Ganesh helps Pawan Kalyan fan: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ వరంగల్ అభిమాని నిరంజన్ యే కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో గత వారం రోజుల నుండి ఇతని మీద పడుతున్న రీల్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ప్రాణాంతక జెన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ , చావు అంచుల్లో ఉన్నాడు. అతని వ్యాధి కి వైద్యం ఇంకా కనిపెట్టలేడని , ఎన్ని రోజులు అతను ఈ భూమి మీద ఉంటాడో గ్యారంటీ లేదని స్వయంగా నిరంజన్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. అలాంటి సమయంలో నిరంజన్ చివరి కోరిక , తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి కలవాలని. రెండు మూడు నెలల నుండి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నిరంజన్ తల్లిదండ్రులు చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు.

ఎట్టకేలకు రీసెంట్ గా ఇతని గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ , వరంగల్ కి వెళ్లి, భద్రకాళి అమ్మవారి దగ్గర , ఆ కుర్రాడి పేరిట అర్చన , పూజలు చేయించి , దైవ ప్రసాదాలను కుటుంబానికి అందించాడు. అంతే కాకుండా, ఆ కుర్రాడికి అవసరమయ్యే వైద్య ఖర్చులు ఒక లక్ష రూపాయలతో పాటు నిరంజన్ కోరిక మేరకు ఒక ఐ ప్యాడ్, పుడిల్ బ్రీడ్ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. కుటుంబానికి జీవనోపాధి కోసం ఒక క్యాంటీన్ ని కూడా పెట్టించాడు. పవన్ కళ్యాణ్ కారణంగా నిరంజన్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహాయసహకారాలు అందించేందుకు పెద్దలు ముందుకొస్తున్నారు. ప్రముఖ నిర్మాత, పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ నేడు నిరంజన్ కుటుంబాన్ని కలిసాడు. పవన్ కళ్యాణ్ వరంగల్ కి వెళ్లిన రోజే , నిరంజన్ కి తన వంతుగా 5 లక్షల రూపాయిలు అందిస్తానని ప్రకటించాడు.

నేడు నిరంజన్ కుటుంబాన్ని కలిసి, మీడియా ముందు బండ్ల గణేష్ 5 లక్షల రూపాయిల చెక్ ని నిరంజన్ తండ్రికి అందించాడు. నిరంజన్ తో మాట్లాడుతున్నప్పుడు , తనకు కారు కనుక్కొని అందులో తిరగాలని ఉందని కోరారట. ఈ 5 లక్షలతో కారుని కొన్నుకొని తిరుగు నాయనా అని చెప్పానంటూ బండ్ల గణేష్ ఈ సందర్భంగా మీడియా కి తెలిపాడు. ఆ కుర్రాడు సంపూర్ణ ఆరోగ్యం తో బయటపడాలని , ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అంటూ బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper