Home Blog Page 8

తెలుగులో కొత్త మీడియా.. ఆ ఇద్దరు మాజీ ఎడిటర్ల శ్రమ ఫలిస్తుందా..

new-telugu-media-house-former-editors-independent-journalism-analysis

Telugu Media : ఈ రోజుల్లో మీడియాకు విలువలేదు. ప్రతి రాజకీయ పార్టీ తమకంటూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేసుకుంది. పత్రికా లేదా ఛానల్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్.. నచ్చిన వాళ్ళ మీద పన్నీరు.. నచ్చని వాళ్ళ మీద బురద అన్నట్టుగానే సాగిపోతోంది. ఇలాంటప్పుడు మీడియాకు విశ్వసనీయత ఎందుకుంటుంది. మీడియాను ప్రజలు ఎందుకు నమ్ముతారు.. నేటి కాలంలో మీడియా కంటే కూడా సోషల్ మీడియా మాత్రమే ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దానివల్లే కొత్తలో కొంత నిజాలు తెలుస్తున్నాయి.

మీడియాకు విశ్వసనీయత అనేది కొడిగట్టిన దీపం లాగా మారిపోయిన నేటి రోజుల్లో.. ఇద్దరి మాజీ ఎడిటర్లు ఒక ప్రయోగం చేస్తున్నారు.. కొత్త మీడియా హౌస్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే తెర వెనక ప్రయత్నాలు జరిగిపోయాయని తెలుస్తోంది. అయితే ఈ సంస్థకు ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరు మాజీ ఎడిటర్లు వామపక్ష భావజాలాన్ని కలిగి ఉన్నవారు. పైగా ఇద్దరికీ జర్నలిజంలో చాలా అనుభవమే ఉంది.. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా వారిద్దరికీ మంచి పేరు ఉంది. పైగా ఇద్దరికీ పత్రికలలో పనిచేసిన అనుభవం
.. సంపాదకులుగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటప్పుడు వారిద్దరు ఏర్పాటు చేయబోతున్న మీడియా హౌస్ పట్ల తెలుగు పాత్రికేయరంగంలో చర్చ నడుస్తోంది.

నేటి కాలంలో ఒక మీడియా హౌస్ ఏర్పాటు చేయాలంటే అంత ఈజీ కాదు. డబ్బులు కావాలి. రాజకీయ పలుకుబడి కావాలి. దీనికి తోడు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇచ్చే దమ్ము ఉండాలి. ఇప్పుడున్న మీడియా సంస్థల్లో నాలుగు, ఐదుకు మించి సంస్థలు ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇవ్వడం లేదు. కొన్ని సంస్థలు అయితే మీరు తెచ్చుకోండి.. మాకు కొంత ఇవ్వండి అనే విధానంలో బిజినెస్ సాగిస్తున్నాయి. అలాంటప్పుడు ఈ ఇద్దరు మాజీ ఎడిటర్ల మీడియా హౌస్ ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది చూడాలి.

వారిద్దరికీ 60 కి పైగానే వయసు ఉంటుంది. ఒకప్పుడు పత్రికలను నిర్వహించిన ఆ ఇద్దరు మాజీ ఎడిటర్లకు ఆర్థిక స్థిరత్వం చెప్పుకునే స్థాయిలో లేదు. అలాగని వీళ్ళిద్దరిని నమ్మి ఫండింగ్ చేయడానికి పెద్దగా ఎవరూ ముందుకు వచ్చినట్టు కనిపించడం లేదు. ప్రారంభంలోనే ఇలా ఉంటే.. చివరి వరకు వీరి బండి సక్రమంగా నడుస్తుందా అనేది చూడాలి. అన్నట్టు నేటి కాలంలో న్యూట్రల్ మీడియా అనేది లేదు. ఒకవేళ న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాదు. అలాంటప్పుడు ఈ ఇద్దరు మాజీ ఎడిటర్లు మీడియా హౌస్ ఎలా రన్ చేస్తారు.. వేతనాలు ఎలా ఇస్తారు.. ఒకటి సపోర్ట్ లేకుండా ఎలా మీడియా హౌస్ నిర్వహిస్తారు.. అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలని పాత్రికేయ రంగ కోవిదులు చెబుతున్నారు.

"మేడిగడ్డ".. చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ..

Revanth Reddy, Chandrababu Naidu

Revanth Chandrababu : తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ.. ఇప్పటికి ఇక్కడ రాజకీయాలు చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు గురించి పెద్దగా తెలంగాణ నాయకులు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు అధికారంలో లేడు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబును ప్రతి సందర్భంలో కేసీఆర్ బూచి గా చూపించారు. తెరపైకి ఓటుకు నోటు అనే కేసును తీసుకొచ్చి చంద్రబాబును ఏపీ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేశారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగారు. నాడు జగన్మోహన్ రెడ్డికి కేసిఆర్ అనేక రకాలుగా మేళ్లు చేశారు. ప్రగతి భవన్ పిలిపించుకున్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ఆహ్వానించారు. ఇవన్నీ అప్పటి రోజులు..

ఇప్పుడు తెలంగాణలో పవర్ సెంటర్ కాంగ్రెస్ చేతిలో ఉంది.. కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా అంటేనే గులాబీ పార్టీకి నచ్చదు. అందువల్లే రేవంత్ రెడ్డి ఏం చేయకపోయినా సరే విమర్శిస్తూనే ఉంటుంది. దానికి చంద్రబాబు ప్రస్తావన జతచేస్తూ ఉంటుంది. పైగా సెంటిమెంట్ రాజకీయాలను రగిలిస్తూ ఉంటుంది.. ఆ మంటల్లో చాలికాచుకుంటూ ఉంటుంది గులాబీ పార్టీ. ప్రస్తుతం మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రాణహిత నదికి వరద వస్తోంది. ఇంతటి కరువు కాలంలో కూడా ప్రాణహిత నదికి వరదరావడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ వరద నీరు వృధాగా వెళుతుంది.

వాస్తవానికి మేడిగడ్డ బ్యారేజీలు కృంగిపోక పోతే.. మిగతా పంప్ హౌస్ లు సక్రమంగా ఉండి ఉంటే ఈ నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉండేది. కరువుకాలంలో ఎల్లంపల్లి.. ఎస్ ఆర్ ఎస్ పి వంటి ప్రాజెక్టులను నింపే అవకాశం ఉండేది. మేడిగడ్డలో బ్యారేజీ కుంగిపోవడం.. మిగతా సుందిళ్ల.. అన్నారం.. కన్నెపల్లి పంప్ హౌస్ లు కూడా పనికిరావని చెబుతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లను రన్ చేయడం లేదు. వచ్చిన నీటిని వచ్చినట్ట కిందికి వదిలిపెడుతోంది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పంప్ చేసిన నీళ్లను వృధాగా సముద్రంలోకి పంపించిన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇంతవరకు కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు పంప్ చేశారు అనేదానికి అధికారిక లెక్కలు లేవు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నిర్మించిన బ్యారేజీలు.. ఇతర పంప్ హౌస్ లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని మరమ్మతులు చేసిన తర్వాత వాడాలని భావిస్తోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. అయితే గులాబీ పార్టీ ఇందులో కూడా రాజకీయం చేస్తోంది. ఇప్పుడు వరద నీరు వస్తున్న నేపథ్యంలో.. దానిని సక్రమంగా వాడకుండా.. రేవంత్ రెడ్డి గురుదక్షిణగా ఆ నీటిని ఏపీకి వదిలేస్తున్నాడని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ.

వాస్తవానికి వచ్చిన వరద నీరు కిందికి వెళ్లడం సహజం. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం సక్రమంగా పనిచేస్తే ఆ నీటిని నిలువ చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాలేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలు.. పంప్ హౌస్ లు సక్రమంగా పనిచేయకపోవడంతో.. ఆ నీటిని వృధాగా కిందికి వదిలివేయాల్సి వస్తోంది. ఫలితంగా పోలవరం ప్రాంతంలో గోదావరి ప్రవాహం ఉదృతంగా ఉంది. ఒకవేళ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ నీరు నిల్వచేసుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడే గులాబీ పార్టీ గొప్ప రాజకీయాలు చేస్తోంది. మేడిగడ్డను మరమ్మతులు చేయకుండా ఆ నీటిని చంద్రబాబుకు గురుదక్షిణ గా రేవంత్ రెడ్డి వదిలేస్తున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. వాస్తవానికి పోలవరం పథకం పూర్తికానప్పుడు ఆ నీటిని చంద్రబాబు ఏం చేసుకుంటారు.. ఒకవేళ చంద్రబాబు కోసం ఆ నీటిని రేవంత్ రెడ్డి వదిలిపెడితే.. ఇక్కడి ప్రజలు క్షమిస్తారా.. సొంత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఊరుకుంటారా.. పాపం ఈ మాత్రం సోయి కూడా గులాబీ పార్టీకి లేకపోవడం అత్యంత దారుణం.

ఈ రాముడు.. మంచి బాలుడు కాదు.. సీఎం రేవంత్ ఎందుకు టార్గెట్ చేశారంటే..

Vishweshwar-reddy-Sandhya-Sridhar-Rao

వెనకటి కాలంలో పుస్తకాలలో రాముడు మంచి బాలుడు అనే ఒక మంచి మాట ఉండేది. ఆ మాట లోకోక్తిగా వినతి కెక్కింది. రాముడి గుణగణాలనే కాదు.. రాముడి పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి మంచి లక్షణాలు ఉంటాయని ఆ మాట ద్వారా తెలుస్తోంది. అంతటి మంచి పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి మాత్రం
.. ఆ పేరుకు మంచి చేయలేకపోయాడు. అంతేకాదు ఇంకా చాలా చేశాడు.. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. ఫోకస్ పెడితే తప్ప ఈ రాముడి లో రావణుడి లక్షణాలు బయటపడలేదు.

హైదరాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాలుగా హైడ్రా దూకుడుగా అడుగులు వేస్తోంది. అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. చెరువులను.. కుంటలను.. నాలాలను అక్రమార్కుల నుంచి విడిపిస్తోంది. ఇంతవరకు హైడ్రా చేపట్టిన ఆపరేషన్లు విజయవంతమయ్యాయి. ఇందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. తాజాగా హైడ్రా సోమాజిగూడ లోని ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి సంబంధించిన బిల్డింగ్ ను సీజ్ చేసింది. అదే కాదు సంధ్య శ్రీధర్ రావు అనే వ్యక్తికి సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాల మీద గురి పెట్టింది.. వాస్తవానికి సంధ్య శ్రీధర్.. ప్రదీప్ కన్స్ట్రక్షన్.. ఇది పేరుకు వేరువేరుగానే అనిపిస్తున్నప్పటికీ.. అసలు వ్యక్తి మాత్రం ఒక్కడే.. అతని పేరు రాముడు అలియాస్ రియల్ ఎస్టేట్ రాముడు.. పేరుకు తగ్గట్టుగా అతడు రాముడు కాదు రావణుడు. హైదరాబాద్ నగరంలో అత్యంత భారీగా బినామీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు.

హైదరాబాద్ నగరంలో సాగిన భూ దందాలలో రియల్ ఎస్టేట్ రాముడు తనముద్ర అత్యంత బలంగా వేశాడు. అసలు అతని అడుగులేని భూ దందా లేదంటే పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బఫర్ జోన్లు.. ఎఫ్ టి ఎల్ పరిధిలు అతనికి ఏమాత్రం అడ్డుకావు. బఫర్ జోన్ లో అతడు ఎన్నో లేక్ ల్యాండ్స్లో నిర్మాణాలు నిర్మించాడు. పేదలకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములలో కూడా అతడు నిర్మాణాలు చేపట్టాడు. చివరికి టీఎస్ ఐఐసి కి సంబంధించిన ప్రభుత్వ భూములను కూడా అతడు వదిలిపెట్టలేదు.. అతడికి చట్టాలు జస్ట్ చుట్టాలు. అత్యంత విలువైన భూములను అతడు తన జేబులో వేసుకున్నాడు. చివరికి బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇతడికి రియల్ ఎస్టేట్ రాముడు అని పేరు పెట్టాడు అంటే.. అతడి భూదందాలను అర్థం చేసుకోవచ్చు.

రియల్ ఎస్టేట్ రాముడు గురించి హైడ్రా ఆరా తీస్తోంది. గతంలో అతడు గచ్చిబౌలి.. మాదాపూర్.. శేరిలింగంపల్లి వంటి ప్రాంతాలలో అక్రమ కట్టడాలను నిర్మించాడు. అనుమతులు లేకపోయినప్పటికీ అతడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో ఇతడు తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్రంలో అధికార కేంద్రాలు మారిపోవడం.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ రంగనాథ్ కు పూర్తిస్థాయిలో బాధ్యతలు ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ రాముడికి బ్యాడ్ టైం మొదలైంది. సంధ్యా శ్రీధర్ రావు.. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వంటి కంపెనీలకు సంబంధించిన దస్త్రాలను రేవంత్ ప్రభుత్వం తడబడడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రాముడి భూ వ్యవహారాలు బయటికి వచ్చాయి. దీంతో హైడ్రా ఇతడి బండారం మొత్తం బయట పెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఒకరకంగా రియల్ ఎస్టేట్ రాముడి బినామీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి హైడ్రా బాస్ రంగనాథ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. భూ రికార్డులను.. శాటిలైట్ మ్యాప్స్.. రెవెన్యూ రికార్డులను తెలంగాణది బృందం సిద్ధం చేసినట్టు సమాచారం. ఒకవేళ ఈ నెట్వర్క్ మీద హైడ్రా గట్టి దెబ్బ కొడితే.. రియల్ ఎస్టేట్ నల్ల దొరల అసలు రంగు బయట పడుతుందని కామెంట్ వినిపిస్తున్నాయి.

కవిత అడుగుతోంది.. కెసిఆర్ 1400 కోట్ల లెక్క చెప్పాల్సిందే..

Kavitha at KCR farmhouse
Kavitha at KCR farmhouse

Kavitha : కవిత దాపరికాన్ని ప్రదర్శించడం లేదు. ఓపెన్ గానే అడుగుతోంది.. అసలు మీ గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదాలో మాట్లాడే హక్కు ఎక్కడదని.. తల్లిని, చెల్లిని సరిగ్గా చూడని మీకు తెలంగాణ ప్రజలను పాలిస్తామని చెప్పే రైట్ ఎక్కడిదని.. కేటీఆర్ గ్యాంగ్ కు కూడా హెచ్చరిక చేస్తోంది.. మీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ యూత్ ఉందని.. తిక్క తిక్క వేషాలు వేస్తే కాళ్లు విరగొడతామని ఓపెన్ గానే సవాల్ విసురుతోంది. సోషల్ మీడియాలో తన ఫోటో మార్ఫింగ్ చేసి వీడియోలు.. పోస్టులు పెడుతున్న వారికి హెచ్చరిక చేసింది.

గురువారం విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడిన మాటల్లో రెండు అంశాలు మాత్రం చాలా పదనుగా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. కేటీఆర్ కు చెందినదని చెబుతున్న జన్వాడ వ్యవసాయ క్షేత్రం నిర్మించింది ఇదే ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ. ఈ కంపెనీ ఆంధ్ర వ్యక్తికి చెందింది. ఇటీవల మణికొండ ప్రాంతంలో ఈ కంపెనీ నిషేధిత భూములలో బహుళ అంతస్తులు నిర్మించింది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి అడ్డగోలుగా ఎన్వోసీ ఇచ్చారు. ఇటీవల హైడ్రా దీనిమీద ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని ప్రజలకు అప్పీలు కూడా చేసింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అంతేకాదు ఈ వ్యవహారం గురించి లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాడు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ చేసిన మేళ్ల గురించి ప్రభుత్వానికి అనేక విషయాలు తెలిసాయి. అందువల్లే ప్రదీప్ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు జన్వాడ వ్యవసాయ క్షేత్ర నిర్మాణానికి బలమైన సంబంధం ఉండడం.. ప్రభుత్వం మీడియాకు అనేక లీకులు ఇవ్వడంతో కేటీఆర్ బృందం అలర్ట్ అయింది. సోషల్ మీడియాలో ఏవో నాలుగు పోస్టులు పెట్టింది కానీ.. అందులో నిజం లేదు. నిబద్ధత కనిపించలేదు. దీనికి తోడు కవిత ప్రదీప్ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు కారు పార్టీలో ఉన్న 1400 కోట్ల గురించి కవిత పదేపదే ప్రస్తావిస్తున్నారు. అదంతా కూడా అవినీతి సొమ్ము అని.. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బు అని కవిత ప్రశ్నిస్తోంది. కవిత ఇలా ప్రశ్నించడం.. ఇలా నిగ్గదీసి అడగడం తొలిసారి కాక పోయినప్పటికీ.. ఈసారి ఏకంగా తన తండ్రినే సవాల్ చేసింది. మరి దీనిపై గులాబీ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది.. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెబుతుంది.. చూడాల్సి ఉంది.

ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'జన నాయగన్'..రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన..

Jana Nayagan Movie Leak
Jana Nayagan Movie Leak

Jana Nayagan : తమిళనాడు సీఎం విజయ్ అభిమానుల 6 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆయన హీరో గా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ కి ఎట్టకేలకు సెన్సార్ ఇక్కట్లు తొలగింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ని జారీ చేసింది. జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా, సెన్సార్ బోర్డు అనేక సన్నివేశాలకు అభ్యంతరం వ్యక్తం చేయడం , వాటికి నిర్మాతలు ఒప్పుకోకపోవడం తో , సెన్సార్ బోర్డు సభ్యులు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో సినిమా విడుదల ని ఆపేయాల్సి వచ్చింది. మరో రెండు రోజుల్లో విడుదల అనగా, ఇలా అర్థాంతరంగా వాయిదా వేయడం తో అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే అప్పటికే ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి.

ఇక వాయిదా తర్వాత నిర్మాతలు హై కోర్టుని ఆశ్రయించడం , హై కోర్టు కూడా సెన్సార్ బోర్డు కి అనుకూలంగా తీర్పుని ఇవ్వడం , దీంతో చేసేది ఏమి లేక సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాలను కట్ చేసి , సరికొత్త ఎడిటెడ్ వెర్షన్ ని బోర్డు కి పంపడం వంటివి జరిగాయి. ఆ తర్వాత తమిళనాడు లో ఎన్నికలు జరిగాయి , విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు , అయినప్పటికీ కూడా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకునే విషయం లో జాప్యం జరగడం పై అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. వాళ్ళ అసహనం కి ఎట్టకేలకు తెరపడింది. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ రావడం తో , ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జరగనుంది.

విజయ్ చివరి చిత్రం, పైగా ఆయన ముఖ్య మంత్రి అయ్యాక రాబోతున్న మొట్టమొదటి చిత్రం కాబట్టి ఈ సినిమా పై హైప్ మామూలు రేంజ్ లో లేదు. తమిళ రాష్ట్రాల్లోనే కాదు , తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్స్ నమోదు అవుతాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇప్పటికే విజయ్ లియో , గోట్ చిత్రాలతో వరుసగా రెండు సార్లు మొదటి రోజున 100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టారు. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఆయన ‘జన నాయగన్ ‘ తో వంద కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని కొల్లగొట్టబోతున్నారు. తమిళనాడు రాష్ట్రము లో అయితే భారీ మార్జిన్ తో ఆల్ టైం రికార్డు కూడా కొడుతుందని అంటున్నారు. ఇవన్నీ జరిగితే , పైరసీ ద్వారా విడుదలకు ముందే లీకైన సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో గా విజయ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

మనవడి కోరిక.. పూరీలు వేసిన తాత రేవంత్.. వైరల్ వీడియో

Revanth reddy

Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెఫ్ అవతారం ఎత్తారు. సుతారంగా గోధుమపిండిని కలిపి.. ముద్దలు చేసి.. వేడి వేడి నూనెలో కాల్చి.. మెత్తటి పూరీలు చేశారు. కాకపోతే అవి పూరీలు మాదిరిగా లేవు. రకరకాల రూపాలలో వచ్చాయి. వాటిని చూసి ఆయన మనవడు ఆశ్చర్యపోయారు. తాత అవన్నీ కూడా రౌండ్ గా రాలేదు. ఓవల్ షేప్ లో వచ్చాయి అంటుండగా రేవంత్ రెడ్డి.. రౌండ్ గా చేయాలా.. రౌండ్ గా చేస్తాను అంటూ మనవడికి బదులిచ్చారు. ఈ సన్నివేశం రేవంత్ రెడ్డి స్వగృహంలో వంటగదిలో చోటుచేసుకుంది.

