Home Blog Page 7

వచ్చేస్తోంది ‘ఆషాఢం’.. ఈ నెలలో ఈ 5 పనులు ఎందుకు చేయరు..

Ashada Masam
Ashada Masam

Ashada Masam: తెలుగు సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే చాలామంది ఈ మాసం వస్తుందంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో కొత్త పనులు, వివాహాలు, గృహప్రవేశాలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఆషాఢం కూడా ఒకటి అని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ నెలలో ఎన్నో పుణ్యపర్వాలు, వ్రతాలు, దేవతారాధనలు జరుగుతాయి. కాబట్టి ఆషాఢాన్ని పూర్తిగా అశుభమాసంగా భావించడం సరైనది కాదని పండితులు చెబుతున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం తర్వాత ఆషాఢ మాసం వస్తుంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జులై 15న ప్రారంభమై ఆగస్టు 12న ముగుస్తుంది. మరి ఆషాఢ మాసంలో ఈ పనులు ఎందుకు చేయరు?

ఆషాఢం ఎందుకు పవిత్రమైనదే..:
ఈ నెలలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాస్య వ్రతాలు కూడా ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి. సాధువులు, సన్యాసులు ఒకే ప్రాంతంలో ఉండి తపస్సు, ధ్యానం, శాస్త్ర అధ్యయనం చేస్తారు. భక్తులు ఉపవాసాలు, దానధర్మాలు, దేవాలయ దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆషాఢాన్ని భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా భావిస్తారు.

గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దీనికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలూ ఉన్నాయి. వర్షాకాలంలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా గోరింటాకు చల్లదనాన్ని అందిస్తుంది. చేతులు, కాళ్లలో వేడి తగ్గించి చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే సౌభాగ్యానికి ప్రతీకగా భావించి వివాహిత మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు. తెలంగాణలో బోనాల సందర్భంగా కూడా గోరింటాకుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.

ఆషాఢంలో పెట్టుబడులకు ఎందుకు భయం?
చాలామంది ఆషాఢంలో వ్యాపారాలు ప్రారంభించకూడదు, పెట్టుబడులు పెట్టకూడదని నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రీయంగా లేదా చట్టపరంగా ఎలాంటి ఆధారం లేదు. గతంలో వ్యవసాయ ఆధారిత సమాజంలో వర్షాకాలం ప్రారంభమయ్యే సమయం కావడంతో పెద్ద ఆర్థిక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసేవారు. ఆ ఆచారమే క్రమంగా సంప్రదాయంగా మారింది. నేటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనేది ఆర్థిక పరిస్థితులు, మార్కెట్ విశ్లేషణ ఆధారంగా నిర్ణయించుకోవాలి.

మాంసాహారం తింటే సమస్యేనా?
ఆషాఢం నుంచి వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో జీర్ణక్రియ కొంత మందగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే వర్షాకాలంలో సూక్ష్మజీవులు వేగంగా పెరిగే అవకాశం ఉండటంతో మాంసాహారం త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ కాలంలో మాంసాహారాన్ని తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవాలని పెద్దలు సూచించారు. ఇది ఆరోగ్య రీత్యా తీసుకున్న జాగ్రత్తగా భావించాలి. అయితే వైద్యపరంగా పూర్తిగా నిషేధం అనే విషయం కాదు. పరిశుభ్రంగా వండిన, సురక్షితమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.

కొత్త జంట ఎందుకు దూరంగా ఉండాలి?
ఆషాఢంలో కొత్తగా పెళ్లైన దంపతులు కొంతకాలం విడిగా ఉండే ఆచారం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి. గతంలో పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరిగేవి. ఆ వెంటనే వచ్చే వర్షాకాలంలో ప్రయాణాలు కష్టంగా ఉండటం, వ్యవసాయ పనులు ప్రారంభం కావడం వల్ల వధువు కొంతకాలం పుట్టింట్లో ఉండే సంప్రదాయం ఏర్పడింది. అలాగే గర్భధారణ జరిగితే ప్రసవ సమయం తీవ్రమైన వేసవిలో పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ ఆచారం ఏర్పడిందని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని మతపరమైన నిషేధంగా కాకుండా సామాజిక సంప్రదాయంగా చూడాలి.

ఈ నెలలో వివాహాలు ఎందుకు చేయరు?
ఆషాఢంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడనే విశ్వాసంతో వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ముహూర్తాలు సాధారణంగా నిర్ణయించరు. అయితే ఇది హిందూ జ్యోతిష్య సంప్రదాయంలో భాగం మాత్రమే. అత్యవసర పరిస్థితుల్లో పండితుల సూచనలతో ప్రత్యేక ముహూర్తాలు కూడా నిర్ణయించే సందర్భాలు ఉన్నాయి.

చైనా ప్రజలకు కొత్త ముప్పు..!

China Floods
China Floods

China Floods: డ్రాగన్‌ కంట్రీ చైనాలో ఎప్పుడు ఎలాంటి ముప్పు ఉంటుందో తెలియడం లేదు. వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికించింది. తర్వాత అనేక వ్యాధులకు కారణమైన వైరస్‌లు కూడా చైనాలోనే మొదలయ్యాయి. దీంతో అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇక చైనాలో ప్రకృతి విపత్తులు సర్వ సాధారణం. వర్షాలు, వరదలు, కరువు, మంచు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు ఇలా అనేకం సంభవిస్తుంటాయి. తాజాగా చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో తీవ్ర వరదలు సాధారణ విపత్తును మించి మరో ప్రమాదాన్ని తీసుకువచ్చాయి. సర్పాల పెంపక కేంద్రాలు నీటిలో మునిగిపోయాయి. దీంతో వందలాది పాములు వెలుపలకు వచ్చాయి. ఇందులో విషపూరిత జాతులు కూడా ఉండటం ప్రజల్లో ఆందోళనను పెంచింది. ఈ సంఘటన విపత్తుల సమయంలో జంతు పెంపక వ్యవస్థలు ఎలా అదనపు ముప్పుగా మారతాయో చూపిస్తుంది.

వరద విపత్తు..
తీవ్ర వర్షాలు, నదులు పొంగడం వల్ల పలు ప్రాంతాలు నీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, గ్రామాలు మునిగిపోవడంతో సాధారణ జీవితం స్తంభించింది. ఈ పరిస్థితి స్థానికంగా ఉన్న సర్ప పెంపక కేంద్రాలను ప్రభావితం చేసింది. వరద నీరు కేంద్రాల రక్షణ గోడలను బద్దలు కొట్టడంతో పాములు ఈదుకుంటూ బయటకు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోలు ఈ పరిస్థితిని మరింత హైలైట్‌ చేశాయి.

