Home Blog Page 8642

అప్పుడు ఆ ముగ్గురు… ఇప్పుడు ఈ నలుగురు….

 

హైదరాబాద్‌లో షాద్ నగర్ సమీపంలో ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ప్రధాన నిందితులు ఆరీఫ్, శివ, నవీన్ మరియు చెన్నకేశవులు తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఎన్‌కౌంటర్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నేరస్థలం పునర్నిర్మాణం కోసం అక్కడికి తీసుకెళ్లిన నిందితులు తమ తుపాకులను తీసుకొని పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారని పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారని వారు తెలిపారు.

 

అయితే, శుక్రవారం ఉదయం జరిగిన సంఘటనలు పదకొండు సంవత్సరాల క్రితం 2008 దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ ఒకే తీరిగా ఉన్నాయి. ‘దిశ’ యొక్క అత్యాచారం కేసును నిర్వహిస్తున్న టాప్ పోలీసు, సైబరాబాద్ పోలీసు చీఫ్ విసి సిజ్జనార్, వరంగల్ ఎన్‌కౌంటర్ సమయంలో పోలీసు సూపరింటెండెంట్ గా ఉండటం గమనార్హం.

2008 లో ఏమి జరిగింది?

2008 డిసెంబర్‌లో ఇద్దరు మహిళా ఇంజనీరింగ్ విద్యార్థులపై యాసిడ్ పోసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను ఉమ్మడి ఏపీ పోలీసులు కాల్చి చంపారు. నిందితుల్లో ఒకరైన శ్రీనివాస్ ప్రతిపాదనను స్వాప్నికా తిరస్కరించడంతో వరంగల్ పట్టణంలోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు స్వాప్నికా, ప్రణీతలపై దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రావు (25), అతని సహచరులు పి.హరికృష్ణ (24), బి సంజయ్ (22) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

 

ఈ రోజు (శుక్రవారం) నివేదించిన ఎన్‌కౌంటర్ మాదిరిగానే, అప్పటి ఎస్పీ ఒక పోలీసు బృందం సాక్ష్యాలను సేకరించడానికి నిందితులతో కలిసి నేరస్థలానికి వెళ్లిందని చెప్పారు. అయితే, ఆ ముగ్గురు నిందితులు ముడి బాంబులతో పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారు. ముగ్గురు నిందితులను చంపిన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు సజ్జనార్ చెప్పారు.

 

అప్పటి వరకు తక్కువ ప్రొఫైల్ కాప్ అయిన సజ్జనార్ అప్పటికి ‘ఎన్‌కౌంటర్ కాప్’ అనే పేరును సంపాదించాడు. బాలికపై దాడి చేసిన 48 గంటల్లోనే అరెస్టులు జరిగాయి, ఎన్‌కౌంటర్ కొద్ది రోజుల్లోనే జరిగింది. ఎన్‌కౌంటర్‌ను నిందితుల కుటుంబాలు, హక్కుల కార్యకర్తలు ప్రశ్నించినప్పటికీ, సజ్జనార్ స్థానిక హీరో అయ్యాడు. ఇప్పుడు దేశ హీరో అయ్యాడు.

 

ఇద్దరు బాధితులు, ప్రణిత మరియు స్వాప్నికా మరియు వారి కుటుంబాలు కూడా ఈ ఎన్‌కౌంటర్‌ను స్వాగతించారు.

 

“శ్రీనివాస్ చంపబడ్డాడని నేను సంతోషించాను ” అని స్వప్నికా తండ్రి దేవేందర్ రెడిఫ్ తెలిపారు.

ఆ విషయంలో కెసిఆర్ ని పొగిడి.. పప్పులో కాలేసిన జగన్!

 

ఏపీలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ‘మహిళలకు రక్షణ ఎలా కల్పించాలి” అనే విషయంలో చర్చ జరగగా సీఎం జగన్ “దిశ” ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దిశ” నిందితులను ఎన్ కౌంటర్ విషయాన్ని సమర్ధిస్తూ ఈ విధంగా మాట్లాడారు.. ‘అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్’…అని. ఈ మాట ఇప్పుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంటే దిశా హంతకుల్ని ఎన్ కౌంటర్ చేయమని కేసీఆర్ గారు పోలీసులకు ముందే చెప్పారా? మరి అందేంటి.. తప్పించుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా, దాడి చేసినందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు చెప్పారు! అది నిజంకాదా??!” అని అనేకమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 

అసలే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్ కౌంటర్ విషయంలో చాలా సీరియస్ గా ఉండగా ఇప్పుడు జగన్ మాటలు కెసిఆర్ కి మరింత తల నొప్పిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు!. ఇదిలా ఉండగా మరోవైపు మహిళా సంఘాలు కూడా ఎన్ కౌంటర్ విషయంలో కాస్త గుస్సుగా ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొంటన్న వారిని కూడా చంపేయాలని డిమాండ్ చేస్తున్న తరుణంలో ఏపీ సీఎం మాటలు వారికి మరింత ఊతం ఇచ్చినట్లయింది. అలాగే ప్రస్తుతం ఏపీలో 2014 నుండి 2019ల మధ్య అనేక రేప్ కేసులు జరిగాయి. అందులో వైసీపీ పార్టీ నేతలుకూడా ఉన్నారు. 2014లో 82, 2015లో 100, 2016లో 116, 2017లో 105, 2018లో 93 కేసులు, 2019 జగన్ సీఎం అయ్యాక దాదాపు 40 పైగా రేప్ కేసులు పెండ్డింగ్ లో ఉన్నాయి వారందర్ని కూడా కెసిఆర్ పంథాలో జగన్ ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు, అనేక విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ఈ విమర్శలు ఇప్పుడే రాక పోవచ్చు కానీ మున్ముందు రావొచ్చు. ఇది, ఇలా ఉండగా ఈ జగన్ పొగడ్తల పై కెసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి…

 

మా ఈ కామెంట్ నిజమని చెప్పడానికి…. జగన్ విమర్శలు ఎదురుకోబోతున్నారు అనడానికి…

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెరాస కొత్త డ్రామా!

 

గత నెల(నవంబర్) 27న రాత్రి 9.30 నుండి తర్వాత రోజు ఉదయం 3.30 మధ్య కాలంలో “దిశ” ఆత్యాచారం గావించబడి, హత్యకు గురైంది. నిజానికి ఆ రోజు రాత్రే దిశ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు కానీ పోలీసుల నిర్లక్యం వల్ల ‘దిశ’ ఉదంతం విషాదంగా మారింది.ఈ మాటలకు అనేకమంది ఏకీభవించి పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సంఘటన జరిగిన తరువాత అనేకమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఆ ఘటనను ఖండించారు, దిశ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. ఈ రెండు విషయాలపై మీడియాలో, ప్రజల్లో పెద్ద ఎత్తున్న అటు పోలీసుల పైన ఇటు కెసిఆర్ పైన వ్యతిరేకత వచ్చింది.

 

అదే సమయంలో దిశ నిందితులకు 14రోజుల రిమాండ్ విధించి, చర్లపల్లి జైలులో ఉంచారు. వ్యతిరేకత పెరుగుతున్న తరుణంలో పోలీసులు, హైకోర్టు కి అప్పీల్ చేసుకొని, నిందితులను బయటకు తీసుకొచ్చి చాలా తెలివిగా ఎన్‌కౌంటర్‌ చేశారు. “ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” అనే సామెత తరహాలో ఇటు పోలీసుల పైన వ్యతిరేకత పోవడమే కాకుండా ప్రజల్లో హీరోలుగా ముద్ర వేయించుకున్నారు, అటు కెసిఆర్ పై విమర్శలు పోవడమే కాకుండా ప్రశంసలు, అభినందనలు అందుకున్నారు, అందులో భాగంగా నిన్న ఏపీ సీఎం జగన్ కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే..

 

ఇప్పుడు మళ్ళీ సీన్ మారింది. ఒక వైపు జాతీయ మానవ హక్కుల కమిటి, మరో వైపు మహిళా సంఘాలు, కెసిఆర్ ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నాయి. అందరికి ఒకే న్యాయం చేయాలి “ధనికులకో న్యాయం-దళితులకో న్యాయమా?” అంటూ విమర్శల పర్వం మొదలయింది. అలాగే దిశ నిందితుల కుటుంబాల పైన సానుబూతి పెరుగుతుంది, వారికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్న తరుణంలో కెసిఆర్ సర్కార్ కొత్త డ్రామాకు తెర లేపింది. దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెరాస కొంత సానుభూతిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకు తార్కాణంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీత దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ చాలా బాధాకరమంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆలేరులో జరిగిన ఓ కార్యక్రమంలో సునీత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యువకుల తల్లిదండ్రులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన యువకుల తల్లిదండ్రులు చాలా బాధపడి ఉంటారని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సునీత తరహాలోనే నిందితుల కుటుంబీకులకు, మరికొంత మంది తెరాస నేతలు సానుభూతి తెలిపే అవకాశాలు లేకపోలేదు.