తీరికలేని పని ఒత్తిడి.. రకరకాల వ్యవహారాలలో రేవంత్ రెడ్డి నిత్యం బిజీగానే ఉంటారు. ప్రజా జీవితంలో ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి ఖాళీగా ఉన్నది లేదు. చివరికి కొడంగల్ ప్రాంతంలో 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ.. ఆయనను ప్రజలు ఖాళీగా ఉంచలేదు. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఆయనను ఎంపీగా గెలిపించారు. ఒకరకంగా ఆయన ఖాళీగా ఉండకూడదని తెలంగాణ ప్రజలు తీర్మానించుకున్నారు. అందువల్లే 2019 లో ఎంపీని చేశారు. 2023లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు. కేవలం 20 సంవత్సరాల రాజకీయ జీవితంలోనే రేవంత్ రెడ్డి మిడ్జిల్ జెడ్పిటిసి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు నైమిశ. ఆమెకు ఒక కుమారుడు. నైమిశ కు కుమారుడు పుట్టిన తర్వాత.. రేవంత్ రెడ్డికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఒక రకంగా మనవడిని తన వారసుడిగా పరోక్షంగా ప్రకటించారు రేవంత్ రెడ్డి. తన ఒత్తిడిని.. తన కాలక్షేపాన్ని మొత్తం మనవడి తోనే సాగిస్తుంటారు రేవంత్. రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి కూడా మనవడితోనే ఎక్కువ కాలం గడుపుతుంటారు. తన మనవడు అడిగింది చేసి పెడుతుంటారు రేవంత్ రెడ్డి. ఆమధ్య మెస్సి గోట్ టూర్లో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు.. మనవడిని తీసుకొచ్చారు రేవంత్. మెస్సితో షేక్ హ్యాండ్ కూడా ఇప్పించారు. అప్పట్లో తిరుమల వెళ్ళినప్పుడు.. యాదగిరిగుట్టకు వెళ్లినప్పుడు.. భద్రాచలం సీతారామచంద్రస్వామి కళ్యాణ ఉత్సవానికి హాజరైనప్పుడు.. రేవంత్ రెడ్డి తన మనవడిని వెంట తీసుకొని వెళ్లారు. ఇప్పుడు ఏకంగా మనవడి కోసం పూరీలు చేసి.. అతని ఆనందాన్ని రెట్టింపు చేశారు. అన్నట్టు రేవంత్ రెడ్డి పూరీలు ఇష్టంగా తింటారు. అందులో బుడంకాయ పప్పు లేదా నాటుకోడి పెట్టుకొని తింటారు.

కంఠంలో ప్రాణం ఉండగా.. కవిత శపథం

Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha

కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేస్తున్నారు. ఎప్పటికప్పుడు వేడివేడి వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. ఏదో ఒక అంశంపై తనదైన వ్యాఖ్యలు చేస్తూ జనం నోళ్ళల్లో నానుతూనే ఉన్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన అభియోగాలు ఎదుర్కోవడం.. ఢిల్లీ తీహార్ జైల్లో ఉండడం.. బెయిల్ మీద బయటకు రావడం.. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కోవడం.. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేయడం.. ఇవన్నీ కవిత రాజకీయ జీవితంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులు.

భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశారు. దీనికి సంక్షిప్తంగా టీఆర్ఎస్ అని పేరు ఖరారు చేశారు. టిఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యమంతో బలమైన సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించింది. ఢిల్లీలో చక్రాలు తిప్పాలని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్లమెంటు ఎన్నికల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశారు. ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపడుతున్నారు. కవిత ఇంతటితోనే ఆగడం లేదు. అంతకుమించి అనే స్థాయిలోనే ఉద్యమకారులతో.. వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

తెలంగాణ రక్షణ సేనకు టిఆర్ఎస్ అనే పేరు కేటాయించడం పట్ల ఇటీవల భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లారు. ఎన్నికల సంఘం తనకు వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ కవితకు లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేనకు టిఆర్ఎస్ పేరు ఇవ్వడం కష్టమని అభిప్రాయపడింది. దీనిపై న్యాయపోరాటానికి కవిత సిద్ధమయ్యారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “కొద్దిరోజులుగా కొంతమంది నా మీద విషం చిమ్ముతున్నారు. టిఆర్ఎస్ అనే పేరును నాకు రాకుండా కుట్రలు చేస్తున్నారు. గులాబీ పార్టీకి ఒక నీతి అనేది లేదు. మేము అంటూ లేదు. తల్లి చెల్లి అనే సభ్యత మరిచి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని.. అటువంటి పార్టీలోకి వెళ్లడం సాధ్యం కాదని.. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ భారత రాష్ట్ర సమితిలో చేరేది లేదని” కవిత స్పష్టం చేస్తున్నారు.

కవిత ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే సంతోష్ రావు వరకు ఎవరిని కూడా ఆమె వదిలిపెట్టడం లేదు. చివరికి హరీష్ రావును ఆమె గుంట నక్క అన్ని సంబోధిస్తున్నారు. అంతేకాదు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆమె పర్యటిస్తూ.. కేటీఆర్ చేస్తున్న తప్పులను ఎండ గడుతున్నారు. మొత్తంగా భారత రాష్ట్ర సమితికి ఆమె కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేని పని కవిత చేస్తూ.. తెలంగాణ ప్రజల్లో సరికొత్త చర్చకు కారణమవుతున్నారు. కవిత ఇదే దూకుడు కొనసాగిస్తారా.. ఇలాగే భారత రాష్ట్ర సమితి మీద పోరాటం చేస్తారా.. అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది గాని.. ఇప్పటికైతే కవిత ఒక అగ్గి బరాటా మాదిరిగా పోరాటం చేయడం తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు ఆనందం కలిగిస్తుంటే.. గులాబీ నాయకులకు మాత్రం కలవరపాటును కలగజేస్తోంది.

రేపు హాస్పిటల్ లో అడ్మిట్ కానున్న పవన్ కళ్యాణ్.. కొన్ని వారాలు రెస్ట్.. అసలు ఏమైందంటే..

Pawan Kalyan Health
Pawan Kalyan Health

Pawan Kalyan Health Update : గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎదురుకుంటున్న ఆరోగ్య సమస్యలను మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గానే ఆయనకు నాజిల్ సర్జరీ జరిగింది. సుమారుగా నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయన విశ్రాంతి తీసుకునే సమయం వచ్చేసింది. కొద్దినెలల క్రితం పవన్ కళ్యాణ్ రెండు భుజాలకు గాయాలు అయ్యాయి. ఆ గాయాలు క్రమేణా పెరిగి తీవ్ర రూపం దాల్చింది. ఈ కారణం చేత రొటేటర్ కప్ దెబ్బ తినడంతో సరిగా కూర్చోలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ కి ఏర్పడింది. కొద్దిరోజుల క్రితమే ఆయన ముంబై కి వెళ్లి ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ లో చెకప్ చేయించుకున్నారు. అక్కడి వైద్యులు తక్షణమే భుజాలకు ఆపరేషన్ చెయ్యాలి, లేదంటే తీవ్రమైన పరిణామాలను ఎదురుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ ని హెచ్చరించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు షెడ్యూల్ చేయబడి ఉన్నాయి , అవి పూర్తి అయిన వెంటనే ఇక్కడికి వచ్చి సర్జరీ చేయించుకుంటానని చెప్పారట పవన్ కళ్యాణ్. షెడ్యూల్ చేయబడిన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ పూర్తి అయ్యాయి , నేడు ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలు , ఎమ్మెల్సీలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం తర్వాత హైదరాబాద్ కి చేరుకోనున్న పవన్ కళ్యాణ్ , అక్కడి నుండి ముంబై కి వెళ్లి ఈ కీలక సర్జరీ చేయించుకోనున్నారు. సర్జరీ తర్వాత కచ్చితంగా డాక్టర్లు కొన్ని వారాలు విశ్రాంతి తీసుకోమని సూచిస్తారు , అంటే పవన్ కళ్యాణ్ కనీసం నెల రోజులు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండబోతున్నారు అన్నమాట. అయితే ఈ సర్జరీల కారణంగా పవన్ కళ్యాణ్ కి దశాబ్దాల నుండి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి కాస్త విముక్తి కలిగినట్టు అయ్యింది. ఇకపై ఆయన స్వేచ్ఛగా పాలన చేసుకోవచ్చు , సినిమాలు కూడా చేసుకోవచ్చు.