సర్ప పెంపక కేంద్రాల నుంచి అపాయం..
గ్వాంగ్జీ ప్రాంతం సర్పాల పెంపకానికి ప్రధాన కేంద్రం. సంప్రదాయ వైద్యం, తోలు, ఆహారం కోసం ఇక్కడ లక్షలాది సర్పాలను పెంచుతారు. వరదలు ఈ కేంద్రాలను దెబ్బతీయడంతో విషపూరిత జాతులు సహా పాములు నివాస ప్రాంతాల్లోకి చేరాయి. ఈ పరిస్థితి ప్రజల రోజువారీ కదలికలను ప్రభావితం చేసింది. పాములు నీటిలో ఈదుతున్న దృశ్యాలు భయాన్ని పెంచాయి.

సర్ప పెంపక కేంద్రాల నుంచి బయటకు వచ్చిన పాముల్లో చాలా వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పాములను పట్టుకున్నారు. ఇంకా 900 పాముల ఆచూకీ తెలియడం లేదు. దీంతో ఇవి ఇళ్లలోకి చేరితో మనుషులకు ప్రమాదమని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రశాంత్ కిషోర్ తో కీలక చర్చలు..

Allu Arjun Politics
Allu Arjun Politics

Allu Arjun Politics: తమిళనాడులో విజయ్ ముఖ్య మంత్రి అయ్యాక , అనేక మంది హీరోల్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశ పుట్టిందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. విజయ్ కి జెన్ జీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది , అంతే కాకుండా ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడిమరీ చూస్తుంటారు. దశాబ్దాల నుండి సంపాదించుకున్న క్రెడిబిలిటీ ఇది. 2008 లోనే దూరదృష్టితో తన రాజకీయ రంగ ప్రవేశం కోసం తన ఫ్యాన్స్ అస్సోసియేషన్స్ అన్నిటిని ఒక తాటిపై తీసుకొచ్చి, వాళ్ళ చేత సేవా కార్యక్రమాలు చేయిస్తూ జనాలకు బాగా దగ్గర చేశారు విజయ్. సరైన సమయం చూసుకొని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు , పోటీ చేసిన మొదటిసారే ఎన్నికల్లో సక్సెస్ అయ్యారు. విజయ్ అనుసరించిన ఈ మోడల్ అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది. అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని వైపుల నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు లేటెస్ట్ గా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

అవును.. మీరు వింటున్నది నిజమే.. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు , అందుకోసం ఆయన రెగ్యులర్ గా ప్రశాంత్ కిషోర్ తో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. ఆయన మామయ్య చంద్ర శేఖర్ కూడా తనవైపు నుండి పూర్తి సహకారం అందిస్తున్నారట. అయితే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ 2029 లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కి రాజకీయ పార్టీ ని స్థాపించేంత ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ , చరిష్మా కానీ లేదు. పుష్ప కారణం గా జెన్ జీ ఆడియన్స్ లో క్రేజ్ ఉంది కానీ , అది ఓట్లు వేసేంత రేంజ్ కాదు. అందుకే అల్లు అర్జున్ చాలా పకడ్బందీగా విజయ్ మోడల్ ని అనుసరిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆయన అభిమాన సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతీ నెల వాళ్లకు ఫండింగ్ కూడా అల్లు అర్జున్ వైపు నుండి అందుతుంది. ఈ అభిమాన సంఘాల ద్వారా ఆయన సేవా కార్యక్రమాలు చేయించే ప్లాన్ లో ఉన్నారు , ఇప్పటికే కొంతమంది కి ఆయన ఈ అభిమాన సంఘాల ద్వారా సేవా కార్యక్రమాలు చేయించారు. ఇలా సుదీర్ఘంగా ఒక దశాబ్దం పాటు చేసి , ఈ లోపు మంచి కాంబినేషన్స్ తో సినిమాలను సెట్ చేసుకొని, భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని , అన్ని వర్గాల్లోనూ ఫ్యాన్ బేస్ ని పెంచుకొని , పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. మరి ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా?, లేదా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అనేది చూడాలి. ఏది ఏమైనా అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది.

రంగస్థలం, దసరా, లెనిన్ ఈ మూడు మూవీస్ మధ్య ఉన్న సంబంధం ఇదే...

Lenin Vs Rangasthalam
Lenin Vs Rangasthalam

Lenin Vs Rangasthalam: కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సక్సెస్ ఫుల్ సినిమా వచ్చిందంటే చాలు దాని రిఫరెన్స్ తో చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమా ఎప్పుడైతే వచ్చిందో దాని ఇన్స్పిరేషన్ తో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక రకంగా శ్రీకాంత్ ఓదెల చేసిన దసరా సినిమా కూడా దానికి ఇన్స్పిరేషన్ గా వచ్చిన సినిమానే కావడం విశేషం…ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు లెనిన్ సైతం ఇలాంటి కథతోనే తెరకెక్కిందనే వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో గోదావరి జిల్లాలో ఉండే ఆ ప్రాంతపు సెటప్ తో సినిమాను చేస్తే దసరా మూవీని మాత్రం తెలంగాణ ప్రాంతాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకొని సినిమా చేశారు.

ఇక ఇప్పుడు లెనిన్ మాత్రం రాయలసీమ ప్రాంతంలో జరిగే కథగా తెరకెక్కించారు. ఈ మూడు సినిమాల కోర్ ఎలిమెంట్ అలాగే సినిమాని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అన్ని ఒకేలా ఉన్నప్పటికి బ్యాక్ డ్రాప్ మాత్రం చేంజ్ చేశారు. మొత్తానికైతే లెనిన్ సినిమాకి మొదటి షో తోనే ఓకే టాక్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాను రంగస్థలం, దసరాలతో పోల్చి చూస్తున్నారు.

దానివల్ల ఈ సినిమాకి ఏదైనా మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే అఖిల్ చాలా రోజుల తర్వాత ఒక పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడనే చెప్పాలి… ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది లాంగ్ రన్ లో ఈ సినిమాకి భారీ విజయం దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఏదేమైనా కూడా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలేవి రాకపోవడంతో భారీ విజయాన్నైతే సాధించలేకపోతున్నారు. గత నెలలో పెద్ది సినిమా వచ్చినప్పటికి ఆ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రేక్షకులందరు స్టార్ హీరో సినిమాల కోసం ఆసక్తి ఎదురుచూస్తున్నారు…

కాజల్ 10 సంవత్సరాలు ఆ స్టార్ హీరోను లవ్ చేయడానికి కారణం ఇదే...