26 ఏళ్ళ దిశకో న్యాయం-9నెలల పాపకో న్యాయమా?

 

షాద్ నగర్ సమీపంలో దిశ కేసులో ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తున్నాయి. 26 ఏళ్ళ దిశను చంపేస్తే ఎన్ కౌంటర్ చేశారు.. కానీ 9నెలల పాపని చంపేస్తే యావజ్జీవ శిక్ష వేస్తారా? అంటూ.. వస్తున్న విమర్శలతో వరంగల్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 నెలల చిన్నారి హత్య కేసులో దోషి ప్రవీణ్‌కు శిక్ష తగ్గించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మానవ మృగానికి మరణ శిక్షే విధించేందుకు అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు.

 

2019లో తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల పాపపై అత్యాచారం కేసులో నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గింపుపై వరంగల్ పోలీసు కమిషనరేట్ కీలక నిర్ణయం తీసుకుంది. శిక్ష తగ్గింపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రకటించారు.

“9నెలల ‘పాప’ అత్యాచారం-హత్య” కేసు పూర్తి వివరాలు..

2019 జూన్‌లో హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారి(శ్రీహిత)పై ప్రవీణ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. జూన్‌ 17 రాత్రి చిన్నారి కుటుంబ సభ్యులు నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత తల్లి రచనకు మెలకువ రాగా… పక్కనే కుమార్తె లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్‌ బైక్‌పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ప్రవీణ్‌ భుజాన టవల్‌లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ప్రవీణ్‌ పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు.

 

 

అయితే, ప్రవీణ్‌ను పట్టుకున్న భరత్‌ చితకబాదాడు. అప్పటికే చిన్నారిలో ఎలాంటి కదలికా లేదు. శరీరం నుంచి అధికంగా రక్తస్రావమైంది. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా రోదించారు. ప్రవీణ్‌.. చిన్నారిపై అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పసికందు హత్యతో హన్మకొండ అట్టుడికిపోయింది. ప్రవీణ్‌ను ఉరి తీయాలంటూ జనం ఆందోళనకు దిగారు.

 

చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో రెండు నెలల లోపే విచారణ పూర్తై తీర్పు వెలువడింది. ఈ కేసులో ముద్దాయి ప్రవీణ్‌… గత జూన్‌ 18న రాత్రి తల్లి పొత్తిళ్లలో పడుకొన్న పసిపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హతమార్చినట్లు హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి జూన్‌ 24 ప్రారంభమైన విచారణ… ఆగస్టు 2న ముగిసింది. పోలీసులు కూడా సవాల్‌గా తీసుకొని 20 రోజుల్లోనే కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 51 మంది సాక్షుల్లో అవసరమున్న 30 మందిని కోర్టులో హాజరుపర్చారు. ప్రవీణ్‌ను దోషిగా నిర్ధారించిన వరంగల్‌ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి ఇంత త్వరగా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి.

 

చిన్నారిపై అత్యాచారం కేసులో ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధించడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీంతో ఈ కేసును విచారించిన ధర్మాసనం… ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరిస్తూ తీర్పునిచ్చింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులతో పాటు సమాజంలోని చాలా వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రవీణ్‌ కూడా అలాగే చంపేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

ఉల్లి కొరతపై టిక్ టాక్ వీడియోలు… నవ్వకుండా ఉండలేరు

 

ఉల్లిపాయల ధర పెరగడంతో ప్రజలు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. అక్కడ వారు వారి పరిస్థితి గురించి సోషల్ మీడియా పోస్టుల ద్వారా పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఆనియన్స్ క్రైసిస్ టిక్‌టాక్‌ను కూడా తాకింది.

 

 

 

 

షార్ట్ వీడియో యాప్‌లోని భారతీయ వినియోగదారులు ఉల్లిపాయలు ధరల పెరుగుదల తమను ఎలా ప్రభావితం చేసిందో చూపించడానికి ఉల్లాసమైన వీడియోలతో ముందుకు వచ్చారు. కొన్ని డబ్బుకు బదులుగా ఉల్లిపాయలు దొంగిలించడం గురించి ఫన్నీ వీడియోలు అయితే, మరికొందరు ఆభరణాలతో సురక్షితంగా ఉల్లిపాయలను లాక్ చేసిన వీడియోలను ఉంచారు. ఒక ఆటో ప్రయాణీకుడు డబ్బులకు బదులుగా ఉల్లిపాయలు చెల్లించాడు.