చిన్నతనం నుండి పవన్ కళ్యాణ్ సైనస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆయనకు కరోనా సోకినప్పుడు ఆరోగ్యం బాగా క్షీణించింది. సైనస్ ఉండడం తో మరింత తీవ్ర రూపం దాల్చింది , అప్పటి నుండి ముక్కు మూసుకొని పోవడం, నెమ్ము చేరడం వంటివి జరుగుతూ ఉండేవి. ఆ కారణం చేత ఆయన తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుండి మొన్న చేయించుకున్న సర్జరీ కారణంగా పవన్ కళ్యాణ్ కి శాశ్వత విముక్తి కలిగింది. ఇప్పుడు రొటేటర్ కఫ్ సర్జరీ ని చేయించుకున్న తర్వాత ఈ సమస్య నుండి కూడా ఆయన దూరం కానున్నారు.

జబర్దస్త్ 'ఫైమా' పెళ్ళికి వెలకట్టలేని బహుమతి ఇచ్చిన నాగబాబు.. వీడియో వైరల్..

Fima Nagababu

Jabardasth Faima : ఈటీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు ఫైమా. ఈమె కామెడీ టైమింగ్ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాదు , ఈటీవీ లో ప్రతీ బుధ, గురువారాల్లో ప్రసారమయ్యే ‘ఢీ 20 ‘ షోలో కూడా ఆమె ఒక మెంటర్ గా వ్యవహరిస్తోంది. వీటితో పాటు ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో , పండగ ఈవెంట్స్ లలో తరుచు కనిపిస్తూ ఉంటుంది ఫైమా. అంతకు ముందు ఈమె ‘బిగ్ బాస్ 6’ లో ఒక కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నది. ప్రేక్షకులకు ఈ షో ద్వారా ఈమె ఇంకా బాగా దగ్గరైంది. ఈ షో పూర్తి అయిన వెంటనే ఆమె అనేక స్టార్ మా ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొన్నది.

‘బీబీ జోడీ 1’ షోలో ఈమె టైటిల్ విన్నర్ గా కూడా నిల్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక అదే ఛానల్ లో అప్పుడప్పుడు ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే టాప్ కామెడీ షోలో పాల్గొనేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ , స్టార్ మా ఛానల్ కి గుడ్ బై చెప్పి , మళ్లీ ‘జబర్దస్త్’ షో లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గానే ఈమె ప్రవీణ్ నాయక్ అనే అతన్ని పెళ్లాడింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. నిత్యం ఇన్ స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉండే ఫైమా , తన రోజువారీ దినచర్య ని తన ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అలా ఆమె తన పెళ్ళికి నాగబాబు ఇచ్చిన బహుమతి గురించి చెప్తూ ఎంతగానో మురిసిపోయింది.

ఆమె మాట్లాడుతూ ‘నా పెళ్ళికి నాగబాబు రాలేదు కానీ , ఈరోజు షూటింగ్ కి వెళ్ళినప్పుడు నాకు ఈ డబ్బులు బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సార్ నన్ను చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్ల , నేను ఇంకా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది ఫైమా. ఈమెకు డబ్బులు కొత్తేమి కాదు , కానీ నాగబాబు ప్రేమతో గుర్తు పెట్టుకొని మరీ ఈమెకు ఈ డబ్బులు బహుమతిగా ఇవ్వడం అనేది , నిజంగా వెలకట్టలేని బహుమతే అని చెప్పొచ్చు. ఈమధ్యనే నాగబాబు జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఈ షో కి వచ్చినప్పటి నుండి టీఆర్ఫీ రేటింగ్స్ మెరుగుపడ్డాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

చిరంజీవి డెడికేషన్ ఏంటి సామి...ఒక్క దానికోసం12 గంటల పాటు కష్టపడ్డాడుగా

Chiranjeevi
Chiranjeevi

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతుంది. స్టార్ హీరోలతో పాటుగా సీనియర్ హీరోలు, టాప్ హీరోయిన్స్ సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సీనియర్ హీరో అయిన చిరంజీవి సైతం ఈ ఏజ్ లో కూడా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరు శభాష్ అంటున్నారు. మెగాస్టార్ అంటే ఏంటో తను పడే కష్టాన్ని చూస్తే అర్థమవుతుందని మరి కొంతమంది అంటున్నారు. నిజానికి ఆయన ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. రీసెంట్ గా జరిగిన షెడ్యూల్లో వర్షం సీక్వెన్స్ ను చిత్రీకరించారట. ఈ షూట్లో చిరంజీవి 12 గంటల పాటు సెట్లోనే ఉండి మొత్తాన్ని అనుకున్న విధంగా కంప్లీట్ చేశారట.

షాట్ గ్యాప్ లో ఆయన క్యారవన్ కి కూడా వెళ్లలేదట. మొత్తానికైతే ఒక దృఢ సంకల్పంతో ఆ సీక్వెన్స్ మొత్తాన్ని 12 గంటల్లో అయిపోగొట్టాలనే ఉద్దేశ్యంతో చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రష్మిక మందానా సైతం ప్రస్తుతం ‘మైసా’ అనే సినిమా చేస్తుంది.

ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతుందట. అండర్ వాటర్ లో చిత్రీకరించాల్సిన కొన్ని సన్నివేశాల కోసం ఆమె విపరీతంగా కష్టపడుతుంది. ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆమె ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఈ సినిమా దర్శకుడు రవీంద్ర పుల్లె సైతం ఈ సినిమాలో రష్మిక విపరీతంగా కష్టపడుతుంది అంటూ ఆమె గురించి పొగుడుతూ కొన్ని కామెంట్లు చేశాడు.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ అయితే హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కుతుంది కాబట్టి రష్మిక మందానకి చాలా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి… మొత్తానికైతే యంగ్ హీరోలు, హీరోయిన్లు, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సినిమా కోసం విపరీతంగా కష్టపడుతుండటం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది…

సెల్ టవర్లు లేకున్నా, నెట్ వర్క్ లేకపోయినా ఫోన్ చేసుకోవచ్చు..SMS పంపొచ్చు.. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసా..