Kajal Aggarwal Love Story
Kajal Aggarwal Love Story

Kajal Aggarwal Love Story: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటుల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉంటాయి. వాళ్ళందరు కలిసి నటిస్తారు కాబట్టి సినిమాలో సీన్స్ బాగా పండడానికి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. దీనివల్ల నటీనటుల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కాజల్ లాంటి నటిమణి సైతం చాలా మంది హీరోలతో సినిమాలను చేసింది. అయితే ఒక హీరోతో ఆమె ప్రేమలో ఉన్నట్టు ఒక సందర్భంలో ఆమె తెలియజేయడం విశేషం. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే ప్రభాస్ గా తెలుస్తుంది. డార్లింగ్ సినిమాలో తనతో పాటు నటించింది. ఆ సినిమాలో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఆన్ స్క్రీన్ మీద వీళ్ళకి కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయిందని చాలామంది కితాబ్ ఇచ్చారు.

మరి ఇలాంటి క్రమం లోనే ఆ తర్వాత ఆమె ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటారనని ఒక ప్రపోజల్ అయితే పెట్టిందట. కానీ ప్రభాస్ మాత్రం దాని మీద ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో 10 సంవత్సరాలపాటు ప్రభాస్ కోసం వెయిట్ చేసి మరి ఆమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక సందర్భంలో తెలియజేసింది.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు పెళ్లి చేసుకోవాలి అని ప్రతి ఒక్క నటిమణి కోరుకుంటుంది. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. తన లైఫ్ ని తను ఒంటరిగా జీవించాలని చాలా ఫ్రీగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా కాజల్ మాత్రం ఒక బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. అలాగే తనకి ఒక బాబు కూడా పుట్టాడు ప్రస్తుతం ఆమె కొన్ని సినిమాల్లో నటిస్తుంది. అయినప్పటికి తన బాబు ను చాలా కేర్ఫుల్ గా చూసుకోవడమే తన ప్రధాన లక్ష్యం అని చెబుతోంది…

రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లలో అందగాడు ఎవరో చెప్పేసిన కాజల్...వైరల్ వీడియో...

Kajal Aggarwal
Kajal Aggarwal

Kajal Aggarwal: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎప్పటికప్పుడు కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాళ్ళు ఏ సినిమా చేసిన కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరిలో హ్యాండ్సమ్ గా కనిపించే హీరో ఎవరు అనే ప్రశ్న ఎప్పటికప్పుడు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటుంది. అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ప్రశ్నను హీరోయిన్ కాజల్ ని అడగగా ఆమె షాకింగ్ ఆన్సర్స్ చెప్పింది…

లుక్స్ ను బట్టి ఎవరెవరికి ఎంత రేటింగ్ ఇస్తారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి కాజల్ నిర్మోహమాటంగా సమాధానం చెప్పింది. మొదటగా అల్లు అర్జున్ కి 10 కి ఎంత రేటింగ్ ఇస్తారు అని అడిగితే 6 అని చెప్పింది. ఎన్టీఆర్ కి కూడా 6 రేటింగ్ ఇచ్చింది. ప్రభాస్ కి మాత్రం వెయిట్ 8 ఇచ్చింది.

రామ్ చరణ్ కి 7 రేటింగ్ ఇచ్చింది. మొత్తానికైతే ప్రభాస్ కి 8 రైటింగ్ ఇచ్చి అందరికంటే అతను హ్యాండ్సమ్ హీరో అని కాజల్ చాలా క్లియర్ గా చెప్పేసింది. మొత్తానికైతే ఇది చూసిన మిగతా హీరోల అభిమానులు మాత్రం కాజల్ మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా హీరోలందరు అందంగానే ఉంటారు. కానీ అందులో ప్రభాస్ తన హైట్, వేటు కి తగ్గట్టుగా ఆ కటౌట్ భారీగా ఉండటంతో అతను చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా కనిపించేవాడు.

కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ లుక్స్ చాలా వరకు చెడిపోయాయి. మొత్తానికైతే కాజల్ ఒక పది సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం కాజల్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ పరంగా సెట్ అయిపోయింది. మంచి అవకాశాలు దొరికినప్పుడు మాత్రమే తను సినిమాలు చేస్తుంది. సీనియర్ హీరోల పక్కన సినిమాలు చేయడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని కూడా చెబుతుండటం విశేషం…

హీరో రామ్ తో పెళ్లి పై నోరు జారేసిన హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే ..వీడియో వైరల్..

Bhagyashri Borse
Bhagyashri Borse

Bhagyashri Borse: టాలీవుడ్ లో చాలా కాలం నుండి హాట్ టాపిక్ గా మారిన జంట రామ్ పోతినేని – భాగ్యశ్రీ భొర్సే . వీళ్లిద్దరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని , డేటింగ్ కూడా చేస్తున్నారని, భాగ్యశ్రీ హైదరాబాద్ లోని రామ్ ఇంట్లోనే ప్రస్తుతం ఉంటుందని , అనేక సార్లు కెమెరాలకు కూడా దొరికిపోయింది , ఇలా సోషల్ మీడియా లో చాలా పెద్ద ప్రచారమే జరిగింది. దీనిపై వీళ్లిద్దరు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత ఏడాది నవంబర్ 27 న వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రొమోషన్స్ సమయంలో కూడా వీళ్లిద్దరు తమ రిలేషన్ పై ఓపెన్ అవ్వలేదు. కానీ రీసెంట్ గా అభిమానులతో జరిగిన ఒక స్పెషల్ ఇంటరాక్షన్ లో భాగ్యశ్రీ రామ్ తో రిలేషన్ పై దాదాపుగా ఓపెన్ అయిపోయింది.

అభిమానులు ‘మీరు నటించిన హీరోలలో ఎవరితో స్నేహం చేస్తారు?, ఎవరితో డేటింగ్ , పెళ్లి వంటివి చేస్తారు? ‘ అని అడగ్గా, అందుకు భాగ్యశ్రీ సమాధానం చెప్తూ ‘ అక్కినేని అఖిల్ తో స్నేహం చేస్తాను, చాలా మంచి కో ఆర్టిస్ట్, ఆయనతో కలిసి పని చేయడం చాలా గొప్ప అనుభవం. ఇక పెళ్లి & డేటింగ్ విషయానికి వస్తే (పెద్దగా నవ్వుతూ) , నాతో నటించిన ప్రతీ హీరో కి దాదాపుగా పెళ్లి అయిపోయింది, కానీ ఒకే ఒక్క కో స్టార్ (రామ్ పోతినేని) కి పెళ్లి అవ్వలేదు ‘ అంటూ చివర్లో ఒక రియాక్షన్ ఇచ్చింది. ఆ రియాక్షన్ ఎలా ఉందంటే మీరంతా సోషల్ మీడియా లో మా మధ్య ఎదో ఉందంటూ ప్రచారం చేశారు కదా, అతనే అనే అర్థం వచ్చేట్టు ఉంది. భాగ్యశ్రీ ఇచ్చిన సమాధానం ఆడియన్స్ మొత్తం నవ్వారు.

అంటే సోషల్ మీడియా లో జరిగే ప్రచారం మొత్తం భాగ్యశ్రీ కి తెలుసు , అయినప్పటికీ క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదు , పైగా ప్రస్తావన తీసుకొచ్చి సిగ్గు పడడం వంటివి చూస్తుంటే కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ఎదో ఉందని అంటున్నారు నెటిజెన్స్. సోషల్ మీడియా లో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. నెటిజెన్స్ చాలా తేలికగా పసిగట్టేసారు. మరి రాబోయే రోజుల్లో ఈ జంట కూడా విజయ్ దేవరకొండ – రష్మిక లాగా షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే నేడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘లెనిన్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. భాగ్యశ్రీ కెరీర్ లో మొట్టమొదటి హిట్ అనుకోవచ్చు, చూడాలి మరి ఈ సినిమా రేంజ్ రాబోయే రోజుల్లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.

ఇదీ పాకిస్తాన్ అసలు రూపం.. ఇంతటి పైశాచికమా

POK Protests
POK Protests

POK Protests: కొద్దిరోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు రోడ్లమీదకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ధరల పెరుగుదల విపరీతంగా ఉందని.. నిత్యావసరాలు అందకుండా చేస్తున్నారని.. పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో అక్కడి ప్రజలు మండిపడ్డారు.. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ అక్కడి ప్రజలు నిరసనలు మొదలుపెట్టారు. శాంతియుతంగా ధర్నాలు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని.. వాటి పరిష్కారానికి అడుగులు వేయాల్సిన పాకిస్థాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. చివరికి ఆర్మీని రంగంలోకి దింపింది.

పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీని రంగంలో దింపిన నేపథ్యంలో అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అత్యంత హింసాత్మకంగా మారింది. పాకిస్తాన్ ఆర్మీ కనీసం విచక్షణ లేకుండా చిన్న పిల్లలను.. గర్భిణులను కాల్చి చంపింది. ఈ ఘటన పట్ల అక్కడి ప్రజల్లో మరింత ఆగ్రహం పెరిగే.. మరింత తీవ్రంగా నిరసనలు చేపట్టారు. అంతర్జాతీయంగా కూడా ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ తన సైన్యాన్ని వెనక్కి పంపింది.

పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరు పట్ల లండన్ లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. శాంతియుత చర్చలకు బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దింపి కాల్పులు జరపడం పట్ల.. ప్రజలను అరెస్టు చేయడం పట్ల అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దీనికి తోడు అక్కడి ప్రజల్లో ఉద్యమ బీజాలు నాటిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ని ఉగ్రవాద సంస్థగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అదే కాదు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కు మందులు.. ఆహారం.. కూరగాయలు.. పాఠ్యపుస్తకాల సరఫరాను నిలిపివేసింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఈ దమనకాండను బయట ప్రపంచానికి తెలియకుండా పాకిస్తాన్ నాటకాలు ఆడింది. నిజాలను కప్పి పుచ్చింది.

పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఇస్లామిక్ దేశాల సహకార సంస్థ ప్రతినిధులు ఇక్కడికి రావాలని.. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు లండన్ ప్రాంతంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విదేశాలలో స్థిరపడిన మీర్ పూరి ముస్లింలు కూడా పాకిస్తాన్ చర్యలను నిరసిస్తున్నారు. లండన్ లో భారీగా నిరసనలు చేపడుతున్నారు. ఫలితంగా పాకిస్థాన్ అసలు రంగు అంతర్జాతీయ వేదికల్లోకి ఎక్కింది. పాకిస్తాన్ అసలు రంగు బయటపడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతూ అక్కడి ప్రజలు నిరసన చేపట్టడం.. తిరుగుబాటు చేయడం భవిష్యత్ కాలంలో చోటుచేసుకునే పరిణామాలకు బలమైన సంకేతంగా నిలుస్తోంది.

సమంత బాటలో నడిచిన కలర్స్ స్వాతి...కానీ అదొక్కటి చేయకూడదు...

Colors Swathi
Colors Swathi

Colors Swathi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లు చేసే సినిమాల పట్ల చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే హీరో హీరోయిన్లు మంచి సబ్జెక్టులను ఎంచుకొని సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయిన కూడా వాళ్లకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక మంచి క్యారెక్టర్ ఉందంటే చాలు ఆయా దర్శకులకు ఈ నటీనటులు గుర్తుకు వచ్చే స్థాయిలో రాణిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి కలర్స్ స్వాతి…తను ఈ మధ్యకాలంలో సినిమాలేమి లేకుండా ఖాళీగా ఉంటుంది. అయితే ఆమె రీసెంట్ గా శ్రీకాంత్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకుంది.

మంత్ అఫ్ మధు సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీకాంత్… ఆ సినిమా చేసే సమయంలోనే కలర్స్ స్వాతి ని ఇష్టపడ్డాడు. తను కూడా అతన్ని ఇష్టపడడంతో ఇద్దరు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇంతకుముందు కలర్స్ స్వాతికి వివాహమై విడాకులు కూడా తీసుకున్నారు.

ఇక ఇలాంటి క్రమంలో శ్రీకాంత్ ను ప్రేమించడం మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకోవడం అనేది బాగానే ఉన్నప్పటికి వీరిద్దరు కలిసి ఉంటారా లేకపోతే మళ్లీ డివోర్స్ తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న చాలా మంది కలర్స్ స్వాతి సైతం సమంత బాటలో నడుస్తుందని తను నాగచైతన్య కి విడాకులు ఇచ్చిన తర్వాత రాజ్ నిడిమూరు ను పెళ్లి చేసుకుంది.

తను కూడా దర్శకుడు కావడం విశేషం…స్వాతి పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ కూడా దర్శకుడు కావడంతో కలర్స్ స్వాతి కూడా సమంత బాటలోనే నడుస్తుంది అంటు కొన్నికామెంట్స్ వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అనే విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా ఆమె మా ఇంటి బంగారం మూవీ తో సక్సెస్ ను సాధించింది. ఇక కలర్స్ స్వాతి సైతం మంచి పాత్రలు దొరికితే సినిమాలను చేస్తానని లేకపోతే సినిమాలు చేసే అవకాశం లేదన్నట్టుగా చెబుతుంది…

హర్మూజ్‌ జలసంధి ఉద్రిక్తతలు.. భారత్‌పై అమెరికా ఒత్తిడి.. కారణం ఇదే!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: హర్మూజ్‌ జలసంధి ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో కీలకమైన మార్గం. ప్రతిరోజూ లక్షల బారెల్స్‌ ఆయిల్‌ ఇక్కడి ద్వారా ప్రయాణిస్తుంది. అమెరికా ఇరాన్‌తో జరుగుతున్న గొడవలో ఈ జలసంధిని కేంద్రంగా చేసుకుని ప్రపంచ దేశాలను ఇరాన్‌పై ఒత్తిడి చేయమని నిర్దేశిస్తోంది. అమెరికా ఇరాన్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా ఒంటరిగా చేయాలని కోరుకుంటోంది. ఇరాన్‌ ఈ జలసంధిని నియంత్రించగలిగే సామర్థ్యం ఉండటం వల్ల అమెరికా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్‌ భారత్‌తో స్నేహపూర్వక సహకారాన్ని కొనసాగిస్తోంది.

భారత్‌–ఇరాన్‌ పరస్పర సహకారం..
భారత్‌ ఇరాన్‌లో 500 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడిలో చాబహర్‌ పోర్టు అభివృద్ధి, జహదాన్‌ వరకు 700 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మాణం అత్యంత ముఖ్యమైనవి. చాబహర్‌ పోర్టు ఇరాన్‌ ఆగ్నేయ తీరంలో ఉంది. ఇది అరేబియా సముద్రంలో ఉన్నందున హర్మూజ్‌ జలసంధి నుంచి దూరంగా ఉంటుంది. జహదాన్‌ రైలు మార్గం పూర్తయితే చాబహర్‌ నుంచి ఇరాన్‌ లోతట్టు ప్రాంతాలకు, ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు సులభంగా వస్తు రవాణా సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టులు భారత్‌కు దీర్ఘకాలిక వ్యూహాత్మక లాభాలను కలిగిస్తాయి.

ఈ ప్రాజెక్టులతో ప్రయోజనాలు..
ప్రాజెక్టు పూర్తయితే భారత్‌ ఇరాన్‌ నుంచి నేరుగా ఆయిల్‌ దిగుమతి చేసుకోవచ్చు. హర్మూజ్‌ జలసంధి ద్వారా వచ్చే రిస్క్‌ పూర్తిగా తగ్గుతుంది. పాకిస్తాన్‌ భూభాగం ద్వారా ఆయిల్‌ రవాణా చేయాల్సిన అవసరం ఉండదు. ఇది భారత భద్రతను బలోపేతం చేస్తుంది. అలాగే వాణిజ్యం, వస్తు రవాణా, ప్రాంతీయ కనెక్టివిటీ మెరుగుపడుతుంది. హర్మూజ్‌ జలసంధిలో ఏదైనా ఉద్రిక్తత ఏర్పడినా భారత్‌ ఆయిల్‌ సరఫరా ప్రభావితం కాకుండా ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి, ఇంధన భద్రతకు చాలా ముఖ్యమైనది.

అమెరికా ఒత్తిడి..
అమెరికా భారత్‌ను ఇరాన్‌లో పెట్టుబడి పెట్టవద్దు, వ్యాపారం చేయవద్దు అని బహిరంగంగానే ఆదేశిస్తోంది. ఇరాన్‌తో సంబంధాలు తగ్గించి తన వైపు నిలబడమని ఒత్తిడి చేస్తోంది. అయితే భారత్‌ స్పష్టమైన స్పందన ఇచ్చింది. ‘మా దేశ సార్వభౌమాధికారం మాకు ఉంది. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో మేమే నిర్ణయించుకుంటాము’ అని తేల్చి చెప్పింది. అమెరికాలో పెట్టుబడి కావాలంటే పెడతామని కూడా స్పష్టం చేసింది. ఇది భారత్‌ తన విదేశాంగ విధానంలో ఎవరి ఒత్తిడికీ లొంగకుండా స్వతంత్రంగా నిలబడుతున్నట్లు చూపిస్తుంది.

భారత్‌ స్వతంత్ర విధానం..
భారత్‌ ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్‌ దిగుమతిదారుల్లో ఒకటి. దేశ ఆర్థిక వృద్ధికి స్థిరమైన ఇంధన సరఫరా అవసరం ఎంతో ఉంది. హర్మూజ్‌ జలసంధి టెన్షన్‌లు పెరిగితే ఆయిల్‌ ధరలు పెరిగి ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుంది. అందుకే భారత్‌ ఇరాన్‌తో సహకారాన్ని కొనసాగిస్తోంది. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్‌ తన జాతీయ ప్రయోజనాలను ముందుంచి నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది బహుళ ధ్రువ ప్రపంచంలో భారత్‌ స్వతంత్ర విధానాన్ని ప్రదర్శిస్తుంది.

వ్యూహాత్మక లాభాలు
చాబహర్, జహదాన్‌ రైలు మార్గం పూర్తయితే భారత్‌ పాకిస్తాన్‌పై ఆధారపడకుండా ఉంటుంది. పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దు సమస్యలు, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఆయిల్, వస్తు రవాణా సురక్షితంగా జరుగుతుంది. ఇది భారత్‌ ప్రాంతీయ ప్రభావాన్ని పెంచుతుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్‌ మరియు మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయి.

ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే హర్మూజ్‌ జలసంధి టెన్షన్‌లు భారత్‌పై ప్రభావం చూపించే అవకాశాలు తగ్గుతాయి. అమెరికా ఒత్తిడి కొనసాగినా భారత్‌ తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. ఇది భారత్‌–అమెరికా సంబంధాలను కొంతవరకు ప్రభావితం చేయవచ్చు. కానీ భారత్‌ రెండు వైపులా సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సంఘటనలు భారత స్వతంత్ర విదేశాంగ విధానం, శక్తి భద్రత ప్రాధాన్యత, ప్రాంతీయ వ్యూహాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.

'లెనిన్' ట్విట్టర్ టాక్ వచ్చేసింది.. నెటిజెన్స్ నుండి ఇలాంటి రియాక్షన్స్ ఊహించలేదు..

Lenin First Day Collections
Lenin First Day Collections

Lenin Twitter Talk : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు అభిమానుల్లో , ఆడియన్స్ లో ఈ చిత్రం భారీ అంచనాలను ఏర్పాటు చేసుకుంది. టీజర్, థియేట్రికల్ ట్రైలర్ , పాటలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా అదిరిపోవడం తో , అఖిల్ ఈసారి పక్కా హిట్ కొట్టబోతున్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఇంటర్వ్యూస్ , ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి వాటిల్లో కూడా అఖిల్ మాటల్లోని నమ్మకాన్ని చూసి ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి. ఓవరాల్ గా మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము. ఈ రివ్యూస్ అయితే ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి అని చెప్పాలి.

ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ఫిల్లర్ సన్నివేశాలతో నింపేసి ఉంటారు , పెద్దగా విషయం ఏమి ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ అలా లేదు , చాలా బలమైన సాలిడ్ సన్నివేశాలతో , మంచి ఎమోషన్స్ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ ఫస్ట్ హాఫ్ ని నడిపించారు డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయ్యిందని , సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూసేలా చేసిందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యిందట కానీ , కొన్ని చోట్ల నాన్ సింక్ గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నెటిజెన్స్. అయితే లవ్ స్టోరీ మాత్రం మూవీ లో అనుకున్నంత కుదర్లేదనీ , చాలా యావరేజ్ గా ఉందని కొందరు అంటున్నారు.

ఇక ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా వేరే లెవెల్ కి వెళ్తుందట. సెకండ్ హాఫ్ లో కొన్ని బ్లాక్స్ , కొన్ని ట్విస్టులు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయని, కానీ మైనస్ పాయింట్ ఏమిటంటే , సెకండ్ హాఫ్ లో వచ్చే రూరల్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు ఇంతకు ముందు ఎక్కడో చూశామే అనే ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు. ఇక అఖిల్ తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా పరిణీతి చెందిన నటన కనబర్చారని , హీరోయిన్ భాగ్యశ్రీ కూడా చాలా బాగా నటించిందని , ఓవరాల్ గా అఖిల్ నుండి చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని , కచ్చితంగా థియేటర్స్ లో చూడొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఐదు రాశుల వారి ఇంట్లో ఈరోజు లక్ష్మి తాండవం.. డబ్బే డబ్బు..

Today 10 july 2026 Horoscope
Today 10 july 2026 Horoscope

Today 10 july 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై భరణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి తాండవం చేయనుంది. మరికొన్ని రాశుల వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): . ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన జీవితం ఉంటుంది. గతంలో ఉన్న కష్టాల నుంచి బయటపడతారు. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చకుండా ఉండాలి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి సహకారం ఉంటుంది. ఇదే సమయంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారులు లాభాలు పొందుతారు. గతంలో కంటే ఇప్పుడు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు. ప్రియమైన వారికోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పాత వివాదాల నుంచి బయటపడతారు. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులన్నీ పరిష్కరించుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సిద్ధం చేసుకుంటారు. అయితే ఇదే సమయంలో ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ధననీయమైన ఆదాయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. క్రమశిక్షణతో పనులు చేయడం వల్ల ముఖ్యమైన వాటిని పూర్తి చేస్తారు. కొత్త అవకాశాలు లభిస్తాయి

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో కంటే ఇప్పుడు వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కొత్త ఆదాయం లభిస్తుంది. బ్యాంకు నుంచి రుణం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రయాణాలు చేసే సమయంలో సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలు రానున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులు లక్ష్యాలను ఏర్పరచుకుంటే వాటిని పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.

పిల్ షేప్ మోడ్యూల్‌ కెమెరా.. 6,500mAh భారీ బ్యాటరీ... కానీ ధర రూ. 13 వేల లోపే.. ఈ ఫోన్ గురించి తెలుసా..

iQOO Z11 Lite
iQOO Z11 Lite

iQOO Z11 Lite: iQOO కంపెనీ తన సరికొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ ను ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ నెలాఖరులోఈ ఫోన్ అధికారికంగా లాంచ్ కానున్నట్లు కంపెనీ ఇండియా సీఈఓ నిపుణ్ మౌర్య స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ (Amazon) లో లైవ్ అయింది. ఏఐ ఫీచర్లు, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ ప్రాసెసర్ వంటివి ఈ ఫోన్ లో ప్రత్యేకం. ఇంకా ఇందులో ఏమేం ఉన్నాయంటే?

iQOO కంపెనీకి చెందిన Z11 Lite ఫోన్ భారత్‌లో 24 జులై 2026 న విడుదల చేయనున్నారు. ఫోన్ భారత్‌లో ప్రధానంగా రెండు విభిన్నమైన కలర్ వేరియంట్లలో లభించనుంది. మొదటిది ‘సోలార్ ఫ్లేమ్’ కాగా, రెండోది ‘మిడ్‌నైట్ బ్లూ’ . ఇందులో సోలార్ ఫ్లేమ్ వేరియంట్ వెనుక ప్యానెల్ మార్బుల్ తరహా ఆకర్షణీయమైన టెక్స్‌చర్ డిజైన్‌తో రానుంది. అంతేకాకుండా కెమెరా మోడ్యూల్ కింద ‘డైనమిక్ లైట్’ అనే సరికొత్త ఫీచర్‌ను ఇచ్చారు. ఇది ఒక మల్టీ కలర్ LED రింగ్ లైట్, ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు లేదా ఇతర నోటిఫికేషన్ల ఆధారంగా రంగురంగుల్లో వెలుగుతూ ప్రత్యేక లుక్‌ను ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేయడానికి వీలుగా ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా కోర్ 5G చిప్‌సెట్‌ను ఉపయోగించారు. బడ్జెట్ శ్రేణిలో రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్ , సాధారణ గేమింగ్‌కు ఇది చక్కగా సరిపోతుంది. ఈ ఫోన్ లో 6.74 అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ను ఉంచారు. అలాగే స్మూత్ బ్రౌజింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్… 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో రానుంది. దీని స్క్రీన్ పైభాగంలో వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిజైన్ ఉంటుంది. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ లో 6,500mAh భారీ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఈ బ్యాటరీకి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

ఫోటోగ్రఫీ కోసం.. iQOO Z11 Lite వెనుక భాగంలో పిల్-షేప్ మోడ్యూల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇవ్వనున్నారు. సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పాటు సరికొత్త AI ఫీచర్లతో వస్తోంది. ఇందులో టెక్స్ట్‌లను సులభంగా సమ్మరైజ్ చేసే ‘AI Creation’, యూట్యూబ్ వంటి వీడియోలకు వెంటనే క్యాప్షన్లు జనరేట్ చేసే ‘AI Captions’ వంటి స్మార్ట్ ఫీచర్లు ‘నాన్-స్టాప్ ఇంటెలిజెన్స్’ బ్యానర్ కింద అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ ధర బేస్ వేరియంట్ 8GB RAM, 128GB స్టోరేజ్ 11,499 నుండి 12,999 మధ్య ఉండే అవకాశం ఉంది.