తంతే, వెళ్ళి బూరెల బుట్టలో పడ్డ నిత్యానంద!

 

‘స్వామి నిత్యానంద’ ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశంలో పెద్దగా పరిచేయం అవసరం లేదు. ఎందుకంటే భారత్ లో ఉన్నప్పుడు స్వామిగారు చేసిన ఘన కార్యాలు అన్నీ, ఇన్నీ కావు. వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా పేరు గడించిన తర్వాత తనపై ఉన్న కేసులకు భయపడి దేశం దాటిన విషయం తెలిసిందే. అయితే నిత్యానంద ఏ దేశం వెళ్లి ఉంటాడంటూ విపరీతమైన చర్చ నడిచింది. తాజాగా, ఈ విలక్షణ స్వామి వెస్టిండీస్ దీవుల్లో ప్రత్యక్షమయ్యాడు. కొంతకాలం క్రితమే అక్కడి దీవుల్లో ఓ చిన్న దీవిని కొనుగోలు చేసిన స్వామీజీ దానికి కైలాసదీవి అని నామకరణం కూడా చేశారు. అంతేకాదు, తన దీవికి దేశం హోదా ఇవ్వాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా, తన దేశంలో అడుగుపెట్టేందుకు ప్రత్యేకంగా పాస్ పోర్టును కూడా రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నిత్యానంద తన సొంత దీవిలోనే మకాం వేసినట్టు సమాచారం! తంతే వెళ్లి బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో మరి!

 

సొమ్ము ప్రజలది-సోకు కేసీఆర్ ది

 

52రోజుల సమ్మె అనంతరం టీఎస్ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటాం అని సీఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెల్సిందే. వారిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఆర్టీసీ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. “సొమ్మొకడిది సోకొకడిది” అంటే సొమ్మేమో ప్రజలది సోకేమో కెసిఆర్ ది. ఎందుకంటే సమ్మెలో టీఎస్ఆర్టీసీ కార్మికులు సాధించింది ఏమి లేకపోగా అప్రతిష్ట మూటకట్టుకున్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ జేఏసి నేతలు తప్పు దారిలో వెళ్లారనేది వాస్తవం. మరోవైపు కెసిఆర్ కూడా మెట్టు దిగక పోవడంతో పరిస్థితి ఇక్కడి దాకా వచ్చింది. అంటే కెసిఆర్, జేఏసి నేతలు పంతాలకుపోయి టీఎస్ఆర్టీసీకి వందల కోట్ల నష్టాన్ని తీసుకొచ్చారని తెలుస్తుంది. మరి ఈ నష్టం ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ప్రజలు భరించాలి అని చావు కబురు చల్లగా చెప్పారు మన ముఖ్యమంత్రిగారు. “మన బిడ్డలు” “మన వాళ్ళు” “మనమెలా పోగొట్టుకుంటామంటూ” తియ్య తీయగా మాట్లాడి నష్టాన్ని మొత్తం ప్రజల మీదికి నెట్టారు. కిలోమీటర్ కి 20పైసలే పెంచుతున్నాం అని భలేగా మాట్లాడారు. దానివల్ల ఆర్టీసీ ఏడాదికి 752కోట్లు ఆదాయం చేకూరుతుందని కమ్మగా.. ప్రజలకు దెబ్బ తగలకుండా చెప్పారు.

 

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిలో దేవాలయాన్ని పునర్నిర్మించటం కోసం వందలకోట్ల ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చుపెట్టటం ఎంతవరకు సబబు? కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఒక మిస్టరీ. ఎన్ని లక్షల ఎకరాలకు నీరొస్తుందో ఇప్పటికీ తెలియదు. ఇంతగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచటమే కదా? ఇవన్నీ సరిపోవన్నట్లు మరలా కొత్తగా ప్రజల మీద అదనపు భారం పెట్టటం సబబా? ప్రియమైన ముఖ్యమంత్రిగారు…

 

ఇకపై తెలంగాణలోని ఆర్డినరీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది. సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లోనూ కనీస ఛార్జీ రూ. 10 రూపాయలుగా ఉండనుంది.