BSNL Global Satellite Service
BSNL Global Satellite Service

BSNL Global Satellite Service: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దేశంలో సరికొత్త గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సేవలను అధికారికంగా అందుబాటులోకి తెచ్చింది. సాధారణ మొబైల్ టవర్లు లేదా సెల్యులార్ నెట్‌వర్క్‌లు అస్సలు పని చేయని మారుమూల ప్రాంతాల్లో సైతం ఈ ఫోన్ ద్వారా నిరంతరాయంగా వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే SMSలు పంపుకోవచ్చు. ‘సరిహద్దులు లేని కనెక్టివిటీ’ అనే నినాదంతో వస్తోన్న ఈ ఫోన్ ధర తెలిస్తే షాక్ తినడం ఖాయం. ఎందుకంటే?

ఈ సరికొత్త శాటిలైట్ ఫోన్ ఇన్మార్శాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్ ప్రొవైడర్ల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల లాగా కాకుండా, ఇది నేరుగా అంతరిక్షంలోని శాటిలైట్లతో అనుసంధానమై ఉంటుంది. అందువల్ల దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, సముద్ర తీరాలు ల్యాండ్ లైన్ లేదా మొబైల్ సిగ్నల్స్ లేని ‘ఆఫ్-గ్రిడ్’ ప్రాంతాలలో కూడా ఇది అద్భుతమైన కనెక్టివిటీని అందిస్తుంది.

కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ హ్యాండ్‌సెట్‌ను అత్యంత పటిష్టంగా రూపొందించారు. ధూళి, నీరు, ప్రమాదవశాత్తు కింద పడినా పాడవకుండా ఉండేలా దీని బాడీ ఉంటుంది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా సుదీర్ఘ కాలం పాటు వినియోగించుకోవడానికి వీలుగా ఇందులో అత్యంత ఎక్కువ కాలం మన్నిక నిచ్చే ‘లాంగ్-లాస్టింగ్’ బ్యాటరీని అమర్చారు. అంతేకాకుండా, ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు తక్షణమే సహాయం పొందేందుకు వీలుగా ఇందులో ఒక ప్రత్యేకమైన ‘SOS ఎమర్జెన్సీ సపోర్ట్’ బటన్‌ను కూడా ఇచ్చారు.

అయితే ఈ శాటిలైట్ ఫోన్ సాధారణ ప్రజల దైనందిన అవసరాల కోసం ఉద్దేశించినది కాదు. దేశ రక్షణ రంగాలు (Defence), విపత్తు నిర్వహణ సంస్థలు (Disaster Management), మైనింగ్ (గనుల తవ్వకం), మారుమూల పారిశ్రామిక ప్రాజెక్టులు, సముద్రయానం చేసే నౌకల సిబ్బందికి ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అలాగే హిమాలయాల వంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లే సాహసయాత్రికులు (Trekkers) అమర్‌నాథ్, కేదార్‌నాథ్ వంటి కఠినతరమైన పుణ్యక్షేత్రాల యాత్రికులకు అత్యవసర సమయాల్లో ప్రాణాలు రక్షించే కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది.

భారతదేశంలో శాటిలైట్ ఫోన్ల వినియోగంపై టెలికాం శాఖ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. కాబట్టి, ఈ ఫోన్‌ను ఎవరైనా సాధారణ మొబైల్ లాగా నేరుగా మార్కెట్లో కొనుగోలు చేయడానికి వీలుండదు. ఈ డివైజ్‌ను పొందాలనుకునే వ్యక్తులు లేదా సంస్థలు కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ నుంచి ముందస్తుగా అధికారిక అనుమతి పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ముందస్తు అనుమతి లేకుండా శాటిలైట్ ఫోన్ కలిగి ఉండటం లేదా వాడటం భారతదేశ చట్టాల ప్రకారం నేరం అవుతుంది.

ఈ సరికొత్త BSNL శాటిలైట్ ఫోన్ ధర అన్ని పన్నులతో కలుపుకుని రూ. 1,34,166 గా నిర్ణయించారు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు నేరుగా తమ సమీప BSNL కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించి ప్రభుత్వ మరియు వాణిజ్య అవసరాల కోసం నెలవారీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను కూడా BSNL ప్రవేశపెట్టింది.

ప్రాంక్ కాల్ చేసిన అక్కినేని అఖిల్ ని ఒక రేంజ్ లో ఆడుకున్న అభిమాని.. వీడియో వైరల్..

Akhil Prank Call
Akhil Prank Call

Akhil Prank Call: మూడేళ్ళ సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అఖిల్ ఎన్నడూ లేని విధంగా విన్నూత రీతిలో ప్రొమోషన్స్ చేయడం మొదలు పెట్టారు. అఖిల్ లోని ఈ సరికొత్త యాంగిల్ ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు మేము చూస్తున్నది నిజంగా అఖిల్ నేనా?, ఇలా మారిపోయాడేంటి?, ఒక సినిమా ప్రొమోషన్స్ లో ఈ రేంజ్ డెడికేషన్ చూపించడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఆయన ఉత్సాహం చూస్తుంటే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చిందో అర్థం అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన గెటప్ శ్రీను , అఖిల్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ని నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూ లో అఖిల్ ఒక అభిమాని కి ప్రాంక్ కాల్ చెయ్యగా అది బాగా వైరల్ అయ్యింది.

ఎదో ఒక నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుదాం , వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని సరదాగా ఈ ప్రాంక్ కాల్ చేశారు. అయితే ఈ ప్రాంక్ కాల్ లో అభిమాని అఖిల్ , గెటప్ శ్రీనులతో చెడుగుడు ఆడుకున్నారు. అఖిల్ ఫోన్ చేసిన వెంటనే ‘హలో సార్.. నేను అఖిల్ ని మాట్లాడుతున్నాను’ అని అనగానే ‘ఏ అఖిల్ ?’ అంటూ ఆ అభిమాని అడుగుతాడు. ‘అఖిల్ అక్కినేని ‘ అని అఖిల్ చెప్పగానే ‘నేను నాగార్జున ని మాట్లాడుతున్నాను , మీరెవరు? ‘ అని అభిమాని అంటాడు. అప్పుడు అఖిల్ ‘నేను నిజంగానే అఖిల్ నే సార్’ అని అనగా, ‘తెలుసు నాన్న.. నాగ చైతన్య ఎలా ఉన్నాడు?..చెప్పు ఇప్పుడు’ అని అంటాడు ఆ అభిమాని. అప్పుడు అఖిల్ ‘మీరు ఏమి చేస్తుంటారు బాస్’ అని అడుగుతాడు.