'మా ఇంటి బంగారం' మొదటి రోజు వసూళ్లను 'లెనిన్' అందుకోగలదా..? అక్కినేని ఫ్యామిలీ కి అతి పెద్ద సవాల్..

Lenin Movie Trailer Review
Lenin Movie Trailer Review

Lenin Movie : మరికొద్ది గంటల్లో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు , ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ అఖిల్ గత చిత్రాల ప్రభావం కారణం గా టాక్ బాగుంటే థియేటర్ కి కదులుదాం అనే మూడ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా కేవలం 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే నమోదు అయ్యాయి. ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే అక్కినేని అఖిల్ ముందు ఇప్పుడు ఉన్నటువంటి అతి పెద్ద సవాల్ ‘మా ఇంటి బంగారం’. సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ అయితే రాలేదు కానీ , ఓవర్సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా లో మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 6 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ‘లెనిన్’ చిత్రానికి ఈ రేంజ్ షేర్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందా అంటే ప్రస్తుతానికి అనుమానమే. ఈ బుకింగ్స్ తో ఆ రేంజ్ ఓపెనింగ్స్ వస్తాయని కచ్చితంగా చెప్పలేము , కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘మా ఇంటి బంగారం’ ఓపెనింగ్స్ కి చాలా దగ్గరగా వెళ్లొచ్చు, అంతే కానీ పూర్తిగా ఆ ఓపెనింగ్స్ ని బీట్ చేయడం మాత్రం అసాధ్యమే.

ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే ‘లెనిన్’ చిత్రం తెలుగు రాష్ట్రాల నుండి 3 నుండి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో షేర్ వసూళ్లను అందుకునే అవకాశం ఉంది. కానీ ఓవర్సీస్ లో కోటి నుండి రెండు కోట్ల మధ్యలోనే గ్రాస్ వసూళ్లు వస్తాయి. అంటే షేర్ వసూళ్లు కేవలం కోటి రూపాయిలు మాత్రమే , ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ చిత్రానికి 5 నుండి 6 కోట్ల రూపాయిల మధ్యలో షేర్ వసూళ్లు వస్తాయని అంచనా. ఇది కేవలం పాజిటివ్ టాక్ వస్తేనే, ఒకవేళ టాక్ రాకపోతే , ఇంతకంటే తక్కువ వసూళ్లు నమోదు అవుతాయి. అప్పుడు సోషల్ మీడియా లో ఈ చిత్రం పై ట్రోల్స్ మామూలు రేంజ్ లో ఉండవనే చెప్పాలి , చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

నిరాశపరుస్తున్న 'లెనిన్' అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే...

Lenin Movie Trailer
Lenin Movie Trailer

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం. టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ కూడా, ఈసారి అఖిల్ మినిమం గ్యారంటీ కంటెంట్ తో మన ముందుకు రాబోతున్నట్టు సూచిస్తున్నాయి. తమన్ అందించిన పాటలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి. ఇక అఖిల్ తో పాటు , మూవీ టీం మొత్తం ఈ సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. అఖిల్ , భాగ్యశ్రీ భొర్సే నాన్ స్టాప్ ఒక పక్క ఇంటర్వ్యూస్ ఇస్తూనే, మరోపక్క ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇలా సినిమా పై బజ్ పెంచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం బాధాకరం.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లోనూ మొదలయ్యాయి. ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా నమోదైన ఈ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ లో కనీసం కోటి రూపాయిల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగితే , పర్వాలేదు , డీసెంట్ అని అనుకోవచ్చు. కానీ ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హైదరాబాద్ లాంటి సిటీ నుండి వచ్చిన గ్రాస్ కేవలం 64 లక్షల రూపాయిలు మాత్రమే. ఇండియా మొత్తం మీద ఈ చిత్రానికి ఇప్పటి వరకు 2147 షోస్ ని షెడ్యూల్ చేశారు. ఈ షోస్ ద్వారా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లు 2 కోట్ల 13 లక్షల రూపాయిలు మాత్రమే. ఆక్యుపెన్సీ కేవలం 18 శాతం మాత్రమే ఉండగా, 6 హౌస్ ఫుల్స్ షోస్ , 103 ఫాస్ట్ ఫిల్లింగ్ షోస్ నమోదయ్యాయి.

ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ, ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వడానికి ముఖ్య కారణం అఖిల్ గత చిత్రాల ప్రభావమే. ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ ఎంతటి ఘోరమైన డిజాస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతకు ముందు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందుకే అఖిల్ సినిమా పై ప్రేక్షకుల్లో ఈసారి నమ్మకం పెద్దగా కలగలేదు, ఆ కారణం చేతనే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత తక్కువగా నమోదు అయ్యాయి. ఇక నార్త్ అమెరికా లో అయితే ఈ చిత్రానికి 82 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇక్కడ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ ట్రెండ్ ఉంది. ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, రేపు పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంటే మాత్రం , ఓపెనింగ్స్ చాలా సాలిడ్ గా ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

జర్నలిజంలో ఇదో కొత్త వింత.. ఆ పత్రిక జర్నలిస్టులకు ‘శిక్ష’ణ

Journalism,

Journalism : ఓరియంటేషన్.. కొద్దిరోజులుగా ఆ పత్రికా యాజమాన్యం తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు నిర్వహిస్తోంది. ఓరియంటేషన్ ఉంటే ఒక సంస్థలో కొత్తగా ప్రవేశించిన ఉద్యోగులకు.. సంస్థ నిబంధనలు.. పనిచేసే విధానం.. పని పరిస్థితుల గురించి వివరించడం.. వాస్తవానికి ఆ పత్రిక యాజమాన్యం ఇలా నిర్వహించడం జర్నలిజం సర్కిల్స్ లో సరికొత్త చర్చకు కారణం అవుతుంది. ఎందుకంటే ఆ పత్రిక యాజమాన్యం ఇప్పటికిప్పుడు ఓరియంటేషన్ ఎందుకు నిర్వహిస్తోంది.. నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది.. నిర్వహిస్తే పాత్రికేయులకు లభించే ప్రయోజనం ఏమిటి.. అనే ప్రశ్నలకు సమాధానం లేదు.