 

సెమీ ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించారు. ఎక్స్‌ప్రెస్ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 15 పెంచారు. డీలక్స్ కనీస ఛార్జీ రూ. 15 నుంచి రూ. 20 పెరగనుంది. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ రూ. 25 పెంచారు. ఇకపై రాజధాని, వజ్ర బస్సులో కనీస ఛార్జీ రూ. 35 పెరగనుంది. గరుడ ఏసీ, గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జీ రూ. 35 పెంచారు. వెన్నెల ఏసీ స్లీపర్‌లో కనీస ఛార్జీ రూ. 75 పెంచారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్ పాస్ ధరలు కూడా పెరగనున్నాయి. ఆర్డీనరీ బస్ ధర రూ. 950, ఎక్స్‌ప్రెస్ రూ. 1070, డీలక్స్ రూ. 1185‌గా ఉండనుంది.

జనాదరణ పెరుగుతుంది జనసేన.. కొంచం జాగ్రత్త!

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారనేది వాస్తవం. మొన్న ఇసుక సమస్యపై పోరాడి ఎంతోకొంత విజయం సాధించారనేది వాస్తవం. అలాగే ఇంగ్లిష్ మీడియం నుండి తెలుగును కాపాడే దిశగా నూతన పంథాలో వెళ్తున్నారనేది కూడా నిజమే. ఈ రెండు సంఘటనలలో జనసేన అంటే ఎంతో కొంత ప్రజల్లోకి పాజిటివ్ టాక్ వెళ్ళింది. ఈ టైంలో జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే కొంచం పేరున్న నేతలు, జనసేన మేధావులు కొంచం జాగ్రత్తగా ఉంటె మంచిది. ఎందుకంటే మంచి పేరు రావడానికి కొన్ని ఏళ్ళు పడితే ఆ పేరు పోగొట్టుకోవడానికి కొన్ని నిమిషాలు పడుతుంది.

 

అసల విషయం ఏమిటంటే.. ఈ రోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా” పథక ప్రారంభ కారక్రమంలో “నా మతం మానవత్వం, నా కులం, మాట నిలబెట్టుకునే కులం” అని వ్యాఖ్యానించారు. జగన్ మాట పై స్పందించిన జనసేన పార్టీ ఈ విధంగా ట్వీట్లు చేశారు. “ఒకసారి మతం మారితే కులాన్ని వదిలేయండి. మీకు కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. మారండి జగన్ రెడ్డి గారు ఇంకా ఇలాగే ఉందాం అంటే కుదరదు. సమాజం మారింది, యువత మారింది, తరాలు మారాయి…” అని ఒక ట్వీట్ చేశారు అలాగే “జగన్ రెడ్డి గారు నా మతం, నా కులం అని మాట్లాడుతున్నారు. నిజానికి మతం మారితే కులం రాకూడదు. రెడ్డి, కమ్మ, కాపు, బలిజ మొదలగు కులాలు హిందూ ధర్మం నుండి వచ్చినవి. క్రైస్తవ మతానికి మారితే కులాలు రాకూడదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మతం మారినా కూడా కులం మారదు.” అని రెండు ట్వీట్లు పవన్ కళ్యాణ్ పేరుతో విడుదల చేశారు. ఇలా జగన్ చేసే ప్రతి మాటని పట్టించుకోని విమర్శలు చేస్తే పార్టీకి తీరని నష్టం రావొచ్చు, మరి ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో కొంచం జాగ్రత్తగా స్పందిచాలి అంతేకానీ చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. ఇక నుండి జగన్ మతం గూర్చి, ఆయన కులం గూర్చి మాట్లాకుండా ఉంటె మంచిదేమో..?

విక్రమ్ లాండర్ ని కనుగొన్నఇండియన్ ఇంజినీర్‌!

 

అతను సైంటిస్ట్ కాదు అయినా విక్రమ్ ను కనుక్కున్నాడు. చంద్రుని గూర్చి తెలుసుకోవాలన్న ఆశ, తృష్ణ ఫలితంగా విక్రమ్ లాండర్ ని కనుక్కునే విధంగా చేసింది. షణ్ముగ సుబ్ర‌మ‌ణియ‌న్‌. వృత్తి రీత్యా మెకానిక‌ల్ ఇంజినీర్‌. బ్లాగ‌ర్‌. యాప్ డెవ‌ల‌ప‌ర్‌. క్యూఏ ఇంజినీర్‌. ఇస్రో ప్ర‌యోగించిన చంద్ర‌యాన్‌2కు సంబంధించిన విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను కూడా గుర్తించింది ఇత‌నే. ఈ చెన్నై చిన్నోడే విక్ర‌మ్ జాడ‌ను తొలిసారి గుర్తించిన‌ట్లు నాసా కూడా అత‌నికి క్రెడిట్ ఇచ్చింది. లూనార్ ఆర్బిటార్ తొలిసారి తీసిన ఫోటోల‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. వాటిని ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ఇంజినీర్ ష‌ణ్ముగ‌కు కొన్ని డౌట్స్ వ‌చ్చాయి. ఫోటోల్లో ఉన్న కొన్ని ప్రాంతాల‌ను గుర్తించి.. బ‌హుశా ఆవే విక్ర‌మ్ కూలిన ప్రాంతాలేమో అని నాసాకు ట్వీట్ చేశారు. నిజానికి చంద్రుడి గురించి తెలుసుకోవాల‌న్న ఉత్సాహాంతో ష‌ణ్ముగ ప‌దేప‌దే ఎల్ఆర్వో రిలీజ్ చేసిన ఫోటోల‌ను ప‌రిశీలించాడు. ఒక‌వేళ విక్ర‌మ్ స‌క్ర‌మంగా ల్యాండ్ అయి.. అది ఫోటోల‌ను పంపినా, చంద్రుడిపై ప్ర‌తి ఒక్క‌రికీ ఇంత ఇంట్రెస్ట్ ఉండేది కాదేమో అని ష‌ణ్మ‌గ త‌న మెయిల్ ద్వారా నాసాకు త‌న అభిప్రాయాన్ని వినిపించాడు. తొలుత ఎల్ఆర్వీ ఇమేజ్‌ల‌ను అప్పుడ‌ప్పుడు స్కాన్ చేస్తూ ఉన్న ష‌ణ్ముగ‌కు కొన్ని తేడాలు క‌నిపించాయి.

 

విక్ర‌మ్ ఏ దిక్కున కూలింది, అది కూలే స‌మ‌యంలో ఉన్న దాని వేగం, ఆ అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ష‌ణ్ముగ విక్ర‌మ్ ఆచూకీ కోసం ప్ర‌య‌త్నించాడు. దాంతోనే విక్ర‌మ్ కూలిన క‌చ్చిత‌మైన ప్రాంతాన్ని గుర్తించ‌గ‌లిగాడు. వాస్త‌వానికి విక్ర‌మ్ దిగాల్సిన ప్రాంతానికి సుమారు మూడోవంతు మైలు దూరంలో ఓ చిన్నపాటి వైట్ స్పార్క్‌ను గుర్తించాడు. అంత‌క‌ముందు ప‌రిశీలించిన ఇమేజ్‌లో ఆ స్పాట్ లేన‌ట్లు ష‌ణ్ముగ ప‌సిక‌ట్టాడు. ఆ తేడాతో యువ ఇంజినీర్ ఓ ఐడియాకు వ‌చ్చేశాడు. బ‌హుశా విక్ర‌మ్ కూల‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోనే ల్యాండ‌ర్ క‌నుమ‌రుగై ఉంటుంద‌ని అనుమానం వ్య‌క్తం చేశాడు.

 

రెండు దృశ్యాల్లో ఉన్న తేడాల‌ను గుర్తించిన ష‌ణ్ముగ వాటిని నాసాకు పంపించాడు. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లోనూ నాసా ఫోటోల‌ను పోస్టు చేశాడు. లూనార్ ఆర్బిటార్ వాటిని స్ట‌డీ చేసింది. చంద్రుడిపై విక్ర‌మ్ కూల‌క‌ముందు, కూలిన త‌ర్వాత న‌వంబ‌ర్ 11వ తేదీన తీసిన ఫోటోల‌ను నాసా అధ్య‌య‌నం చేసింది. అయితే ఎక్క‌డైతే విక్ర‌మ్ దిగాలో.. దానికి ఆగ్నేయ దిశ‌లో సుమారు 2500 అడుగుల దూరంలో విక్ర‌మ్ ఉన్న‌ట్లు నాసా ద్రువీక‌రించింది. కొన్ని గంట‌ల క్రిత‌మే నాసా శాస్త్ర‌వేత్త‌లు ష‌ణ్ముగ‌కు మెయిల్ చేశారు. ఆ లేఖ‌లో విక్ర‌మ్‌ను గుర్తించిన ష‌ణ్ముగ‌కు కంగ్రాట్స్ చెప్పారు. సుబ్ర‌మ‌ణ్య‌స్వామి జ‌న్మ‌తిథి షష్ఠి. ష‌ణ్ముగ ష‌ష్ఠి రోజునే నాసా ఈ శుభ సందేశం వినిపించ‌డం సంతోష‌క‌ర‌మే. నాసా త‌న‌కు క్రెడిట్ ఇచ్చిన విష‌యాన్ని ష‌ణ్ముగ త‌న ట్వీట్‌లో తెలిపాడు.

