Homeటాప్ స్టోరీస్Kavitha : కవిత అడుగుతోంది.. కెసిఆర్ 1400 కోట్ల లెక్క చెప్పాల్సిందే..

Kavitha : కవిత అడుగుతోంది.. కెసిఆర్ 1400 కోట్ల లెక్క చెప్పాల్సిందే..

Kavitha : కవిత దాపరికాన్ని ప్రదర్శించడం లేదు. ఓపెన్ గానే అడుగుతోంది.. అసలు మీ గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదాలో మాట్లాడే హక్కు ఎక్కడదని.. తల్లిని, చెల్లిని సరిగ్గా చూడని మీకు తెలంగాణ ప్రజలను పాలిస్తామని చెప్పే రైట్ ఎక్కడిదని.. కేటీఆర్ గ్యాంగ్ కు కూడా హెచ్చరిక చేస్తోంది.. మీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ యూత్ ఉందని.. తిక్క తిక్క వేషాలు వేస్తే కాళ్లు విరగొడతామని ఓపెన్ గానే సవాల్ విసురుతోంది. సోషల్ మీడియాలో […]

Kavitha : కవిత దాపరికాన్ని ప్రదర్శించడం లేదు. ఓపెన్ గానే అడుగుతోంది.. అసలు మీ గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదాలో మాట్లాడే హక్కు ఎక్కడదని.. తల్లిని, చెల్లిని సరిగ్గా చూడని మీకు తెలంగాణ ప్రజలను పాలిస్తామని చెప్పే రైట్ ఎక్కడిదని.. కేటీఆర్ గ్యాంగ్ కు కూడా హెచ్చరిక చేస్తోంది.. మీ దగ్గర కంటే నా దగ్గర ఎక్కువ యూత్ ఉందని.. తిక్క తిక్క వేషాలు వేస్తే కాళ్లు విరగొడతామని ఓపెన్ గానే సవాల్ విసురుతోంది. సోషల్ మీడియాలో తన ఫోటో మార్ఫింగ్ చేసి వీడియోలు.. పోస్టులు పెడుతున్న వారికి హెచ్చరిక చేసింది.

గురువారం విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడిన మాటల్లో రెండు అంశాలు మాత్రం చాలా పదనుగా ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రదీప్ కన్స్ట్రక్షన్స్. కేటీఆర్ కు చెందినదని చెబుతున్న జన్వాడ వ్యవసాయ క్షేత్రం నిర్మించింది ఇదే ప్రదీప్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ. ఈ కంపెనీ ఆంధ్ర వ్యక్తికి చెందింది. ఇటీవల మణికొండ ప్రాంతంలో ఈ కంపెనీ నిషేధిత భూములలో బహుళ అంతస్తులు నిర్మించింది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీనికి అడ్డగోలుగా ఎన్వోసీ ఇచ్చారు. ఇటీవల హైడ్రా దీనిమీద ఫోకస్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ప్లాట్లు కొనుగోలు చేయకూడదని ప్రజలకు అప్పీలు కూడా చేసింది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. అంతేకాదు ఈ వ్యవహారం గురించి లోతుగా దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నాడు కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కంపెనీ చేసిన మేళ్ల గురించి ప్రభుత్వానికి అనేక విషయాలు తెలిసాయి. అందువల్లే ప్రదీప్ కన్స్ట్రక్షన్ కంపెనీ గురించి ఇటీవల మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ప్రదీప్ కన్స్ట్రక్షన్ కు జన్వాడ వ్యవసాయ క్షేత్ర నిర్మాణానికి బలమైన సంబంధం ఉండడం.. ప్రభుత్వం మీడియాకు అనేక లీకులు ఇవ్వడంతో కేటీఆర్ బృందం అలర్ట్ అయింది. సోషల్ మీడియాలో ఏవో నాలుగు పోస్టులు పెట్టింది కానీ.. అందులో నిజం లేదు. నిబద్ధత కనిపించలేదు. దీనికి తోడు కవిత ప్రదీప్ కన్స్ట్రక్షన్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు కారు పార్టీలో ఉన్న 1400 కోట్ల గురించి కవిత పదేపదే ప్రస్తావిస్తున్నారు. అదంతా కూడా అవినీతి సొమ్ము అని.. ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బు అని కవిత ప్రశ్నిస్తోంది. కవిత ఇలా ప్రశ్నించడం.. ఇలా నిగ్గదీసి అడగడం తొలిసారి కాక పోయినప్పటికీ.. ఈసారి ఏకంగా తన తండ్రినే సవాల్ చేసింది. మరి దీనిపై గులాబీ పార్టీ ఏ విధంగా కౌంటర్ ఇస్తుంది.. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెబుతుంది.. చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper