
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారనేది వాస్తవం. మొన్న ఇసుక సమస్యపై పోరాడి ఎంతోకొంత విజయం సాధించారనేది వాస్తవం. అలాగే ఇంగ్లిష్ మీడియం నుండి తెలుగును కాపాడే దిశగా నూతన పంథాలో వెళ్తున్నారనేది కూడా నిజమే. ఈ రెండు సంఘటనలలో జనసేన అంటే ఎంతో కొంత ప్రజల్లోకి పాజిటివ్ టాక్ వెళ్ళింది. ఈ టైంలో జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే కొంచం పేరున్న నేతలు, జనసేన మేధావులు కొంచం జాగ్రత్తగా ఉంటె మంచిది. ఎందుకంటే మంచి పేరు రావడానికి కొన్ని ఏళ్ళు పడితే ఆ పేరు పోగొట్టుకోవడానికి కొన్ని నిమిషాలు పడుతుంది.
అసల విషయం ఏమిటంటే.. ఈ రోజు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి “వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా” పథక ప్రారంభ కారక్రమంలో “నా మతం మానవత్వం, నా కులం, మాట నిలబెట్టుకునే కులం” అని వ్యాఖ్యానించారు. జగన్ మాట పై స్పందించిన జనసేన పార్టీ ఈ విధంగా ట్వీట్లు చేశారు. “ఒకసారి మతం మారితే కులాన్ని వదిలేయండి. మీకు కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. మారండి జగన్ రెడ్డి గారు ఇంకా ఇలాగే ఉందాం అంటే కుదరదు. సమాజం మారింది, యువత మారింది, తరాలు మారాయి…” అని ఒక ట్వీట్ చేశారు అలాగే “జగన్ రెడ్డి గారు నా మతం, నా కులం అని మాట్లాడుతున్నారు. నిజానికి మతం మారితే కులం రాకూడదు. రెడ్డి, కమ్మ, కాపు, బలిజ మొదలగు కులాలు హిందూ ధర్మం నుండి వచ్చినవి. క్రైస్తవ మతానికి మారితే కులాలు రాకూడదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మతం మారినా కూడా కులం మారదు.” అని రెండు ట్వీట్లు పవన్ కళ్యాణ్ పేరుతో విడుదల చేశారు. ఇలా జగన్ చేసే ప్రతి మాటని పట్టించుకోని విమర్శలు చేస్తే పార్టీకి తీరని నష్టం రావొచ్చు, మరి ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో కొంచం జాగ్రత్తగా స్పందిచాలి అంతేకానీ చిన్నపిల్లలాగా ప్రవర్తించకూడదు. ఇక నుండి జగన్ మతం గూర్చి, ఆయన కులం గూర్చి మాట్లాకుండా ఉంటె మంచిదేమో..?
ఒకసారి మతం మారితే కులాన్ని వదిలేయండి. మీకు కులం కావాలి, మతం కావాలి, ఓట్లు కావాలి, డబ్బులు కావాలి. మారండి జగన్ రెడ్డి గారు ఇంకా ఇలాగే ఉందాం అంటే కుదరదు. సమాజం మారింది, యువత మారింది, తరాలు మారాయి…
కానీ ‘రంగులే’ మారట్లేదు!
– శ్రీ పవన్ కళ్యాణ్ గారు#JanaSenaAatmeeyaYatra
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 2, 2019
జగన్ రెడ్డి గారు నా మతం, నా కులం అని మాట్లాడుతున్నారు. నిజానికి మతం మారితే కులం రాకూడదు. రెడ్డి, కమ్మ, కాపు, బలిజ మొదలగు కులాలు హిందూ ధర్మం నుండి వచ్చినవి. క్రైస్తవ మతానికి మారితే కులాలు రాకూడదు కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మతం మారినా కూడా కులం మారదు.
– శ్రీ పవన్ కళ్యాణ్ గారు
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 2, 2019
ఏసేసాడు బాగా ఏసేసాడు …😂
” వైసీపీ ది రంగుల రాజ్యం ”
లాస్ట్ పంచ్ మనది అయితే దానికి వచ్చే కిక్కె వేరప్ప …!!
– @PawanKalyan@PasagadaPRASHAD @bhemamani @ChhBong @darling_kamalk pic.twitter.com/W5qGW0QHEB— JanaSena YuvaSena (@JSP_YuvaSena) December 2, 2019