జగన్ కులం ‘రెడ్డి’ కాదు…అసలు కులం ఇదే..!

ఏపీ సీఎం జగన్ అసలు రెడ్డి నే కాదు అని అంటున్న మాజీ ఎంపీ తులసి రెడ్డి . మరి జగన్ ఏ కులానికి సంబంధిచిన వ్యక్త్తో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

వైసీపీకి చుక్కలు చూపిస్తున్న పవన్!

 

ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ టూర్ లో చాలా బిజీగా ఉన్నాడు. అన్ని కోణాల్లోనుంచి వైసీపీ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వైసీపీ నేతలు ఇప్పటి వరకు చేసిన ప్రతి విమర్శలకు బహు ధీటుగా స్పందిస్తూ తనదైన రీతిలో దూసుకెళ్తున్నాడు.

 

గత నెల ఇసుక సమస్య పై పోరాడిన జనసేనాని ఇప్పుడు, ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడంపై స్పందిస్తున్నారు. అలాగే వైసీపీ నేతలు చేసిన విమర్శలను కూడా ఖండిస్తున్నారు. ప్రస్తుతం జగన్ యొక్క మతం-కులం గూర్చి ఘాటు విమర్శలు చేస్తున్నారు. పవన్ చేసిన విమర్శలకు స్పందిస్తూ … మొన్న గుంటూరు లో ” వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా” కార్యక్రమం లో జగన్ మాట్లాడుతూ.. తన మతం “మానవత్వం” అని అలాగే తన కులం “మాట నిలబెట్టుకునే కులం” అని చెప్పడం జరిగింది. తదనంతరం పవన్ మాట్లాడుతూ… జగన్ కులం “రెడ్డి” అని, క్రిస్టియన్ గా మారిన తర్వాత ఆ కులాన్ని మార్చుకోవాలి లేకుంటే మతం మార్చుకోవాలి అన్న రీతిలో స్పందిస్తున్నారు.

 

ఇసుక సమస్యపై పోరాటం, ఇంగ్లిష్ మీడియంపై విమర్శలు చెయ్యడం తో పవన్ కి ఎంతో కొంత జనాదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గాని… ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నతమైన స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన స్థాయిని దిగజార్చుకునే విధంగా ఎదుటి వ్యక్తుల (వారు ఎవరైనప్పటికీ) కులం గురించి లేదా మతం గురించి మాట్లాడటం ఎంతవరకు సబబు అని కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

 

ఒకవిధంగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ.. బలమైన వైసీపీ ప్రభుత్వం పై ఎదో ఒక విమర్శ చేస్తూ… జనాలకు మరింత దగ్గరవుతున్న నేపథ్యంలో… ఎప్పుడూ చేసినట్లే తన తొందరపాటు తనంతో (కుల-మత విమర్శలతో) జనాలకు దూరమవుతున్నాడా? అనిపిస్తుంది.

 

ఏది ఏమైనప్పటికి చంద్రబాబు కి మించి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాడు అనటంలో సందేహం లేదు.

2019 ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

 

తెలంగాణలో 2019 ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. పరీక్షల తేదీలను తెలంగాణ గవర్నమెంట్ అధికారులు వెల్లడించారు

  • ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు : మార్చి 4 నుంచి 21 వరకు
  • ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు : మార్చి 5 నుంచి 23 వరకు
  • ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌
  • జనవరి 28న నైతిక, మానవ విలువల పరీక్ష
  • జనవరి 30న పర్యావరణ విద్య పరీక్ష

 

తెలంగాణలో అమ్మాయిలకు రక్షణ లేదా?

తెలంగాణలో ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే ఒక రకమైన అభద్రతా భావం కలుగుతుంది. వరంగల్ లో 9నెలల చిన్నారి శ్రీహితపై అత్యాాచారం చేసి ప్రాణాలు తీసిన ప్రవీణ్‌. హైదరాబాద్ శాలిబండలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 62 ఏళ్ల కార్మికుడు. హన్మకొండలో పుట్టినరోజు నాడు గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశారు. హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొని వస్తానని చెప్పి వెళ్ళిన ప్రియాంకరెడ్డిని అతిదారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన. ఇలా చెప్పుకుంటూ.. పోతే తెలంగాణలో అనేకచోట్ల ఎన్నెనో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి.