ఆ పత్రిక ఏర్పాటు జర్నలిజాన్ని ఉద్ధరించడానికి కాదు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి కాదు. పాత్రికేయుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురావడానికి అంతకంటే కాదు. కేవలం ఆ పత్రిక ఒక పార్టీకి కరపత్రిక. నిజాలతో సంబంధం లేదు. కేవలం అబద్దాల పునాదుల మీద మాత్రమే ఆ పత్రిక నడుస్తోంది. గతంలో ఆ పత్రిక యాజమాన్యం ఓ రాష్ట్రంలో అధికారంలో ఉంది.. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ పత్రిక యజమాని తండ్రి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇన్ని రకాలుగా సానుకూలతలు ఉన్నప్పటికీ.. ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు తక్కువే అని చెప్పాలి. పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆ పత్రిక యాజమాన్యం ఉద్యోగులకు గొప్పగా మేలు గాని.. సౌకర్యాలు గాని కల్పించిన దాఖలాలు లేవు. పత్రికను ప్రారంభించిన తొలి రోజుల్లో గొప్పగా జీతాలు ఇచ్చేవారు. ఉద్యోగులను బస్సులో తీసుకెళ్లేవారు. క్యాంటీన్లో రకరకాలుగా సదుపాయాలు కల్పించేవారు. మొదట్లో ఈ హంగామా బాగానే నడిచేది. ఆ తర్వాత కాస్ట్ కటింగ్ పేరుతో ఇవన్నీ కూడా తొలగిపోయాయి. చాలామంది ఉద్యోగులను కూడా మేనేజ్మెంట్ తొలగించింది. ఉన్న వాళ్ళతోనే ఇప్పుడు పని చేస్తోంది. వారంతా కూడా సంవత్సరాలుగా అదే సంస్థలో పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఆ పత్రిక యాజమాన్యానికి ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. పైగా ఉద్యోగులలో కూడా పెద్దగా భరోసా లేదు. అలాంటప్పుడు పత్రిక యాజమాన్యం ఓరియంటేషన్ క్లాసులు పెడితే ప్రయోజనం ఏముంది. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు.. ఇతర సదుపాయాలు కల్పించినప్పుడే వారు యాజమాన్యం మీద నమ్మకాన్ని కలిగి ఉంటారు. మరింత గొప్పగా పనిచేస్తూ ఉంటారు. యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించినప్పుడు.. బండెడు చాకిరి భుజాల మీద మోస్తున్నప్పుడు.. యాజమాన్యం మీద ప్రేమ ఎందుకు ఉంటుంది. ఓరియంటేషన్ క్లాస్ పెడితే ప్రయోజనం ఏమంటుంది. గతంలో ఆ పత్రికలో పెద్ద తలకాయలు భారీగా జీతాలు తీసుకున్నాయి. ఉద్యోగుల మెడ మీద కత్తి పెట్టి తొలగించాయి. ఇప్పుడు ఆ పెద్ద తలకాయలకు వచ్చిన ఆలోచన ఓరియంటేషన్ క్లాస్. దీనివల్ల యాజమాన్యానికి టీ ఖర్చులు.. బిస్కెట్ల ఖర్చులు తప్ప పెద్దగా ఉపయోగ ఉండదు. ఎందుకంటే పార్టీకి కరపత్రంగా మారిన ఆపత్రిక.. ఎప్పటికీ ప్రజాస్వామ్య విలువలను అందుకోలేదు. నాలుగో స్తంభాలాగా నిలబడలేదు.

టీమిండియా కెప్టెన్ టాస్ గెలిచాడు.. ఇంగ్లాండ్ తో ఈ మ్యాచ్ కూడా అస్సామేనా..

Shreyas Iyer replaces Suryakumar Yadav
Shreyas Iyer replaces Suryakumar Yadav

India vs England : గతంలో టీమిండియా కెప్టెన్లు టాస్ గెలవడం అసాధ్యంగా ఉండేది. ఎప్పుడో ఒకసారి మాత్రమే టాస్ గెలిచేవారు. టాస్ గెలిచినప్పటికీ.. ఓడిపోయినప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే టీమిండియా కెప్టెన్లు నాడు విలక్షణమైన ఆట తీరు ప్రదర్శించేవారు. మైదానంలో సరికొత్తగా కనిపించేవారు. తోటి ప్లేయర్లలో స్ఫూర్తిని నింపేవారు. ఫలితంగా టీం ఇండియాకు సానుకూలమైన ఫలితాలు వచ్చేవి.

ఇప్పుడు టీమిండియా టి20 సారథి శ్రేయస్ అయ్యర్ వరుసగా టాస్ గెలుస్తూనే ఉన్నాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్లో కూడా అతడు టాస్ గెలిచాడు. మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు సారధిగా అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఐదవ మ్యాచ్. కానీ అతడి నాయకత్వంలో టీమిండియా ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అనామకమైన ఐర్లాండ్ చేతిలో టి20 సిరీస్ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా జరిగి ఉంటే ఫలితం వేరే విధంగా వచ్చి ఉండేది. అప్పుడు టీమ్ ఇండియా వరుసగా రెండవ సిరీస్ కూడా కోల్పోయి ఉండేది.

ప్రస్తుత సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు దూకుడు మీద ఉంది. తొలి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం.. రెండో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడం.. మూడో మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ భారీ అంతరంతో గెలవడం విశేషం. అయితే టీమిండియా ఓడిపోయిన అన్ని సందర్భాల్లోనూ సారధి అయ్యర్ టాస్ నెగ్గడం విశేషం. టీమిండియా సారథి టాస్ నెగ్గిన నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ వరుసగా నాలుగు మ్యాచ్లో గెలిచినప్పటికీ.. టీమిండియాకు విజయాలు సొంతం కాలేదు. పైగా దారుణమైన స్థితిలో ఓటములు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటప్పుడు టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోతేనే బాగుంటుంది.. అప్పుడే టీమిండేకు గెలుపు దక్కుతుందేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో అయ్యర్ నాయకత్వ తీరు పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ప్రారంభంలో ముందుకు నడిపించడాని.. ఆ తర్వాత అతడి సారథ్యం పంజాబ్ జట్టుకు విజయాలు అందించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. కనీసం అతడి వైఫల్యాల చరిత్ర చూసైనా సరే మేనేజ్మెంట్ టీ20 సారధిగా అవకాశం ఇవ్వకుండా ఉండాల్సిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. సూర్య కుమార్ యాదవ్ ని పక్కనపెట్టి.. అయ్యర్ ను నెత్తి మీద పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క టాస్ ఓడిపోలేదు.. ఒక్క మ్యాచ్ గెలవలేదు.. ఇది అయ్యర్ రికార్డ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.