‘నేనా.. అసలు మీరు ఎవరు నాకు కాల్ చేశారు’ అని ఆ అభిమాని అడగ్గా, ‘ప్రామిస్ సార్ నేను అక్కినేని అఖిల్ ని’ అని అంటాడు అఖిల్. అప్పుడు ఆ అభిమాని ANR వాయిస్ తో మిమిక్రీ చేస్తూ ‘నాకు తెలుసు.. నా మనవడు వాయిస్ ని గుర్తు పట్టలేనని అనుకుంటున్నారా నాన్న’ అంటూ బదులిస్తాడు ఆ అభిమాని. అలా చాలా సరదాగా సాగిపోయిన ఈ ప్రాంక్ కాల్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో గెటప్ శ్రీను తో కూడా ఆ అభిమాని చెడుగుడు ఆదుకుంటాడు. చివరికి నీకు దండం బాబు అని కాల్ చేస్తారు. భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది , మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

ఏ అలవాటుతో ఏ అవయవం దెబ్బతింటుందో తెలుసా..

Bad Habits And Health
Bad Habits And Health

Bad Habits And Health: ఆధునిక జీవనశైలిలో చాలా మంది తెలియకుండానే కొన్ని చెడు అలవాట్లను అలవర్చుకుంటున్నారు. ఇవి మొదట్లో పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, కాలక్రమేణా శరీరంలోని కీలక అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిలోనూ మార్పులు చేసుకోవడం అవసరం. అయితే ఏ అలవాటు ఏ అవయవంపై ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

అతిగా మద్యం సేవిస్తే ప్రమాదంలో లివర్ :
లివర్ శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తరచూ, అధికంగా మద్యం సేవించడం వల్ల లివర్ కణాలు దెబ్బతింటాయి. దీంతో ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ హెపటైటిస్, లివర్ సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కొన్నిసార్లు లివర్ పనితీరు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

తగినంత నీరు తాగకపోతే కిడ్నీలపై భారం:
శరీరంలో వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపించే పని కిడ్నీలు చేస్తాయి. రోజూ సరిపడా నీరు తాగకపోతే మూత్రం గాఢంగా మారి అందులోని ఖనిజ లవణాలు పేరుకుపోతాయి. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా కిడ్నీల పనితీరు కూడా క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే రోజంతా తగినంత నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

ధూమపానం వల్ల ఊపిరితిత్తులు బలహీనం:
సిగరెట్, బీడీ వంటి పొగాకు ఉత్పత్తుల్లో వేలాది హానికర రసాయనాలు ఉంటాయి. ఇవి నేరుగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. ధూమపానం వల్ల దీర్ఘకాలిక దగ్గు, శ్వాసకోశ వ్యాధులు, COPD, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. పరోక్ష ధూమపానం కూడా ఇతరుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

నిద్రలేమితో మెదడుకు చేటు:
రోజూ సరిపడా నిద్ర లేకపోతే మెదడు విశ్రాంతి పొందదు. దీంతో జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీర్ఘకాలం నిద్రలేమి కొనసాగితే గుండె జబ్బులు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్ చూస్తే కళ్లకు నష్టం:
డిజిటల్ పరికరాలను గంటల తరబడి ఉపయోగించడం వల్ల కళ్లపై అధిక ఒత్తిడి పడుతుంది. దీంతో కళ్లు పొడిబారడం, మంట, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. దీనిని డిజిటల్ ఐ స్ట్రెయిన్ అంటారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును చూడడం వంటి ’20-20-20′ నియమాన్ని పాటించడం ఉపయోగకరంగా ఉంటుంది.

జంక్ ఫుడ్ జీర్ణవ్యవస్థకు హానికరం:
పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి జంక్ ఫుడ్‌లో కొవ్వు, ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో పాటు ఊబకాయం, కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

ఉదయం సూర్యరశ్మికి దూరమైతే ఎముకలు బలహీనం:
ఉదయం మితమైన సూర్యరశ్మి శరీరంలో విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్-డి లోపిస్తే కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రతిరోజూ కొద్దిసేపు ఉదయం సూర్యరశ్మిలో ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మంచి అలవాట్లే ఆరోగ్యానికి రక్షణ
ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చెడు అలవాట్లకు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యం. మద్యం, ధూమపానం వంటి అలవాట్లను మానేయడం, రోజూ తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, డిజిటల్ పరికరాల వినియోగాన్ని పరిమితం చేయడం వంటి చిన్నచిన్న మార్పులు దీర్ఘకాలంలో శరీరంలోని అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అలా వచ్చిన మహిళలు.. మండిపడ్డ సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్

Chandrababu
Chandrababu

Chandrababu: ప్రస్తుతం దేశం లో ప్రజలతో మమేకమై పరిపాలన చేస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. జనాలతో కలిసి భోజనం చేయడం , వాళ్ళతో కలిసి బస్సు ప్రయాణం చేస్తూ బాగోగులు అడిగి తెలుసుకోవడం , అర్జీలు స్వయంగా స్వీకరించి వారి సమస్యలకు పరిష్కారం చూపడం , ఇలా ఒక్కటా రెండా ఎన్నో సందర్భాలు ఆయన్ని జనాలకు అత్యంత చేరువ చేశాయి. గతంలో పని చేసిన కొంతమంది ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు పలు సందర్భాల్లో సహనం కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సహనం కోల్పోలేదు , ఎలాంటి పరిస్థితి వచ్చినా చాలా కూల్ గానే మాట్లాడేవారు. కానీ మొదటిసారి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో , పిటీషన్ పట్టుకొని వచ్చిన ఒక మహిళపై మండిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

చంద్రబాబు లోని ఈ కోపాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నేడు బనగానేపల్లె లో ‘మీ భూమి – మీ హక్కు’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమం లో ఒక మహిళా పిటీషన్ పట్టుకొచ్చి రచ్చ చేయడం తో ఆయన మండిపడ్డారు. ఆయన ఆ మహిళతో మాట్లాడుతూ ‘వినమ్మా.. విను.. కొత్తగా నేర్చుకున్నారు ఈమధ్య డ్రామాలు. ఆ పక్కన ఉండు , మీరు ఎవరైనా సరే మీరు అర్జీలు ఇవ్వాలంటే , ఆ పక్కనే వచ్చి తీసుకుంటాను , మర్యాదగా మాట్లాడుతాను, అంతే తప్ప మధ్యలో మాట్లాడితే మంచిది కాదు’ అంటూ మండిపడ్డారు. అంతే కాకుండా పోలీసులకు ‘వాళ్ళని అటు పక్కన నిల్చోబెట్టండి.. ఫోర్స్ గా తీసుకెళ్ళకండి’ అంటూ ఆదేశించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఎవరైనా సరే ఇక్కడ ఏదైనా కాగితం ఇవ్వాలంటే, ప్రత్యేకంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడుతా, మీ చెప్పే సమస్యలన్నీ విని పరిష్కారం చేయిస్తా ‘ అంటూ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు నాయుడు ఇలా అర్జీలు పట్టుకొని వచ్చిన వారిపై అరవడాన్ని వైసీపీ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. సమస్యలు చెప్పుకుందామని వస్తే, చంద్రబాబు వాళ్లపై ఎలా మండిపడుతున్నారో చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆ సభలో సీఎం చంద్రబాబు ఈ అర్జీల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి , వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కలెక్టర్ కి వివరించారని , దాని సంగతి చూపించకుండా , ఇలా సగం సగం వీడియోలు కట్ చేసి సీఎం పై విష ప్రచారం చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇక వర్కౌట్లు అవసరం లేదు.. రోజూ 15 నిమిషాలు ఇలా చేస్తే.. ఆరోగ్యం మీ సొంతం.. ఏం చేయాలంటే..

15 Minute Walk Benefits
15 Minute Walk Benefits

15 Minute Walk Benefits: ప్రస్తుత బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే గంటల తరబడి జిమ్‌లో చెమటోడ్చాల్సిందేనని చాలా మంది భావిస్తుంటారు. కానీ వైద్య నిపుణులు మాత్రం అలాంటి అపోహలు అవసరం లేదని అంటున్నారు. ప్రతిరోజూ కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు నడిచినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు. అయితే ఈ నడక క్రమపద్ధతిలో ఉండాలని, ఇలా చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అసలు క్రమపద్ధతిలో నడక అంటే ఎలా ఉంటుంది?

సాధారణంగా చాలా మంది వాకింగ్ అనగానే నెమ్మదిగా నడుస్తూ ఉంటారు. కానీ ప్రతిరోజూ వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా నడవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోజువారీ నడక వల్ల శరీరంలో శక్తి పెరిగి అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గి ప్రశాంతత కలుగుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం.. పెద్దలు వారానికి 150 నుంచి 300 నిమిషాల పాటు మితమైన శారీరక వ్యాయామం చేయడం మంచిది. ఇందులో వేగంగా నడవడం, సైక్లింగ్, ఈత, జాగింగ్ వంటి వ్యాయామాలు ఉండొచ్చు. ఇవి శరీరాన్ని చురుకుగా ఉంచడమే కాకుండా మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

కేవలం కార్డియో వ్యాయామాలే కాకుండా వారానికి కనీసం రెండుసార్లు కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. స్క్వాట్స్, పుష్‌అప్స్, తేలికపాటి బరువులతో చేసే వ్యాయామాలు లేదా యోగా వంటి కార్యకలాపాలు కండరాల బలం పెంచి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. వయసు పెరిగే కొద్దీ కండరాల బలహీనతను తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.

చాలామంది రోజుకు 10 వేల అడుగులు నడవాలనే లక్ష్యాన్ని ఒత్తిడిగా తీసుకుంటుంటారు. అయితే ఆరోగ్యానికి అది తప్పనిసరి కాదని వైద్యులు చెబుతున్నారు. మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా, మీకు నచ్చిన వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయడం మరింత ముఖ్యమని సూచిస్తున్నారు. తక్కువ సమయం అయినా ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని అంటున్నారు.

వ్యాయామంతో పాటు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, ఒత్తిడి నియంత్రణ, స్థిరమైన జీవనశైలి కూడా ఆరోగ్యానికి కీలకం. రోజుకు 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర శరీరానికి విశ్రాంతిని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉండాలంటే భారీ లక్ష్యాల కంటే చిన్న చిన్న అలవాట్లను ప్రతిరోజూ పాటించడం ఎంతో ప్రభావవంతం. రోజుకు 10-15 నిమిషాల నడక, వారానికి తగినంత వ్యాయామం, కండరాల బలోపేతానికి శిక్షణ, సరైన నిద్ర, సమతుల్య జీవనశైలిని అలవాటు చేసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మరింత పెరుగుతాయి.

లెనిన్ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్ అయిందిగా... అదేంటి అఖిల్ ఆయన్ని చంపాడు...

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Akkineni: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయంటూ అఖిల్ ఒక ఈవెంట్లో చాలా ప్రౌడ్ గా చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ ట్విస్టులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక అఖిల్ సైతం తన తోటి హీరోలందరు పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ ను సాధిస్తుంటే తను మాత్రం ఒక సక్సెస్ ని సాధించడానికి కూడా నానా తంటాలు పడుతున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలపాటు వెయిట్ చేయాల్సిందే…

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాలో భారీ ట్విస్టులు ఉన్నాయట. ఇంటర్వ్యూలో అఖిల్ తన వెంట తిరిగే ఒక నటుడిని ఇంటర్వెల్ లో నరికి చంపుతాడట. అసలు ఆయన అలా ఎందుకు నరికాడు. సినిమా మొదట్నుంచి చాలా సన్నిహితంగా ఉన్న ఆ నటుడిని అఖిల్ ఎందుకు నరికాడు దాని వెనుక గల కారణం ఏంటి అనేది మనకి సెకండాఫ్ లో రివిల్ అవుతుందట.

ఇక ఏది ఏమైనా కూడా ఈ ట్విస్ట్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతుందని చెబుతున్నారు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ లో భారీ రేంజ్ లో ఉండబోతుందట. ట్విస్ట్ ఏంటి అనేది రివిల్ చేయడం లేదు కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం సినిమా యూనిట్ కి హైలెట్ అవ్వబోతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్స్ చేస్తున్నారు…

ఇక ఈ సినిమా సక్సెస్ అయితే అఖిల్ టాప్ లెవల్ లో నిలబడతాడు లేకపోతే మాత్రం చాలా వరకు డౌన్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఇక నాగార్జున సైతం ఈ సినిమా మీద స్పెషల్ కేర్ తీసుకొని మరి సినిమాని రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ లో ఆడుతుంది ప్రేక్షకులను మెప్పించగలుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

సుకుమార్ రెమ్యూనరేషన్ లో తన టీమ్ కి ఎంత చెల్లిస్తాడంటే...

Sukumar
Sukumar

Sukumar: ఒక సినిమా సక్సెస్ లో దర్శకుడు కీలకపాత్ర వహిస్తాడు. ఆయన రాసుకున్న కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. ఇక ఇలాంటి ఈ క్రమంలోని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటి ఉన్న కొంత మంది దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు సుకుమార్ చేసిన సినిమాలు సైతం అలాంటివే కావడం విశేషం… ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా అందులో తన మార్క్ కనిపిస్తుంది. డిఫరెంట్ గా సినిమాని ప్రజెంట్ చేయడంలో ఆయన ఎప్పటికప్పుడు కొత్త పంథాను వాడుతూ ఉంటాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసిన ఆయన ‘పుష్ప 2’ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…

ఇప్పటివరకు తను సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రేక్షకులందరిలో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరికంటే సుకుమార్ తన టీమ్ కి ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ చెల్లిస్తుంటారట…ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నా కూడా తన టీమ్ కి మాత్రం హైయెస్ట్ పెయిడ్ అయితే చేస్తూ ఉంటారని పలువురు అతని దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసే వాళ్లు, రైటింగ్ సైడు వర్క్ చేసే వాళ్ళు సైతం చెబుతున్నారు.

అందుకే సుకుమార్ దగ్గర క్వాలిటి ప్రొడక్ట్స్ వస్తున్నాయని ఆయన ప్రతి ఒక్కరికి పేమెంట్ చేస్తాడని, అందుకే అతని దగ్గర చాలా మంది ఇష్టపడి పని చేస్తూ ఉంటారని చెబుతుంటారు. ఇక ఏది ఏమైనా కూడా సుకుమార్ రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యాలను ప్రదర్శిస్తూ భారీ విజయాలను సాధిస్తే చూడాలని అతని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…