ఇన్ని దారుణాలు జరుగుతున్నా.. ప్రభుత్వం నుండి కఠినమైన చట్టాలేవీ లేకపోవడం గమనార్హం. కేసులని, విచారణ అని, కోర్టులని నిందితులను తిప్పి తిప్పి చివరికి తూతూ మంత్రంగా కేసులు మూసివేయడంమో లేదా ఏదో ఒక కేసుపెట్టి కొంతకాలం శిక్ష అనుభవించడమే చేస్తున్నారు. ఖఛ్చితమైన చట్టం తీసుకొస్తే తప్పా ఈ నేరాలు ఘోరాలు తగ్గేలాలేవు. మంత్రులు, మేధావులు, జ్ఞానవంతులు ఒక్కసారి ఆలోచించండి.

ప్రియాంకరెడ్డి హత్య:తెలంగాణ లాయర్ల సంచలన నిర్ణయం!

 

దేశవ్యాప్తంగా నిర్భయను తలపించిన ప్రియాంకరెడ్డి హత్య ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోవడంతో అడ్వకేట్లు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాయర్లు ఎవరూ కూడా నిందితులకు సహాయం చేయకూడదని, వారి తరఫున వాదించిన కూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే న్యాయవాదులు సైతం తమ వంతు పాత్ర పోషించాలని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయంతో ఎవరు వారి తరపున వాదించని పరిస్థితి. అంతేకాదు నిందితులకు కఠినంగా శిక్షపడే విధంగా న్యాయపోరాటం చేస్తామని లాయర్లు చెప్తున్న నేపథ్యంలో, కోర్టులో నిందితులకు ఏ విధమైన శిక్ష పడుతుంది. ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వారికి కోర్టులు ఎప్పటి వరకు శిక్షను విధిస్తాయి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 

ప్రియాంకరెడ్డిని హత్యచేసిన నిందితులను ఉరి తీయాలని దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్నాయి

 

 

ప్రియాంక రెడ్డి అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య చేసిన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించి వేస్తోంది. మన చట్టాలను, మన న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ఏం చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజల నుండి తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. నలుగురు మృగాళ్ల చేతిలో దారుణంగా అత్యాచారం గావించ బడి,హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కేసులో నలుగురు నిందితులను పోలీసులు రాత్రి సంఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.డాక్టర్ ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్ మరియు హత్య కేసులో ఘటనకు పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు రాత్రంతా విచారించారు. మరికొద్ది సేపట్లో వారిని బయటకు తీసుకురాబోతున్నారు.

చిమ్మ చీకటిలో కలిసి పోయిన ప్రియాంకరెడ్డి రోదన

 

ప్రియాంకరెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. సంచలనం రేకెత్తిస్తున్న ప్రియాంక రెడ్డి రేప్ మరియు మర్డర్ కేసులో జీర్ణించుకోలేని నిజాలు బయటకు వస్తున్నాయి. ఆమె పై కామాంధులు చేసిన ఆఘాయిత్యం అతి దారుణం. పశువుల డాక్టర్ ప్రియాంక రెడ్డి, పశువులను హ్యాండిల్ చేయగలిగింది కానీ పశువుల వలె నలుగురు ఆమెపై అఘాయిత్యం చేస్తుంటే ప్రతిఘటించలేక, నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేక ఆమె రోదన ఆ చిమ్మ చీకటిలో కలిసి పోయింది. ఆమె తనువు కానరాని లోకానికి వెళ్లిపోయింది.

 

 

ప్రియాంకారెడ్డి హత్యోదంతంలో పాల్గొన్న దుండగులు ఆరీఫ్, శివ, నవీన్, చెన్నకేశవులును పోలీసులు శనివారం తెల్లవారు జామున 4గంటల సయమంలో శంషాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించా రు. పోలీసులు స్టేషన్‌లోనే నిందితులకు వైద్య పరీక్షలు చేయించి తహసీల్దార్‌ ఎదుట హాజరు పర్చి ఆ తర్వాత చర్లపల్లి జైలుకు తరలించారు.

 

‘దిశా’ రేపిస్టులకు సపోర్ట్:స్మైలీనాని ఒరిజినల్ ఆడియో రికార్డు

ప్రియాంక రేపిస్టులను సపోర్ట్ స్మైలీనాని ఒరిజినల్ ఆడియో రెకార్డ్ ఇంకా వైరల్గా మారింది